ఈశ్వర ఉవాచః
తతః ప్రాసాదమాసూత్ర్య వర్తయేద్వస్తుమజ్ఞపమ్ ।
కుర్యాత్కోష్ణచతుఃషష్టిం జేతే వేదాసకే సమే.
కోణేషు విన్య సేద్వంశా రజనోష్టాధికోణగా ।
ద్విపదాః షట్పదాస్తాస్తు వాస్తుం తత్రార్చయేద్యథా
ఆకుఞ్చితకచం వాస్తుముల్తానమసురాకృతిమ్ ।
స్మరేత్పూజాసు కుర్యాది నివేణీ త్వరరాననమ్.
జానునీ కూర్పరో సర్ధి దిశి వాతహతాశయోః।
పైత్ర్యాం పాదపడే రౌద్ర్యాం శిరోగ్య హృదయేలికి.
అన్య దేహే నమారూడా దేవతాః పూజితాః శుభాః ।
ఆప్టో కోణాధిపాస్త్రత కోణార్ధే ష్వష్టసు స్థితాః.
షట్పదాస్తు మరీచ్యాద్యా దికు పూర్వాదిషు క్రమాత్।
మధ్యే చతుష్పదో బ్రహ్మా శేషాస్త పడితాః స్మృతాః.
సమస్తనాడీసంయో మహామహ్మమ్బుజం తలమ్ ।
త్రిశూలం స్వస్తికం వజ్రం మహాస్వస్తికసంపుటి.
త్రికటుం మణిబన్దం చ సువిశుద్ధం, పదం తథా ।
ఇతి ద్వాదశ మర్మాణి వాస్తోర్భిక్త్యాదిమ త్యజేత్.
సాజ్యమశతమీయ పర్ణన్యాయామ్బుజోడకమ్ ।
దదీరాథ జయనాయ పతాకాం కుజ్కుమోజ్వలామ్.
రత్న వారి మ హేన్గాయ రనౌ ధూమ్రం వితానకమ్ ।
సత్యాయ మృతగోధూమమాజ్యభ క్తం శృశాయ చ.
విమాంసమ న్తరికాయ శకు నేభ్యస్తు పూర్వతః ।
మధుక్షరాజ్యసంపూర్ణాం ప్రదద్యాద్వహ్నయే స్రుభమ్.
జాన్ పూర్ణం సువర్ణము వితథాయ నివేదయేత్ ।
దద్యాద్రశఃపతా షోద్రం యమరాజే పలెదనమ్.
గర్గం గఛర్వనాధాయ జిహ్వాం భృఙ్ఞాయ పశ్మిణః ।
మృగాయ పద్మవర్ణాని యామ్యామిత్యష్ట దేవతాః.
పరమేశ్వరుడు చెప్పెను- స్కందా! పిమ్మట ప్రాసాదమును ఆసూత్రించి వాస్తు మండలరచన చేసి చతురమైన సమతల క్షేత్రము నందు ఆరువది నాలుగు కోక్షములు నిర్మించవలెను. కోణములందు రెండు వంశముల విన్యాసము చేయవలెను. వికోణముకు పోవునట్లుగా, ఎనిమిది రజ్జువులు గుర్తించవలెను. అవి ద్విపద - షట్పదష్టానము రూపమున విభక్తములై యుండును. వాటిపై వాస్తుదేవతాపూజ, చేయవలెను . కుంచిత కేశధారి యగు వాస్తు పురుషుడు వెల్లగితల పండుకొని యుండును. ఆతని ఆకారము అసురసదృశముగా నుండును. పూజాసమయమున ఆతనిని ఆ విధము గనే స్మరించవలెను. కాని గోడ మొదలైన వాటికి పునాదీ వేయునపుడు అతడు ముఖము క్రిందికి వంచి పండుకొని యున్నట్లు ధ్యానము చేయవలెను. ఆతని మోకాళ్ళు మోచేతులు తొడలు వాయవ్య ఆగ్నేయ దిక్కుల వైపు పడియుండును. ఒకదానితో ఒకటి కలసి యున్న పాదములు నైరృతి దిక్కువైపున ఉండును, ఆతని శిరస్సు ఈశాన్యదిక్కు వైపున నుండును. చేతులు దోసిలిగా ఏర్పడి వక్షఃస్థలముపై నుండును. ఆ వాస్తుపురుషుని శరీరముపై ఎక్కియున్న దేవతలను పూజించుటచే శుభకర మగును. ఎనమండుగురు దేవతలు కోణాధిపతులు. వారు ఎనిమిది కోణార్ధములందుందురు. వరుసగా పూర్వాది దిక్కులందున్న మరీచ్యాది దేవతలు ఆరేసి పదముల ఆధిపతులు, వారి మధ్యనున్న బ్రహ్మ నాలుగు పదముల ఆధి పతి. మిగిలిన దేవతలు ఒక్కొక్క పదమున కధిపతులు. సమ సము, నాడిసంపాతము మహామర్మ, కమలము, ఫలము, త్రిశల - స్వస్తిక - వజ్ర - మహాస్వస్తి క - సంపుట - త్రికటి - మణిబంధ - సువిశుద్ధ పదములు పండ్రెండు మర్మ స్థానములు వాస్తుభిత్త్యాదులందు వీటి నన్నింటిని పూజించవలెను. రుద్రునకు మృతాక్షతలు సమర్పింపవలెను. పర్జన్యునకు కమల - జలము, జయంతునకు కుంకుమరంజిత మగు నిర్మలపతాక, మహేంద్రునకు రత్నమిశ్రితోదకము, సూర్యు నకు ధూమ్రవర్ణ మగు బొందని సత్యదేవతకు మృత యుక్తగోధుమలు, భృతనకు ముద్గాన్నము, అంతరిక్షువకు పడి మాంసము లేదా సక్తువులు సమర్పించవలెను. వీరు తూర్పుదిక్కునకు సంబంధించిన ఎనమండుగురు దేవతలు. అగ్ని కి మధువు, పాలు, నెయ్యి నింపిన గ్రక్కు సమర్పించవలెను. హషకు పేలాలు, వితథునకు సువర్ణమిశ్రిత జలము, గృహతునకు మధువు, యమునకు మాంసోదనము, గంధర్వనాధునకు, గంధము, భృంగరాజునకు పశ్మిడిహ్వ, మృగమునకు యవపర్ణములు సమర్పించవలెను. ఈ ఎనమండుగురు దేవతలు దక్షిణమున పూజింపబడుదురు.
పిత్రే తిలోదకం క్షీరవృక్షజం దన్తధావనమ్ ।
దౌవారికాయ దేవాయ ప్రదద్యాద్దేనుముద్రయా.
సుగ్రీవాయ దిశత్పుష్పాన్ పుష్పదన్తాయ దర్భకమ్ ।
రక్తం ప్రచేతసే పద్మమసురాయ సురాసవమ్.
మృతం గుడౌదనం శేషే రోగాయ ఘృతమండకాన్ ।
లాజాన్వా పశ్చిమాశాయాం దేవాష్టక మితీరితమ్.
మారుతాయ ధ్వజం పీతం నాగాయ నాగ కేసరమ్।
ముఖ్యే తవ్యాణి భల్లాటే ముద్గసూపం సుసంస్కృతమ్.
సోమాయ పాయసం సాజ్యం లూకం మూషయే దిశేత్ ।
లోపీమదితయే దిత్యై పరిమిత్యుత్తరాష్టకమ్.
మోదకాన్ బ్రహ్మణః ప్రాచ్యాం షట్పదాయ మరీచయే।
సవితే రక్తపుష్పాణి వహ్న్యఈ కోణకోష్ఠకే.
తదధ కోష్టకే దద్యాత్సావిత్యై చ కుశోదకమ్ ।
దక్షిణే చత్తన రక్తం షట్పదాయ వివస్వతే.
హరిద్రౌదన మిన్గాయ రశోధకోణకోష్టకే ।
ఇంద్రజాయ చ మిశ్రాన్న మిన్గాధస్తాన్ని వేరయేత్.
వారుణ్యాం షట్పదానీనే మిత్రే సగుడ మోదనమ్ ।
రుద్రాయ మృతసిద్ధాన్నం వాయుకోశాధరే పదే.
తదరో రుద్రదాసాయ మాంసమార్గమథోత్తరే ।
దధీత మాషనైవేద్యం షట్పదనే ధరాధరే.
ఆపాయ శివకోణాధ సద్వతాయ చ తత్సలే ।
క్రమాద్దద్యాద్ధధిక్షీరం పూజయిత్వా విధానతః.
చతుష్పదే నివిష్టాయ బ్రహ్మణే మధ్యదేశత ।
పఞ్చగవ్యావతో పేతం చరుసాజ్యం నివేదయేత్.
పితృదేవతలకు తిలోదకమును సమర్పించవలెను. దౌవారికదేవతకు క్షీరవృక్షదంతధావనకాష్ఠమును ధేనుమద్రా ప్రదర్శన పూర్వకముగా సమర్పించవలెను. సుగ్రీవునకు పుష్పములు, పుష్పరంతునకు కుశలు, వరుణునకు ఎర్రని కమలములు, అసురునకు సురాసవములు, శేషునకు నేతిలో తడిపిన అన్నము, రోగునకు మృతమిశ్రమండిక ములు సమర్పించవలెను. వీరు పశ్చిమదిగ్గేవతలు, మారుతునకు పచ్చని రంగు గల ధ్వజము, నాగదేవతకు నాగ కేసరము ముఖ్య నకు భక్ష్యపదార్థము, భల్లాటునకు ముద్ధసూపము, సోమనకు. మృతమిపాయసము. చరకునకు శాలూకము, ఆదితికి లోపి, దితికి పూరీ సమర్పించవలెను. ఈ ఎనమండుగురు ఉత్తరదిగేవతలు, మధ్యనున్న బ్రహ్మకు మోదకములు సమ ర్పించవలెను. పూర్వదిక్కునందు ఆరు పదముల ఉపభోక్తయగు మరీచికి కూడ మోదకములు అర్పించవలెను. బ్రహ్మ క్రింద ఆగ్నేయ కోష్ఠమునందున్న సవితకు ఎర్రటి పుష్పములు, సవిత క్రింద ఆగ్నేయ కోషమునండున్న సావిత్రికి కుశోదకములు సమర్పించవలెను. బ్రహ్మకు దక్మిణమున ఆరు పదముల అధిష్టాతయగు వివస్వంతునకు రక్తచంద నము, బ్రహ్మకు నైరృతి దిక్కునందున్న క్రింది కోష్టమునందున్న ఇంద్రునకు పసుపు అన్నము, ఇంద్రుని క్రింద నైరృతి కోణమునందున్న ఇంద్రజునకు మిష్టాన్నము, బ్రహ్మ కు పశ్చిమమున ఆరుపదములందున్న మిత్రునకు గుడమిశ్రాన్నము, వాయవ్యకోణము క్రింద పదమునందున్న రుద్రునకు మృతపక్వాన్నము, రుద్రుని క్రింది కోక్షమునందుద్న రుద్రదాసునకు ఆర్ద్రమాంసము, ఉత్తరమునందున్న ఆరు పదములకు అధిపతియగు వృథ్వీధరునకు పెనులతో చేసిన నైవేద్యము ఈశాన్యము నందు క్రిందనున్న పదమునందలి ఆపుని, దాని కింకన క్రిందనున్న ఆపవత్సుని యథావిధిగా పూజించి పెరుగు, పాయసము సమర్పించవలెను. మధ్యభాగమున నాల్గు పదములలో నున్న బ్రహ్మకు పంచగవ్యములు, అక్షతలు, మృతసహితమగు బరువు సమర్పించవలెను.
ఈశాదివాయుపర్య న్తకోణేష్వథ యథాక్రమమ్ ।
వాస్తుబాహ్యే చరక్యాద్యాశ్చతస్రః పూజయేద్యథా.
చరక్యై నఘృతం మాంసం విదార్యై దధిపజజే ।
పూతనాయై పలం పిత్తం రుధిరం చ నివేదయేల్.
అస్థిని పాపరాక్ష న్యై రక్తపిత్తపలాని చ ।
తమాషోదనం ప్రాచ్యాం స్కన్దాయ వినివేదయేల్.
ఆర్యన్లే దక్షిణా శాయాం పూపాన్ కృసరయా
యుతాన్ జమ్బకాయ చ వారుణ్యా మామిషం రుధిరాన్వితమ్.
ఉదీచ్యాం పిలిపిఙ్ఞాయ రక్తాన్నం కుసుమాని చ ।
యజీద్వా సకలం వాస్తుం కుశదధ్యక్షతైర్జలైః.
గృహే చ నగరాదౌ చ ఏకాశీతిపదైర్యజేత్ ।
తిపదా రజవః కార్యాః షట్పదాశ్చ వికోణ కే.
ఈశాద్యాః పాదికా స్తస్మిన్ నాగాద్యాశ్చ ద్వికోష్ఠగా।
షట్పదస్థా మరీ చ్యాద్యా బ్రహ్మా నవపదః స్మృతః.
నగర గ్రామటాదో వాస్తు శతపదో2పి వా ।
వంశద్వయం కోణగతం దుర్జయం దుర్భరం సదా.
యథాదేవాలమే న్యానస్తతా శతపదే హితః ।
గ్రహాః స్కన్దయ స్తత్ర విజ్ఞేయాశ్చైవ షట్పదాః.
చరత్యాద్యా భూతపదా రజ్జువంశాది పూర్వవత్ ।
దేశ సంస్థాపనే వాస్తుశ్చతుస్రాంశచ్ఛతం భవేత్.
చతుఃషష్టిపడో బ్రహ్మా మరీ చ్యాద్యాశ్చ దేవతాః ।
చతుష్పజ్ఞాతత్పదికా ఆపాద్యష్టా రసాగ్ని భిః.
ఈశానాధ్యా నవపదాః స్కన్గాద్యాః శ క్తికాః స్మృతాః ।
చర క్యాద్యా సద్వదేవ రజ్జువంతాది పూర్వవత్.
జేయో వింశతిసాహ నైర్వాస్తుమజ్ఞలగైః పదై ।
న్యాసో నవగుణ స్తోత్ర కర్తవ్యో దేశ వాస్తువత్.
పశ్చివింశతిపదో వాస్తుర్వేతాలాఖ్యశ్చితౌ స్మృతః ।
అన్యో నవపదో వాస్తుః షోడశాక్షో స్తథాపరః.
షడసత్యప్రవృత్తాదేర్మధ్యేస్యాచ్చతురసకమ్ ।
ఖాతే వాస్తో సమం పృష్ఠి న్యా నే బ్రహ్మ శిలాత్మ కే.
శాలూకస్య నివేళే చ మూ ర్తిసంస్థాపనే తథా ।
పాయసేన తు నైవేద్యం సర్వేషాం వా ప్రదాయేత్.
ఉత్తాను కే తు వై వాస్తుః పఞ్చచిహస్తప్రమాణత ।
గృహప్రాసాదమానేన వాస్తుః శేషస్తు సర్వదా.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే వాస్తుపూజావిధిర్నామ త్రినవతితమోధ్యాయః.
ఈశ్యర ఉవాచః
పిదప ఈశాన్యము మొదలు వాయవ్యదిక్కువరకును, నాల్గువిదిశలలో నున్న చరకి మొదలగు నలుగురు మాతృ కలను వాస్తుబాహ్యభాగమున పూజించవలెను. చరకికి సఘృతమాంసము, విదారికి పెరుగు, కమలములు, పూతనకు మాంసపిత్తమాంసములను సమర్పింపవలెను. పాపరాక్షసీకి ఎముకలు, మాంసము, పిత్తము, రక్తము సమర్పింపవలేను. తూర్పున స్కందునకు ముర్దోదనము, దక్షిణమున అర్యమకు కిచడి, పుష్పము, పశ్చిమదిక్కునందు జంభకునకు రక్తమాంసములును సమర్పింపవలెను. ఉత్తర దిక్కునందు పిలిపిచ్చకు రక్తవర్గాన్నము, పుష్పములు సమర్పించవలెను. లేదా సకల వాస్తుమండపమును కుశ - దధ్యక్షత - జలములతో పూజించవలెను. గృహనగరాదులలో ఎనుబది.. ఒక పదము లతో గూడిన వాస్తుమండలమును పూజించవలెను. - ఈ వాస్తుమండలమునందు త్రిపద షట్పదరజ్జువులను వెనుకటివలెనే నిర్మింపవలేను. దానియందు ఈశాది దేవతలు పదికు లని చెప్పబడుదురు. 'ఆహా' మొదలగు నవి రెండేసి పదములపై నుండును. మరీచ్యాదిదేవతలు ఆరు పదములందున, బ్రహ్మ తొమ్మిడి పదములందును ఉండును. నగర. గ్రామ.ఫోటాదు లందు శతపదవాస్తు విధానము కూడ చెప్పబడినది. వాటిలో రెండు వంశములు కోణగతములు. అవి సర్వదాదుర్గయములు, దుర్ధరము అని చెప్పబడుచున్నది. శతపదవాస్తు మండలమునందు గూడ దేవాలయమునందు వలెనే న్యాస ముండును. అందు స్కందాదులు షట్పదాధిష్ఠితలు చరకి మొదలగు వారు ఐదేసి పదములను అధిష్టించి యుందురు. రజ్జువంతాదులను వెనుక వలెనే చేయవలెను. దేశ రాష్ట్ర స్థాపనకొరకు వాస్తుమండలమున మూడువేల నాలుగు వందల పదము ఉండును. మధ్యలో నుండు బ్రహ్మ అరువదినాలుగు పదములకు అధిపతి. మరీచి మొదలగు దేవతల అధికారమున ఏబదినాలుగు చొప్పున పదము లుండును. ఆప మొదలగు ఎనమండుగురు దేవతలకు ముప్పదియారు చొప్పున స్థానములుండును. ఈశానుడు మొదలగు వారు తొమ్మిదేసి పదములకును, స్కందాదులు వందేసి పదములకును ఆధిపతులు. చరకి మొదలగువారి పదములు గూడ తదనుసారముగనే ఉండును. రజ్జువంశాదికల్పన వెనుకటి వలెనే చేయవలెను. వాస్తుదేవపూజ ఇరువదివేల పదముల వాస్తు మండపముమీద కూడ చేయవచ్చును. దానియందు, దేశ వాస్తువునందు వలె తొమ్మిది రెట్లు న్యాసము చేయవలెను. చీ స్థాపన సమయమున ఇరువది యైదు పదముల వాస్తు మండలము విహితము. దానికి వతాల మని పేరు. తొమ్మిది పద ముల మండలము కూడ ఉండవచ్చును షట్కోణ త్రికోణమవృత్తాదిమధ్యమున. చతురస్రవాస్తుమండలము కూడ విహిత మైనది. ఈ వాస్తువు పునాదులు మొద లగువాటికై త్రవ్వు గోతులకు ఉపయోగింపబడును. బ్రహ్మ శిలాత్మక పృషవ్యాసము నందున శారాకనివేశనమునందును, మూర్తిస్థాపనమునందును గూడ వాస్తును ఉపయోగించును. వాస్తుమండలమానం దున్న సమస్తదేవతలకును క్షీరాన్నము నైవేద్యము చేయవలెను. ఉత్తాన క్తము అగు సకలకార్యకలందును, సాధారణముగ, ఐదుశ్రీమదగ్ని మహాపురాణము హస్తముల వెడల్పు, పొడవు గల వాస్తుమండలము నిర్మింపవలెను. గృహప్రాసాదమానానుసారముగ నిర్మించిన వాస్తు మండలమే సర్వదా శ్రేష మని చెప్పబడినది.
అగ్ని మహాపురాణమునందు వాస్తుపూజావిధివర్ణన మను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 93 of the Agni Purāṇa is as follows:
This chapter provides the most detailed description of the vāstu-puruṣa (the cosmic being embedded in the building site) and the pūjā performed to him and to all the site's presiding deities before construction begins. The construction of the 64-pada vāstu-maṇḍala — a grid of 64 squares with Brahma presiding over the central 16 squares and 44 other deities occupying the surrounding zones — is described. The vāstu-puruṣa's posture — lying face-down with his head in the northeast — and the twelve marma-sthāna-s (vital points) of his body, which must never be violated by construction, are identified. Offerings to all 45 vāstu-devatās by name — each receiving a specific food item as naivedya — are listed. Variants of the maṇḍala for different site sizes — the expanded 81-pada for towns and the 100-pada for major cities — are described.