అగ్ని మహా పురాణము

139 - అథ షష్టిసంవత్సరఫలం

ఈశ్వర ఉవాచః-

షష్ట్యబ్దానాం ప్రవక్ష్యామి శుభాశుభమతః శృణు

 ప్రభ వే యజ్ఞ కర్మాణి విభవే సుఖినో జనా.

శుక్ల చ సర్వసస్యాని ప్రమో వేన ప్రమోదితాః

ప్రజాపతో ప్రవృద్ధిః స్యాదఱిరా భోగవర్దనః.

శ్రీముఖే వర్ధతే లోకో భావే భావః ప్రవర్తతే

యూనా చ పూర్యతే శుక్రో ధాతా సర్వౌషధీకరః.

ఈశ్వరః క్షేమస్వారోగ్య: బహుధాన్యః సుభిక్షదః

ప్రమాథీ మధ్య వర్షస్తు విక్రమే సస్యసమ్పదః.

వృషో వృష్యతి సర్వాంశ్చ చిత్రభానుశ్చ చితతామ్

స్వర్భానుః క్షేమమారోగ్యం తారణే జలదాః శుభాః.

 పార్థివే సస్యసంపత్తి రతివృష్టి స్తథా జయః

సర్వజిత్యుత్త మా వృష్టిః సర్వధారీ సుభిక్షదః.

విరోధీ జలదాన్ హానీ వికృతశ్చ భయజ్కరః

ఖరే భవేత్పుమాన్వీరో నన్దనే నన్దతే ప్రజా.

విజయః శత్రుహస్తా చ శత్రురోగాది మర్దయేత్

జ్వరాల్తో మన్మథే లోకో దుష్కరే దుష్కరాః ప్రజాః.

దుర్ముఖే దుర్ముఖో లోకో హేమలమ్బేన సంపదః

సంవత్సరో మహాదేవి విలమ్బస్తు సుభిక్షదః.

వికారీ శత్రువోపాయ విజయే సర్వదా క్వచిత్

ప్లవే ప్లవని తోయాని శోభనే శుభకృత్ర్పజా.

రాక్షసే నిష్ఠురో లోకో వివిధ ధ్యానమానలే

సువృష్టిః పిజ్జలే క్వాపి కాలే హ్యుక్త ధనక్షయః.

సిద్ధార్డే సిధ్యతే సర్వం రౌద్రే రౌద్రం ప్రవర్త తే

దుర్మతో మధ్యమా వృష్టిరున్దుభిః క్షేమధాన్యకృత్.

స్రవనే రుధిరోద్గారీ రక్తాక్షః క్రోధనోజయః

క్షయే క్షీణధనో లోకః షష్టిసంవత్సరాణి తు.

ఇత్యాగ్నేయే మహాపురాణే యుద్ధజయార్ణవే షష్టి సంవత్సర ఫలనిరూపణం వామ

ఏకోనచత్వారింశదధిక శతతమోధ్యాయః

పరమేశ్వరుడు పలికేను : పార్వతీ! ఇపుడు ఆరువది సంవత్సరముల (లోకాన్నింటి) శుభాశుభ ఫలములను చెప్పెదను. సావధానముగావినుము. ప్రథవసంవత్సరమున యజ్ఞకర్మలు అధికముగా జరుగును. ‘విభవ' యందు ప్రజలు సుఖవంతులు. శుక్లయందు సమస్త ధాన్య సమృద్ధి. 'ప్రమోదమున సకలానందము 'ప్రజాపతి' యందు వృద్ధి, అంగిరసమందు భోగవృద్ది శ్రీముఖమున జనసంఖ్యావృద్ది. 'యువ' మందు ప్రచురవరము. 'ధాత' యందు ఔషధుల అధికోత్పత్తి. 'ఈశ్వర” యందు క్షేమ ఆరోగ్యప్రాప్తి. బహుధాన్యమున ప్రచురాధానోత్పత్తి ప్రమాదియందు మధ్యవృష్టి విక్రమ' యందు అన్న సమృద్ధి. 'వృష' యందు సకలప్రజాపోషణము. చిత్రభానువునందు విచిత్రత, సుభానువునందు కల్యాణ ఆరోగ్య ములు. 'తారణ’ యందు శుభకరము లగు మేఘములు. పార్థివమున సస్యసంపత్తి , అవ్యయమున అతివృష్టి, సర్వజిత్తునందు ఉత్త మవృష్టి, సర్వధారియందు ధాన్యాది సమృద్ధి, విరోధియందు మేఘ వినాశము. 'వికృతి' యందు భయము ‘ఖరి యందు పురుషులలో పౌరుషాధిక్యము. నందన యందు ప్రజానందము. 'విజయ' మందు శత్రునాశనము, జయ యందు రోగవినాశనము ‘మన్మథ' యందు జ్వరపీడ. దుష్కరమునందు ప్రజలకు దుష్కర్మప్రవృత్తి దుర్ముఖమున కటు భాషిత్వము. హేమ లంబమున నంపత్రాప్తి, విలంబమున అన్న ప్రాచుర్యము వికారియందు శత్రుకోపము. శార్వరియందు అక్కడక్కడ సర్వ లాభము ప్లవయందు వరదలు. 'శోధన శుభకృతు’ లందు నామానుకూలముగ శుథము. 'రాక్షస యందు ప్రజలలో నిమరత్వము “అనల' యందు వివిధధానోత్పత్తి. 'పింగల' యందు ఆచ్చటచ్చట వృష్టి. కొలయుక్త' మున ధనహాని. “సిద్దార్థమున సకల కార్యసిద్ధి. రౌద్రమునందు ప్రపంచమున రౌద్రభావప్రవృత్తి. దుర్మతి’ యందు మధ్యవృష్టి “దుందుభి యందు మంగలము ధనధాన్య ప్రాప్తి, రుధిరోద్గారి రక్తాక్షులందు రక్త పానము. క్రోధనమున విజయము. 'క్షయ' యందు ప్రజాపక్షయము ఈ విధముగ అరువది సంవత్సరముల (లో కొన్నింటిని) గూర్చి చెప్పబడినది.

అగ్ని మహాపురాణమునందు సంగ్రామజయార్ణవమున షష్టి సంవత్సర ఫలనిరూపణమను నూట ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.