అగ్ని మహా పురాణము

132 - అథ సేవాచక్రమ్.

ఈశ్వర ఉవాచః

సేవాచక్రం ప్రవక్ష్యామి లాభాలాభార్థసూచకమ్

పితా మాతా తథా భ్రాతా దమ్పతీ చ విశేషతః.

తస్మింశ్చ క్రేతు విజ్ఞేయం యో యస్మాల్లభతే ఫలమ్

షడూర్ధ్వాః స్థాపయేద్రేఖా భిన్నాశ్చాష్టౌ తు తిర్యగ్గాః.

కోష్ఠకాః పఞ్చవింశచ్చతేషు వర్ణాన్ సమాలిఖేత్

స్వరాన్ పఞ్చ సముద్ధృత్య స్పర్శాన్ పశ్చాత్సమాలిఖేత్.

కకారాదిహకారాన్తా న్హీనాజ్గాంస్త్రీన్వివర్జయేత్

సిద్దః సాధ్యః సుసిద్దశ్చ హ్యరిర్మృత్యుశ్చ నామతః.

అలిర్మృత్యుశ్చ ద్వావేతౌ వర్జయేత్సర్వకర్మసు

ఏషాం మధ్యే యదా నామ లక్షయేత్తు ప్రయత్నతః.

ఆత్మపక్షేస్థితాః సత్త్వాః సర్వే తే శుభదాయకాః

ద్వితీయః పోషక శ్చైవతృతీయశ్చార్థదాయకః.

ఆత్మనాశశ్చతుర్థస్తు పఞ్చమో మృత్యుదాయకః

స్థానమేవార్థలాభాయ మిత్రభృత్యాదిబాన్ధవాః.

సిద్ధః సాధ్యః సుసిద్ధశ్చ సర్వే తే ఫలదాయకాః

అరిర్మృత్యుశ్చ ద్వావేతౌ వర్జయేత్సర్వకర్మసు.

 ఆకారాన్తం యథా ప్రోక్తం అ ఇ ఉ ఏ ఓ విదు స్తథా

 పునశ్చైవాంశ కాన్వక్ష్వే వర్గాష్టక సంస్మృతాన్.

దేవా ఆకారవర్గే చ దైత్యాః కవర్గమాశ్రితాః

నాగా శ్చైవ చవర్గాః స్యుర్గన్దర్వాశ్చటవర్గజాః.

తవర్గే ఋషయః ప్రోక్తా పవర్గేరాక్షసాః స్మృతాః

పిశాచాశ్చ యవర్గే చ శవర్గే మానుషాః స్మృతాః.

దేవేభ్యో బలినో దైత్యా దైత్యేభ్యః పన్నగా స్తథా

పన్న గేభ్యశ్చ గన్దర్వా గన్దర్వాదృషయో వరాః.

ఋషిభ్యో రాక్షసాః శూరా రాక్ష సేభ్యః పిశాచకాః

పిశాచేభ్యో మానుషాః స్యుర్దుర్బలం వర్జయేద్బలి.

పరమేశ్వరుడు పలికెను : ఇపుడు సేవాచక్రమును గూర్చి చెప్పెదను. దీని వలన సేవకునకు సేవ్యుని వలన కలుగు లాభనష్టములు తెలియును. తండ్రి, తల్లి, సోదరులు, స్త్రీపురుషులు వీరి విషయమున దీనిని బాగుగా పరిశీలించి వలెను. ఎవ్వ డైనను పైన చెప్పిన వారినుండి లాభము పొందగల్గునా లేదా అను విషయమును సేవాచక్రము ద్వారా తెలిసికొనవచ్చును. తూర్పు నుండి పడమటకు ఆరు రేఖలను, ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డు రేఖలనుగీయ వలెను. ఇట్లు గీయగా ముప్పది యైదు గళ్ళ సేవాచక్రము ఏర్పడును. దాని పై కోష్టములందు ఐదు స్వరములను వ్రాసి పిదప స్పర్శవర్ణములను వ్రాయవలెను. వీటిలో ఙ, ఞ, ణ లను విడచివేయవలెను. క్రింది కోష్టములలో (క నుండి హ వరకు) వరుసగ సిద్ద, సాధ్య, సుసిద్ధ, శత్రు, మృత్యువులు వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయగా సేవాచక్రము సర్వాంగసంపన్న మగును. ఈ చక్రము నందలి ‘శత్రు’ ‘మృత్యు’ అను కోష్టములలో నున్న స్వర-వ్యంజనములను అన్ని కార్యములందు పరిత్యజించవలెను. కాని సిద్ద - సాధ్య - సుసిద్ధ - శత్రు - మృత్యు - అను కోష్టములందు ఏదైన ఒక కోష్టమునందు సేవ్య - సేవకుల నామముల ప్రథమాక్షరములు వచ్చినచో అది సర్వథా శుభము. దీనిలో ద్వితీయకోష్టము పోషకము; తృతీయము ధనదాయకము, నాల్గవది ఆత్మనాశకము; ఐదవది మృత్యుప్రదము. మిత్ర-భృత్య బాంధవాదుల విషయమున పరిశీలించు నపుడు (వారి పేర్లున్న) స్థానములు సిద్ధ-సాధ్య-సుసిద్ధము లైనచో ఉత్త మఫలదాయక ములు. అన్ని కర్మలందును అరి - మృత్యువులను విడవవలెను. ఆ ఇ ఉ ఏ ఓ లను ఆకారాంతమును వలె భావింతురు. ఇపుడు వర్గాష్టకసంస్కృతము లగు అంశకములను గూర్చి చెప్పెదను. అవర్గమునకు (అ ఇ ఉ ఏ ఓ) ఆధిపతులు దేవతలు. కవర్గుకు దైత్యులు, చవర్గుకు పన్న గులు, టవర్గుకు గంధర్వులు, తవర్గుకు ఋషులు, పవర్గుకు రాక్షసులు, యవర్గుకు (య ర ల వ) పిశాచమలు, శవర్గుకు (శ ష స హ) మనుష్యులు అధిపతులు. వీరిలో దేవతలకంటె దైత్యులు వారికంటె పన్న గులు, వారికంటె గంధర్వులు, వారికంటె రాక్షసులు, వారికంటె పిశాచములు పిశాచములకంటె మనుష్యులు అధికబలవంతులు. బలవంతుడు దుర్బలుని విడువవలెను. సేవ్య సేవకుల నామాద్యక్షరములు ఒకే వర్గమునకు చెందినచో ఉత్తమము.

పునర్మిత్రవిభాగం తు తారాచక్రం క్రమాచ్ఛృణు

నామాద్యక్షరమృక్షం తు స్ఫుటంకృత్వాతు పూర్వతః.

ఋక్షే తు సంస్థిరాస్తారా నవత్రికా యథాక్రమాత్

జన్మ సంపద్విపత్దేమం నామర్దాత్తారకా ఇమాః.

ప్రత్యరిర్ధనదా షష్టి నైధనామైత్ర కే పరే

పర మైత్రాన్తి మా తారా జన్మ తారా త్వశోభనా.

సంపత్తారా మహా శ్రేష్టా విపత్తారా తు నిష్ఫలా

 క్షేమతారా సర్వకార్యే ప్రత్యరిర్య్హర్థనాశినీ.

ధనదా రాజ్యలాభాది నైధనా కార్యనాశినీ

 మైత్రలారా చ మిత్రాయ పరమిత్రా హితావహా.

మాత్రా వై స్వరసంజ్ఞా స్యాన్నామమధ్యే క్షిపేత్ప్రియే

వింశత్యా చ హరేద్బాగం యచ్ఛేషం తత్ఫలం భవేత్.

ఉభయోర్నామమధ్యే తు లక్షయేచ్చ ధనం హ్వ్రణమ్

హీనమాత్రాహ్వ్రణం జ్ఞేయం ధనం మాత్రాధికం పునః.

ధనేన మిత్రతా నృణామృణేనైవ హ్యుదాసతా

సేవా చక్రమిదం ప్రోక్తం లాభాలాభాదిదర్శకమ్.

మేషమిథునమోః ప్రీతిర్మైత్రే మిథునసింహ యోః

తులాసింహౌ మహామైత్రీ చైవం ధనుర్ఘటే పునః.

మిత్రసేవాం న కుర్వీత మిత్రౌ మీనవృషౌ మతౌ

వృషకర్కటయోర్మైశ్రీ కుశీరమట యోస్తథా.

కన్యావృశ్చికయోరేవం తథా మకరకీటయోః

మీన మకరయో ర్మైతీ తృతీయైకాదశే స్థితా.

తులావృషౌ మహామైత్రీ విద్విష్టౌ వృషవృశ్చికౌ

మిథునధనుషోః ప్రీత్రిః కర్కటకమక రయోస్త థా.

 మృగకుమ్భకయోః ప్రీత్రిః కన్యామీనౌ తథైవ చ.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యుద్ధ జయార్ణవే సేవాచక్రం నామ ద్వాత్రింశ దధిక శతత మోధ్యాయః.

మైత్రీ విభాగమునకు సంబంధించిన తారాచక్రమును గూర్చి వినుము. మొదట నామప్రథమాక్షరమును బట్టి నక్షత్రము తెలిసికొని తొమ్మిది తారలను మూడు పర్యాయములు ఆవృత్తిచేయగా ఇరువదియేడు నక్షత్రముల తారలు తెలియును. ఈ విధముగ తన నామనక్షత్రమునకు సంబంధించిన తారను తెలుసుకోనవలెను. జన్మ - సంపత్ - విపత్ క్షేమ - ప్రత్యరి - సాధన - వధ - మైత్ర - ఆతిమైత్రము లని తొమ్మిది తారలు. వీటిలో జన్మ తార అశుభము. సంపత్తార ఆత్యుత్తమము. విపత్తార నిష్ఫలము. క్షేమతార అన్ని కార్యములందును గ్రాహ్యము. ప్రత్యరితారచే ధననాశము కలుగును. సాధకతారచే రాజ్యలాభము కలుగును. వధఠార కార్యవినాశనము. మైత్రతార మైత్రీకార కము. ఆతి మైత్రము హితకారోకము.

 ప్రియురాలా నామాక్షరమునందలి స్వరముల సంఖ్యను కూడి ఇరువదిచే భాగించి, శేషముచే ఫలము తెలియవలెను. (అనగా స్వల్పశేషము కలవాడు అధిక శేషము కలవానినుండి లాభము పొందును.) సేవ్యసేవకుల నామాక్షరములలో ఎవనికి అధిక స్వరములుండునో అతడు ధని; అల్పస్వరములు కలవాడు ఋణి. ధనస్వరములు మైత్రికిని, ఋణస్వరములు దాసత్వ మునకును మంచివి.  ఈ విధముగ లాభనష్టముల జ్ఞానమునకై సేవాచక్రము చెప్పబడినది. మేష - మిథున - రాశులవారి మధ్య ప్రీతి, మిథున-సింహములవారి మధ్య మైత్రి, తుల-సింహరాశులవారిమధ్య మహామైత్రి ఉండును. కాని ధనుః కుంభరాశులవారి మధ్య మైత్రి ఉండదు. అందుచే వీరు పరస్పర సేవ చేయరాదు. మీన - వృషభ; వృషభ-కర్కట; కర్కట - కుంభ; మకర-వృశ్చిక; మీన-మకరముల వారి మధ్య మైత్రియు, మిథున-కుంభ; తులా-మేషముల వారి మధ్య మహామైత్రి ఉండును. వృషభ - వృశ్చికములవారి మధ్య పరస్పరము వైరముండును, మిథున-ధనుస్; కర్కట - మకర, మకర - కుంభ, కన్యా - మీన రాశులవారి మధ్య ప్రీతి ఉండును.

అగ్ని హపురాణమునందు యుద్ధజయార్ణవమున సేవాచక్ర మను నూటముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.