అగ్ని రువాచః
వాక్కర్మ పార్శ్వయుక్ముక్ల తోకకృతే మతోప్లవః ।
హుతాన్తా దేశవర్ణేయం విద్యా ముఖ్యా సరస్వతీ.
ఆక్షా రాశీ వర్ణలక్షం జపేత్స మతిమాన్భవేత్ ।
ఆత్రిః సవహ్నిర్వా మాక్షి బిందురింద్రాయ హృత్పరః.
వజ్రపద్మధరం శక్రం పీత మావాహ్య పూజయేత్ ।
నియుతం హోమయేదాజ్య తిలాం స్తేనాభి షేచయేత్.
నృపాదిర్భ్రష్ట రాజ్యాధీన్ రాజ్యపుత్రాది మాప్నుయాత్ ।
హృల్లేఖా శ క్తి దేవాఖ్యా దోషాగ్నిర్ధండి దండవాన్.
శివ మిష్ట్వా జపేచ్చ క్తి మష్టమ్యాది చతుర్ధ శీమ్ ।
చక్రపాశాంకుశ ధరాం సభాయాం వరదాయికామ్.
హోమాదినాన సౌభాగ్యం కవిత్వం పుత్రవాన్భవేత్ ।
ఓం హ్రీం, ఓం నమః కామాయ సర్వజన హితాయ
సర్వ జన మోహనాయ ప్రజ్వలితాయ సర్వజన
హృదయం మమాత్మ గతం కురు.
ఓం ఓం ఏతజ్జపాది నామంత్రోవశ యేత్సకలం జగత్.
ఓం హ్రీం చాముండే ఆముకం దహ దహ
పచ పచ మమవశ మానయ ఆనయ ఠఠ.
వశీకరణ కృన్ మంత్రశ్చా ముండాయాః ప్రకీర్తితః ।
ఫలత్రయ కషాయేణ వరాంగం క్షాలయే ద్వశే .
ఆశ్వగంధాయవైః స్త్రీతు నిశాకర్పూర కాదినా ।
పిప్పలీ తండులాన్యష్టౌ మరిచానిచ వింశతిః.
బృహతీరస లేపాచ్చ వశే స్యాన్మరణాంతికం ।
కటీర మూల త్రికటు క్షౌద్రలేప స్తథా భవేత్.
హిమం కపిత్థకరసం మాగధీ మధుకం మధు ।
తేషాం లేపః ప్రయు క్తస్తు దంపత్యోః స్వస్తిమావ హేత్.
సశర్కరో యోనిలేపాత్కదంబ రసకోమధు ।
సహదేవీం మహాలక్ష్మీః పుత్రజీవీ కృతాంజలిః.
ఏతచ్చూర్ణం శిరః క్షిప్తంలోకస్య వశముత్తమమ్ ।
త్రిఫలా చందనక్వాథ ప్రస్థాద్వికుడవం పృథక్ .
భృంగ హేమరసం దోషాతావతీ చుంబ (ఛంబు) కంమధు ।
ఘృతైః పక్వానిఛాయా శుష్కా లేప్యాతు రంజనీ.
విదారీంసోచ్చటా మాష చూర్ణీ భూతాం సశర్కరామ్ ।
మథితాంయః పిబేత్క్షీరై ర్నిత్యం స్త్రీశతకం వ్రజేత్.
అగ్ని దేవుడు పలికెను. “ఐ, కులజే ఐం సరస్వతి స్వాహా" ఇది పదకొండు అక్షరముల ముఖ్యమంత్రమైన సరస్వతీ విద్యా. "ఉప్పులేని ఆహారము తినుచు అక్షర లక్షలు జపము చేసినవాడు బుద్ధిమంతుడగును. ఆత్రి (ద్) అగ్ని (ర్) వామనేత్ర (ఈ) బిందు (9) ఇవి కలుపగా ఏర్పడిన “హ్రీం” యను మంత్రము శత్రువులను పారద్రోలు మహామంత్రము. వజ్ర కమలములను ధరించిన పీతవర్ణుడగు ఇంద్రుని ఆ వాహనచేసి పూజించి మృత తిలములతో లక్ష హోమములు చేయవలయును. పిదప తిల మిశ్ర జలముతో ఇంద్రునకు అభిషేకము చేయవలయును. అట్లు చేయుటచే రాజు కోల్పోయిన రాజ్యమును పుత్రాదులను పొందును. హీం అనుదానికి “శక్తి దేవ” యని పేరు దీని ఉద్దారము ఘోష అగ్ని దండి దండములు. శివా శివ పూజలు చేసి ఈ మంత్రమును జపించవలయును. అష్టమీనుండి చతుర్దశి వరకు పూజలో వుండవలెను. చేతులలో చక్రము పాశము అంకుశము అభయముద్ర ధరించిన వరదాత్రియగు దేవిని ఆరాధన చేసి హోమాదులు చేయుటచే సౌభాగ్యము కవితాశ క్తి పుత్రులు లభింతురు. “ఓం హ్రీం ఓం నమః” మొదలు "కురు కురు ఓం" వరకును వున్న మూలోక మంత్రమును జపాదులు చేయుటచే సంపూర్ణ జగత్తువక ములో నుండును. ఓం హ్రీం చాముండే అముకం దహ దహ పచపచ మమవశమానయస్వాహా ఓం" ఇది చాముండా వశీకరణమంత్రము. ఈవశీకరణ ప్రయోగ సమయమున శ్రీ చల్లని త్రిఫలాజలముతో తన గుహ్యాంగమును కడుగుకొనవలయును. అశ్వగంధయవ క్షార హరిద్రా కర్పూరా దులు కూడ ఇందుకు ఉపయోగించవచ్చును. ఎనిమిది పిప్పలి తండులములు ఇరువది మిరియముగింజల బృహతీ రసము వీటి లేపముచే కూడ మరణాంతము వరకు వశము చేసుకొన గలుగును. కటినమూ త్రికటు ఔద్ర లేపముకూడ ఇందులకు ఉపయోగించును. హిమ, కపిత్తక రస, మాగధి మధు వీటి ప్రయోగము దంపతులకు క్షేమకరము. శర్కర కలిపిన కబందరసమును మధువును గుహ్యాంగము నందు లేపనము చేసినచో వశీకరణమగును. సహదేవి, మహాలక్ష్మి పుత్రజీవి కృతాంజలులు చూర్ణమును శిరస్సుపై ఉంచినచో ఇది ఉత్తమమైన వశీకరణ సాధనము. త్రిఫలా చందన ముల క్వాథము ఒక ప్రస్తము వేరుగాను రెండుకుడవములు వేరుగాను వుచి భృంగ పామరసములు అంతే ప్రమాణము గల పసువు చుంబకము తేనె. నేతిలో ఉడికించినపుడు పసుపు, ఎండిన పసుపు వీటి అన్నిటికో లేపము తయారుచేసి ఔదారి జటా మాంస చూర్ణము నందు శర్కర కలిపి బాగుగా మర్దించి పాంతో ప్రతిదినము సేవించు పురుషుడు శ్రీ శతముతో సంగమము చేయకలుగును.
గుల్మమాషతిలవ్రీహి చూర్ణక్షీర సితాన్వితమ్ ।
ఆశ్య (శ్వ) త్థవంశ దర్భాణాం మూలంవై వైష్ణవీ శ్రీయోః.
మూలందూర్వాశ్వ గంధోత్థం పిబేత్క్షారైః సుతార్థినీ ।
కౌంతీలక్ష్మ్యోః శిఫాధాత్రీ వజ్రం లోధ్రం వటాంకురమ్.
ఆజ్యక్షీ రమృతౌ పేయం పుత్రార్థం త్రిదివంస్త్రియా ।
పుత్రార్థినీ పిబేత్ క్షీరం శ్రీమూలం సవటాంకురమ్.
శ్రీవటాంకుర దేవీనాం రసం నన్యే పిబేచ్చసా ।
శ్రీపద్మమూల ముత్ క్షీర మశ్వత్థోత్తర మూలయుక్.
తరలం పయసాయుక్తం కార్పాస ఫలపల్లవమ్ ।
అపామార్గస్య పుష్పాగ్రం నవం సమహిషీపయః.
పుత్రార్థం చార్ధషట్ శ్లోకైర్యోగాశ్చత్వార ఈరితాః।
శర్కరోత్పల పుష్పాక్ష లోధ్ర చందనసారివాః.
స్రవమాడే శ్రియా గరే దాతవ్యా స్తండులాంభసా ।
లాజాయష్టి సీతా ద్రాక్షాక్షౌద్ర సర్పిషివా లిహేత్.
గుల్మ, మాష, తిలవ్రీహి చూర్ణములతో పాటు శర్కరకలిపి ఆశ్వత్థ వంశ, దర్భమూల వైష్ణవీ శ్రీ మూలము లను దూర్వా అశ్వగంధ మూలములను పుత్రులు కోరు స్త్రీ పాలతో త్రాగ వలెను. కాంతిలక్ష్మి శిఫాధాత్రి. వజ్ర, లోధ్ర, వటాంకురములను స్త్రీ ఋతుకాలమునందు ఆజ్య క్షీరములు కలిపి త్రాగవలెను. పుత్రుడు కలుగును, పుత్రార్థినియగు స్త్రీ శ్రీయను ఓషధీమూలమును వటాంకురమును క్షీరముతో త్రాగవలెను. శ్రీ వటాంకుర దేవీల రసమును నశ్యముగా తీసుకొనవచ్చును. త్రాగవచ్చును. శ్రీ పద్మమూల అశ్వత్థ ఉత్తరమూ ములను పాలతో త్రాగవలెను. కారాస ఫలము అను పల్లవములను పాలలో నూరి పలుచగ చేసి త్రాగవలెను. అపామార్గ నూతన పుష్పాగములను గేదెపాలతో త్రాగ వలెను. పైన చెప్పిన ఆరున్నర శ్లోకములలో నాలుగు పుత్రప్రాప్తియోగమును చెప్పబడినవి. స్త్రీకి గర్భ స్రావమగుచున్నచో శర్కర, ఉత్పల పుష్ప, అక్షలోధ్ర, చందన, శార్దాలతను బియ్యపుకడుగులో నూరిగాని లేదా లాజాయష్టిసిలా, ద్రాక్ష, మధు, ఘృతములను కలిపిగాని స్త్రీ సేవించవలెను.
అటరూష కలాంగల్యోః కాకమాచ్యాః శిఫాపృథక్ ।
నాభేరదః సమాలిప్య ప్రసూతే ప్రమదా సుఖమ్.
రక్తం శుక్లం జపాపుష్పం రక్తశుక్ల స్రుతౌ పిబేత్ ।
కేసరం బృహతీ మూలం గోపీయష్టి తృణోత్పలమ్.
సాజక్షీరం సతైలం తద్భక్షణం రోమజన్మకృత్ ।
శీర్య మాణేష కేశేషు స్థాపనంచ భవేదిదమ్.
ధాత్రి భృంగరస ప్రస్థం తైలంచ క్షీరమాడకమ్ ।
షష్ట్యంజన ఫలం తైలం తత్కేశాక్షి శిరోహితమ్.
హరిద్రారాజ వృక్షత్వక్ చించాలవణలోధకౌ ।
పీతాఖారీ హరేదాశు గవాముదర బృంహణమ్.
ఓం నమో భగవతే త్ర్యంబకాయ ఉపశమయ ఉపశమయ
చులుచులు మిలి మిలి భిదభిద గోమానినీ చక్రిణీ హ్రూంఫట్ ।
అస్మిన్గ్రామే గోకులస్య రక్షాం కురు శాంతింకురు శాంతింకురు ఠఠఠ.
ఘంటాకర్ణో మహా సేనో వీరః ప్రోక్తో మహాబలః.
మారీనిర్నా శనకరః సమాం పాతు జగత్పతిః ।
శ్లోకౌచై వన్య సేదేతౌ మంత్రౌ గోరక్షకౌ పృథక్ .
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నానావిధ మంత్రౌషధాదికం నామ ద్వ్యధిక త్రిశతతమోఽధ్యాయః.
ఆటరూష, కలాంగలీ, కాకమాచీ శివలను నూరి నాభి క్రిఁదు భాగమన పూసినచో సుఖప్రసవమగును. రక్త శుక్ల జపాపుష్పములు రక్త శుక్ల ఓషధులు కలిపి త్రాగవలెను. కేసరబృహతీ మూల గోపీ షష్టి తృణోత్పలము లను మేక పాలతో నూరి తైలము కలిపితిన్నచో వెంట్రుకలు మొలచును, జుట్టు ఊడిపోకండగ చేయుటకు కూడ ఇవి ఉపయో గించును. ధాత్రి, భృంగర సములు ఒక్కొక్క ప్రస్థము, తైలము, ఒక ఆడకము పాలు షష్టి ఆంజనల ఒక పలము తైలము ఇవియన్నియు నేతకేశ శిరస్సులకు హితకరములు. హరిద్రా రాజవృత్వక్ చించాలవణ లోధ్ర పితఖారులు, ఆవుల పొట్ట ఉబ్బురోగమును తొలగించును, ఓం నమోభగవతే మొదలుకురు ఠఠత వరకును గల మూలో క్తమంత్రము గోసముదాయర ఇక్షామంత్రము. మహాసేనుడు, వీరుడు అగు మంటాకర్ణుడు మహాబలవంతుడని చెప్పబడివాడు. జగత్పతియైన ఆతడు మహామారి వినాశకుడు. అతడునన్ను రక్షించుగాక ! ఈ రెండు మంత్రములుగోరక్షక మంత్రములు. వీటిని వాసి ఇంటిలో వుంచుకొనవలయును.
అగ్ని మహాపురాణమునందు నానా విధమంత్రౌషధాదికమను మూడు వందల రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 302 of the Agni Purāṇa is as follows:
This chapter catalogues the eighty types of vāta disorders, the forty types of pitta disorders, and the twenty types of kapha disorders, along with their characteristic signs and symptoms. Agni explains the mixed (sāṃnipatika) disorders that arise when two or three doṣas are simultaneously vitiated, which are the most difficult to cure. The significance of proper diagnosis (parīkṣā) through pulse, urine, skin, tongue, eye, and sound is introduced. The physician who understands the doṣa-dhātu-mala framework is said to be capable of treating all conditions.