అగ్ని మహా పురాణము

26 - అథ ముద్రాలక్షణమ్

నారద ఉవాచః-

 ముద్రాణాం లక్షణం వత్యే సాన్ని ధ్యాది ప్రకారకమ్

అఞ్జలిః ప్రథమా ముద్రా వన్దనీ హృదయానుగా.

నారదుడు పలికెను :-

దేవతాసాంనిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన ఆంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ.

ఊర్ధ్వాజ్గుష్ఠో వామచుష్టిర్దక్షిణాజ్గుష్ఠబన్దనమ్

 సవ్యస్య తస్య చౌజ్గుష్ఠో యస్య చోర్ద్వే ప్రకీర్తితః.

 తిస్రః సాధారణావ్యూ హే ఆథాసాధారణా ఇమాః

 కనిష్ఠికాదివిమో కేన అష్టౌ ముద్రా యథాక్రమమ్.

ఎడమచేతి పిడికిలిని బొటనవేలు పైకినిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటనవ్రేలు వంచిబంధించినట్లును (వందని) ఉంచవలెను. అట్లే. రెండు పిడి కెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉండవలెను (హృదయానుగ). ఈ మూడును వ్యూహమునందు సాధారణము చలు. పరుసగా కనిష్ఠిక మొద లైన వాటిని విడువగా ఏర్పడిన ఎనిమిది ముద్రలు అసాధారణములు.

అష్టానాం పూర్వబీజానాం క్రమశ స్త్వవధారయేత్

 ఆజ్గుష్ఠేన కనిష్టానం నామయిత్వాజ్గులిత్రయమ్.

 ఊర్ధ్వం కృత్వా సంముఖం చ బీజాయ నవమాయ వై

వామహస్త మథోత్తానం కృత్వోర్ధ్వం నామధేచ్ఛనై.

వరాహస్య స్మృతా ముద్రా ఆఙ్ఞానాం చ క్రమాదిమాః

 ఏకై కాం మోచయేద్బద్ధ్వా వామముజ్జా తథాజ్గులీమ్.

ఆకుఞ్చయే త్పూర్వముద్రాం దక్షిణే ప్యేవ మేవ చ

ఊర్ధ్వాజ్గుష్ఠో వామముష్టిర్ముద్రాసిద్ధి స్తతో భవేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ముద్రా లక్షణం నామ షడ్వింశోధ్యాయః.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్టిక వరకును ఉన్న మూడు వేళ్ళను అంగుష్ఠముచేత వంచి, పైకి ఉండునట్లును, సంముఖముగాను చేసి నవమబీజమునకు వినియోగించవలెను. వామహస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. ఆది వరాహముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామముష్టియందు ఒక్కొక్క వేలిని . ముణిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణహస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామముష్టియందలి అంగుష్ఠము నిలచి. ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమునందు ముద్రాలక్షణ మను షడ్వింశాధ్యాయము సమాప్తము.