పుష్కర ఉవాచః
చత్రాది మంత్రాన్వక్ష్యామి యైస్తత్పూజ్య జయాదికమ్।
బ్రహ్మణః సత్యవా క్యేన సోమస్య వరుణస్య చ.
సూర్యస్య చ ప్రఖా వేణ వర్గస్వత్వం మహామతే ।
పాండరాభప్రతీకాళ హిమకుందేందు సుప్రభ.
యథామ్బుదశ్ఛాదయతే శివాయైనాం వసుంధరామ్ ।
తథాచ్ఛాదయ రాజానం విజయారోగ్యవృద్దయే.
గంధర్వకుల జాత స్వం మా భూయా కులదూషకః ।
బ్రహ్మణః సత్యవా క్యేన సోమస్య వరుణస్య చ.
ప్రభా ఐచ్చ హుతాశస్య వర్గస్వత్వం తురంగమ ।
తేజసాచైవ సూర్యస్యమునీనాం తపసాతథా.
రుద్రస్య బ్రహ్మచర్యేణ పవనస్య బలేన చ ।
స్మరత్వం రాజపుత్రోసి కౌస్తుభస్తు మణింస్మర.
యాంగతిం బ్రహ్మహా గచ్ఛేత్పితృహా మాతృహా తథా ।
భూమ్యక్తేనృతవాదీచ క్షత్రియశ్చపరాజ్ము ఖః.
వ్రజే స్త్వం తొంగతిం డిప్రంమాతృపంభ వేత్తవ ।
వికృతిం మాపగచ్ఛే స్వం యుద్దేధ్వని తురంగమ.
రిపూన్వినిఘ్న నమరే సహభర్తా సుఖీభవ ।
శక కేతో మహావీర్య సుపర్ణస్వాముపా శ్రితః.
పత త్రిరాడైన తేయ స్తథా నారాయణధ్వజః ।
కాశ్య పేయోఒమృతా హర్తాసాగారిర్విష్ణువాహనః.
అప్రమేయో దురాధరో రణేదే వారి సూదనః ।
మహాబలో మహావేగో మహాకాయోమృతాశనః
గరుత్మా న్మా రుతగతిస్త్వయి సన్నిహిత స్థితః ।
విష్ణునా దేవదేవేన శ క్రార్థం స్థాపితోహ్యసి.
జయాయ భవమేనిత్యం వృద్ధయేఽథ బలస్య చ ।
సాశ్వవరాయుధాన్యో ధాన్రక్షాస్మాకం రిపూన్ధహ.
పుష్కరుడు పలికెను. ఛత్రాడి మంత్రములను చేప్పేదను. వాటిని పూజించుటచే విజయాదికమును పొందును. మహామతియైన ఓఛత్రదేవా ! నీవు హిమము, మల్లెపూవు, చంద్రుడువలే, తెల్లని కాంతితో ప్రకాశించుచున్నావు. బ్రహ్మ యొక్క సత్యవచనము చేతన, వరుణ సూర్య ప్రభావములచేతను నీవు సర్వదా వృద్ధి పొందుము. మేఘము మంగళము కొరకై ఈ భూమిని ఆచ్చాదించునట్లు నీవు విజయము కొరకును ఆరోగ్య వృద్ధికొరకును రాజును ఆచ్ఛాదించుము. ఓఅశ్వమా ! నీవు గంధర్వ కులమున బుట్టితివి కావున కులదూషకము కావద్దు. బ్రహ్మ సత్య వాక్యము చేతను, హోమ వరుణ అగ్నుల ప్రభావము చేతను, సూర్య తేజస్సు చేతను, మునుల తపస్సు చేతను, రుద్రుని బ్రహ్మ చర్యముచేతను, వాయుపు బలముచేతను, నీవు సర్వదామున్ముందుకు సాగుము. నీవు అశ్వరాజపుత్రుడను విషయము స్మరించుము. కౌస్తు కమణిని స్మరించుము. బ్రహ్మహత్య, పితృహత్య, మాతృహత్య చేసిన వాడును, భూమి కొరకై ఆసత్యమాడినవాడు, యుద్దము నుండి పరాజ్ముఖుడైన క్షత్రియుడును ఎంత శీఘ్రముగా అధోగతిని పొందుదురో, యుద్ధమునందు పృష్ఠము చూపించుటచే నీవు కూడ అట్లే దుర్గతిని పొందుదువు. నీకు అట్టి వికారము కలుగ కుండుగాక ! అట్టి పాపము కలుగకుండు గాక ! సమరాంగణమున శత్రువులను సంహరించుచు నీస్వామితో కూడి సుఖముగ నుండుము. మహాపరాక్రమమునకు ప్రతీకమైన ఓయింద్రధ్వజమా ! నారాయణుని ధ్వజమైన గరుత్మంతుడు నీ పై ప్రతిష్ఠింపబడినాడు. ఇతడు సర్ప శత్రువు. విష్ణు వాహనము కశ్యపకుమారుడ. దేవలోకములోనుంచి బలాత్కారమున, అమృతమును అపహరించి నాడు. అతను విలకాయుడు. అతని బలవేగమలు గొప్పవి. అమృతమును ఆస్వాదించినవాడు. అతనిశ క్తి ఆప్రమేయము. యుద్దమంలో దుర్జయుడై శత్రుసంహారము చేయును. వాయుతుల్యగతి కలవాడు. అట్టి గరుత్మంతుడు ఇంద్రుని కొరకై శ్రీ మహావిష్ణువుచే నీ పై స్థాపింపబడినాడు. నీవు సర్వదా నాకు విజయమును ఇమ్ము. నాబలమును పెంచుము. ఆశ్వములు కవచములు, ఆయుధములు వీటితో కూడిన నాయోధులను రక్షించి శత్రువులను కాల్చి భస్మముచేయుము.
కుముదై రావణౌపద్మః పుష్పదంతోఽథ వామనః ।
సుప్రతీకోఽజనోనీలో హ్యేతేఽష్టౌదేవ యోనయః.
తేషాంపుత్రాశ్చ పౌత్రాశ్చ బలాన్యష్టౌసమాశ్రితాః ।
భద్రోమంద్రో మృగశ్చైవగజః సంకీర్ణ ఏవచ.
వనేవనే ప్రసూతాస్తే స్మరయోనిం మహాగజాః ।
పామ్రుత్వాంవసవోరుద్రా ఆదిత్యాః సమరుద్గణాః.
భర్తారం రక్షనాగేంద్ర సమయఃపరిపాలలామ్।
ఐరావతాధి రూఢస్తు వజహస్త శతక్రతుకి.
పృష్ఠతోనుగత స్వేష రక్షతుత్వాం సదేవరాట్ ।
ఆవాప్నుహి జయంయుద్దే సుస్థ శ్చైవ సదావ్రజ.
అవాప్ను హి బలంచైవ చైరావతసమంయుధి ।
శ్రీస్తేసోమాద్బలం విష్ణో నేజః సూర్యాజ్ఞవో నిలాత్ .
సైర్యం గిరేర్ణయం రుద్రాద్యశోదేవాత్పురందరాత్ ।
యుద్ధేశక్షను నాగాస్త్వాం దిశశ్చసహదై వతైః .
ఆశ్వినౌసహగందర్వైః పాండుత్వాం సర్వతో దిశః ।
మనవోవసవోరుద్రా వాయుః సోమోమహర్షయః.
నాగకిన్నర గంధర్వ యక్షభూతగణాగృహాః ।
ప్రమథాస్తు సహాదిత్యైర్బూతేశో మాతృభిఃసహ.
శక్రః సేనాపతిఃస్కందో వరుణశ్చాశ్రిత స్త్వయి ।
ప్రదహస్తురిపూన్సర్వాన్రాజా విజయమృచ్ఛతు.
కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అంజన - నీలులు, అను ఎనిమిది గజు రాజులు దేవయోనియందు పుట్టినవి. వీటి పుత్ర పౌత్రులే ఎనిమిది వనములందు నివసించుచున్నది. భద్ర - మంద్ర - మృగ - సంకీర్ణ జాతీయగజములు ప్రతివనమునందు పుట్టుచున్నవి. ఓ మహాగజములారా : నీ జాతిని స్మరించుడు. వసు. వులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణములు, మిమ్ములను రక్షించుగాక ! ఓగజేంద్ర! నీనీయమును పాటించి స్వామిని రక్షించుము. వజ్రధారియైన దేవేంద్రుడు ఐరావతమును ఎక్కి నీ వెనుక నే వచ్చుచున్నాడు. అతడు నిన్ను రక్షించుగాక. యుద్ధము నందు విజయము పొంది స్వస్తుడవై ముందుకు నడువుము. యుద్ధమునందు నీకు ఐరావతము వంటి బలము వచ్చు గాక. చంద్రుని మండి కాంతిని, విష్ణువు నుండి బలమును, సూర్యుని నుండి తేజస్సును, వాయు నుండి వేగ మును, పర్వ తము నుండి స్థిరత్వమును, రుద్రుని నుండి విజయమును, ఇంద్రుని నుండి యశమును పొందుము. దిగ్గజములు, దిక్కులు దిక్పాలకులు, యుద్ధమున నిన్ను రక్షింతురు గాక. గంధర్వ సహితులగు ఆశ్వికుమారులు అన్ని వైపుల నుండి నిన్న రక్షింతురు గాక. మను - వసు - రుద్ర - వాయు – చంద్ర - మహర్షి - నాగ - కిన్నర - యక్ష - భూత - ప్రమథ - గ్రహ - ఆదిత్యులు, మాతృకా సహితుడగు భూతాధిపతియైన శివుడు, ఇంద్రుడు, దేవ సేనాపతియైన కార్తికేయుడు, వరుణుడు, నిన్ను అధిష్టించియున్నారు. వారు సమస్త శత్రువులను భస్మము చేయుదురు గాక ! రాజు విజయము పొందుగాక.
యానిప్రయుక్తాన్యరిభిర్భూషణాని సమంతతః ।
పతస్తు తవశత్రూణాం హతాని తవతేజసా.
కాలనేమి వధే యద్యద్యుద్దే త్రిపురఘాతనే ।
హిరణ్యకశిపోర్యుద్దేవధే సర్వాసు రేషుచ.
శోభితాసి తథై వాద్య శోభస్వ సమయం స్మర ।
నీల శ్వేతామిమాం దృష్ట్వా నశ్యంత్వాకు నృపారయః.
వ్యాధిభిర్వివిధైగ్ఘోరైః శ స్త్రైశ్చ యుధి నిర్జితాః ।
పూతనా రేవతీ లేఖాకాలరాత్రీతిపఠ్యతే
దహంత్వాకు రిపూన్సర్వాన్పలా కేత్వా ముపాశ్రితాః ।
సర్వమేధోమహాయజ్ఞే దేవదేవేన శూలినా.
శర్వేణ జగతశ్చైవ సారేణ త్వం వినిర్మితః ।
నన్దకస్యాపరాం మూ ర్తిం న్మరశత్రునిబర్హణా.
నీలోత్పల దలశ్యామ కృష్ణ దుఃస్వప్న నాశన ।
ఆసిర్విక సనః ఖడ్గ స్తీక్ష్ణ ధారో దులాసదః.
శ్రీ గర్భో విజయశ్చైవ ధర్మపాల స్త ఖై వచ ।
ఇత్యష్టా తవనామాని పురోక్తాని స్వయంభువా.
నక్షత్రం కృత్తికా తుభ్యం గురుర్దేవో మహేశ్వరః ।
హిరణ్యం చ శరీరం తే దైవతం తే జనార్దనః.
రాజానం రక్ష నిస్త్రింశ సబలం సపురం తథా ।
పితా పితామహోదేవః సత్వం పాలయ సర్వదా.
ఓ పతాకా! శత్రువులు నలువైపులనుండిచేయు ఘాతక ప్రయోగ వణులు నీతేజస్సుచే కొట్టబడి నశించుగాక! కాలనేమి త్రిపుర సంహార యుద్ధములందును, హిరణ్యకశిపుయుద్దములందును, సకలదై త్యయుద్ధములందును, నీవు ఎట్టుప్రకాశించితివో అట్లేనేడు ప్రకాశించుము. నీప్రతిజ్ఞను స్మరించుము, నల్లగను తెల్లగను వన్న నిన్ను చూచి రాజుశత్రువులు వెంటనే నశింతురుగాక ! వ్యాధులచేతను శస్త్రములచేతను పరాజితులగుదురు గాక! నీవు పూతన, రేవతి, లేఖాకాళ రాత్రి మొద పేళ్లతో ప్రసిద్దులవు. ఓ పతాకా! నిన్ను ఆశ్రయించుచున్నాము. మాశత్రువులందరిని కాల్చివేయుము, సర్వమేధ మహాయజ్ఞమును, దేవదేవుడగు రుద్రుడు జగత్తు యొక్కసారముతో నిన్ను స్మరించినాడు. శత్రునాశకమగు ఓ ఖడ్గమా! నీవు నారాయణుని, నందకమను ఖడ్గమునకు రెండవమూర్తీ వను విషయమును స్మరింపుము. నీవు నీలక మల దళముతో సమానమగు శ్యామకృష్ణవర్ణములు కలదానవు. దుస్వప్నములను నశింపచేయుదువు. పూర్వము, బ్రహ్మ దేవుడు నీకు ఆసి, విషసనము, ఖడ్గము, తీక్షధారము, శ్రీ గర్భము, విజయము, ధర్మపాలము అను ఎనిమిది పేర్లు పెట్టినాడు. నీది కృత్తికానక్షత్రము మహేశ్వరుడు నీగురువు. సువర్ణము నీశ రీరము. జనార్దనుడు నీదేవత. ఓ ఖడ్గమా! శయనా నగర సహికుడగు రాజునుర క్షింపుము. దేవ శ్రేష్ఠుడగు పితామహుడు నీ తండ్రి నీవుసర్వదామమ్ముల రక్షించుము.
శర్మప్రదస్త్వం సమరే వర్మ న్సైన్యే యశోఽద్యమే ।
రక్ష మాం రక్షణీయోఽహం తవానఘనమోఽస్తుతే.
దుందుభేత్వం సపత్నానాం ఘోషాద్దృదయకంపనః ।
భవ భూమిప సైన్యానాం యథా విజయవర్దనః.
యథా జీమూత ఘో షేణ హృష్య ని వరవారణాః ।
తథాస్తు తవ శబ్దేన హ ర్షో ఽస్మాకం ముదావహ.
యథా జీమూత శబ్దేన స్త్రీణాం త్రాసోభిజాయతే ।
తథాతు తవశ బేన త్రస్యంత్వన్మద్విషోరణే.
మంత్రై సదార్చనీయాస్తే యోజనీయాజయాదిషు ।
ఘృతక అబల (డ) విష్ణ్వాదే స్త్వభి షేకంచ వత్సరే.
రాజ్ఞోభి షేకః కర్తవ్యో దై వజ్ఞేన వురోధసా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఛత్రాది మంత్రాదికం నామైకోన సప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
ఓ కవచమా! నీవు రణభూమిలో కల్యాణ ప్రదము. ఓ నిష్పాపమా నేనునీనుండి రక్షపొందుటకు అర్హుడను. నన్ను రక్షింపుము నీకు నమస్కారము ఓ దుందుభీ నీవు ధ్వనిచే శత్రువుల హృదయములను కంపింపచేయుదువు మా రాజు సేనలకు విజయవృద్ధిని చేయుము. మేఘధ్వనిచే ఉత్తమ గజములు సంతసించినట్లు నీశబ్దముచే మాకుహరము కలుగు గాక! మేఘ గర్జనముచే స్త్రీలకు భయము కలుగునట్లు నీధ్వనిచే యుద్ధమునకు వచ్చిన నా శత్రువు భయ పడుదురుగాక! ఈ తంతములతో రాజోపకరణములను పూజించి వాటిని విజయకార్యమునకై వినియోగించవలెను. దైవజ్ఞుడు ఆగు రాజపురోహితుడు రక్షాబంధనాదుల ద్వారా రాజరక్షణముచేసి, ప్రతిసంవత్సరము విష్ణ్వాది దేవతలకును రాజునకును, అభిషేకము చేయవలెను.
అగ్ని మహాపురాణమున చక్రాదిమంత్రాదికమను రెండువందల అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 269 of the Agni Purāṇa is as follows:
Puṣkara narrates to Paraśurāma the mantras for consecrating royal insignia — the umbrella (chatra), horse, elephant, flag, sword, armor, and drum. Each of these royal emblems receives a specific mantra invoking the corresponding deity: Garuḍa is invoked on the flag, Airāvaṇa and the aṣṭa-diggaja are named in elephant mantras, and Indra presides over the royal umbrella. The chapter teaches that these consecrated objects become receptacles of divine power that protect the king and his army in battle. The Kaumuda, Airāvaṇa, Padma, and other elephants of the eight directions are invoked by name.