ఈశ్వర ఉవాచః-
సంగ్రామవిజయం విద్యాం పదమాలాం వదామ్యహమ్.
ఓం హ్రీం చాముణ్ణి, శ్మశానవాసిని, ఖట్వాజకపాలహస్తే, మహా పేతసమారూఢ్, మహావిమానసమాకులే, కాలరాత్రి, మహాగణపరివృతే, మహాముఖే, బహుభుజే, మజ్జడమరుక్మిణి, అట్టాట్టహానే, కిలి, కిలి, కిలి, ఓం హూం ఫట్ , దంష్ట్రా మోరాన్తకారిణి, నాదశ బహులే, గజచర్మ ప్రావృతశరీరే, మాంసదిద్దే, లేలిపోనో గ్రణి హే, మహారాక్షసి, రౌద్రదంష్ట్రాకరాలే, భీమాట్టాట్టహాసే, స్ఫుర ద్విద్యుత్ర్పభే, చల చల ఓం చకోర నేత్ర చిల్లి చిలి ఓం లలజ్జ హ్వే, ఓం భీం భృకుటీముఖి, హుంకారభయతాసిని, కపాలమాలావేష్టిత
జటాముకుట కళాజధారిణి, ఆట్టాట్టహా నే కిలి కిలి ఓం హ్రూం దంష్ట్రా మోరాన్తకారిణి, సర్వవిఘ్న వినాశిని, ఇదం కర్మ సాధయ సాధయ, ఓం శీఘం కురు కురు ఓం సట్ ఓం ఆజ్కు శేన శమయ ప్రవేశయ ఓం రంగ రంగ కమ్పయ కమ్పయ ఓం చాలయ ఓం రుధిరమాంసమధ్యప్రియే హన హన, గుట్ట కుట్ట ఓం ఛిన, ఓం మారయ, ఓం అనుక్రమయ, ఓం వజ్రశరీరం పాతయ ఓం త్రైలోక్యగతం దుష్టమదుష్టం ఏ గృహీతమగృహీతం వా ఆవేశయ, ఓం నృత్య, ఓం వన్ద, ఓం కోటరాక్షి , ఊర్వ కేశి, ఉలూకవదనే, కరిణి, ఓం కరజ్కమాలాధారిణి, దహ, ఓం పచ, పచ, గృష్ణ, ఓం మణలమధ్యే ప్రవేశయ, ఓం కిం విలమ్బసి, బ్రహ్మసత్యేన, విష్ణుసత్యేన, రుద్రనల్యేన, ఋషిసత్యేన ఆవేశయ ఓం కిలికిలి ఓం లీలి ఖిలి, విలి విలి ఓం వికృతరూపధారిణి, కృష్ణభుజంగవేష్టితశరీరే, సర్వగ్రహావేశిని, ప్రలమౌష్టినీ, భ్రూభంగలగ్న నాని కే, వికటముఖి, కపిలజడే, బ్రాహ్మి భజ్జ ఓం జ్వాలాముఖి. స్వన ఓం పాతయ ఓం రక్తాక్షి ఘూర్ణయ భూమిం పాతయ ఓం శిరో గృష్ణ చతుర్మీలయ ఓం హ స్తపాదౌ గృష్ణ ఓ0 ముద్రాం స్ఫోటయ ఓం ఫట్ ఓం విదారయ ఓం త్రిశూలేన చ్చేదయ, ఓం వజ్రేణ హన ఓం దజేన తాడయ తాడయ, ఓం చ కేణ చ్చేదయ చ్చేదయ, దంష్ట్రయా కీలయ, ఓం కర్ణికయా పాటయ, ఓం ఆజు శన గృష్ణ, ఓం శిరోజ్వరమైకాపాకం, ద్వ్యాహికం, త్ర్యాహికం, చాతుర్థికం డాకినీస్కన్దగ్రహాన్ మ్చు ముళ్చో ఓం పచ ఓం ఉత్సాదయ ఓం భూమిం పాతయ ఓం గృష్ణ, ఓం బ్రహ్మాణి ఓం ఏహి మ హేశ్వరి ఏహి ఓం కౌమారి, ఏహి ఓం వైష్ణవి, ఏహి ఓం వారాహి, ఏహి ఓం ఐన్స్టీ, ఏహి ఓం చాముణే ఏహి ఓం రేవతి, ఏహి ఓం ఆకాశ రేవతి, ఏహి ఓం హిమవచ్చారిణి, ఏహి ఓం రురుమర్దిని, అసురక్షయజ్కరి, ఆకాశగామిని, పాశేన బన్ల బన్ల ఆజు శేన కట కట సమయం తిష్ట ఓం మణలం ప్రవేశయ, ఓం గృష్ణ ముఖం బళ్ల ఓం చతుర్బన, హస్త పాదౌ చ బధ్ధ, దుష్టగ్రహానర్వాన్బన్ద, ఓం దిబధ్ధ ఓం విదితో బత, అధస్తాదృఛ, ఓం సర్వం బడ్గ ఓం భస్మనా పానీయేన మృత్తికయా నర్ష వైర్వా సర్వానాదేశయ ఓం పాతయ ఓం చాముణ్ణి కిలి కిలి, ఓం విచ్చే హూం ఫట్ స్వాహా.
పదమాలా జయాఖ్యేయం సర్వకర్మ ప్రసాధికా ।
నర్వదా హోమజప్యాద్వై: పాఠాద్యైశ్చరణే జయః ।
అష్టావింశ భుజాధ్యేయా అనిఖేటకవతి.
గదాదఱయుతా చాన్యౌ శరచాపధరో పరౌ ।
ముష్టిముద్గరయుత్తా చ శంఖఖడ్గయుతో పరె.
ధ్వజవజ్రధరౌ దాన్యౌ సచక్రపరశూపరౌ ।
డమరుదర్పణాఢ్యాచ శక్తి కుత్తని పి హలేన
ముసలేనాఢ్యా పాశతోమర సంయుతా ।
డక్కా ప్రణవ సంయుక్తావభయ ముష్టితాన్వితో.
తర్ణయనీ చ మహిషం మాతనీ హోమతోఒరిజిత్ ।
తిమధ్వాక్త తిలై రోమో నరేయో యస్యకస్యచిత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే యుద్ధజయార్ణవే సంగ్రామ విజయ విద్యానామ పఞ్చత్రింశదధిక శతతమోధ్యాయః.
పరమేశ్వరుడు పలికెను : దేవీ ! ఇపుడు సంగ్రామమునందు విజయము నిచ్చు విద్యను (మంత్రమును) చెప్పెదను. పదమాలారూపమున నున్నది. “ఓం చాముణ్డే............విచ్చే హుం ఫట్ స్వాహా” అను (మూలో క) మంత్రము 'జయా' అను పేరు గల పదమాల. అన్ని కార్యములందు సిద్ది నిచ్చును. దీనితో హోమము చేయుటచేతను, జపపాఠములు చేయుటచేతను సర్వదా యుద్ధమునందు విజయము ప్రాప్తించును. ఇరువది ఎనిమిది హస్తములు గల చాముండా దేవిని ధ్యానించవలస. ఆమెకు రెండు చేతులలో కత్తి, ఖేటకము ఉన్నది. రెండు చేతులలో గరాదండమలు, రెండు సంగ్రామవిజయవిద్యా చేతులలో ధనుర్బాణములు, రెండు చేతులలో ముష్టిముద్గరములు, రెండు చేతులలో శంఖఖడ్గములు, రెండు చేతులలో ధ్వజ వజము, రెండు చేతులలో చక్రపరశువులు, రెండు చేతులలో దర్పణడమరువులు, రెండు చేతులలో శక్తి-కుంతములు, రెండు చేతులలో హలముసలములు, రెండు చేతులలో పాశతోమరములు, రెండు చేతులలో ఢక్కా-పణవములు, రెండు చేతులలో అభయముద్ర, రెండు చేతులలో ముష్టికములు ఉండును. ఆమె మహిషాసురుని భయ పెట్టుచు వానిని చంపును. ఈ విధముగ ధ్యానించుచు హోమము చేయుట చే సాధకునకు శత్రువులపై విజయము లభించును. నెయ్యి, తేనె, పంచదార కలిపిన తిలలుహోమము చేయవలెను. ఈ సంగ్రామ విజయవిద్యను ప్రతిఒక్కనికిని (అధికారములేని వానికి) ఈయరాదు.
ఆగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున సంగ్రామవిజయ విద్యావర్ణన మను ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 135 of the Agni Mahā Purana is as follows:
Procedures for securing victory in battle are described, addressed originally to kings and their purohitas. Agni prescribes a pre-battle Viṣṇu-pūjā with specific martial mantras, homa with red flowers and guggulu, and the installation of a victory-kalaśa on the chariot's front pole. The warrior is to carry a rakṣā-bandha prepared with mantras that invoke Nārasiṃha and Sudarśana. The chapter includes astrological guidance on auspicious nakṣatras and tithis for commencing a military campaign and on reading battle omens.