అగ్ని మహా పురాణము

129 - అథార్ఘకాణ్డమ్.

ఈశ్వరవాచః

ఆర్ఘమానే ప్రవక్ష్యామి ఉల్కపాతోఽథ భూశ్చలా

నిర్ఘాతో గ్రహణే వేశో దిశాం దాహో భవేద్యదా.

లక్షయేన్మాసి మాస్యేవం యద్యేతాఃస్యుశ్చ చైత్ర కే

అలఙ్కారాదిసంగృహ్య షడ్భిర్మాసైశ్చతుర్గుణమ్.

వైశాఖే చాష్టమే మాసి షడ్గుణం సర్వసంగ్రహమ్

జ్యేష్ఠే మాసి తథాషాఢ యవగోధూమధాన్య కైః.

శ్రావణే మృతతైలాద్యైరాశ్వినే వస్త్రధాన్యకైః

కార్తికే ధాన్యకైః క్రితైర్మాసే స్యాన్మార్మార్గశీర్షకే.

వుష్యే కుఙ్కుమగన్ధాద్యైర్లాబో ధాన్యైశ్చ మాఘకే

గన్ధాద్యైః ఫాల్గునే క్రీతైరర్ఘకాణ్డముదాహృతమ్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఆర్ఘకాణ్డం నామోనత్రింశదధికశతతమోఽధ్యాయః

పరమేశ్వరుడు పలికేను : వస్తువుల మూల్యమును (అల్పత్వాధికత్వముల) గూర్చి చెప్పెదను, భూతలవంపై ఉల్కాపాతము, భూకంపము, వజ్రపాతము, చంద్రసూర్యగ్రహణములు, దిక్కులందు ఆధికముగ వేడి కలుగు నపుడు ఈ విషయమును ప్రత్యేకమాసమునందును పరిశీలించవలెను. పైన చెప్పిన లక్షణములలో ఏ దైన లక్షణము చైత్రమునం దైనచో అలంకారసామగ్రిని (వెండి, బంగారము మొ!!) సంగ్రహించుకొనవలెను. ఆరు మాసముల తరువాత ఆవి నాలుగు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. వైశాఖమునం దైనచో వస్త్ర-ధాన్య-సువర్ణ-మృతాదులను సంగ్రహించుకొనవలెను ఎనిమిదవ మాసమున ఆరు రెట్ల మూల్యమునకు అమ్ముడుపోవును. జ్యేష్ఠాషాఢములం దైనచో యవలు, గోధుమలు, ధాన్యము సంగ్రహించు కొనవలెను. శ్రావణమునం దైనచో మృతతై లాదరస పదార్థములను సంగ్రహించవలెను. ఆశ్వయజ మాసముం దైనచో వస్త్రములు, ధాన్యము సంగ్రహించవలెను. కార్తిక మునం దైనచో అన్ని విధముల అన్నమును కొని ఉంచుకొనవలెను. మార్గశిర పుష్యముం దైనచో కుంకుమము వలనను సుగంధపదార్థముల వలనను లాభము వచ్చును. మాఘమునం దైనచో ధాన్యము వలన లాభము కలుగును. ఫాల్గునమునం దైనచో సుగంధపదార్ధముల వలన లాభము కలుగును. లాభము వచ్చు ఆవధి ఆరు ఎనిమిదిమాసము లని గ్రహించవలెను.

అగ్ని మహాపురాణమునందు అర్ఘకాండ మను నూటఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.