ఆగ్ని రువాచః-
ఛందో వక్ష్యే మూలజైస్తైః పింగలో క్తం యథాక్రమం ।
సర్వాదిమధ్యా న్తగణౌమ్నౌ భ్యౌజ్రౌస్తౌత్రికాగణాః.
హ్రస్వోగురుర్వా పాదాన్తే పూర్వోయోగాద్వి సర్గతః ।
అనుస్వారాద్వ్యం జనాత్స్యా జ్జిహ్వామూలీయత స్తథా.
ఉపద్మానీయశో దీర్ఘోగురుర్ గ్లౌనౌ గణావిహ ।
వసవోఽష్టౌచ చత్వారో వేదాదిత్యాదిలోకతః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అష్టవింశత్యుత్తర త్రిశతతమోఽధ్యాయః.
అగ్ని దేవుడు పలికెను : ఇపుడు వేదమూలమంత్రాను సారముగ పింగలోక్త ఛందస్సులను క్రమముగా వర్ణించెదను. మ, న, థ, య జ, ర, స, త, గణములు యని గణములు ఎనిమిది. అన్ని గణములందును. మూడేసి అక్షరము లుండును. మగణములో అన్ని అక్షరములు గురువులు. నగణములో అన్ని అక్షరములు లఘువులు, ఆది గురువు భగణము, ఆది లఘువుయగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము. పొదాంతమునందున హ్రస్వాక్షరము వికల్పముగా గురువగును. విసర్గ అనుస్వార సంయుక్తాక్షర జిహ్వా మూలీయ ఉపధ్మా నీయములకు అవ్యవహిత పూర్వమునందున్న హ్రస్వము కూడ గురువు. దీర్ఘము గురువు గురువువు “గ” లఘువునకు “ల” యని సంకేతము. వసు శబ్దము ఎనిమిదికి, వేద శబ్దము నాలుగుకు, సంజ్ఞయగును. ఈ విషయములను లో కాను సారము తెలుసుకొనవలెను.
అగ్ని మహాపురాణమున ఛందస్సారమను మూడువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 329 of the Agni Purāṇa is as follows:
The installation of Devī in her various forms — Durgā, Lakṣmī, Sarasvatī, and the fierce Caṇḍikā — is described. Agni explains that Devī may be installed in single-faced or multi-faced iconic forms, and that the number of arms and weapons she holds must correspond precisely to the śāstric specification of each form. The maṇḍapa for the ceremony is decorated with specific plants, flowers, and fabrics associated with the śakti tradition. The chapter describes the kanyā-pūjā (worship of young girls as manifestations of Devī) that accompanies major installation ceremonies, and the animal sacrifice (bali) traditionally offered at śākta shrines is mentioned in this context.