అగ్ని మహా పురాణము

128 - అథ కోటచక్రమ్.

ఈశ్వర ఉవాచః

కోటచక్రం ప్రవక్ష్యామి చతురస్రం పురం లిఖేత్

చతురస్రం పునర్మధ్యే తన్మధ్యే చతురస్రకమ్.

నాడీత్రితయచిహ్నాడ్యం మేషాద్యాః పూర్వదిఙ్ముఖాః

కృత్తికా పూర్వభౌగే తు ఆశ్లేషాగ్నేయగోచరే.

భరణీదక్షిణే దేయా విశాఖాం నైరృతే న్యసేత్

అనురాదాం పశ్చిమే చ శ్రవణం వాయుగోచరే.

ధనిష్ఠం చోత్తరే న్యస్య ఐశాన్యాం రేవతీం తథా

బాహ్యనాడ్యాం స్థితాన్యేవ ఆష్టా హ్యృక్షాణియత్నతః.

రోహిణీపుష్యఫల్గున్యః స్వాతీ జ్యేష్ఠా క్రమేణ తు

అభిజిచ్ఛతతారా తు అశ్వినీ మధ్యనాడికా.

కోటమధ్యే తు యా నాడీ కథయామి ప్రయత్నతః

మృగశ్చాభ్యన్తరే పూర్వం తస్యాగ్నేయే పునర్వసుః.

ఉత్తరా ఫల్గునీ యామ్యే చిత్రా నైరృతసంస్థితా

మూలం తు పశ్చిమే న్యస్యో త్తరాషాఢాం తు వాయవ్యే.

పూర్వభాద్రపద సౌమ్యే రేవతీ చేశగోచరే

కోటస్యాభ్యన్తరే నాడీ ఋక్షాష్టకసమన్వితా.

ఆర్ద్రాహస్తస్తథాషాఢ చతుష్కం చోత్తరాత్రికమ్

మద్యే స్తంభచతుష్కం తు దడ్యాతోటస్య కోటరే.

ఏవం దుర్గస్య విన్యాసం బాహ్యే స్థానం దిశారిపాత్

ఆగస్తుకో యథా యోద్ధా ఋక్షవాన్స్యాత్ఫలాన్వితః.

కోటమధ్యేగ్రహాః సౌమ్యా యదా ఋక్షాన్వితాః పునః

జయం మధ్యస్థితానాం తు భఙ్గమాగామినో విదుః.

ప్రవేశభే ప్రవేష్టవ్యం నిర్గమే భే చ నిర్గమేత్

భృగుః సౌమ్య స్తథా భౌమఋక్షాస్తం సకలం యదా.

తదా భంగం విజానీయాజ్ఞయమాగన్తుకస్య చ

ప్రవేశర్క్షచతుష్కే తు సంగ్రామం చారభేద్యదా.

తదా సిద్ధ్యతి తద్దుర్గం న కుర్యాత్తత్ర విస్మయమ్

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే కోటచక్రం నామాష్టావింశత్యధికశతతమోఽధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : ఇపుడు కోట చక్రమును గూర్చి చెప్పేదను, మొదట చతుర్భుజము గీసి, దాని లోపల రెండవ చతుర్భుజమును, దాని లోపల మూడవ చతుర్భుజమును, దాని లోపల నాల్గవ చతుర్భుజమును గీయవలెను. ఇట్లు గీయగా కోట చక్ర మేర్పడును. దీని లోపల ఏర్పడు మూడు రేఖలకు ప్రథమనాడి, మధ్యనాడి, ఆంతనాడి అని పేర్లు. కోట చక్రము పైన పూర్వాడిదిశలు వ్రాసి రాకు కూడ వ్రాయవలెను. తూర్పున కృత్తిక, ఆగ్నేయమున ఆశ్లేష, దక్షిణమున మఘ, నైరృతియందు విశాఖ, పశ్చిమమున అనూరాధ, వాయవ్యమున శ్రవణము, ఉత్తరమున ధనిష్ఠ, ఈశాన్యము వందుభరణి వ్రాయవలెను. ఈ విధముగ ప్రథమనాడియందు ఎనిమిది చక్రము లగును. ఇట్లే పూస్వాదిదిశల క్రమమున, మధ్య నాడియందు, రోహిణీ, పుష్యమి, పూర్వఫల్గుని, స్వాతి, జ్యేష్ట, అభిజిత్తు, శతభిషము, అశ్విని నక్షత్రములు వ్రాయవలెను. అంతనాడియందు, ప్వూదిదిశాక్రమమున మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, మూల, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, రేవతి వ్రాయవలెను. ఈ విధముగ అంతనాడి యందు గూడ ఎనిమిది నక్షత్రము లగును. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరా భాద్ర-ఈ నాల్గు నక్షత్రములు కోట చక్రమధ్య స్తంభము లగును. ఈ విధముగ చక్రము వ్రాయగా బాహ్య స్థానము దిక్పాలకులస్థాన, మగును. ఆగంతుకు డైన యోధుడు ఏ దిక్కునందు ఏ నక్షత్రమునందో, ఆ దిక్కు ద్వారా కోటలో ప్రవేశించినచో ఆతడు విజయము పొందును. కోట మధ్య నున్న నక్షత్రములందో, శుభగ్రహములు వచ్చి నపుడు యుద్ధము చేసినచో మధ్య నున్న వానికి విజయము, ఆక్రమణ చేసినవానికి పరాజయము కలుగును. ప్రవేశించువాని నక్షత్రమునందు ప్రవేశించవలెను. బైటకు వచ్చు నక్షత్రమునందు బైటకి రావలెను. శుక్ర-కుజ-బుధులు నక్షత్రాంతమునం దున్నపుడు యుద్ధారంభము చేయుచో ఆక్రమణకర్త పరాజితు డగును. ప్రవేశ నక్షత్రములు నాల్గింటియందు యుద్ధము ప్రారంభ మైనచో దుర్గము వశ మగును ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

అగ్ని మహాపురాణమునందు కోటచక్ర నిరూపణ మను నూటఇరువదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.