పుష్కర ఉవాచః
దేవపూజాదికం కర్మ వక్ష్యే చోత్పాత మర్ధనమ్ ।
ఆపోహిష్ఠేతి తిసృభిః స్నాతోఽర్ఘ్యం విష్ణవేఽర్పయేత్.
హిరణ్యవర్ణా ఇతి చ పాద్యంచ తిసృభిర్ద్విజ ।
శన్న ఆపోహ్యాచమనమిద మాపోఽభిషేచనమ్.
రథేఅక్షే చ తిసృభిర్గంధం యువేతి వస్త్రకం ।
పుష్పం పుష్పవతీత్యేవం ధూపం ధూపోఽపి చాప్యథ.
తేజోఽసి శుక్రం దీపేసాన్మధుపర్కం దధీతిచ ।
హిరణ్య గర్భ ఇత్యష్టావృచః ప్రోక్తా నివేదనే.
అన్నస్యమనుజశ్రేష్ఠపానస్య చ సుగంధినః ।
చామరవ్య జనోపానచ్చత్రం యానాసనే తథా.
యత్కించి దేవమాదిమ్యోత్సావిత్రేణ నివేదయేత్ ।
పౌరుషంతు జపేత్సూక్తం తదేవ జుహుయాత్తథా.
అర్చాభావే తథా వేద్యాం జలే పూర్జఘటే తథా ।
నదీతీరేఽథ కమలే శాంతిః స్యాద్విష్ణుపూజనాత్.
పుష్కరుడు పలికెను. ఇపుడు ఉత్పాతములను తొలగించు దేవ పూజాది కర్మను గూర్చి చెప్పెదను. స్నానము చేసి “ఆపోహిషా” మొదలగు (యజు 36-14,16) మూడు మంతనలతో మహావిష్ణువునకు అర్ఘ్యము సమర్పించి, “హిరణ్యవర్ణాః” (ఋక్ 11-11-1,3) మొదలగు మూడు మంతమంతో పాద్యము “శంనో ఆపః” ఆను మంత్రముతో ఆచమనము, “ఇచమాపః” (యజు-6-17) ఆనుమంత్రమతో అభిషేకమును సమర్పించవలెను. “రథే” “ఆక్షేమ,” “చతస్రః” అను మూడు మంత్రములతో గంధమును, “యువాసువాసాః” (ఋ 3-8-4) అనుమంత్రముతో వస్త్రమును “పుష్పవతి” (ఆథర్వ 8-7-27) అనుమంత్రముతో పుష్పమును, “ధూరసి” (యుజు 1-8) ఆది మంతముతో ధూప మును, “తేజోఽసి” “శుకమసి” (యజు 1-36) అనుమంత్రముతో దీపమును “దధిక్రావ్ణో” (యజు 23-28) అను మంత్రముచే మధుపర్కమును సమర్పించి “హిరణ్యగర్భః” మొదలగు ఎనిమిది ఋక్కులను పఠించి ఆన్నమును సుగంధ మగు పానీయమును సమర్పించవలెను. మిగిలిన చామర, వ్యజన, పాదుకా, ఛత, యాన, ఆసనాదులన సావిత మంత్రముతో సమర్పించవలెను. పురుషసూక్తముతో జపహోమము చేయవలయును. భగవద్విగహము లేనిచో వేదిక పై స్థాపించిన జలపూర్ణకలశము నందుకాని నదీ తటమునందగాని, కమలమునందుగాని, విష్ణువును పూజించినచో ఉత్పాతములు శమించును.
తతో హోమః ప్రకర్తవ్యో దీప్యమానే విభావసౌ ।
పరిసంమృజ్య పర్యుక్ష్య పరిస్తీర్య పరిస్తరైః.
సర్వాన్నాగ్రం సముద్ధృత్య జుహుయాత్స్రయత స్తతః ।
వాసుదేవాయ దేవాయ ప్రభవే దావ్యయాయచ.
ఆగ్నయేచైవ సోమాయ మిత్రాయ వరుణాయచ ।
ఇంద్రాయచ మహాభాగ ఇంద్రాగ్నిభ్యాం తథైవచ.
విశ్వభ్యశ్చైవ దేవేభ్యః ప్రజానాం పతయేనమః ।
అనుమత్యైతథారామ ధన్వన్తరయ ఏవచ.
వాస్తోష్పత్యై తతో దేవ్యై తతః స్విష్టకృతేఽగ్నయే ।
స చతుర్ధ్యన్త నామ్నాతు హుత్వైతేభ్యో బలింహరెత్.
తక్షోపతక్షమభితః పూర్వేణాగ్నిమతః పరమ్ ।
అశ్వానా మపి ధర్మజ్ఞ ఊర్ణానామాని చాప్యథ.
నిరున్దీ ధూమ్రిణీకాచ అస్వపన్తీతథైవచ ।
మేఘపత్నీచ నామాని నర్వేషామేవ భార్గవ.
ఆగ్నేయాద్యాః క్రమేణాథ తతః శక్తిషునిక్షిపేత్ ।
నందిన్యై చసుభాగ్యైచ నుమంగళ్యైచ భార్గవ.
భద్రకాల్యై తతోదత్వా స్థూణాయాంచ తథాశ్రీయే ।
హిరణ్య కేశ్యైచ తథా వనస్పతయ ఏవచ.
ధర్మాధర్మ మయౌ ద్వారే గృహమధ్యే ధృవాయచ ।
మృత్యవేచ బహిర్దద్యాద్వరుణాయోదకాశయే.
భూతేభ్యశ్చ బహిర్ధద్యాచ్ఛరణే ధనదాయచ ।
ఇంద్రాయేన్ద్ర పురుషేభ్యో దద్యాత్ఫూర్వేణ మానవః.
యమాయ తత్పురుషేభ్యో దద్యాద్దక్షిణత స్తథా ।
వరుణాయ తత్పురుషేభ్యో దద్యాత్పశ్చిమేతథా.
సోమాయ సోమ పురుషేభ్యో ఉదగ్గద్యాద నంతరమ్ ।
బ్రహ్మణే బ్రహ్మపురుషేభ్యో మధ్యేదద్యాత్తథైవచ.
ఆకాశేచ తథా చోర్ద్వే స్థండిలాయ క్షితౌ తథా ।
దివాదివాచరేభ్యశ్చ రాత్రౌరాత్రిచరేషుచ.
బలిం బహిస్తథా దద్యాత్సాయం ప్రాతస్తు ప్రత్యహమ్ ।
పిండనిర్వపనంకుర్యాత్ప్రాతః సాయం నకారయేత్.
భూమిపైనున్న వేదిక పై మార్జన ప్రోక్షణములు చేసి దాని నలువైపుల కుశలు పరచి అగ్నిని ప్రదీప్తము చేసి దానిలో హోమము చేయవలెను. పరశురామా! మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుకొని అన్ని అన్నములనుండియు మొదటి భాగమును గ్రహించి వాసుదేవాదులకు హోమము చేయవలెను. వాసుదేవ, దేవ, ప్రభు, ఆద్యయ, ఆగ్ని, సోమ, మిత్ర, వరుణ, ఇంద్ర, మహాభాగ, ఇంద్రాగ్ని, విశ్వదేవ, ప్రజాపతి, ఆనుమతి, ధన్వంతరి, వాస్తోష్పం , దేవి, స్విష్ట కృదగ్ని అను దేవతానామములను చతుర్థ్యంతముచేసి, వీటికి హోమముచేసి, క్రిందచెప్పువిధముగజలి సమర్పించవలెను. ఓ ధర్మజ్ఞ! ముందు ఆగ్నేయ దిక్కునందు ప్రారంభించి, తడా, ఉపతక్షా, అశ్వా, ఊర్జ, నిరుంధీ, ధూమ్రిణీకా, ఆస్వపంతీ, మేధపత్నీ, అనువారికి బలి అర్పింపవలెను. ఓ భృగునుద! ఇవి బలిని స్వీకరించు దేవతల పేర్లు, పిదప నంది న్యాది భక్తులకు బలి అర్పింపవలెను. నందినీ, సుభాగ్యా, సుమంగళీ భద్రకాళీ యను నలుగురు శక్తులకు పూర్వాది దిక్కులు నాల్గింటి యందును బలి యిచ్చి ఒక శంఖువుపైగాని స్తంభముపైగాని, “శ్రీహిరణ్యకేశీ” వనస్పతులకు బిల్ యివ్వవలెను. ద్వారము రెండుప్రక్కల ధర్మ మయ, అధర్మమయులకు గృహమధ్యమమున ధౄవునకు ఇంటి వెలుపల మృత్యువునకు జలాశయమున వరుణునకు బలిసమర్పించి ఇంటివెలుపల భూతబలిని ఇవ్వవలెను. ఇంటిలోపల కుబేరునకు తూర్పున ఇంద్రునకు ఇంద్రపురుషులకు, దక్షిణమున, యమునకు, యమపురుషులకు, పశ్చిమమున, వరుణునకు వరుణపురుషులకు ఉత్తరమున, సోమమునకు సోమపురుషునకు గృహమధ్యమున బ్రహ్మకు బ్రహ్మ పురుషులకు ఆకాశమున విశ్వేదేవతలకు పృథివీపై సంల దేవతలకు బలియిచ్చి పిదప పగలు దివాచర ములకు రాత్రి రాత్రిచరములకు బలియివ్వవలెను. ప్రతిదినము సాయంకాలమందును ప్రాతఃకాలమునందును ఇంటివెలుపల బలి యివ్వవలెను. ఒక దినమున శ్రాద్దమునకు సంబంధించిన పిండ ప్రదానము జరిగినచో ఆనాడు సాయంకాల బలి యివ్వకూడదు.
మిత్రేతు ప్రథమం దద్యాత్తత్పిత్రే తదనంతరమ్ ।
ప్రపితామహాయ తన్మాత్రే పితృమాత్రేతతోఽర్పయేత్.
తన్మాత్రే దక్షిణాగ్రేషు కుశేష్వేవం యజేత్సితౄన్ ।
ఇంద్రావారుణ వాయవ్యాయామ్యావా నైరృతాశ్చయే.
తేకాకాః ప్రతిగృహ్ణంతు ఇమం పిండం మయోద్ధృతమ్ ।
కాక పిండంతు మంత్రేణ శునః పిండం ప్రదాయేత్.
వివస్వతః కులే జాలౌద్వౌశ్యావ (మ) శబలౌశునౌ ।
తేషాం పిండం ప్రదాస్యామి పథిరక్షన్తు మేసదా.
సౌరభేయః నర్వహితాః పవిత్రాః పాపనాశనాః ।
ప్రతిగ్యహ్ఞన్తు యేగ్రాసం గావస్త్రైలోక్య మాతరః.
గోగ్రాసంచ స్వస్త్యయనం కృత్వా భిక్షాంప్రదాపయేత్ ।
ఆతిథీన్దీనాన్పూజయిత్వా గృహీభుంజీతచ స్వయమ్.
ఓం భూః స్వాహా ఓం భువః స్వాహా ఓం స్వః స్వాహా ఓం భూర్భువః స్వాహా ।
ఓం దేవకృతస్యైనసోఽవ యజనమసి స్వాహా ।
ఓం పితృకృత దేవకృతస్యైనసోఽవ యజనమసి స్వాహా ।
ఓం ఆత్మకృత స్వైనసోఽవ యజనమసి స్వాహా ।
ఓం మనుష్య కృత దేవకృతస్యైనసోఽవ యజనమసి స్వాహా ।
ఓం ఏనస ఏనసోఽవయజనమసిస్వాహా ।
యచ్చాహమేనో విద్వాంశ్చకార ।
యచ్చా విద్వాంస్తస్య సర్వస్యైనసోఽవ యజనమసి స్వాహా ।
అగ్నయే స్విష్ట కృతే స్వాహా ।
ఓం ప్రజాపతయే స్వాహా ।
విష్ణుపూజావైశ్వదేవ బలిస్తే కీర్తితామయా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఉత్పాత శాంతిర్నామ చతుఃషష్ట్యధిక ద్విశతతమోఽధ్యాయః.
పితృశ్రాద్దమునందు దక్షిణాగ్ర కుశములపై మొదట తండ్రికి పిదప పితామహనకు పిండదానము చేయవలెను. ఇదే విధముగా మొదట తల్లికి, పిదప పితామహికి పిదప ప్రపితామహికి పిండ దానము చేయవలెను. ఈ విధముగ పితృయాగము చేయవలయును. వండిన వంటనుండి బలివే శ్వ దేవములు చేసిన పిమ్మట ఐదు బలులు ఇవ్వవలేమ. ఇంద్ర, వరుణ, వాయు యమ, నీఋతి దేవతల దిక్కులందు నివసించు కాకులు నేను ఇచ్చిన ఈ పిండమును గ్రహించుగాక! అను ఆర్డము గల మంత్రముతో కాక బలి ఇవ్వవలెను శ్యామ శబల, వర్ణములు గల రెండు శునకములు వివస్వంతుని కులమున జన్మించినవి. నేమ ఆరెండింటి పిండ ప్రదానము చేయుచున్నాను. అదినన్ను మార్గమునందు సర్వదా రక్షించుగాక! అను ఆర్థ ము గల మూలోకమంత్రము చదువుతూ కుక్కలకు బలిఇవ్వవలెను. త్రిలోకజననులు, కామధేను వుత్రికలు ఆయిన గోవులు ఆందరికీని పాతక రములు పవిత్రములు, పాపవినాశ కమలు. ఆవినేనిచ్చు ఈ గ్రాసమును గ్రహించుగాక! అను అర్థము గల మూలో క్తమంత్రముతో గోవునకు గ్రాసమును ఇచ్చిస్వ స్యయనము చేయవలయును. పిదప యాచకులకు భిక్షయిచ్చి దీనులగు ప్రాణులకును ఆతిథులకును అన్నము పెట్టి గృహస్థుడు తాను తినవలెను. “ఓం భూస్వాహా” మొదలు “ఓం ప్రజాపతయే స్వాహా” వరకును గల మూలోక్త మంత్రములు చదువుతు, అన్నాహుతులివ్వవలెను. ఈ విధముగా విష్ణుపూజా వైశ్యదేవ బలులను గూర్చి నీకు చెప్పితిని.
ఆగ్ని మహాపురాణమున ఉత్పాతశాంతి యను రెండువందలఆరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 264 of the Agni Purāṇa is as follows:
The application of daṇḍa (punishment) as the instrument of social order is presented. Agni teaches that punishment must be proportionate, impartial, and administered after proper judicial inquiry — a king who punishes unjustly himself incurs pāpa, while one who fails to punish wrongdoers also incurs pāpa. The chapter describes the four traditional means of statecraft: sāma (conciliation), dāna (inducement), bheda (division among enemies), and daṇḍa (force). The legal procedures for trials, witnesses, ordeals, and the hierarchy of courts are also described.