అగ్ని రువాచః
యదోరాసస్పంచ పుత్రా జ్యేష్ఠస్తేతు సహస్రజిత్ ।
నీలాంజికో రఘుః క్రోష్టుః శతజిచ్చ సహస్రజిత్.
శతజిద్దైహయోరేణు హయో హయ ఇతిత్రయః ।
ధర్మనేత్రో హైహయస్య ధర్మనేత్రస్య సంహనః.
మహిమా సంహనస్యా సీన్మహిమ్నో భద్రసేనకః ।
భద్రసేనాద్దుర్గమోఽభూద్దుర్గమాత్కనకోఽభవత్.
కనకాత్కృత వీర్యస్తు కృతాగ్నిః కరవీరకః ।
కృతౌజాశ్చ చతుర్థోఽభూతృత వీర్యాత్తుసోఽర్జున.
దత్తోఽర్టు నాయతపతే స ప్తద్వీప మహీశతమ్ ।
దదౌబాహు సమాస్రంచ హ్యజేయత్వం రణేఽరిణా.
ఆధర్మే వర్తమానస్య విష్ణుహస్తాన్మృతిర్దౄవా ।
దశయజ్ఞ సహస్రాణి సోఽర్జునః కృతవాన్నృపః.
అనష్ట ద్రక్ష్యతా రాష్ట్రేతస్య సంస్మరణాదభూత్ ।
నన్యూనం కార్తవీర్యస్య గతింయాస్యన్తివై నృపాః.
యజ్ఞ్తెర్దానైస్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేనచ ।
కార్తవీర్యస్య చ శతం పుత్రాణాం పంచవైపరాః.
సూరసేనశ్చ సూరశ్చ దృష్ణోక్తః కృష్ణఏవచ ।
జయధ్వజశ్చ నామ్నాసీదా వన్త్యో నృపతిర్మహాన్.
జయధ్వజాత్తాలజంఘ స్తాల జంఘాత్తతః సుతాః ।
హై హయానాం కులాః పంచ భోజాశ్చావన్తయస్తథా.
వీతిహోత్రాః స్వయంజాతాః శౌండికేయ స్తథైవచ ।
వీతిహోత్రాదనన్తోఽభూదనన్తాద్ద్జురయోనృపః.
అగ్నిదేవుడు పలికెడు : యదుపునకు నీలాంజికుడు, రఘువు, క్రోష్టు, శతజిత్, సహస్రజిత్ అను ఐదుగుడు పుత్రులు జన్మించిరి. వారిలో సహస్రజిత్ జేష్టుడు. శతజిత్తునకు హైహయాడు, రేణుహయుడు, హయుడు అని ముగ్గురు పతులు పుట్టిరి. హైహయునకు ధర్మనేత్రుడు వానికి సంసాతుడు, వానిచి మహిమండు, వానికి భద్రసేనుడు, వానికి దుర్గముడు, వానికి కడ జన్మించిరి. కనకునకు కృతవీర్య-కృతాగ్ని-కరవీర-కృతౌజులను పుత్రులుజన్మించిరి. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఆతనికి సప్తద్వీప పరివృతమగు పృథ్విపై ఆధిపత్యమును, వేయ్యిభుజములను యుద్దనునందు అజేయత్వమును వరముగ ఇచ్చి “నీవు ఎప్పుడు అధర్మము చేయుదువో అపుడు శ్రీమహావిష్ణువు నిన్ను సంహరించును” అని చెప్పెను. అర్జునుడు పదివేలయజ్ఞములు చేసెను. అతనిని స్మరించగనే రాష్ట్రములో ఎవరికిని ధన నాశనము కలుగకుండెను. యజ్ఞదావ, తపపరాక్రము, శాస్త్రజ్ఞానము లందు కృత వీర్యకుమారుడగు అర్జునునకు సాటి ఎవ్వరును లేరు. ఆతనికి ఐదువందరి పుత్రులు జనించిరి. వారిలో శూరసేన - శూర - ధృష్ణోక్త - కృష్ణ - జయధ్వజులు, అను ఐదుగురు ప్రధానులు.జయధ్వజుడు అవంతీ దేశరాజాయెను. అతనికి తాల జంముడు పుత్రుడు. తాలజంఘునకు ఆదే పేరుతో ప్రసిద్దులగు చాలమంది పుత్రులు జనించిరి. హైహయవంశ క్షత్రియులలో భోజ - అవంతీ - వీతిహోత్ర - స్వయంసంత, శౌండికేయులను ఐదు కులములు ఉండెను. వీతిహోత్రునకు అనంతడు అతనికి దుర్జయుడు జన్మించెను.
క్రోష్టోర్వంశం ప్రవక్ష్యామి యత్రజాతో హరిః స్వయమ్ ।
క్రోష్టోస్తు వృజినీవాంశ్చ స్వాహా భూద్వృజినీవతః.
స్వాహాపుత్రో రుదద్గుశ్చ తస్యచిత్ర రథః సుతః ।
శశబిందుశ్చిత్ర రతాచ్చక్రవర్తీ హరౌరతః.
శశబిందోశ్చ పుత్రాణాం శతానామథవచ్చతమ్ ।
ధీమతాం చారురూపాణాం భూరి ద్రవిణతేజసామ్.
పృథుశ్రవాః ప్రధానోఽభూత్తస్యపుత్రః సుయజ్ఞకః ।
సుయజ్ఞస్యోశనాః పుత్ర స్తితిక్షురుశనః సుతః.
తితిక్షోస్తు మరుత్తోఽభూత్తస్మాత్కంబల బర్హిషః ।
పంచాశద్రుక్మ కవచాద్రుక్మేషుః పృథురుక్మకః.
హవిర్జ్యామఘః పాపమ్నోజ్యామఘః స్త్రీజితోఽభవత్ ।
సేవ్యాయాం జ్యామఘదాసీ ద్విదర్భస్తస్యకౌశికః.
లోమపాదః క్రథఃశ్రేష్ఠాత్కృతిః స్యాల్లోమపాదతః !
కౌశికస్యచిదిః పుత్రస్త స్మాచ్చైద్యానృపాః స్మృతాః.
క్రథాద్విదర్భ పుత్రాశ్చకుంతిః కుంతేస్తుధృష్టకః ।
దృష్టస్య నిధృతిస్తస్య ఉదరాభ్యోవిదూరథః.
దశార్హపుత్రో వ్యోమస్తు వ్యోమాజ్జీమూత ఉచ్యతే ।
జీమూత పుతోవికలః తస్యభీమరథఃసుతః.
భీమరథాన్నవరథః తతోదృఢ రథోఽభవత్ ।
శకున్తిశ్చదృఢ రథాచ్ఛకున్తేశ్చ కరంభకః.
కరంభాద్దేవ రాతోఽభూద్దేవక్షేత్రశ్చ తత్సుతః ।
దేవక్షేత్రాన్మధుర్నామ మధోర్ద్రవరసోఽభవత్.
ద్రవరసాత్పురుహూతోఽభూజ్జంతు రాసీత్తుతత్సుతః ।
గుణీతుయాదవో రాజాజంతుపుత్రస్తు సాత్వతః.
సాత్వతాద్భజమానస్తు వృష్టిరందక ఏవచ ।
దేవావృధశ్చ చత్వారస్తేషాం వంశాస్తు విశ్రుతాః.
భజమానస్య వాహ్యోఽభూద్వృష్టిః కృమిర్నిమిస్తథా ।
దేవావృధాద్బభ్రు రాసీత్తస్య శ్లోకోఽత్రగీయతే.
యథైవశృణుమో దూరాద్గణాంస్తద్వత్స మంతికాత్ ।
బభ్రుఃశ్రేష్ఠో మనుష్యాణాం దేవైర్దేవా వృధఃసమః.
చత్వారశ్చ సుతా బఖ్రోర్వాసుదేవపరా నృపాః ।
కుహరో భజమానస్తు శినిః కంబలబర్హిషః.
ఇపుడు క్రోష్టువంశమును గూర్చిచేప్పెదను, ఈవంశమున శ్రీమహావిష్ణువు స్వయముగ జన్మించెను. క్రోజ్జనకు వృజినీవంతుడు అతనికి స్వాహా, వానికి రుషద్గుడు, అతనికి చిత్రరథుడు ఆతనికి చక్రవర్తియై శశిబిందువు జనించిరి. శశిబిందువు సర్వదా విష్ణుభజన సక్తుడై యుండెను. ఆతనికి పదివేలమంది పుత్రులు పుట్టిరి వారందరును అధికధనవంతులు తేజశ్శాలులుఅయివుండిరి. వారిలో పృథుశ్రవుడు జ్యేష్టుడు. అతనికుమారుడు సుయజ్ఞుడు అతనికి ఉశనుడు ఆతనికి తితిక్షువు, ఆతనికి మరుత్తుడు, ఆతనికి ఋక్మకవచుడను కంబలబద్దీ శుడు పుట్టెను. ఋక్మ కవచునకు ఋక్మేశువు, పృథు రుక్మకుడు, రావి, జ్యాసగుడ, పాపఘ్నుడు మొదలగు ఏబది పుత్రులు జన్మించిరి. వీరిలో జ్యామగుడు స్త్రీలకులొంగిన వాడై యుండెను. వానికి శైబ్యయిందు విదర్భుడు యన కుమారుడు పుట్టెమ. ఆతనికి కౌశికుడు లోమపాదుడు క్రథుడు అనుపుత్రులు పుట్టిరి. వీరిలో లోమపాదుడు జ్యేష్ఠుడు. ఆతనికి కృతియను పుత్రుడు పుట్టెను. కౌశికుని పుత్రుడు చిది. ఈ వంశము వారు చైడ్యలు యను పేరుతో ప్రసిద్ధులు. విదర్భపుత్రుడగు పృథునకు కుంతి, కుంతికి ధృష్టకుడు, పుట్టిరి. వానికి ధృతి, వానికి విదూరథుడు, పుట్టిరి విదూరథునకు శూరుడనికూడ పేరు. దళార్జునకు వ్యోమూడు వానికి జీమూతుడు వానికి విక లుడు. వానికి భీమరథుడు, వానికి నవరథుడు, వానికి ధ్రుఢరథుడు, వానికి శకుంతి, దానికి కరంభుడు, దానికి దేవరాతుడు, వానికి దేవ నేత్రుడు, వానికి వధువు, వానికి ధ్రవర సుడు, వానికి పురుహూతుడు, వానికి జంతవు - వానికి సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు యదు వంశీయులలో ఉత్తమగుణవంతుడగు రాజు అతనికి భజమానుడు, వృష్టి అంధకుడు దేవావృదుడు, అను నలుగురు పుత్రులు పుట్టిరి. ఈ నలుగురి వంశ ములును ప్రసిద్దములైనవి. భజ మానునకు బాహ్యుడు, వృష్టి-కృమి, నిమి, అను పుత్రులు పుట్టిరి. దేవావృధునకు విభువు పుట్టెను. ఆతని విషయమున ఈశ్లోకము చెప్పబడు చున్నది. “మనము దూరమునుండి సద్గుణములను ఎట్లువినుచున్నా మో, దగ్గరనుండి కూడ ఆమ్లేచూచుచున్నాము. బభ్రువు మనుష్యులలో శ్రేష్టుడు, దేవావృధుడు దేవతాసమానుడు.” బభ్రువునకు కుహురుడు భజమానుడు శిని, కంబలబర్హిషుడు ఆను వాసుదేవభక్తులగు నలుగురు కుమారులు పుట్టిరి.
కుహురస్య సుతో ధృష్ణుర్దృష్ణోస్తు తనయోధృతిః ।
ధృతేః కపోతమాభూత్తస్య పుత్రస్తు తిత్తిరిః.
తిత్తిరేస్తు నరః పుత్రస్తస్య చందన దుందుభిః ।
పునర్వసుస్తస్య పుత్ర ఆహుకశ్చాహుకీ సుతః.
ఆహుకాద్దేవకోజజ్ఞే ఉగ్రసేనస్తతోఽభవత్ ।
దేవవానుప దేవశ్చ దేవకస్య సుతాః స్మృతాః.
తేషాం స్వసారః నప్తాసన్వసుదేవాయ తాదదౌ ।
దేవకీశ్రుత దేవీచ మిత్రదేవీయశోధరా.
శ్రీదేవీ సత్యదేవీచ సురాపీ చేతి సప్తమీ ।
నవోగ్రసేనస్య సుతాః కంసస్తాసాం చ పూర్వజః.
న్యగ్రోధశ్చ సునామాచ కంకః శంకుశ్చ భూమిపః ।
సుతనూరాష్ట్ర పాలశ్చ యుద్ధముష్టిః సుముష్టికః.
భజమానస్య పుత్రోఽథ రథముఖ్యో విదూరథః ।
రాజాధిదేవః శూరశ్చ విదూరథసుతోఽభవత్.
రాజాధిదేవ పుత్రౌద్వౌ శోణాశ్వః శ్వేతవాహనః ।
శోణాశ్వస్య సుతాః పంచ శమీశత్రుజిదాద్దయః.
శమీపుత్రః ప్రతి క్షేత్రః ప్రతిక్షేత్రస్య భోజకః ।
భోజన్య హృదికః పుత్రో హృదికస్య దశాత్మజాః.
కృతవర్మా శతధన్వా దేవార్హోభీషణాదయః ।
దేవార్హాత్కంబల బరిరస మౌజాస్తతోఽభవత్.
సుదంష్ట్రశ్చ సువాసశ్చ ధృష్టోఽభూదసమౌజసః ।
గాంధారీ చైవ మాద్రీచ దృష్టభార్వేబభూవతుః.
సుమిత్రోఽభూచ్చ గాంధార్యాం మాద్రీజజ్ఞేయుధాజితమ్ ।
అనమిత్రః శనిర్దృష్టాత్తతోవై దేవమీఢుషః.
అనమిత్ర సుతో నిఘ్నె నిఘ్నస్యాపి ప్రసేనకః ।
సత్రాజితః ప్రసేనోఽథ మణిం సూర్యాత్స్యమన్తకమ్.
ప్రాప్యారణ్యే చరంతంతు సింహోహత్వాగ్రహీన్మణిమ్ ।
హతో జాంబవతా సింహో జాంబవాన్హారిణాజితః.
తస్మాన్మణిం జాంబవతీం ప్రాప్యా గాద్ద్వారకాం పురీమ్ ।
సత్రాజితాయ ప్రదదౌ శతధన్వా జమానతమ్.
హత్వాశతధనుం కృష్ణో మణిమాదాయ కీర్తిభాక్ ।
బలయాదవ ముఖ్యాగ్రేహ్య క్రూరే మణిమర్ఫయేత్.
మిథ్యా భిశస్తిం కృష్ణస్య త్యక్త్వా స్వర్గీచసంపఠన్ ।
సత్రాజితో భంగకారః సత్యభామా హరేఃప్రియా.
అనమిత్రాచ్ఛి నిర్జజ్ఞే సత్యకస్తు శినేః సుతః ।
సత్యకాత్సాత్యకిర్జజ్ఞే యుయుధానాద్ధునిర్హ్యభూత్.
దునేర్యు గంధరః పుత్రః స్వాహ్యోఽభూత్సయుధాజితః ।
ఋషభక్షేత్రకౌతస్య ఋషభాచ్చశ్వఫల్కకః.
శ్వఫల్క పుత్రోహ్యక్రూరశ్చా క్రూరాచ్చ సుదన్వకః ।
శూరాత్తు వసుదేవాద్యాః పృథా పాండోః ప్రియాఽభవత్ .
ధర్మాదుధిష్ఠిరః పాండోర్వాయోః కున్త్యాం వృకోదరః।
ఇంద్రాద్ధనంజయోమాద్య్రాం నకులః సహదేవకః.
వసుదేవాచ్చ రోహిణ్యాం రామః సారణ దుర్గమౌ ।
వసుదేవాచ్చ దేవకాశమాదౌ జాతః సుసేనకః.
కీర్తిమాన్భాద్రసేనశ్చ జారుఖ్యో విష్ణుదాసకః ।
భద్రదేహః కంస ఏతాన్షడ్గర్భాన్ని జఘానహ.
తతో బలస్తతో కృష్ణః సుభద్రాభద్రభాషిణీ ।
చారుదేష్ణశ్చ సాంబాద్యాః కృష్ణాజ్ఞాంబవతీ సుతాః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యదువంశ వర్ణనం నామ పంచసప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
కుహురునకు ధృష్ణువు-వానికిధృతి-వానికి కపోతరోముడు, వానికి తిత్తిరి, వానికి నరుడు, వానికి, ఆనక దుందుభి. పుట్టిరి. ఆనకదుందుభికి పునర్వసువు ఆతనికి ఆ హుకీ పుత్రుడగు ఆ హుకుడు పుట్టెను. ఆ హుకునకు దేవక ఉగ్ర సేనులు పుత్రులు. దేవకునకు దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు, దేవర క్షితుడ, అను నలుగురు పుత్రులు పుట్టిరి. వీరికి ఏడుగురు సోదరీలు ఉండిరి. వారిని వసుదేవుడు వివాహమాడెను. దేవకి శ్రుతదేవి. మిత్రదేవి, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సురాపి, అని వీరి పేర్లు. ఉగ్రసేనునకు కంస-న్యగ్రోధ-సునామ-కంక-శంకు-సుతను-రాష్ట్రపాల-యుద్ధముష్టి-సుముష్టికులను అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. వీరిలో కంసుడు జ్యేష్ఠుడు. భజమానునకు ఉత్తమ. రథికుడై న విదూరథుడు అతనికి రాజాధి దేవశూరులు పుట్టిరి. రాజాధి దేవునకు శోణాశర్వుడు, శ్వేతవాహనుడు, అను ఇరువురు పుత్రులు జన్మించిరి. శోణాశ్వునకు శనిశ త్రుజిత్, మొదలగు ఐదుగురు పుత్రులు జన్మించిరి. కమికి ప్రతి క్షేత్రుడు వాని భోజుడు, వానికి హృదికుడు జన్మించిరి. హృదికుని పదిమంది పుత్రులలో కృతవర్మ-శతధన్వుడు- దేవారుడు-భీషణుడు-మొదలగువారు ప్రధానులు. దేవార్జునకు కంబల బరి ఆతనికి సమౌజుడ, ఆతనికి సుదౌష్ట్ర-సువాస-ధృష్టులు జన్మించిరి. ధృష్టునకు గాంధారిమాద్రియను ఇద్దరు భార్యలుండిరి. గాంధారియందు సుమిత్రుడు, మాద్రియందు యుధాజిత్తు పుట్టిరి. ధృష్టునకు అనమిత్రుడుశిని పుట్టిరి. శినికి దేవమీఢుషుడు జనించేను. అనమిత్రునకు నిమ్నుడు ఆతనికి ప్రసేన-సత్రాజిత్తులు పుట్టిరి. సోదరుడగు సత్రాజిత్తుకు సూర్యుని నుండి లభించిన శ్యమంతక మణిని ధరించి ప్రసేనుడు వేటకై వెళ్ళగా ఒక సింహ మతనిని చంపి మాణిక్యమును గ్రహించెను. ఆసింహమును చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకొనెను. పిదప శ్రీ కృష్ణుడు యుద్ధము నందు జాంబవంతుని ఓడించి జాంబవతిని ఆమణిని స్వీకరించి ద్వారకాపురికి తిరిగి వచ్చి మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేసెను. శతధన్వుడు సత్రా జిత్తును చంపివేసెను. శ్రీ కృష్ణుడు శతధన్వునిచంపి ఆమాణిక్యమును లాగుకొని యశ్శూలియయ్యెను. ఆతడు బలరామాది యదువంశీయుల సమక్షమున ఆమణిని ఆక్రూరునకు యిచ్చెను. దీనితో శ్రీ కృష్ణుని పై వచ్చిన మిథ్యారోపము తొలగి పోయెను. ఈ కథను చదువువానికి స్వర్గముంభించును. సత్రాజిత్తునకు బంకకారుడను పుత్రుడు శ్రీకృష్ణుని భార్యయగు సత్యభామయు జనించిరి. ఆవమిత్రునకు శిని వానికి సత్యకుడు వానికి యుయుధానుటను నామాంతరముగల సాత్యకి, వానికి ధుని, పానికి యుగంధరుడు పుట్టిరి , యుధాజిత్తునకు స్వాహ్యుడు. వానికి ఋషభ - క్షేతకులు పుట్టిరి. ఋషభునకు స్వవల్కుడు, దానికి అక్రూరుడు, వానికి సుధన్వకుడు పుట్టిరి. శూరు నకు వసుదేవుడు మొదలగు పుత్రులు పృథయను కన్యయు పుట్టిరి ఆమెపాండురాజునకు భార్య, కులతియను సామాంతరముగల ఆమెకు (పృథ) యముని అంశముచే యుధిష్ఠిరుడు, వాయుఅంశ ముచే భీమసేనుడు, ఇంద్రాంశముచే ఆర్జునుడు జన్మించిరి. మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. వసుదేవునకు రోహిణియందు బలరామ సారణదుర్గములు అను ముగ్గురు పుత్రులు దేవియందు సుషేణ - కీర్తిమత్ - భద్రసేన - జారుఖ్య - విష్ణుదాస భద్రదేహులు జన్మించిరి. ఈ ఆరుగురు శిశువులను కంసుడు చంపివేసెను. పిదప బలరామ కృష్ణులు ఆవిర్భవించిరి. చివర కల్యాణవచనముగల సుభద్ర జన్మించేను. శ్రీకృష్ణునకు చారుదేష్ణుడు సాంబుడు మొదలగు పుత్రులు పుట్టిరి. సాంబారులు జాంబవతి పుత్రులు.
అగ్నిమహాపురాణమున యదువంశవర్ణనమను రెండువందలడెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 275 of the Agni Purāṇa is as follows:
The Yadu dynasty, the clan into which Bhagavān Kṛṣṇa descends, is traced in detail. The five sons of Yadu give rise to lines including Śatajit → Haihaya → Kārta-vīrya Arjuna, the thousand-armed king who became Dattātreya's disciple. The chapter narrates the Śyamantaka maṇi episode involving Prasena, Jāmbavanta, Kṛṣṇa, Satrājit, and Satyabhāmā. The Yādava lineage runs through Sātvata → Bhajamāna, Vṛṣṭi, Andhaka, and Devāvṛdha, to Ugrasena and Kaṃsa, and through Śūra → Vasudeva. Vasudeva's wives Devakī and Rohiṇī give birth to Kṛṣṇa and Balarāma; Kṛṣṇa's 16,000 wives and sons Pradyumna, Aniruddha, and Vajra are enumerated. The Pāṇḍavas are also traced through Kuntī (Pṛthā), daughter of Śūra.