పుష్కర ఉవాచః
సర్వానుగ్రహకా మంత్రాక్చతుర్వర్గ ప్రసాధకాః ।
ఋగథర్వ తథాసామ యజుః సంఖ్యాతు లక్షకమ్.
భేదః సాంఖ్యాయనశ్చైక ఆశ్వలాయనో ద్వితీయకః ।
శతాని దశ మంత్రాణాం బ్రాహ్మణా ద్విసహస్రకమ్.
ఋగ్వేదో హిప్రమాణేన స్మృతో ద్వైపాయసాదిభిః।
ఏకోన ద్విసహసంతు మంత్రాణాం యజుష స్తథా.
శతాని దశ విప్రాణాం షడశీతిశ్చ శాఖికాః ।
కాణ్వీ మాధ్యందినీ సంజ్ఞా కఠీమాధ్యకఠీతతా.
మైత్రాయణీచ సంజ్ఞాచ తైత్తిరీయాభిధానికా ।
వైశంపాయని కేత్యాద్వాశాఖాయజుషి సంస్థితాః.
సామ్నః కౌథుమసంజ్ఞైకా ద్వితీయాథర్వణాయనీ ।
గానాన్యపిచ చత్వారి వేద ఆరణ్యకం తథా.
ఉక్థాఊహ చతుర్థంచ మంత్రానవసహస్రకాః ।
సచతుః శతకాశ్చైవ బ్రహ్మ సంకటకా స్మృతాః.
పుష్కరుడు పలికెను. సర్వాను గ్రాహకములగు వేదమంత్రములు నాల్గు పురుషార్థములను ఇచ్చును. ఋక్, యజుః, సామ, ఆథర్వములని వేదములు నాలుగు. వీటి మంత్రముల సంఖ్య ఒక లక్ష. ఋగ్వేదమునకు, సాంఖ్యానము ఆశ్వలాయనమని, రెండు శాఖలు. వీటిలో ఒకవెయ్యి ఋగ్వేద బ్రాహ్మణములలో రెండు వేల మంత్రములున్నవి. కృష్ణ ద్వైపాయనాదులు ఋగ్వేదమున ప్రమాణముగా అంగీకరించిరి. యజుర్వేదమున పందొమ్మిది వందల తొంబది తొమ్మిది మంత్రములున్నవి. బ్రాహ్మణములందు వెయ్యి మంత్రములు వున్నవి. శాఖలు ఎనుబది ఆరు, కాండ్వి, మాధ్యందినీ, కఠి, మైత్రాయణి, తైత్తరీయ, వైశంపాయనిక . మొదలగు శాఖలు, యజుర్వేదము నందువున్నవి. సామవేదమున కౌధుమ శాఖ, అథర్వణాయణిశాఖ - అను రెండుశాఖలున్నవి. దీనిలో వేదము ఆర వ్యాకము, ఉక్తకము, ఊహము, అనునాలుగు గానములున్నవి. సామవేదమంలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరువదిఐదు మంత్రములు వున్నవి. ఇవి బ్రహ్మ కు సంబంధించినవి. ఇంతవరకు సామవేదమానము చెప్పబడినది.
పంచవింశతి రేవాత్ర సామమానం(9425) ప్రకీర్తితమ్ ।
సుమంతుర్జాజలి శ్చైవ శ్లోకాయనిరథర్వ కే.
శౌనకః పిప్పలాదశ్చ ముంజ కేశాదయోఽపరే ।
మంత్రాణామయుతం షష్టిశతం(1600) చోపనిషచ్చతమ్.
వ్యాసరూపీ సభగవాఞ్చాఖాభేదాద్యకారయత్ ।
శాఖాభేదాదయో విష్ణురితి హాసః పురాణకమ్.
ప్రాప్యవ్యాసాత్పురాణాది సూతోవై లోమహర్షణః ।
సుమతిశ్చాగ్ని వర్చాశ్చ మిత్రయుః శింశపాయనః.
కృతవ్రతోఽథ సావర్ణిః షట్ శిష్యా స్తస్య చాభవన్ ।
శాంశపాయనాదయశ్చక్రుః పురాణానాంతు సంహితాః.
బ్రహ్మా దీని పురాణాని హరివిద్యా దశాష్టచ ।
మహాపురాణే హ్యాగ్నేయే విద్యారూపో హరిఃస్థిత.
సప్రపంచో నిష్క్రపంచో మూర్తామూర్తస్వరూపధృక్ ।
తంజ్ఞాత్వాభ్యర్బ్య సంస్తూయ భుక్తిముక్తిమవాప్నుయాత్
విష్ణర్షిమ్లర్బవిష్ణుశ్చ ఆగ్ని సూర్యాది రూపవాన్ ।
అగ్నిరూ పేణ దేవాదోర్ముఖం విష్ణుః పరాగతిః.
వేదేమసపురాణేషు యజ్ఞమూర్తిశ్చ గీయతే ।
ఆగ్నేయాఖ్యం పురాణంతు రూపం విష్ణోర్మహత్తరమ్.
ఆగ్నేయాఖ్య పురాణస్య కరా శ్రోతా జనార్దనః ।
తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేద మయంమహత్.
సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం వరమ్ ।
సర్వాత్మ హరిరూపంహి పఠతాం శృణ్వం నృణామ్.
విద్యార్థినాంచ విద్యాదమర్డినాం శ్రీధనప్రదమ్ ।
రాజ్యార్థినాం రాజ్యదంచ ధర్మదం ధర్మ కామినామ్.
స్వర్గార్డినాం స్వర్గదంచ పుత్రదం పుత్రకామినామ్ ।
గవాదికామినాం గోదం గ్రామదతి గ్రామకామినామ్
కామార్థినాం కామదం చ సర్వసౌభాగ్య సంప్రదమ్।
గుణకీ రిప్రదం నృణాం జయదం జయకామినామ్.
సర్వేపూసాం సర్వదంతు ము క్తిదం ము క్తికామినామ్ ।
పాపఘ్నం పాపక ర్తౄణామాగ్నేయంహి పురాణకమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వేదశాఖాదికీర్తనం నామైక సప్తత్యధిక ద్విశతతమోఽధ్యాయః.
సుమంతువు - జాజలి - శ్లోకాయణీ - శౌనకుడు పిప్పలాదుడు ముంజ కేశుడు, మొదలగు వారు ఆథర్వవేదము రాఖా ప్రవర్తకులగు ఋషులు. దీనిలో పదహారువేల మంత్రములు నూరు ఉపనిషత్తులు వున్నవి. శ్రీ మహావిష్ణువు వ్యాస రూపమున అవతరించి వేదశాఖా విభాగమును చేసెను. వేద శాఖా భేదాదులు ఇతిహాసములు పురాణములు, ఇవన్నియు విష్ణు స్వరూపములు, లోమహర్షనుడను నూతుడు వ్యాసుని నుండి పురాణాదులు గ్రహించి, ప్రచారము చేసెను. ఆతనికి సుమతిఅగ్ని వర్చసుడు, మిత్రము శింశపాయనుడు, కృతవ్రతుడు, సావర్ణి - అను ఆరుగురు శిష్యులుండిరి. శింశపాయనాదులు పురాణ సంహితను రచించిరి. శ్రీ మహావిష్ణువే బ్రహ్మాది అష్టాదశ పురాణముల రూపమునను అష్టాదశ విద్యారూపమునను, వున్నాడు. సప్రపంచ, నిమ్రపంచ, మూర్తి మూర్త, స్వరూపధారియగు శ్రీమహావిష్ణువు అగ్నిపురాణరూపమున నున్నాడు. అతనిని తెలుసుకొని పూజించి స్తుతించినచో భుక్తిముక్తులు లభించును. విజయశీలుడగు విష్ణువు ప్రభావసంపన్నుడు. అగ్ని సూర్యాదిరూపముననున్న వాడు. ఆ విష్ణువే ఆగ్ని రూపమున దేవతాదుల ముఖముగ నున్నాడు. ఆతడే పరమగతి. వేద పురాణములందు యజ్ఞమూర్తిగ వర్ణింపబడుచున్నాడు. ఈ అగ్ని పురాణము విష్ణువు యొక్క మహత్త రరూపము. ఈ అగ్ని మహాపురాణము నకు కర్తయు శ్రోతయు కూడ జనార్దనుడే అందుచే ఈ అగ్ని మహావురాణము సర్వవేదమయము. సర్వ విద్యామయము సర్వజ్ఞానమయము, పుణ్యము శ్రేష్ఠము. చదువు వారికిని వినువారికిని సర్వాత్ముడగు శ్రీహరియే స్వరూపము ఈ పురాణము విద్యార్థులకు విద్యను ధనార్డులకు ఐశ్వర్యమును, రాజ్యార్థులకు రాజ్యమును, ధర్మకాములకు ధర్మమును, స్వర్గ కాములకు స్వర్గమును, పుత్రకాములకు పుత్రులను, గడాదికములకు గోవులను గ్రామములకు గ్రామములను ఇచ్చును. కామార్థులకు సర్వసౌభాగ్యములను, గుణ కీర్తులను ఇచ్చును. జయరాములకు జయమును, సర్వకాములకు సర్వముతు ముక్తి కోరువారికి ముక్తిని ఇచ్చును. పాపములు చేసిన వారికి పాపములు తొలగించును.
అగ్ని మహాపురాణమున వేదశాఖా కీర్తనమను రెండువందల డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 271 of the Agni Purāṇa is as follows:
Agni enumerates the four Vedas and all their branches (śākhās). The Ṛgveda is described as having the Sāṅkhyāyana and Āśvalāyana śākhās; the Yajurveda has eighty-six branches including the Kāṇvī, Mādhyandini, and Taittirīya; the Sāmaveda includes the Kautuma and Ātharvāṇāyanī śākhās with a total of 9,425 mantras; and the Atharvaveda is associated with Sumantu, Jājali, Śaunaka, and Pippalāda. The sage Vyāsa is credited with dividing the originally undivided Veda into four for the benefit of the current age. The chapter concludes with the declaration that the Agni Purāṇa itself is sarvaveda-mayam — containing the essence of all the Vedas.