అగ్ని మహా పురాణము

362 - అథ నానార్థ వర్గః

 అగ్ని రువాచః

ఆకాశ త్రిదివే నాకోలోకస్తు భువనేజనే

పద్యేయశ న చ శ్లోకః కరే ఖడ్గేచ సాయకః.

ఆనకః పటహో భేరీ కలంకోఽకాప వాదయోః

మారుతే వేధసి బ్రధ్నేపుంసికః కం శిరోంఽబునో.

స్యాత్పులాకస్తుచ్చధాన్యే సంక్షేపే భక్తసిక్థ కే

మహేంద్ర గుగ్గులూలూక వ్యాలగ్రాహిషు కౌశికః.

శాలావృకౌకపిశ్వానౌ మానం స్యాన్మితి సాధనమ్

సర్గః స్వభావ నిర్మోక్ష నిశ్చయాధ్యాయ సృష్టిషు.

 యోగః సన్నహనో పాయధ్యాన సంగాతి యుక్తిషు

భోగః సుఖేస్త్య్రాది భృతావబ్జౌశంఖనిశాకరౌ.

కాకే భగండౌ కరటి దుశ్చర్మా శిపివిష్టకః

రిష్టం క్షేమాశుభాభా వేష్వరి షేతు శుభాశుభే.

వ్యష్టిః ఫలే సమృద్ధాచ దృష్టిర్జానేఽక్ష్ణి దర్శనే

నిష్ఠానిష్పత్తి నాశాంతాః కాష్ఠోత్క ర్షేస్థితౌదిశి.

భూగోవాచ స్త్విడా ఇలః ప్రగాఢం భృతకృచ్ఛ్రయోః

భృశ ప్రతిజ్ఞయోర్బాడం శక్తస్థూలౌ దృఢౌత్రిష.

విన స్త సంహతౌ వ్యూఢౌ కృష్ణోవ్యాసేఽర్జునేహరా

పణోద్యూతాది షూత్సృష్టేభృతౌమూల్యేధనేఽపిచ.

మౌర్వ్యాంద్రవ్యాశ్రితే సత్త్వ శుక్ల సంధ్యాది కే గుణః

శ్రేష్ఠేఽధిపే గ్రామణీః స్యాజ్జుగుప్సాకరుణేఘృణే.

తృషాస్పృహాపిపాసే ద్వే విపణిః స్యాద్వజిక్పథే

విషాభిమరలోహేషు తీక్ష్ణం క్లీబేఖ రేత్రిషు.

ప్రమాణం హేతుమర్యాదా శాస్త్రేయతా ప్రమాతృమ

కరణం క్షేత్రగాత్రాదా వీరిణం శూన్య మూషరమ్.

అగ్ని పలికెను. “నాకః = ఆకాశము, స్వర్గము, “లోకః = లోకము, జనులు, శ్లోకః” = పద్యము, కీర్తి, “సాయక” = బాణము, ఖడ్గము, “ఆనక” = పటహము, ఖేరి. “కలంక” = మచ్చ, ఆపవాదము “కః” = (పుం) = వాయువు, బ్రహ్మ, సూర్యుడు, కం = (వ) = శిరస్సు, జలము. “పలాకః” = తుచ్చ ధాన్యము, సంపమ, అన్నపు మెరుకు, “కౌశికః” = మహేంద్రుడు, గుగ్గులు, గుడ్లగూబ, పాములపాడు, “శలా వృకః” = వానరము, శునకము, “మానమ్” = కొలుచు సాధనము. “సర్గః” = స్వభావము, నిరోషము, నిశ్చయము, ఆధ్యాయము, సృష్టి, “యోగి” = కట్టుట, ఉపాయము, ధ్యానము. సంగతి, యుక్తి, “భోగః” = సుఖము, వేశ్యా లను, మొదలగు వారికి ఇచ్చుకృతి “అబ్దః” = శంఖము, చంద్రుడు, “కరట!” = కాకి, ఏనుగు గండస్థలము “శిపివిష్టః” = దుష్ట చర్మకలవాడు, ఊరిష్టం” = క్షేమము, ఆశు కము, అభావవ, “ఆరిష్టం” = శుభము, అశుభము “వ్యష్టిః” = ప్రభా తము, సమృద్ధి “దృష్టిః” = జ్ఞానము, నేత్రము, దర్శవము “నిష్ణా= నిష్పత్తి , నాశము, అంతము “కాష్ఠ” = ఉత్కర్షము, స్థితి, దిక్కు, “ఇడా”, “ఇలా” = భూమి, గోవు. “ప్రగాఢః” = ఆత్యంతము, కఠినము, “బాడం” = మిక్కిలి ప్రతిజ్ఞ, “దృఢః” = సమర్థుడు, స్థూలమైనది. “వ్యూఢః” = ఏర్పరుపబడినది. కలిసియున్నది. “కృష్ణః = వ్యాసుడు అర్జునుడు, హరి, “పణః” = జూదా దుల యందు పండెము, భృతి మూల్యము, ధనము, “గుణః” = సారి, గుణము. సత్త్వాదులు, శుక్లాదులు, సంధి మొదలగునవి. “గ్రామణీః” = శ్రేష్ఠుడు, గ్రామాధిపతి. “ఘృణా” = జుగుప్స కరుణ, “తృషా” = ఆసక్తి, దాహము “విపణిః” = వర్తకుల వీథి, “తీక్ష్ణమ్” = విషము, యుద్ధము, లోహము, తీక్షమైనది. అను ఆర్థమున ఇది త్రిలింగము, “ప్రమాణమ్” = హేతువు, మర్యాద, శాస్త్రము, ఇంత ఆను నిశ్చయము. ప్రామాణీకుడు. “కరణమ్” = క్షేత్రము, శరీరము, మొదలగునవి, ఈరిణమ్ = శూన్యము ఊషరక్షేత్రము.

యస్తాహ స్తి పకేసూతే వహ్ని జ్వాలా చ హేతయః

శ్రుతం శాస్త్రా వభృతయోర్యుగ పర్యా ప్తయోః కృతమ్.

ఖ్యాతే హృష్టే ప్రతీతోఽభి జాతస్తు కులజే బుధే

వివిక్తౌ పూతవిజనౌ మూర్ఛితా మూఢసో చ్ఛ్రయౌ.

ఆర్థోఽభిధేయ రైవస్తు ప్రయోజన నివృత్తిషు

విదానాగమయో స్తీర్థ మృషిజుష్ట జలేగురౌ.

ప్రాధాన్యే రాజలింగేచ వృషాంగే కకుదోఽస్త్రియామ్

స్త్రి సంవిజ్జ్ఞాన సంభాషా క్రియాకారం జినాశును.

ధర్మేరహస్యుపనిషత్స్యాదృతౌ వత్సరే శరత్

పదం వ్యవసితి త్రాణస్థాన లక్ష్మాంఘ్రి వస్తుము.

త్రిష్విష్ట మధురౌ స్వాదూమృదూ చాతీక్ష్ణకోమలౌ

నత్యేసాషౌ విద్యమానే ప్రశస్తేఽభ్యర్హితే చసత్.

విధిర్విరానే దైవేఽపి ప్రణిధిః ప్రార్థనేచతే

వధూర్జాయా స్నుషా స్త్రిచ సుధాలేపో ఽమృతంస్నుహీ.

స్పృహా సంప్రత్యయః శ్రద్దా పండితమ్మన్య గర్వితౌ

బ్రహ్మ బంధుర ధిక్షేపే భానూరశ్మి దివాకరౌ.

గ్రావాణౌ శైలపాషాణౌ మూర్థనీచౌప్పథగ్జనౌ

తరుశైలౌ శిఖరిణౌ తను స్త్వగ్ధే హయోరపి.

ఆత్మాయత్నో ధృతిర్బుద్ధిః స్వభావో బ్రహ్మవర్ష్మచ

ఉత్థానం పౌరుషే తంత్రేవ్యుత్థానం ప్రతిరోధనే.

నిర్యాతనం వైరుశుద్ధౌదానే వ్యాసార్పణేఽపిచ

వ్యసనం విపదిభ్రంశే దోషే కామజకోపణే.

మృగయాక్షా దివాస్వప్నః పరివాదః స్త్రియోమదః

తౌర్యత్త్రికం వృథాట్యాచ కామజో దశకోగణః.

వైశున్యం సాహసం ద్రోహఈర్ష్యాసూయార్థ దూషణమ్

వాగ్ధండశ్చైవ పారుష్యం క్రోధజోఽపి గణోఽష్టకః.

“యంతా” = మావటివాడు, సారథి. “హేతి” = అగ్నిజ్వాల. “శ్రుతమ్” = శాస్త్రి నిర్ణయము, శాస్త్రము. “కృతం” = కృతయుగము, ప్యూ ప్తమ, “ప్రతీతః” = ప్రసిద్దము, చూడ బడినది. “అభిజతః” = సతులీనుడు, పండితుడు “వివిక్త = పవిత్రమైనది. ఏజనము, “మూర్ఛితః” = మూర్చ పొందినవాడు, ఆంతట వ్యాపించినది, “ఆర్థః” = ఆర్థము, ధనము, వస్తువు, ప్రయోజనము, నివృత్తి “తీర్థం” = మూల కారణము, ఆగమము, మహర్షులు సేవించిన జలము, గురువు. “కకుద్” = ప్రధానము, రాజచిహ్నము, ఎద్దుమూపురము, “సంవిత్” = జ్ఞానము, సంభాషణము, క్రియా నియమము, యుద్ధము, నామము “ఉపనిషత్” = ధర్మము, రహస్యము, “శరత్” = శరదృతువు, సంవత్సరము, “పదం” = నిశ్చయము, రక్షణము స్థానము, చిహ్నము, పాదము, వస్తువు, “స్వాదు” = ఇష్టము, మధురము “మృదు” = తీర్ఘము కానిది, కోమలము. “సత్” = సత్యము సాధువు, వున్నఁ, ప్రశస్తము, పూజ్యము, విధికి = విధానము, దైవము. “ప్రణిధి:” = పార్థన, గూఢచారి. “వధూః” = భార్య, కోడలు, శ్రీ “సుధా” = సున్నము, అమృతము, “శ్రద్ధా” = ఆసక్తి, విశ్వాసము, పండి తం మన్య, గర్విత = పండితువని గర్వించిన వాడు, బ్రహ్మ “బంధుః” = బ్రాహ్మణుని అధిక్షేపమును తెలుపును. “భానుః” = సూర్యుడు, కిరణము. “గ్రావా” పర్వతము, శిల. “పృథక్ జనోజ్ఞమూర్ఖుడు, నీచుడు. “శిఖరీ” = వృక్షము, పర్వతము. “తనుః” = చర్మ, దేహము. “ఆత్మా” =యత్నము, ధృతి, బుద్ధి, స్వభావము, బ్రహ్మ, శరీరము. “ఉత్థావమ్” = పౌరుషము, తంత్రమా. “వ్యుత్థావమ్”= ఎదిరించుట. “నిర్యాతవం” = వైరము తీర్చుకొనుట. దానము, న్యాసము తిర్గి ఇచ్చుట. “వ్యసనం”  = ఆపద, క్రింద పడుట, కామ క్రోధముల వలన కలిగిన దోషము, వేట జూదము, పగటి నిద్ర, ఇతరులను నిందించుట, శ్రీ సత్తి, మద్యపానము, నాట్యము, గానము, వాద్యములు, వ్యర్థముగా, తిరుగుట. ఇవి కామము వలన కలిగిన పది వ్యసనములు; చాడీలు చెప్పుట, సాహసము, ఈర్ష్య, అసూయ, ఆర్ద్ర దూషణము, పరుషవాక్, పరుష పండము. ఇవి క్రోధము వలన కలిగిన ఎనిమిది వ్యసనములు.

అకర్మగుహ్యే కౌపీనం మైథునం సంగతౌరతౌ

ప్రధానం పరమార్థాధీః ప్రజ్ఞానం బుద్ధి చిహ్నయోః.

క్రందనే రోదనాహ్వానే వర్ష్మదేహ ప్రమాణయోః

ఆరాధనం సాధనే స్వాదవాస్తౌ తోషజేపి చ.

రత్నంస్వజాతి శ్రేష్ఠేఽపిలక్ష్మ చిహ్న ప్రధానయోః

కలాపో భూషణే బర్హేతూణీరౌ నంహ తేఽపిచ.

తల్పం శయ్యాట్ట దారేషు డింభౌతు శిశు బాలీశౌ

స్తంభౌ స్థూణాజడీ భావౌ సభ్య సంసది వై సభా.

కిరణప్రగ్రహౌరశ్మి ధర్మాః పుణ్యయమాదయః

లలామం పుచ్చపండ్రాశ్మ భూషాప్రాధానకే తుషు.

ప్రత్యయోఽధీన శపథ జ్ఞానవిశ్వాస హేతుషు

సమయాః శపథా చారకాల సిద్ధాంత సంవిదః.

ఆత్యయోఽతిక్రమే కృచ్చ్రే సత్యం శపథ తథ్యయోః

వీర్యం బలప్రభావౌ చ రూప్యం రూపే ప్రశస్తకే.

దూరదరో ద్యూతకారే పణేద్యూతే దురోదరమ్

మహారణ్యే దుర్గపథే కాంతారః పున్నపుంసకమ్.

యమానిలేంద్ర చంద్రార్క విష్ణు సింహాదికే హరిః

దరోఽస్త్రియాం భయేశ్వబ్రే జఠరః కఠినేఽపిచ.

ఉదారో దాతృమహతో రితరస్త్వన్య నీచయోః

చూడాకిరీటం కేశాశ్చ సంయలో మౌలయస్త్రయః.

బలిః కోపహారాదౌ సైన్య స్థైర్యాదికె బలమ్

స్త్రికటీ వస్త్రబంధోపి నీవీపరిపణేఽపిచ.

శుకలే మూషికే శ్రేష్ఠే సుకృతే వృషభే వృషః

ద్యూతాక్షే సారిఫలకేఽప్యాకర్షోఽథాఽక్షమింద్రియే.

నా ద్యూతాంగే చ కర్షేచ వ్యవహారే కలిద్రుమే

ఊష్ణీషః స్యాత్కిరీటాదౌ కర్షూః కుల్యాభిధాయినీ.

ప్రత్యక్షేఽధి కృతేఽద్యక్షః సూర్య వహ్ని విభావసూ

శృంగారాదౌ విషేవీర్యే గుణిరాగే ద్రవేరసః.

తేజఃపురీష యోర్వర్చ ఆగః పాపాపరాధః

చందః పద్యేఽభిలాషే చ సాదీయాన్సాదు బాఢయోః.

వ్యూహోవృందేఽప్యహిర్వృత్రేఽప్య గ్నీంద్వర్కా స్తమోనుదః.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే శబ్దకోశే నానార్థవర్గనిరూపణంనామ ద్విషష్ట్యధిక త్రిశతతమోఽధ్యాయః.

         “కౌపీనం” = చెడ్డపని, గుహ్యము. “మైథునం” = సంగతి, రతి. “ప్రధానం” = పరమార్థ బట్టి. “ప్రజ్ఞానం”=చిహ్నము, బుద్ధి. “క్రందనం” = ఏడ్పు, పిలుచుట. “వర్ష” = దేహము, ప్రయాణము. “ఆరాధనం” = సాధనము, ప్రాప్తి, సంతోష పెట్టుట . “రత్నం” = స్వజాతి శ్రేష్ఠమ. “లక్మ” = చిహ్నము, ప్రధానమా. కలాపః = భూషణము, నెమలి పింఛము, అంబులపొది, సంఘటితము. “తల్పం” = శయ్యా, ఆట్టాలిక, భార్య. “డింభ” = శిశువు, మూర్ఖుడు. “స్తంభ” = స్తంభము, కొయ్యబారుట. “నడా” = సమితి, సదస్సులు. “రశ్మి” = కిరణము, కళ్ళేము. “ధర్మః” = పుణ్యము యమాదులు, లలామం, పుచ్ఛము, పుండ్రము, అశ్వము, అలంకారము, ప్రాధాన్యము, ధ్వజము , “ప్రత్యయః” = అధీనము, శపథము, జ్ఞానము, విశ్వాసము, హేతువు. “సమయః” = శపథము, ఆచారము, కాలము, సిద్ధాంతము, ఒడబాటు. “అత్యయః” = అతిక్రమణము, కాఠిన్యము. “సత్యం” = శపథము, తథ్యము. “వీర్యం” = ఐలము, ప్రభావము. “రూప్యం” = రూపము, పశ స్తము “దురోదరః” = (పుం) జూదరి (నపుం) పందెము, జూదము. “కాంతారః” = మహారణ్యము, దుర్గ మార్గము. “హరిః” = యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు విష్ణువు, సింహాదులు. “దరః” = (పుం. న ) భయము, గొయ్యి.”జఠరః” = ఉదరము, కఠినము. “ఊదారః” “దాతా, మహా పురుషుడు, “ఇతరః” = ఆన్యుడు, “ నీచుడు, “మౌళిః” = శిఖ, కిరీటము, ముడి వేసిన జుట్టు, “బలి”=పన్ను, ఉపహరము, “బలం” = సైన్యము, సైర్యము మొదలగునవి. “నీవీ” = స్త్రికటి వస్త్రబంధము, మూల ధనము, “వృషః” = అధిక వీర్యవంతుడు, ఎలుక, శ్రేష్ఠము, పుణ్యము, వృషభము, అకర్షః” = జూడము వండుపయోగించు పాచికా, సారి ఫలకము ‘అక్షం” - ఇంద్రియము, “ ఆష” = పాచికా, కర్షము, వ్యవహారము, కలిద్రుమము. “ఉషీకః' = ' కిరీటాదికము, “కర్పూ” = చిన్ననది. “ అధ్యక్ష” = ప్రత్యక్షము అధికారి, “విభావసుః” = సూర్యుడు, అగ్ని “సం” = శృంగారాదిర సము, విషము, వీర్యము, గుణము, రాగము, ద్రవము, “వర్చన్” = తేజస్సు, పురీషము. “ఆగః” = పాము, ఆపరాధము, ‘ఛందస్’ =పడ్యము, అభిలాష, ‘సాధీయన్’ = ఉత్తమము, నిశ్చితము, ‘వ్యూహః’ = సమూహము, ‘అహః’ = వృలాసురుడు, . ‘తమోపహ’ = అగ్ని , చంద్రుడు, సూర్యుడు.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు నానార్థ వర్గ నిరూపణ మను మూడు వందల ఆరువది రెండవ అధ్యాయము సమాప్తము.