అగ్ని రువాచః
సోమవంశం ప్రవక్ష్యామీ పఠితం పాపనాశనమ్ ।
విష్ణునాభ్యబ్జజో బ్రహ్మాబ్రహ్మపుత్రోఽత్రిరత్రితః.
సోమశ్చ క్రే రాజసూయం త్రైలోక్యం దక్షిణాందదౌ ।
సమాప్తేఽవభృథే సోమం తద్రూపాలోక నేచ్చవః.
కామబాధాభితప్తాంగ్యో నర దేవ్యః సిషేవి రే ।
లక్ష్మీ నారాయణరత్యక్త్వా సినీవాలీ చ కర్దమమ్.
ద్యుతిర్విధావసుంత్యక్త్వా పుష్టిరాతార మవ్యయమ్ ।
ప్రభా ప్రభాకరం త్యక్త్వాహవిష్మ క్రం కుహూఃస్వయమ్.
కీ ర్తిర్ణయ న్తం భర్తారం వసుర్మారీచ కశ్యపమ్ ।
ధృతి స్త్యక్త్వా పతిం నదీం సోమమేహభజత్తదా.
స్వకీయా ఇవ సోమోఽపి కామయామాస స్తదా ।
ఏవం కృతాపచారస్య తాసాంభర్తురణ స్తదా.
నశ శాకాపచారాయ శాపైః శస్త్రాదిభిఃపునః ।
న ప్రలో కైక నాథత్వమహ ప్ర స్తపసాహ్యుత.
విణభామ మతి స్తస్య వినయాదనయాఽఽహతా ।
బృహస్పతేః సవై భార్యాం తారాంనామయక స్వినీమ్
జహారతరసా సోమో హ్యవమాన్యాంగిరసుతమ్ ।
తత సద్యుద్దమ భవత్పఖ్యాతం తారకామయమ్.
దేవానాం దానవానాంచ లోక క్షయకరం మహత్ ।
బ్రహ్మానివార్యోనసం తారామంగిర సే దదౌ.
తామంతః ప్రసవాం దృష్ట్వాగర్భంత్యజాబ్రవీద్గురుః ।
గర్భస్త్యక్తః ప్రదీప్తోఽథ ప్రాహాహంసోమసంభవః.
ఏవం సోమాద్బుధః పుత్రః పుత్ర స్తస్య పురూరవా।
స్వర్గంత్యక్త్వోర్వశీ సా తం వారయామాస చాప్సరాః.
అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు పఠించినచోపాపములను నశింపచేయు సూర్యవంశమును గూర్చి చెప్పెదను. విష్ణు నాభికమలమునుండి బ్రహ్మపుట్టెను బ్రహ్మపుత్రుడు ఆత్రి, ఆతనికి సోముడు పుత్రుడు. అతడు రాజసూయయాగము చేసి త్రిలోక రాజ్యమున దక్షిణగా ఇచ్చివేసెను. అవభృథస్నానము సమాప్తమైన పిమ్మట ఆతని రూపమును చూడగోరి తొమ్మండుగురు దేవతాస్త్రాలు ఆతని దగ్గరకు వచ్చి కామబాణ సంతప్త ఆతనిని సేవించిరి. నారాయణుని విడిచి లక్ష్మియా, కర్దముని విడిచి సినీవాలి, ఆగ్నిని విడిచి ద్యుతి, అవ్యయుడగుధాతను విడిచిపుష్టి, ప్రభాకరని విడిచి ప్రభ, హవిష్మంతుని విడచి కుహు, వీరందరు స్వయముగ సోముని దగ్గరకు వచ్చిరి. థర్తయగు జయంతుని విడిచి కీర్తి, మరిచిపుత్రుడగు కశ్యపుని విడిచి వసువు, పతియైన మందిని విడిచి ధృతియు, వచ్చి సోముని సేవించిరి. చంద్రుడుకూడ పొరలను స్వకీయత్రీలనువలె కామించెను. ఈ విధముగ అపచారముంచేసిన ఆతని విషయమున ఆస్త్రీల భర్త లు శాపములచేతగాని, శస్త్రాదులచేతగాని శిక్షించుటకు సమర్ధులు కాకపోయిరి. సోముడు తన తపోబలముచే సప్త లోకములకు ఏక మాత్రాధిపతియయ్యెను. ఈ దుర్వినీతిచే కలుషితమైన ఆతని బుద్ధి వినయ విహీనమై భ్రాంతిచెందెను. ఆతడు ఆంగిరానందనుడిగు బృహస్పతిని అవమానించి ఆతని భార్యయగు యశస్వినియైన తారను బలాత్కారముగ అపహరించెను. అందుచే దేవదానవులమధ్య తార కామయముయను ప్రసిద్ధిగి ల లోక క్షయక రమగు గోప్పయుద్ధము జరిగెను. అంతమున్మబ్రహ్మ శుక్రుని అడ్డగించి తారను బృహస్పతికి ఇప్పించెను. ఆమె గర్భవతి అని తెలిసి బృహస్పతి ఈగర్భమును విడువుముయని ఆజ్ఞాపించగ ఆమె ఆగర్బమును విడిచెను. అపుడు తేజశ్శాలియగు కుమారుడు ఆవిర్భ వించి నేను సోమని పుత్రుడను అనిచెప్పెను. ఈ విధముగ సోమునకు బుధుడను పుత్రుడు కలిగెను. ఆతనికి పురూరవుడు పుత్రుడు. ఊర్వశియను అప్పలస స్వర్గము విడచి పురూరవుని వరించెను.
తయాసహాచరర్రాజా దశవర్షాణి పంచ చ ।
పంచషట్ సప్తచాష్టౌ చ దశ చాష్టౌ మహామునే.
ఏకోఽగ్ని రభ వత్పూర్వం తేన శ్రితాప్రవర్తితా ।
పురూరవా యోగశీలో గాంధర్వంలోక మీయివాన్.
ఆయుర్దృఢాయురశ్వా యుర్ఘ నాయుర్దృ తిమాన్వసుః ।
దివిజాతః శతాయుశ్చ సుషువే చోర్వశీన్ పపాన్.
ఆయుషోనహుషఃపుత్రో వృద్ధశర్మారజి స్తథా ।
దర్భోవిపాప్మా పంచాగ్న్యం రజేః పుత్రశతంహ్యభూత్.
రాజేయా ఇతివిఖ్యాతా విష్ణుదత్తవరోరజిః ।
దేవాసు రేరణే దైత్యానవధీత్సురయాచితః.
గతాయేంద్రాయ పుత్రత్వం గత్వారాజ్యం దివంగతః ।
రజేఃపుత్రైర్హృతంరాజ్యం శుక్రస్యాథ సుదుర్మనాః.
గృహంత్యాది విధినా గురురిందొ యతద్దదౌ ।
మోహయిత్వా రజసుతాహనం స్తే నిజధర్మగాః.
నహుషస్యసుతాః స ప్రయతిర్యయాతిరుత్తమః ।
ఉద్భవః పంచక శ్చైవ శర్యాతి మేమపాలకౌ.
యతిః కుమారభా వేఽపి విష్ణుంధ్యాత్వా హరింగతః ।
దేవయానీ శుక్రక న్యా యయాతేః పత్న్యభూత్తదా .
వృషపర్వజా శర్మిష్ఠా యయాతేః పంచతత్సుతాః ।
యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయత.
ద్రుహ్యం చానుంచ పూరుంచ శర్మిష్ఠావార్షపర్వణీ ।
యదుః పురుశ్చాథవతాం తేషాం వంశ వివర్ధనౌ.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సోమవంశ వర్ణనంనామ చతుఃసప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
పురూరవుడు ఊర్వశితో ఏబదితొమ్మిది సంవత్సరములు విహరించెను. పర్వము ఒకేయగ్ని వుండెడిది. పురూరవుడు ఆ అగ్ని ని మూడుగా విభజించెను. మహాయోగియగు ఆతడు గంధర్వలోకము చేరెను. పురూరవునకు ఊర్వశియందు ఆయు, - దృఢాయు ఆశ్వాయు-ధనాయు- దృతిమత్-వసు-దివిజాత-శతాయు అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. ఆయువునకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, దంభుడు, విపాప్మ అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. రజికి రాజేయులని ప్రసిద్ధిచెదిన నూర్గురుపుత్రులు జనించిరి. రతికి విష్ణువు వరములను ఇచ్చేను. దేవతల ప్రార్థింపగ, ఆతడు దేవాసురయుద్దమునందు దైత్యులను చం పెను. తనకు పుత్రుడుగా జన్మించిన ఇంద్రువకు రాజ్యము ఇచ్చి రజి స్వర్ణముచేరెను. కొంతకాలము తరవాత రజీ కుమారులు ఇంద్రునిరాజ్యహను లాగుకొవగ అతడు దుఃఖితుడయ్యెను. పిదప బృహస్పతి గ్రహశాంత్యాది విధులచే రజిపుత్రులను మోహింపచేసి రాజ్యముతీసుకొని మరల యిందునకు ఇచ్చెను. అపుడు రజికుమారులు ధర్మభ్రష్టలేరి. నహుషునకు-యతి-యయాతి- ఉత్తమ-ఉద్దవ-పంచక – శర్యాతి- మేఘ పాలకులను ఏడుగురు కుమారులు జనించిరి. యతి బాల్యమునందే విష్ణుధ్యానము చేసి విష్ణుపదమును పొందెను. శుక్రుని కుమార్తెయైన దేవయానియు, వృషపర్వుని కుమార్తెయైన శర్మిష్ణయు యయాతి భార్యలైరి. వీరియందుయయాతికి ఐదుగురుకుమారులు జనించిరి. దేవయాని, యదు, తుర్వసు, ఆనువారిని కనెను. శర్మిష్ఠ ధృహ్యుడు అను, హరుడు ఆనుముగ్గురు పుత్రులను కనెను. వీరిలో యదు- పూరువులు సోమవంశ వర్ధకులైరి.
అగ్ని మహాపురాణమునందు సోమవంశవర్ణనమను రెండువందలడెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 274 of the Agni Purāṇa is as follows:
The Lunar dynasty is traced from Brahmā → Atri → Soma (the Moon). The chapter recounts Soma's transgression — his abduction of Tārā, wife of Bṛhaspati — which precipitated the great Tārakāmaya war between the devas and asuras. From this union was born Budha (Mercury). The lineage continues: Budha → Purūravas → Āyu → Nahuṣa → Yayāti. Yayāti's two wives — Devayānī, daughter of Śukrācārya, and Śarmiṣṭhā, daughter of the asura king Vṛṣaparvā — give him five sons: Yadu, Turvaśu, Druhyu, Anu, and Pūru, the progenitors of the major Lunar clans.