అగ్ని మహా పురాణము

60 - అథ వాసుదేవప్రతిష్ఠావిధిః

శ్రీ భగవానువాచః

పిణ్డికాస్థాపనార్థం తు గర్భాగారం తు సప్తధా

విభజేద్భ్రహ్మథాగే తు ప్రతిమాం స్థాపయేద్బుధః.

 దేవమానుష వైశాచ భాగేషు న కదాచన

బ్రహ్మ భాగం పరిత్యజ్య కిఞ్చిదా శిత్య చాణ్డజ.

దేవమానుష భాగాభ్యాం స్థాప్యా యత్నాత్తు పిణ్దికా

నపుంసక శిలాయాం తు రత్న న్యాసం సమాచ రేత్.

నారసిం హేన హుత్వాథ రత్న న్యాసం చ తేన వై

 వీహీనత్నాని ధాతూంశ్చ లోహాదీంశ్చన్దనాదికాన్.

పూర్వాది నవగ రేషు న్య సేన్మ ధ్యే యథారుచి

అథ చేన్గాది మనైశ్చ గర్తో గుగ్గులావృతః.

రత్న న్యాసవిధిం కృత్వా ప్రతిమామాలభేద్దురుః

సశలా కైర్దర్భ పుజ్ఞాః సహదేవై కి సమన్వితై .

సబాహ్యా నైశ్చ సంస్కృత్య పఇ్చగవ్యన శోధయేత్

ప్రోక్షయేద్దర్భతోయేన నదీతీర్థోద కేన చ.

హయగ్రీవుడు చెప్పెను - బ్రహ్మ దేవా! పిండి కాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయములోని గర్భగృహ మును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మ భాగము నందు స్థాపింపవలెను. దేవ - మనుష్య - పిశాచ భాగములయందెన్నడును స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవ భాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమి పై ప్రయత్న పూర్వకముగ పిండిక ను స్థాపింపవలెను. నపుంసక శిలపై - రత్న న్యాసము చేయవలెను. నృసింహమంత్రముతో హోమము చేసి, ఆ మంత్రముతోనే రత్న న్యాసము కూడ చేయవలెను. ద్రోహులు, రత్నములు, లోహము మొదలగు ధాతువులు, చుదనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును. మధ్యభాగము నందును ఉంచిన కుండములలో, తన అభిరుచి ననుసరించి ఉంచవలెను. పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాది దిశ లలో నున్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాస విధి పూర్తి యైన పిదప గురుశ లోకలతో కూడిన కుశ సమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థ జలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.

హోమార్ధే స్థణ్దిలం కుర్యాత్సిక తాభిః సమ నతః

సార్ధహస్తప్రమాణం తు చతురస్రం సుశోభనమ్.

అష్టదిక్షు యథాన్యాసం కలశానపి విన్య సేత్

పూర్వాద్యానష్టవర్ణన అగ్నిమాపీయ సంస్కృతమ్.

త్వమగ్నేద్యుభరితి చ గాయత్ర్యా సమిధా హుతమ్

అష్టార్లేనాష్టశతకమాజ్యం పూర్ణం ప్రదాపయేత్.

శాస్త్యుదక మాత్రపతై రూలేన శతమ గ్రితమ్

సిక్చోద్దేవస్య తన్మూర్టీ శ్రీశ్చ తే హ్యనయా ఋచా.

బ్రహ్మయానేన చోద్ధృత్య ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే

తద్విష్ణోరితి మ శ్రేణ ప్రాసాదాభిముఖం నయేత్.

శిబికాయాం హరిం స్థాప్య భ్రమయీత పురాదికమ్

గీత వేదాదిశ బ్దైశ్చ ప్రాసాదాభిముఖం నయేత్.

హోమము కొరకు ఇసుక తో ఒకటిన్నర హస్తముల విస్తారము గల, చతురస్రము, సుందరము ఆగు వేదిని ఏర్పరుపవలేను. ఎనిమిది దిక్కులందును. యథాస్థానమున కలశము లుంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను, పిమ్మట అగ్ని ని వేది పై స్థాపించి, కుశలతో సంస్కారము చేసి “త్వమగ్నే ద్యుభిః” అను మంత్రము తోను, గాయత్రీ మంత్రముతోను సమిధలను హోమము చేయవలెను. అష్టాక్షర మంత్రముతో నూట ఎనిమిది ఆజ్యాహుతులు చేసి, పూర్ణాహుతి ఇవ్వవలెను. పిమ్మట నూరు పర్యాయములు మూలమత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుగకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సు పై చల్లవలెను. ఆ సమయమున “శ్రీశ్చ లక్ష్మీశ్చ” ఇత్యాది మంత్రము పఠింప వలెను. “ఉత్తిష్ట బ్రహ్మణస్పతే” అను మంత్రముతో ప్రతిమను పైకి ఎత్తి, బ్రహ్మ రథముపై నుంచి, “తద్విష్ణోః” ఇత్యాదిమంత్రము పఠించుచు దేవాలయము వైపు తీసికొని వెళ్ళవలెను. ఆక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీ పై ఎక్కించి నగరమునందు, గీత వాస్య వేదమంత్రా ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయద్వారమువద్దకు తీసికొనిరావలెను.

స్త్రీభిర్విప్రైర్మజలాష్టమ టైః సంస్నా పయేద్దరిమ్

తతో గందదినాభ్యర్చ్యమూలమ శ్రేణ దేశిక .

అతో దేవేతి వస్త్రాద్యమష్టాంగార్యం నివేద్య చ

స్థిరే లగ్నే పిణ్డికాయాం దేవస్యత్వేతి ధారయేత్.

ఓం త్రైలోక్యవి క్రాన్తాయ నమస్తేస్తు త్రివిక్రమ

సంస్థాప్య పిణ్డికాయాం తు స్థిరం కుర్వాద్విచక్షణః.

ధ్రువా ద్యౌరితి మంత్రేణ విశ్వతశ్చక్షురిత్యపి

పఞ్చగవ్యేన సంస్నాప్య క్షాల్య గందోద కేన చ.

పూజయేత్సక లీకృత్య సాజ్గం సావరణం హరిమ్

పిమ్మట గురువు సువాసినీగ్రోల చేతను, బ్రాహ్మణుల చేతను, ఎనిమిది మంగళ కలశ ముల ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించి, మూలమంత్రోచ్చారణ, పూర్వకముగ గంధాద్యుపచారములు సమర్పించి పూజచేసి “ఆతో దేవాః” ఇత్యాది ఋక్కు చదువుచు వస్త్ర్యా ష్టా: గార్ఘ్యము ఇవ్వవలెను. పిమ్మట స్థిరలగ్నమున “దేవస్యత్వా ఇత్యాదిమంత్రము చదువుచు ఆ అర్చావిగ్రహమును ప్రతిష్ఠ చేయవలెను. “సచ్చిదానంద స్వరూపా! త్రివిక్రమా! నీవు మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించితివి. నీకు నమస్కాతము” అని ప్రార్థింపవలెను. ఈ విధముగ పండితుడు ప్రతిమను పిండిక మీద స్థాపించి, “ధ్రువాద్యౌః” “విశ్వతశ్చక్షుః” ఇత్యాదిమంత్రములు చదువుచు స్థిరము చేయవలెను. పంచగవ్యము లతో స్నానము చేయించి, గంధోదక ముదో ప్రతిమా ప్రక్షాళనము చేసి, సకలీకరణానంతరము, శ్రీహరికి సాంగోపాంగ సాధారణపూజ చేయవలెను.

ధ్యాయేత్ఖం తస్య మూర్తిం తు పృథివీ తస్య పీఠికా

కల్పయేద్విగ్రహం తస్య తై జనైః పరమాణుభిః

జీవమావాహయిష్యామి పశ్చివింశతిత త్వగమ్

చైతన్యం పరమానన్దం జాగ్రత్స్వప్న వివర్జితమ్

దేహేంద్రియమనోబుద్ధిప్రాణాహఙ్కారవర్జితమ్.

బ్రహ్మా దిగ్డమ్బపర్యన్తం హృదయేషు వ్యవస్థితమ్

హృదయాత్రతిమాబిమ్బ స్థిరో భవ పరేశ్వర.

సజీవం కురు బిమ్బం త్వం సబాహ్యాభ్యనరస్థిత

ఆజ్ఞుష్ఠమాత్రః పురుషో దేహోపాధిషు సంస్థితః.

జ్యోతిర్జానం పరం బ్రహ్మ ఏక మేవాద్వితీయకమ్

సజీవీక రణం కృత్వా ప్రణవేన నిబోధయేత్ .

సాన్నిధ్యకరణం నామ హృదయం స్పృశ్య వై జపేత్

సూక్తం తు పౌరుషం ధ్యాయన్ని దం గుహ్యమనుం జపేత్ .

ఈ విధముగ ధ్యానించవలేను – “ఆకాశము శ్రీ మహా విష్ణువు యొక్క విగ్రహము; పృథివి ఆతని పీఠము (సింహాసనము). పిమ్మట పరమాత్ము ని శరీరము తై జసపరమాణువులతో ఏర్పడి నట్లు భావన చేయుచు ఇట్లు చెప్పవలెనుఇరువదియైదు తత్వములలో వ్యాపించి యున్న జీవుని ఆవాహన చేయుచున్నాను. ఆ జీవుడు చైతన్య స్వరూపుడు. పరమానందరూపుడు; జాగ్రత్స్వప్న సుషు ప్వవస్థాశూన్యుడు. దేహేంద్రియ - మనో - బుద్ది - ప్రాణ - ఆహంకార రహితుడు. బ్రహ్మ మొదలు కీటకము వరకును ఉన్న సకలజగత్తునందును వ్యాపించి, అందరి హృదయములలో ఉన్న వాడు. పరమేశ్వరా! నీవే ఆ జీవచైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిర ముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠమాత్రపురుషు డున్నాడు. అతడు జ్యోతిస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు; ఏకమాత్ర ఆద్వితీయపర బ్రహ్మ. ఈ విధముగ ప్రతిమను సజీవము చేసి ప్రణపముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణకర్మ” యని పేరు. భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్యమంత్రమును పఠింపవలెను.

నమస్తేస్తు సురేశాయ సన్తోషవిభవాత్మనే

జ్ఞానవిజ్ఞానరూపాయ బ్రహ్మ తేజోనుయాయినే.

గుణాతిక్రాంత దేశాయ పురాణాయ మహాత్మనే

ఆక్షయాయ పురాణాయ విష్ణో సన్నిహితో భవ.

యచ్చ తే పరమం తత్వం యచ్చ జ్ఞానమయం వపుః

తత్సర్వమేక తో లీనమస్మిన్డే హే విబుధ్యతామ్.

ఆత్మానం సన్ని ధీకృత బ్రహ్మా దిపరివార కాన్ స్వ

నామ్నా పయేదన్యానాయుధాన ముద్రయా.

యాత్రావర్షాదికం దృష్ట్వా జ్ఞేయః సన్ని హితో హరిః

నత్వా స్తుత్వా స వాద్యైశ్ఛ జప్త్వా చాష్టాక్షరాదికమ్.

 “ప్రభూ! నీవు సకలదేవాధీశుడవు. సంతోషపై భవస్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞాన విజ్ఞానము నీ స్వరూపము. త్రిగూణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశరహితు డగు పురాణపురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణ! నీ విచట సంనిహితుడవు కమ్ము. నీ పరమతత్వము, జ్ఞానమయశరీరము ఒక సంఘాతముగ ఏర్పడి ఈ ఆర్చావిగ్రహమునందు ఆవిర్భూత మగు గాక”. ఈ విధముగ శ్రీహరి సాంనిధ్యకరణము చేసి ఆతని ఎదుట బ్రహ్మ దీపరివార దేవతలను స్థాపింపవలెను. వారి ఆయుధములను ముద్రలను కూడ స్థాపింపవలెను. శ్రీహరిదర్శనార్థమై వచ్చు వారియాత్రలను బట్టియు, వరాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నా డను విషయమును గ్రహింపవలెను. నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాదిమంత్రములు జపించుచు భగవంతుడచట సన్నిహితుడై యున్నాడని గ్రహింపవలెను.

చణ్డప్రచణ్డౌ ద్వారస్థా నిర్గ త్యాభ్యర్చయేద్గురుః

అథ మజ్ఞపమాసాద్య గరుడం స్థాప్య పూజయేత్.

దిగీశాన్ దిశి దేవాంశ్చ స్థాప్య సంపూజ్య దేశిక

విష్వక్సేనం తు సంస్థాప్వ శబ్ధచక్రాది పూజయేత్.

సర్వపార్షద కేభ్యశ్చ బలిం భూతేభ్య అర్పయేత్

గ్రామవస్త్ర సువర్ణాది గురవే దక్షిణాం దదేత్.

యాగోపయోగిద్రవ్యాద్యమా దార్వాయ నరోత్సయేత్

ఆచార్యదక్షిణార్థం తు ఋత్విగో దక్షిణాం దదేత్.

అన్యేభ్యో దక్షిణాం దద్యాదిజయే బ్రాహ్మణ స్తతః

ఆవారితాన్ ఫలాన్ దద్యాద్యజమానాయ వై గురుః.

విష్ణుం నమేతృతిష్టాతా చాత్మనా శకలం కులమ్ .

సర్వేషామేవ దేవానామేష సాధారణీ విధిః.

మూలమంత్రాః పృథక్ తేషాం శేషం కార్యం సమానకమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయ వాసుదేవ ప్రతిష్ఠాది విధిర్నామ షష్టితమోధ్యాయః.

పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ - ప్రచండు లను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆ యా దిక్పాలకులను, ఇతర దేవతలను స్థాపించి, శంఖచక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ-వస్త్ర-సువర్ణాదులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యున కీయవలెను. ఋత్విక్కులకు ఆచార్యదక్షిణలో సగ మీయవలెను. పిమ్మట బ్రాహ్మణులకు గూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. ఆచటకు వచ్చు బ్రాహ్మణు నెవ్వనిని అడ్డు పెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫల మీయవలెను. భగవద్విగ్రహప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు తన వంశీయు లందరిని తనతో పాటు శ్రీమహా విష్ణువు సమీపమునకు తీసికొని పోవును. ఇది అందరు దేవతలకును సాధారణ మైన విధానము. కానీ ఆ యా దేవతల మూ మంత్రములు మాత్రము వేరు వేరుగ నుండును. మిగిలిన కార్యము లన్నియు సమానమే.

అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిష్టాదివిధి యను ఆరువదవ అధ్యాయము సమాప్తము.