అగ్ని మహా పురాణము

321 - అథా ఘోరాస్త్రాది శాంతికల్పః

ఈశ్వర ఉవాచః-

 అస్త్రయాగః పురా కార్యః సర్వకర్మసు సిద్ధిదః

మధ్యేపూజ్యం శివాద్యస్త్రం వజ్రాది న్పూర్వతః క్రమాత్.

పంచచక్రం దశకరం రణాదౌ పూజితం జయే

గృహపూజా రవిర్మధ్యే పూర్వాద్యాః సోమకాద యః.

 నర్వ ఏకాదశ స్థాస్తు గృహాః స్యుర్గ్రహ పూజనాత్

అస్త్రశాంతిం ప్రవక్ష్యామి సర్వోత్పాత వినాశినిమ్.

 గ్రహరోగాది శమనీం మారీ శత్రు విమర్దినీమ్

వినాయకోపత ప్తిఘ్న మఘోరాస్త్రం జపేన్నరః.

 లక్షం గ్రహాది నాశః స్యాదుత్పాతే తిలహోమకమ్

దివ్యేలక్షం తదర్దేన వ్యోమహోత్పాత నాశనమ్.

ఘృతేన లక్షపాతేన ఉత్పాతే భూవిజేహితమ్

మృత గుగ్గులు హోమేచ నర్వోత్పారాది మర్దనమ్.

 దూర్వాక్షతాజ్య హోమేన వ్యాధయోఽథ ఘృతేనచ

సహ స్రేణతు దుః స్వప్నా వినశ్యంతిన సంశయః.

ఆయుతాద్గ్రహ దోషఘ్నో జవాఘృత విమిశ్రితాత్

వినాయకా ర్తి శమనమయుతేన ఘృతస్యచ.

 భూత వేతాళ శాంతిస్తు గుగ్గులోరయుతేన చ

మహావృక్షస్య భంగేతు వ్యాలకం కే గృహేస్థితే.

 ఆరణ్యానాం ప్రవే శేచ దూర్వాజ్యాక్షత హావనాత్

ఉల్కాపాతే భూమికంపే తిలాజ్యేనా హుతాచ్చివమ్.

 రక్తస్రావే తు వృక్షాణామయుతాద్గుగ్గులోః శివమ్

ఆకాలే ఫల పుష్పాణాం రాష్ట్ర భంగేచ మారణే.

 ద్వీపదాదేర్యదా మారీలక్షార్ధాచ్చ తిలాజ్యతః

హస్తిమారీ ప్రశాంత్యర్థం కరిణీ దంత వర్ధ నే.

హస్తిన్యాం మదదృష్టౌచ ఆయుతాచ్చా న్తిరిష్యతే

అకాలే గర్భపాతు జాతం యత్ర వినశ్యతి.

 వికృతాయత్ర జాయన్తే యాత్రాకాలేఽయుతం హునేత్

తిలాజ్య లక్షహోమన్తు ఉత్తమ సిద్ధిసాధనే.

 మధ్యమాయాం తదర్ధేన తత్పాదాదధ మాసుచ

యథా జప స్తథా హోమః సంగ్రామే విజయో భవేత్.

అఘోరాస్త్రం జపేన్న్యస్య ధ్యాత్వా పంచాస్య మూర్జితమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయేఽ ఘోరాస్త్రాది శాంతికల్ప నిరూపణం నామైకవింశత్యధిక త్రిశతతమోఽధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను. సమస్త కర్మల యందును ముందుగా సర్వ సిద్ది ప్రదమగు అస్త్రయాగము చేయవలెను. మధ్య భాగమున శివాటి అస్త్రమున పూర్వాది దిక్కు లందు క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల అస్త్రములను పూజించపలెను. శంకరునకు ఐదు ముఖములు పది హస్తములున్నవి. అట్టి శంకరుని యుద్ధ ప్రారంభమున పూజించినచో జయము కలుగును. మధ్య యందు రవిని పూర్వాది దిక్కు లందు చంద్రాదులను వుంచి గ్రహపూజ చేయవలెను. గ్రహపూజ చేయుటచే గ్రహములన్నియు ఏకాదశ స్థానమునందున్న లాభ రూప ఫలమును ఇచ్చును. సమస్త ఉత్పాతమును నశింపచేయు ఆస్త్ర శాంతిని చెప్పెదను. ఇది గ్రహరోగాదులను మారి శత్రు భయూదులను తొలగించును. వినాయకుల వలన కల్గిన బాధలను తొలగించును. నరుడు లక్ష పర్యాయములు ఆ ఘోరాస్త్రము జపించినచో గ్రహములు నశించును. దివ్య ఉత్పాతములు కలిగి నపుడు అర్ధ లక్ష హోమములు చేయవలెను. లక్ష ఆజ్యాహుతులు చేసినచో భూమి జోత్పాతములు నశించును. గుగ్గులు మిత్ర మృతమును హోమము చేసినచో ఆన్ని ఉత్పాతములు నశించును. దూర్వలు ఆక్షతలు ఆజ్యము, హోమము చేసిన సర్వ రోగములు నశించును. మృతముతో సహస్ర హోమము చేసినచో దుస్స్వప్న ములు నశించును. ఇందు సంశయము లేదు. పది వేలు హోమము చేసినచో గ్రహ దోషములు తొలగును. యవఘృత హోమముచే వినాయక బాధలు తొలగును. పది వేల ఆజ్య హోమములు పది వేల గుగ్గులు హోమములు చేసినచో భూతవేతాళ శాంతి కలుగును. ఏదైన మహా వృక్షము పడి పోయినను ఇంటిలో సర్ప శవము వచ్చినను మృత, అక్షతల హోమములచే విమ్న శాంతి కలుగును. ఆరణ్య ప్రవేశము చేయ వలసినపుడు కూడ ఇట్లు చేయవలెను. ఉల్కాపాతము గాని, భూకంపము గాని కల్గినపుడు తిలమృత హోమములు చేసిన మంగళమగును, వృక్షము నుండి రక్తము కారినను ఆకాలమున పుష్ప ఫలము వుట్టినను రాష్ట్ర భంగము కల్గినను తిలమిశ్ర మృతముతో ఆర్ధ లక్ష హోమములు చేయవలెను. ఏనుగులకు మహా మారి వచ్చినపుడు ఆడ ఏనుగులకు దంతములు వచ్చినను లేదా వాటికి గండస్థలము నుండి మదము కొరివను పది వేల హోమము చేసినచో శాంతి కలుగును. ఆకాలమున గర్భ పాతమైనను పుట్టిన వెంటనే శిశువు మరణించినను వికృతాంగములు గల శిశువు జన్మించినను సమయమునకు పూర్వమే శిశువు జన్మించినను పది వేల హోమములు చేసిన దోషము శమించును. సిద్దిని సాధించుటకు తిల మిశ్రమములగు మృతముతో ఒక లక్ష హోమములు చేయుట ఉత్తమము. ఆర్ధ లక్ష హోమములు చేసినచో మధ్యమ సిద్ధియు ఇరవడి ఐదు వేల హోమమ చేసినచో అధమ సిద్దియు కల్గును. జపాను సారముగ హోమము చేసినచో యుద్దము నందు విజయము లభించును. తేజిళ్ళాలి యగు పంచ ముఖుని ధ్యానించుచు న్యాస పూర్వకముగ అఘోరాస్త్ర జపము చేయవలెను.

ఆగ్ని మహా పురాణమున ఆ ఘోరాస్త్రాది శాంతి కల్ప నిరూపణ మను మూడు వందల ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.