అగ్ని మహా పురాణము

307  - అథ త్రైలోక్య మోహన మంత్రాః

అగ్ని రువాచః

వక్ష్యే మంత్రం చతుర్వర్గ సిద్ధ్యై త్రైలోక్య మోహనమ్

ఓం శ్రీం హ్రీం హ్రూం ఓం నమః పురుషోత్తమ పురుషోత్తమ

పతి రూప లక్ష్మీ నివాస సకల జగత్ క్షోభణ సర్వస్త్రీ

హృదయ దారణ త్రిభువన మదోన్మాదకర సుర మనుజ

సుందరీజన మనాంసి తాపయ తావయ దీపయ దీపయ శోషయ శోషయ

మారయ మారయ స్తంభయ స్తంభయ ద్రావయ ద్రావయ ఆకర్షయ ఆకర్షయ

పరమ సుభగ సర్వ సౌభాగ్యకర కామప్రద ఆముకం

హన హన చక్రేణ గదయా ఖడ్గేన సర్వబాణైర్భింద భింద

పాశేనకట కట అంకుశే తాడయ తాడయ త్వర త్వర కిం

తిష్ఠతి యావత్ తావత్ సమీహితం మేసిద్దం భవతిహ్రూం ఫట్ నమః

ఓం పురుషోత్తమ త్రిభువనమదోన్మాదకర .

హ్రూం ఫట్ హృదయాయ నమః

కర్షయ మహాబల హ్రూం ఫట్ ఆస్త్రాయ

తిభువనేశ్వర సర్వజన మనాంసి హన హన

దారయదారయ మమవకమానయ ఆనయ హ్రూం ఫట్ నేత్రాయ

త్రైలోక్యమోహన హృషీ కేశా ప్రతిరూప సర్వస్త్రీ హృదయాకర్షణ ఆగచ్ఛా గచ్ఛనమః సాంగాక్షి వ్యాప కేనైవ న్యాసంమూల వదీరితమ్.

ఇష్ట్వాసంజప్య పంచా శత్సహస్రమ భీషిచ్యచ

కుండేఽగ్నౌ దైవికే వహ్నౌ చరుంకృత్వాశతం హు నేత్.

పృథగ్ధధిఘృతంక్షీరం చరుం సొజ్యం పయః కృతమ్

ద్వాదశాహుతిమూలేన సహస్రం చాక్షతాం స్తిలాన్.

యవం మధు త్రయం పుష్పం ఫలం దధిసమిచ్ఛతమ్

హుత్వాపూర్ణాహుతిం శిష్టం ప్రాశ యేత్సఘృతంచరుమ్ .

సంభోజ్య విప్రానాచార్యం తోషయేత్సధ్యతే మనుః

స్నాత్వాయథా వదాచమ్య వాద్యతోయాగ మందిరమ్.

గత్వాపద్మాసనం బద్ద్వాశోషయే ద్విధినావపుః

రక్షఘ్న విఘ్న కృద్ధిక్షున్య సేదాదౌ సుదర్శనమ్.

 తం బీజం నాభిమధ్యస్థం ధూమ్రం చండానిలాత్మకమ్

ఆ శేష కల్మషం దేహాద్వి శ్లేషయదను స్మరేత్.

రంబీజం హృదయాబ్జస్థం స్మృత్వా జ్వాలాభిరాద హేత్

ఊర్ద్వధ స్తిర్యగ్గాభిస్తు మూర్ధ్ని సంప్లావయేద్వపుః.

ధ్యాత్వామృతై ర్బహిశ్చాంతః సుషుమ్నా మార్గగామిభిః

ఏవం శుద్ధవపుః ప్రాణానాయమ్య మనునాత్రిధా.

విన్న్యసేన్న్యస్త హస్తాంతః శక్తి మస్తక వక్త్రాయాః

గు హ్యేగలే దిక్షుహృది కుక్షౌదే హేచ సర్వతః.

ఆవాహ్య బ్రహ్మరంద్రేణ హృత్పద్మే సూర్యమండలాత్

తారణైవం పరాత్మానం స్మరేత్తం సర్వలక్షణమ్ .

త్రైలోక్య మోహనాయ విద్మహే స్మరాయ (?) ధీమహి

తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఆత్మార్చనా.

త్క్రతుద్రవ్యం ప్రోక్షయేచ్చుద్ద పాత్రకమ్

కృత్వాత్మ పూజాం విధినా స్థండిలేతం సమర్చయేత్ .

అగ్ని దేవుడు పలికెను చతుర్వర్గ సిద్ధికై త్రైలోక్య మోహన షను మంత్రమును చెప్పెదను. "ఓం శ్రీం హ్రీం మొదలు "ఆగచ్ఛ ఆగచ్ఛ నమః" వరకను మూలో క్త మగు మూలమంత్ర యుక్త వ్యాపక న్యాసము చెప్పబడినది. పూజ చేసి ఏబది వేల జపము చేసి ఆభిషేకము చేసి వైదిక విధిచే స్థాపించిన" కుండాగ్నిలో నూరు హోమములు చేయవల యును. దధి ఘృత క్షీర ఘృతయుక్త చెరు శృత వయస్సులను వేర్వేరుగా మూల మంత్రముతో పండ్రెండు పర్యాయములు హోమము చేసి అక్షత తియవలతో వెయ్యి హోమములు చేసి త్రిమధు పుష్ప ఫల దధి సమిధలతో నూరేసి హోమములు చేయవవలయును. పిదప పూర్ణాహుతి చేసి మిగిలిన మృత సహిత చెరువును భక్షించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యుని దక్షిణాదుతో సంతోషింప చేయవలయును. మంత్రము సిద్ధించును. స్నానా చమనములు చేసి మౌనముతో యాగ మందిరమున ప్రవేశించి పద్మా సనమున కూర్చండి తాంత్రిక విధానముతో శరీర శోషణము చేయవలయును. ముందుగా రాక్షసులను విమ్న కారక భూతములను ఆణచుటకై అన్ని దిక్కులందును సుదర్శన న్యాసము చేయవలయును. ఈ సుదర్శ నము పంచ క్లేశములకు బీజము, ధూమ్ర వర్ణము ప్రచండానిల రూపము. వాభి ప్రదేశము నదున్న నా సకల పాపములను శరీరము నందుండి తొలగించుచున్నది యవి భావన చేయవలయును. పిదప హృదయాబ్దము నందున్నరం బీజమును స్మరించి మీదను క్రిందను పార్శ్వము లందును వ్యాపించియున్న అగ్ని జ్వాలలచే ఆ పాప పుంజమును జ్వలింపచేసి భస్మము చేయ వలయును. పిదప శిరస్సు నందు అమృత భావన చేసి సుషుమ్నా నాడీ మార్గమున వచ్చుచున్న ఆ అమృత ధారలచే తన శరీరమును బయటను లోపలను కూడ ఆప్లావితము చేయవలయును. ఈ విధముగా శుద్ద శరీరడై మూల మంత్రముతో మూడు ప్రాణాయామములు చేసి శిరో ముఖ గుహ్య గ్రీవ. సకలదిక్ హృదయ కుక్షి సమస్త శరీరము లందు హస్త మంచి వాటి పై శ క్తి న్యాసము చేయవలయును. సూర్య మండలము నుండి పరమాత్మను ఆవాహనము చేసి బ్రహ్మ రంధ్ర మార్గము నుండి హృదయ కమలమునకు తీసుకొని వచ్చి ప్రణవోచ్చారణ చేయుచు సర్వలక్ష లక్షణ సంపన్నుడగు ఆ పర మాత్మను స్మరించవలెను. లోతైలోక్య మోహనాయ విద్మహే స్మరాయధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్" యను నది లోక్య మోహన గాయత్రి. అల్మార్చనానంతరము యజ్ఞ ద్రవ్యములను శుద్ధములగు పాత్రములను ప్రోషించి ఆత్మ పూజ చేసి వేదిక పై ఆర్చించవలెను.

 కూర్మాది కల్పితే పీఠే పద్మస్థంగరు డోపరి

సర్వాంగ సుందరం ప్రాప్తవయో లావణ్య యౌవనమ్.

మదాఘూర్ణితతామ్రాక్ష ముదారం స్మర విహ్వలమ్

దివ్య మాల్యాంబర లేప భూషితం సస్మితాననమ్.

విష్ణుంనానా విధానేక పరివార పరిచ్చదమ్

లోకాను గ్రహణం సౌమ్యం సహస్రాదిత్య తేజసమ్.

వంచబాణధరం ప్రాప్తకామైక్షం ద్విచతుర్భుజమ్

దేవస్త్రీభిర్వృతం దేవీముఖాసక్తేక్షణం జపేత్.

చక్రం శంఖం దనుః ఖడ్గం గదాం ముసల మంకుశమ్

పాశంచ బిభ్రతం చార్చేదావాహాది విసర్గతః.

శ్రియం వామోరు జంఘస్థాం శ్లిష్యన్తీం పాణినాపతిమ్

సాబ్జవామకరాం పీనాం శ్రీవత్స కౌస్తుభాన్వితామ్.

మాలినం పీత వస్త్రంచ చక్రాద్యాడ్యం హరింయజేత్

ఓం సుదర్శన మహాచక్రరాజ ధర్మశాంత దుష్ట

భయంకర చ్చిద చ్చిద విదారయ విదారయ పరమంలాన్

గ్రస గ్రస భక్షయ భక్షయ భూతాని నాశయ నాశయ.

హ్రూం ఫట్ ఓం జలచరాయ స్వాహా ఖడ్గతీక్ష్ణ

చ్ఛిన్ద చ్ఛిన్ద ఖడ్గాయనమః శార్జ్గయ సశ రాయ హ్రూం ఫట్

భూతగ్రామాయ విద్మ హే చతుర్విధాయ ధీమహి

తన్నో బ్రహ్మ ప్రచోదయాత్.

నంవర్తక శ్వసన పోథయ పోథయ హ్రూం ఫట్ స్వాహా

పాశ బంధ బంధ ఆకర్షయ ఆకర్షయ హ్రూం ఫట్

అంకు శేన కట్ట కట్ట హ్రూం ఫట్

క్రమాద్భుజేషు మంత్రైః స్వైరేభిరస్త్రాణి పూజయేత్.

ఓఒ పక్షిరాజాయ హ్రూం ఫట్

తార్క్ష్యం యజేత్కర్ణి కాయామంగ దేవాన్యథావిధి

శ క్తిరింద్రాది యంత్రేషు తార్క్ష్యాద్యా ధృత చామరాః

శక్తయోఽన్తే ప్రయోజ్యాదౌ సురేశాద్యాశ్చ దండినా

పీతేలక్ష్మీ సరస్వత్యౌ రతిప్రీతిజయాః సీతాః.

కీర్తి కాంత్యాసితేశ్యామే తుష్టి పుష్ట్యాస్మ రోదితే

లో కే శాంతం యజేదేవం విష్ణు మిష్టార్థ సిద్దయే.

ధ్యాయేన్మంత్రం జపిత్వైనం జుహుయా త్త్వ భిషేచయేత్

ఓం శ్రీం క్రీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః

ఏతత్పూజాదినా సర్వాన్కామానాప్నోతి పూర్వవత్.

తోయైః సమ్మోహనీ పుష్పైర్నిత్యం తేన చ తర్పయేత్

బ్రహ్మాసశక్ర శ్రీదండీ బీజం త్రైలోక్య మోహనమ్.

జప్త్వాత్రిలక్షం హుత్వాచ లక్షం బిల్వేశ్చ సాజ్య కైః

తండులైః ఫలగంధాధ్యైర్దూర్వాభిస్త్వాయురాప్నుయాత్.

తయాభి షేక హోమాది క్రియాతుష్టోహ్య భీష్టదః

ఓం నమో భగవతే వరాహాయ భూర్భువః స్వః పతయే

భూపతిత్వం మేదేహి హృదయాయ స్వాహా

పంచాంగం నిత్యమయుతం జప్త్వాయూ రాజ్య మాప్నుయాత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే త్రైలోక్య మోహన మంత్ర కథనం నామ సప్తాధిక త్రిశతతమోఽధ్యాయః.

కూర్మాది రూపమున కల్పితమగు పీఠముపై గరుత్మంతుని పై పద్మాసవము నందున్న శ్రీ మహా విష్ణువు సర్వాంగ సుందరుడు. వయస్సు తగిన లావణ్య యౌవనములు కలవాడు. అతని ఎర్రని నేత్రములు మదముచే తిరుగుచుండును. ఉదారుడు. స్మరవిహ్వలుడు. దివ్య మాల్యాంబర ఆలేపములచే అలంకృతుడు. మందహాసము కలవాడు. అనేక విధము లగు పరివార పరికరములు కలవాడు. లోకానుగ్రహ కారకుడు. సౌమ్యుడు. సహస్ర సూర్య తేజశ్శాలి. ఐదు బాణములు ధరించినవాడు. ఆతని అన్ని ఇంద్రియములును ప్రాప్తకామములు ఎనిమిది భుజములు గల వాడు. దేవతాస్త్రాలు యాతనిని చుట్టు ముట్టి యుందురు. ఆతని దృష్టి లక్ష్మీ ముఖ పై లగ్నమై యుండును. ఈ విధముగ భగవంతుని ధ్యానించవలెను. ఆతని ఎనిమిది హస్తములలో వరుసగా చక్ర శంఖ ధనుః ఖడ్గ గదా, ముసల, అంకుశ, పాశ ములుండును. ఆతనినిశ్రీ మదగ్ని మహాపురాణము ఆవాహనాదుల ద్వారా పూజించి ఆంతమును విసర్జించవలెను. శ్రీ మహా విష్ణువు తన వామోరు జంఘల పై చేతితో తనను ఆలింగనము చేసుకొని వున్న లక్ష్మిని కూర్చుండ బెట్టుకొని యుండును. ఆమె ఎడమ చేతిలో పద్మము వుండును. ఆమె బలిసి శ్రీవత్స కౌస్తుభములతో ప్రకాశించుచుండును. మాలా ధారియు, పీత వస్తూడు, చక్రాది ధారియు యగు హరిని పూజించ వలెను. "ఓం సుదర్శన మొదలు హుంఫట్" వరకును మూలములలో నున్నది. సుదర్శన మంత్రముతో సుదర్శనమును పూజించవలెను. “ఓం జల చరాయ స్వాహా ఖడ్గ తీక్ష్ణ చింద, ఖడ్గాయ నమః జార్జ్గాయ, సశ రాయ హఫట్. ఇవి పాంచజన్యాది పూజా మంత్రములు. భూత గ్రామాయ విద్మహే చతుర్విధాయధి మహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఇది భూత గ్రామ గాయత్రి. సంవర్తక శ్వసన పోథయ పోధయ హంఫట్ స్వాహా" పాశ బంధ బంధ, ఆకర్షయ, ఆక రయ హుంకట్. అంకుశ కట్ట కట్ట హంఫట్". వీటిలో ముసలాదులను వాటి వాటి మంత్రములతో పూజించవలెను. “ఓం పక్షిరాజాయ హుంఫట్" యని గరుత్మంతుని పూజించవలెను. కర్జి క యందు యథావిధిగా ఆంగ దేవతలను పూజించి పూర్వాది దళములందు లక్ష్మ్యాది శక్తులను పొతురధారి ఆర్ష్యాదులను పూజించవలెను. శక్తి పూజ అంతము నందు చేయ వలయును. ముందుగ దండి సహితులగు ఇంద్రాదులను పూజించవలెను. లక్ష్మీ సరస్వతులు పీతవర్ణము కలవారు. రతి ప్రీతి జయలు శ్వేత వర్ణము కలవారు. కీర్తి కాంతులు కూడ శ్వేత వర్ణులు తుష్టి పుష్టులు. శ్యామ వర్ణము కలవారు. వీరిలో స్మర భావముండును. లోకేశుని వరకు దేవతలను పూజించి ఆభీష్ట సిద్దికై విష్ణువును పూజించవలెను. ఈ క్రింది మంత్ర మును జపించి హోమాభిషేకములు చేయవలయును. "ఓం శ్రీం క్లీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయవిష్ణవే నమః అని మంత్రము. ఈ విధముగా పూజాదులు చేయుటచే సర్వకామములను పొందును. జలముతో సం మోహనీ వృక్ష పుష్ప ముతోను పైమంత్రము చెప్పుచు నిత్యతర్పణము చేయవలయును. బ్రహ్మ ఇంద్ర శ్రీదేవి, దండి, బీజ మంత్ర తై లోక్య మోహన విష్ణువులను పూజించి పైమంత్రమును మూడు లక్షలు జపించి కమల పుష్ప బిల్వ పత్ర మృతములతోను, తుండుల వల సుగంధ చందనాది ద్రవ్యములతోను దూర్వలతోను ఒక లక్ష హోమము చేయవలయును. దీర్ఘ యుర్దా యము పొందును. జపాభి షేకహోమాదులచే సంతుష్టుడే మహా విష్ణువు ఆభీష్ట ఫలములను ఇచ్చును. “ఓం నమో భగవతే వరా హాయ'' భూర్భుభువ్వుఃపతయే భూపతిత్వం మే దేహి హృదయాయ స్వాహా, ఇది వరాహముత్రము. దీనికి ఐదంగములండును. ప్రతి దినము పది వేల చొప్పున జపము చేసిన వాడు ఆయుర్ధాయమును రాజ్యమును పొందును.

ఆగ్ని మహా పురాణమున త్రైలోక్య మోహన మంత్ర కథన మను మూడు వందల యేడవ ఆధ్యాయము సమాప్తము.