అగ్ని మహా పురాణము

195 - అథ వారవ్రతాని

అగ్ని రువాచః-

వారవ్రతాని వక్ష్యామి భుక్తిముక్తిప్రదాని హి

కరం పునర్వసుః సూర్యే స్నానే సర్వౌషధి శుభా. 

శ్రాద్దీ చాదిత్యవారే తు సప్తజన్మస్వరోగభాక్

సంక్రామ్లో సూర్యవారో యః సోర్కస్య హృదయః శుభః.

కృత్వా హస్తే సూర్యవారం న కేనాబ్దం చ సర్వభాక్

చిత్రాభసోమవారాణి సప్తకృత్వా సుఖీ భవేత్.

స్వాత్యాం గృహీత్వా బాజ్జారం సప్తనక్త్యా ర్తివర్జితః

విశాఖాయాం బుధం గృహ్య సప్తన క్తి గ్రహా ర్తినుత్.

 అనురాధే దేవగురుం సప్తన క్తీ గ్రహార్తినుత్

శుక్రం జ్యేష్ఠాసు సంగృహ్య స పన గ్రహార్తినుత్.

మూలే శనైశ్చరం గృహ్య సప్తన క్తీ గ్రహార్తినుత్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వారవ్రతాని నామ పఞ్చనవత్యధిక శతతమోధ్యాయః.   

అగ్ని చెప్పెను: ఇపుడు భుక్తి ముక్తి ప్రదము అగు వారవ్రతములను చెప్పెదను. రవివారమునాడు హస్త కాని పునర్వసు కాని వచ్చినపుడు పవిత్ర మగు సర్వోషఫీజలముతో స్నానము చేసి, రౌద్దము చేయువాడు ఏడు జన్మల వరకను రోగములచే పీడింపబడడు. సంక్రాంతి దినమున భానువాసర మైనచో, ఆది పవిత మగు ఆదిత్యహృదయము అని చెప్పణడును. ఆ దినమున గాని, హస్త నక్షత్రయుక్త జానువారమునందు గాని ఒక సంవత్సరము నక్త వ్రతము చేయువానికి  సర్వము లభించును. ఏడు చిలానక్షత్రయుక్త సోమవార వ్రతములు చేయువాడు సుఖవంతు డగును. స్వాతీనక్షత్రయుక్త మంగళ వార వతము ప్రారంభించి, ఏడు ముగలవార నక్త వతములు చేయువాడు అన్ని కష్టములనుండియు విముక్తుడగును. విశాఖా నక్షత యుక్త బుధవారమునాడు ప్రారంభించి ఏడు బుధవారనక్త వ్రతము లాచరించువాడు  బుధగ్రహపీడ నుండి విముక్తు డగును. అనురాధానక్షత్రయుక్త గురువారమునాడు ప్రారంభించి ఏడు గురువారనక్త వ్రతములు చేయువాడు బృహస్పతి గ్రహపీడనుండి విముక్తు డగును. జేష్టానక్షత్రయుక్త శుక్రవారమునాడు ప్రారంభించి  ఏడు శుక్రవాడవక్త వ్రతములు చేయువాడు శుక్రగహపీడనుండి విముక్తుడగును. మూల నక్షత్రయుక్త శనివారమువాడు ప్రారంభించి ఏడు శనివాసర నక్త వ్రతములు చేయువాడు శనిగ్రహాపీడమునుండి విముక్తు డగును.

ఆగ్ని మహావురాణమునందలి వారవ్రతవర్ణనమును నూటతొంబదియైదవ అధ్యాయము సమాప్తము.