అగ్ని మహా పురాణము

19 - అథ కశ్యపవంశ వర్ణనమ్

అగ్ని రువాచః-

కశ్యవస్య వదే సర్గమాదిత్యాదిషు హే మునే

చాక్షుషే తుషితా దేవా స్తేఒదిత్యాం కశ్యపాత్పునః  

ఆసన్విష్ణుశ్చ శక్రశ్చ త్వష్టా ధాతా తధార్యమా

పుషా లివస్వాన్ సవితా మిత్రోథ వరుణో భగః.

అంశాశ్చ ద్వాదశాదిత్యా ఆసన్వైవస్య తాంత రే

అరిష్టనేమివల్నీ నామవత్యానీహ షోడశ.

ఓ మునీశ్వరుడా! ఆపుడు కశ్యపునకు ఆదిత్యాదులయందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. దానుష మన్వంతరము నందు తుషితడేవతలుగా ఉన్న వారే మరల వైవస్వతమన్వంతరమునందు- ధాత, ఆర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు. వరుణుడు, భగుడు, అంశువు అను, ద్వాదశాదిత్యులుగా ఆదితియందు కశ్యపునకు జనించిరి, అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జన్మించిరి.

బహుపుత్రస్య విదుషశ్చతస్రో విద్యుతః సుతాః

ప్రత్యజ్గిర సజాః శ్రేష్ఠః కృశాశ్వస్య సురాయుధాః.

ఉదయాస్తమనే సూర్యే తద్వదేతే యుగే యుగే.

విద్వాంసుడై న బహుపుత్రునకు నలుగురు విద్యుత్రులు కుమార్తె లుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్టమైన సురాయుధ ములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాస్త మన ములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.

హిరణ్యకశిపుర్ధిత్యాం హిరణ్యాక్షశ్చ కశ్యపాతీ.

సింహికా బాభవత్కన్యా విప్రచిత్తే  పరిగ్రహః

రాహుప్రభృతయస్త స్యాం సైంహికేయా ఇతి శ్రుతా.

దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సింహిక యను కుమార్తె యు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి సైంహినేయులని ప్రసిద్ధి పొందిరి.

హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః ప్రధిలాజసః

అనుప్రదశ్చ ప్రదశ్చ ప్రహ్లాదశ్చాతివైష్ణవః.

 సంప్రదశ్చ చతుర్దభూదాదపుత్రో ప్రదస్తథా

సంప్రదపుత్ర ఆయుష్మాన్ శిబిర్బాష్కల ఏవ చ

విరోచనస్తు ప్రాహ్లాదిర్బవిర్జజ్ఞే విరోచనాత్

 బలేః పుత్రశతం త్వాసిత్ బాణజ్యేష్ఠం మహామునేః

హిరణక శిపునకు ప్రసిద్ధ మైన తేజస్సుగల అనుహ్లాదుడు, హ్రదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంప్రో గుడు అను నలుగురు పుత్రులు జనించిరి. ఫదుని పుత్రుడు పదుడు, ఆయుష్మంతుడు, శిబి సంప్రదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

పురా కల్వే హి బాణేన ప్రసాద్యోమాసంతి వర

పార్శ్వతో విహరిష్యామిత్యేవం ప్రాప్తశ్చఈశ్వరాత్.

పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.

హిరణ్యాక్ష సుతాః పళ్చి శ దురః శకునివతి

ద్విమూర్తా శజ్కురాద్యశ్చ శతమానన్దనోసుతాః.

స్వర్భానోః సుప్రభా కన్యా పులోమ్న స్తు శచీ స్మృతా

ఉపదనలీ హయశిరా శర్మిష్ణా వార్షవర్వణీ.

ప్రలోమా కాలకా చైవ వైశ్వానరసుతే ఉభే

కశ్యపస్య తు భార్యే ద్వే తయోః పుత్రాశ్చ కోటయః.

స్వర్భానువునకు సుప్రథఆను కన్యయు, పులోమునకు కచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోము కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.

ప్రహ్లాదస్య చతుష్కోట్యో నివాతకవచాః కులే

తామ్రాయాః షట్సులాః స్యుశ్చ కాకీ శ్యేనీ చ భాస్యపి.

గృధ్రికా చ శుచిగ్రీవా లాభ్యః కాకాదయో భవన్

అశ్వాశ్చోష్ట్రాశ్చ తా మాయా అరుణో గరుడ స్తథా.

వినతాయాః సహస్రం తు సర్పాశ్చ సురసాభవాః

కాద్ర వేయాః సహస్రం తు శేషవాసుకితక్షకా.

దంష్ట్రాణః క్రోధవశగా ధరోత్థాః వక్షణోజలే

 సురభ్యాం గోమహిష్యాదిరిరోత్పన్నానృణాదయః.

ఖసాయాం యక్షరజాంసి మునేరప్సర సోభవన్

ఆరిష్టాయాస్తు గందర్వాః కశ్యపాద్ది స్థిరం చరమ్.

ఏషాం పుత్రాదయోసంఖ్యా దేవై ర్వై దానవా జితాః

ప్రహ్లాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన రామకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని దాసి, గృధిక , శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామవలననే ఆశ్వములును. ఒంటెలును. జనించినవి. వినతవలన ఆరుణుడును, ఆగరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పు; తులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందురు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇక నుండి తృణాదులు పుట్టెను, ఆ కశ్యపమువలననే సయను అప్సరస యందు యతులు, రాక్షసులును, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించి నది. వీరి పులాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.

దితిర్వినష్టపుత్రా వై తోషయామాస కశ్యపమ్.

పుత్రమింద్రప్రహర్తారమిచ్ఛతీ ప్రావ కశ్యపాత్.

ఈ విధముగ పుత్రులు నశించగా దితి ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అను గ్రహింపచేసికొని ఆట్టి వానిని పొందెను.

 పాద(దా)ప్రక్షాళ నాత్యుప్తా తస్యా గర్భం జఘాన హ.

భిధ్రమన్విష్య చేన్తస్తు తే దేవా మరోతోభవన్

శక్రస్యైకోనవక్చాతత్సహాయ దీప్త తేజసః.

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశ మును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సాహాయ్యము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి).

ఏతత్సర్వం హరిర్భ్రహ్మా అభిషిచ్య పృథుం నృపమ్

దదౌ క్రమేణ రాజ్యాని ఆన్యేషామధిపో హరిః

హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగ ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.

ద్విజౌషధీనాం చన్దశ్చ అపాం తు వరుణో నృపః

రాజ్ఞాం వైశ్రవణో రాజా సూర్యాణాం విష్ణురీశ్వరః.

వసూనాం పావకోరాజా మరుతాం వాసవః

ప్రభుః ప్రజాపతీనాం దక్షోథ ప్రహ్లాదో దానవాధిపః.

పితృణాం చ యమో రాజా భూతాదీనాం హరః ప్రభుః

పామవాంశ్చైవ శైలానాం నదీనాం సాగరః ప్రభుః.

గన్షర్వాణాం చిత్రరథో నాగానామథ వాసుకిః

సరాణాం తక్షకోరాజా గరుడః పక్షిణామథ.

ఐరావతేగజేౄణాం గోవృషో2థ గవామపి

మృగాణామధ శార్దూలః ప్లక్ష వనస్పతీశ్వరః.

ఉచ్చైశ్రవాస్త థాళ్వానాం సుధన్వా పూర్వపాలకః

దక్షిణస్యాం గజవదః కేతుమానాలకోజలే.

హిరణ్య రోమకః సౌమ్యే ప్రతిసర్గోయమీరితః

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే ప్రతిసర్గ వర్ణనం నామ ఏకోనవింశోధ్యాయః.

బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు. జలములకు వరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు - విష్ణువు, వసువులకు అగ్ని , మరుతులకు ఇంద్రుడు, ప్రజాపతులకు దకుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి, వనస్పతులకు ప్లక్ష ము, ఆశ్వములకు ఉచ్చైశ్రవము ప్రభువులు తూర్పున సుధన్వ, దక్మిణమున శంఖ పదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు. ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము) చెప్పబడినది.

ఆగ్ని మహాపురాణమున ప్రతి సర్గ వర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.