అగ్ని మహా పురాణము

263 - అథోత్పాత శాంతిః

పుష్కర ఉవాచః

శ్రీసూక్తంచ ప్రతివేదం జ్ఞేయం లక్ష్మీ వివర్ధనమ్

హిరణ్య వర్ణాం హరిణీమృచః పంచదశశ్రియః.

రథీష్వక్షేషు వాజేతి చతస్రో యజుషిశ్రీయః

స్రావన్తీయం తథాసామ శ్రీసూక్తం సామవేదకే.

శ్రియం ధాతర్మయి ధేహి ప్రోక్తమాథర్వణే తథా

శ్రీసూక్తంయో జపేద్భక్త్యా హుత్వా శ్రీస్తస్య వైభవేత్.

పద్మాని చాథ బిల్వాని హత్వాజ్యం వా తీలాంఛ్రియః

ఏకంతు పౌరుషం సూక్తం ప్రతివేదంతు సర్వదమ్.

సూక్తేన దద్యాన్నిష్పాపో హ్యేకైకయా జలాంజలిమ్

స్నాత ఏకైకయాపుష్పం విష్ణోర్దత్వాఘహా భవేత్.

స్నాత ఏకైకయా దత్వాఫలం స్యాత్సర్వకామభాక్

మహాపాపోప పాపాన్తో భవేజ్జప్త్వాతు పౌరుషమ్.

కృచ్ఛ్రైర్విశుద్ధో జప్త్వాచ హుత్వాస్నాత్వాథ సర్వభాక్

పుష్కరుడు పలికెను : పరశురానూ! ఒక్కొక్క వేదములోనున్న లక్ష్మీవర్ధకమగు శ్రీసూక్తమును తెలియవలెను. “హిరణ్యవర్ణాం హరిణీం” మొదలగు పదునై దు ఋగులు ఋగ్వేదీయ శ్రీసూక్తము. “రథే” (29-43) “అక్షయరాజాయ” (80-18) వాజి (18-34) చతస? (18-32) ఈ సాలుగు మంత్రములును యజుర్వేదీయ శ్రీ సూక్తము. “క్రాంతి యసామ” సామవేదీయ శ్రీసూక్తము. “శ్రీయంధాతర్మయిధేహి” ఇది ఆథర్వవేదీయ శ్రీసూక్తము. భక్తిపూర్వకముగ శ్రీసూక్త జపహోమము చేయువానికి తప్పక లక్ష్మి లభించును. శ్రీదేవి అనుగ్రహమునకై కమలములు, బిల్వములు ఆజ్యము, తిలలు, హోమము చేయవలయును. అన్ని వేదములదును పురుషసూక్తము వున్నది. ఆది సకల కామప్రదమిది. స్నానము చేసి పురుషసూక్తములోని ఒక్కొక్క మంత్రముతో మహా విష్ణువునకు ఒక్కొక్క జలాం జలియు పుష్పమును సమర్పించువాడు తానుపాపరహితుడై ఇతరుల పాపములను కూడ తొలగించును. స్నానము చేసి ఈసూక్తమునందలి ఒక్కొక్క మత్రముతో శ్రీమహావిష్ణుగువకు ఫలమును సమర్పించువాడు సర్వ కామములను పొందును. పురుషసూక్త జపమచే మహా పాతకములు ఉప పాతకములు నశించును. కృఛవ్రతము చేసి పరిశుద్దుడైన వాడు స్నానపూర్వకముగ పురుష సూక్త జప హోమములు చేసినచో సర్వమును పొందును.

అష్టాదశభ్యః శాంతిభ్యిస్తిస్రోఽన్యాః శాంతయో వరాః.

అమృతా చాభయాసౌమ్యా సర్వోత్పాత విమర్దనాః

ఆమృతా సర్వదైవత్యా హ్యభయా బ్రహ్మదైవతా.

సౌమ్యాచ సర్వ దైవత్యా ఏకాస్యాత్సర్వకామదా

ఆభయాయా మణిః కార్యోవరుణస్య భృగూత్తమ.

శతకాండామృతా యాశ్చ సౌమ్యాయాః శంఖజోమణిః

తద్దైవత్యా స్తథా మంత్రాః సిద్దౌస్యాన్మణి బంధనమ్.

దివ్యాన్తరిక్ష భౌమాది సముత్పాతార్ధనా ఇమాః

దివ్యాన్తరిక్ష భౌమంతు ఆద్భుతం త్రివిధం శృణు.

అహర్క్ష వైకృతం దివ్యమాంతరిక్షం నిబోధమే

ఉల్కాపాతశ్చ దిగ్గాహః పరివేషస్తథైవచ.

గంధర్వ నగరం చైవ వృష్టిశ్చ వికృతా చయా

చరస్థిర భవం భూమౌ భూకంపమపి భూమిజమ్.

సప్తాహాభ్యంతరే వృష్టావద్భుతం నిష్ఫలం భవేత్

శాంతిం వినాత్రిభిర్వర్షైరద్భుతం భయకృద్భవేత్.

దేవతార్చాః ప్రనృత్యంతి వేపన్తే ప్రజ్వలన్తిచ

ఆరటంతి చరోదంతి ప్రస్విద్యన్తే హసన్తిచ.

ఆర్చావికారోపశమోఽభ్యర్చ్య హుత్వా ప్రజాపతేః

అనగ్నిర్దీప్యతే యత్ర రాష్ట్రేచ భృశనిఃస్వనమ్.

పదునెనిమిది శాంతులలో సమస్త ఉత్పాతములను తొలగించు అమృత. ఆథయ, సౌమ్య, అనుమూడు శాంతులు సర్వోత్తమములు. అమృతాశాంతి సర్వదై వత్యము. అభయాశాంతి బ్రహ్మదేవతకము. సౌమ్యాశాంతి సర్వదే వత్యము. వీటిలో ఒక్కొక్కటి కూడ సర్వకామప్రదము. ఓ భృగు శ్రేష్ఠా! అభయశాంతి కొరకై వరణవృక్షము యొక్క మూలముతో మణి చేయవలయును. ఆమృతశాంతికి దూర్వామూల మణిని, సౌమ్యా శాంతికి శంఖమణిని ధరించవలయును. ఆయా శాంతుల దేవతలకు సంబంధించిన మంత్రములతో మణిని సిద్ధము చేసి కట్టవలెను. ఈ శాంతులు దివ్య అంతరిక్ష భౌమ ఉర్చాతములను శమింప చేయును. దివ్య, అంతరిక్ష, భౌమ ములను మూడు విధముల ఆద్భుతములగు ఉత్పాతములను చెప్పెదను వినుమా. గహనుక్షత్రముల వికారములచే కలుగు ఉత్పాతములు దివ్యములు. అంతరిక్షత్పాతములను వినుము. ఉల్కాపాతము, దిగ్గాహము, సూర్యుడు గుడి కట్టుక, గంధర్వనగ రము, వికృతమైన వరము ఇవి అంతరిక్ష ఉత్పాతములు. స్థావరములందును జంగమప్రాణులందును కలుగు ఉపద్రవములు, భూకంపము, ఇవిభూమితోత్పాతములు. ఈ ఉత్పాతములు కనబడిన తరువాత ఒక వార ములో పునఃవర్షము పడినచో ఆ అద్భుతము నిష్ఫలమగును. మూడు సంవత్సరముంవరకు ఈ ఆద్బుతోత్పాతమునకు శాంతిచేసుకున్న చో ఆది లోకమునకు భయావహము. దేవతా ప్రతిమలు నాట్యమాడుట, కదలుట, మండుట, శబ్దము చేయుట, ఏడ్చుట, చెమట పట్టుట, నవ్వుట మొదలగు వికారములు కనబడినచో ఆ దేవతలను పూజించి ప్రాజాపత్య హోమము చేయవలయును, ఏరాష్ట్రము నందు అంటించకుండగ నే ఆగ్ని ఘోర శబ్దముతో ప్రజ్వలించినదో ఆ రాష్ట్రము రారిచే పీడింపబడును.

నదీప్యతే చేంధన వాంస్తద్రాష్ట్రం పీడ్యతే నృపైః

అగ్ని వైకృత్య శమన మగ్ని మంత్త్రెశ్చ భార్గవ.

ఆకాలే ఫలితావృక్షాః క్షీరం రక్తం స్రవంతిచ

వృక్షోత్పాత ప్రశమనం శివం పూజ్యచ కారయేత్.

అతివృష్టి రనావృష్టి ర్దుర్భిక్షాయోభయం మతమ్

అనృతౌత్రిదినారబ్ద వృష్టిర్జ్ఞేయా భయాయహి.

వృష్టివైకృత్య నాశః స్యాత్పర్జన్యోన్ద్వర్క పూజనాత్

నగరాదప సర్పస్తే సమీప ముపయాన్తిచ.

నద్యోహ్రదప్రస్రవణా విరసాశ్చ భవన్తిచ

సలిలాశయ వైకృత్యే జప్తవ్యో పారుణో మనుః.

అకాల ప్రసవా నార్యః కాలతోవా ప్రజాస్తథా

వికృత ప్రసవాశ్చైవ యుగ్మప్రసవ నాదికమ్.

స్త్రీణాంప్రసవ వైకృత్యే స్త్రీవిప్రాది ప్రపూజయేత్

వడవా హస్తినీ గౌర్వాయది యుగ్మం ప్రసూయతే.

విజాత్యం వికృతం వాపి షడ్భిర్మాసైర్మ్రియేతవై

వికృతం వా ప్రసూయన్తే పరచక్ర భయం భవేత్.

హోమః ప్రసూతి వైకృత్యే జపోవిప్రాది పూజనమ్

యాని యానాన్య యుక్తాని యుక్తాని న వహంతిచ.

ఆకాశే తూర్యనాదాశ్చ మహద్భయ ముపస్థితమ్

ప్రవిశంతి యదా గ్రామ మారణ్యా మృగపక్షిణః.

అరణ్యం యాన్తివా గ్రామ్యా జలం యాన్తిస్థలోద్భవాః

స్థలం వా జలజాయా న్తి రాజద్వారాదికే శివాః.

ప్రదోషే కుక్కుటోవాసే శివాచార్కోదయే భవేత్

గృహం కపోతః ప్రవిశేత్క్రవ్యాద్విమూర్ధ్నిలీయతే.

మధురాం మక్షికాం కుర్యాత్కాకో మైథునగోదృశి

ప్రాసాద తారేణో ద్యానద్వార ప్రాకార వేశ్మనామ్.

ఆనిమిత్తంలు పతనం దృడానాం రాజమృత్యవే

రజసావాథ ధూమేన దిశోయత్ర సమాకులాః.

కేతూదయోపరాగౌ చ ఛిద్రతాశశిసూర్యయోః

గ్రహర్క్షవికృతిర్యత్రతత్రాపి భయమాదిశేత్.

అగ్నిర్యత్ర నదీప్యేత స్రవన్తే చోదకుంభకాః

మృతిర్బయం శూన్యతాది రుత్పాతానాం ఫలంభవేత్.

ద్విజదేవాది పూజాభ్యః శాంతిర్జపైస్తు హోమతః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఉత్పాత శాంతిర్నామ త్రిషష్ట్యధిక ద్విశతతమోధ్యాయః.

భృగునందనా ! ఇట్టి ఆగ్ని వికారశాంతికి అగ్ని దైవత్యములగు మంత్రములలో హోమము చేయవలయును. వృక్షములు ఫలములిచ్చినను, వాటినుండి పాలు, రక్తము కారినను ఆది వృక్షజనీత భౌమోల్పాతము. అపుడు శివుని హౌజించి ఉత్పాతములకు శాంతి చేయవలయును. ఆతి వృష్టి, అనావృష్టి రెండును దుర్బిక్షకారణములు. వర్ష ఋతువుకాని ఋతువులో మూడు దినములు నిరంతర వృష్టి కలిగినచో ఆదిభయజనకము, పర్జన్య, చంద్ర సూర్యులను పూజించుటచే ఈ వర్షవికారము నశించును. ఒక నగరము నుండి నదులు, దూరమై పోయినను దగ్గరకు వచ్చినను, అందలి సరోవర మూలు ప్రవాహములు ఎండిపోయినను ఈజలాశయ వికారమును తొలగించుటకు వారుణ మంత్రము జపించవలెను. స్త్రీలు అసమయమున ప్రసవించినను, సమయమున ప్రసవించకున్నను వికృతమైన గర్బముకన్నను, కవల పిల్లలు మొదలగు వారిని కన్నను ఈ ప్రసవవికారమను తొలగించుటకు పతి వత లైన స్త్రీలను, బ్రాహ్మణాదులను పూజించవలెను. గుఱముగాని, ఏనుగుగాని, ఆవుగాని, రెండు పిల్లలుకన్నను, వికృతమైన విజాతీయ సంతాసమును కన్న ను ఆరుమాసము లకోపన మరణించినను వికృత గర్భము కన్నను ఆరాజ్యమునకు శత్రువులనుండి భయము కలుగును. ఈ ఉత్పాతమును శాంతింపచేయుటకై హోమము జపము ! బ్రాహ్మణ పూజ చేయవలెను. ఆయోగ్యమైన పశువులు బండి కట్టినను, యోగ్య పశువులు బండిలాగకున్నను, ఆకా మున తూర్యనాదము వినబడినను మహాభయము వచ్చును. వన్య పశుపక్షులు గ్రామ ములో ప్రవేశించినను గ్రామ్య పశువులు వనములోనికి వెళ్ళిపోయినను స్థలచరములు జలములో ప్రవేశించినను, జలచరములు స్థలము పైకి వచ్చినను రాజ ద్వారాది సమీపమునకు నక్కలు వచ్చినను, ప్రదోష కాలమున కోడికూసినను, సూర్యోదయ సమయమున వక్కలు ఆరచినను, పావురములు, ఇంటిలో దూరినను మాంసము తిను పక్షులు తలపై తిరిగినను, సామాన్యపు ఈగ తేనె కూర్చివను కాకులు మైథునము చేయుచుండగ కనబడినను దృడమైన ప్రాసాదములు తోరణములు, ఉద్యానములు, ద్వారములు, ప్రాకారములు, భవనములు, ఆకారణమగ పడిపోయినను రాజు మరణించును. పరాగముగాని, ధూమము గాని, పదిదిక్కుల నిండి పోయినను కేతువు ఉదయించినను. గహణము వచ్చినను, సూర్యచంద్రబింబముల మధ్యరంధ్రము కనబడివను ఇవి గహనక్షత వికారములు. ఇవి ఎచట కనబడునో అచట రయమును సూచించును. ఆగ్ని మండక పోయిను, ఉదక కుంభము అకారణముగ కారినను ఈ ఉత్పాతములకు ఫలితముగ మరణము, భయము, మహా మారి, మొదలగునవి కలుగును. బాహ్మణులను దేవతలను పూజించుటచేతను, జపహోమముల చేతను, ఈ ఉత్పాతములు శాంతించును.

ఆగ్నిమహాపురాణమున ఉత్పాతశాంతికథనమను రెండువందల ఆరువది మూడవ అధ్యాయము సమాప్తము