అగ్ని మహా పురాణము

91 - అథ వివిధ మంత్రాదయః.

ఈశ్వర ఉవాచః

అభిషిక్తః శివం విష్ణుం పూజయేద్భాస్కరాడికాన్

శబ్ధభేర్యాది నిర్ఘోషైః స్నాపయేత్పఞ్చగవ్యమై.

యో దేవాన్ దేవలోకం స యాతి స్వకులముద్దరన్

వర్షకోటీసహ స్రేషు యత్పావం సముపార్జితమ్. 

మృతాభ్యజ్గేన దేవానాం భస్మీభవతి పావకే

ఆడకేన మృతాద్యైశ్చ దేవాన్ స్నాప్య సురో భవేత్ .

చన్దనేనానులిప్యాత గన్దాద్యై పూజయేత్తతా

అల్పాయా సేన స్తుతిభిః స్తుతా దేవాస్తు సర్వదా.

ఆతీరానాగతజ్ఞాన మన్రధీ భు క్తిము క్తిదాః

ధృహీత్వా ప్రశ్న నూక్ష్మార్ణే హృతే ద్వాభ్యాం శుభాశుభమ్.

 త్రిభిర్ణవో మూలధాతుశ్చతుర్బ్బి హ్మణాదిభిః

పఞ్చాదౌ భూతత్వ్తాది శేషే తైవం జయాధికమ్.

ఏకత్రికాతిత్రికా న్తే పదే ద్విపదకాన్తకే

అశుభం మద్యం మధ్యేష్వి న్దత్రిమ నృప శుభ.

సంఖ్యావృ న్దే జీవితాబ్దం యమో బ్ధదశహా ధ్రువమ్

సూర్యేరా స్యేశ దుర్గా శ్రీ విష్ణు మ నెగ్గితే త్కజే.

కఠిన్యా జప్తయా స్ప్రష్టే గోమూత్రాకృతిరేఖయా

 ఆడభ్యైకం త్రికం యావత్తిచతు ష్కావసానకమ్.

 మరుధ్వ్యోమ మరుద్బీజై శ్చతుః షష్టిపడే తథా

అక్షాణాం పతనాత్ స్పర్శాద్విషమాదౌ శుభాదికమ్.

ఏకత్రికాధిమారభ్య అశ్తేచాష్ట్ర త్రికం తథా

శ్యజాడ్యాయాః సమా హీనా విషమాః శోభనాదిదాః.

ఆ ఈపల్లవితైః కాద్యైః షోడశ స్వర పూర్వగైః

ఆద్యైస్తైః సస్వరైః కాద్యై స్త్రీ పుఠాణామమన కాః.

శ్రీం బీజాః ప్రణవాద్యాః స్యుః నమోన్తా యత్ర పూజనే

మన్రా వింశతిసాహస్రాః శతం షష్ట్యరికం తతః.

ఓం హ్రీం మన్రాః సరస్వత్యాశ్చణ్డి కాయాస్త థైవ చ

తథా గౌర్యాశ్చ దుర్గాయా ఆం శ్రీం మన్రాః శ్రియ స్తథా.

తథా క్షౌం మన్రాః సూర్యస్య ఆం హౌం మన్రాః శివస్య చ

ఆం గం మన్రా గణేశస్య ఆం మన్రాశ్చ తథా హరేః.

శతార్ధై కాధికైః కాద్యై స్తథా షోడశభిః స్వరైః

 కాద్యైస్తైః సస్వరై రాద్యైః కా నైర్మన్రా స్తథాఖిలాః.

రవీశ దేవీవిష్ణూనాం స్వాబ్దిదేవేస్ట్రవర్తనాత్

 శతత్రయం షష్ట్యధికం ప్రత్యేకం మణ్డలం క్రమాత్.

అభిషిక్తో జ పేద్ద్యాయేచ్ఛిష్యాదీన్ దీక్షయేద్గురుః

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే అభిషిక్తేన కర్తవ్యస్య తత్తద్దే వతామ స్త్రజపాదేర్విధిర్నామ ఏకనవతితమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను: అభిషేకానంతరము దీక్షితుడు శివ-విష్ణు-సూర్యాదిదేవతలను పూజించవలెమ. శంఖ భేర్యాదివాద్యధ్వనులతో దేవతలకు పంచగవ్యములతో స్నానము చేయించు వాడు, తన కులమును ఉద్ధరించి తాను దేవలోకము నకు వెళ్ళును. దేవతల శరీరమునకు అజ్యాడ్యంగ నము చేయుటచే, కోటి సహస్రవర్ష సంచిత మైన పాపము భస్మ మైపోవును. ఒక ఆడకము (ఆడ్డెడు) నెయ్యి మొదలైన వాడితో దేవతలకు స్నానము చేయించిన మనుష్యుడు దేవత యగును. చందనము పూసి గంధాదులతో దేవపూజ చేయువానికి గూడ అదే ఫలము లభించును. కొంచెము ప్రయాసతో మాత్రమే స్తోత్రపాఠము చే దేవతాస్తుతి చేసినచో భూతభవిష్యజ్ఞానము, మంత్రజ్ఞానము, భోగమోక్షములు లభించుచు. ఎవ రైన మంత్రమునకు సంబంధిం చిన శుభాశుభఫలములను గూర్చి ప్రశ్నించినచో, ఆ ప్రశ్న వాక్యములో నున్న అక్షరములు లెక్కించి, రెండుచే భాగించగా ఒకటి శేషించినచో శుభము, శూన్యముగాని, రెండు గాని శేషించినచో ఆశుభము. మూడుచే భాగించినచో  మూలధాతురూప జీవుని విషయము తెలియును. ఒకటి శేషించినచో వాతజీవుడు, రెండు శేషించినవో పిత్తజీవుడు, మూడు శేషించినచో కప జీవుడు. నాలుగుతో భాగించినచో బ్రాహ్మణాధివర్ణబుద్ధి కలుగును. ఐదుచే భాగించినచో భూతతత్త్వాది జ్ఞానము కలుగును. ఈ విధముగనే జయపరాజయాది జ్ఞానము కూడ కలుగును, మంత్రపదాంతమునందు ఒక త్రికము (మూడు బీజాక్షరములు) న్నను, అధిక బీజాక్షరములున్నను, ప, మ, క లు ఉన్నను వీటిలో మొదటిది అశుభము. మధ్యలో నున్నది మధ్యమము, చివరిది శుభము. చివర సంఖ్యా సమూహ మున్నచో ఆది జీవనకాలము పది సంవత్సరములు అని సూచించును. దళసంఖ్య ఉన్నచో పది సంవత్సరముల పిమ్మట ఆ మంత్రసాధకుడు తప్పక మరణించును, సూర్య-గణపతి- శివ-దుర్గా-లక్ష్మి- విష్ణు మంత్రములు అక్షరములతో, అంగుషస్పృష్ట జైన కమలపత్రముమీద, గోమూత్రాక్షారరేఖపపై, ఇక త్రికము (మూడు  అక్షరములు) ప్రారంభించి పండ్రెండు త్రికములవరకును వ్రాయవలెను. ఆరువదినాలుగు కోషముల మండలము చేసి దానిపై యం, హం యం అను బీజాక్షరముల త్రికములను మొడటి కోశమునుండి ఎనిమిదవ కోశము వరకును వ్రాయవలెను.

ఈ స్థానములపై పాచీక చేయుటచేత గాని, స్పృశించుటచేత గానీ శుభాశుభజ్ఞానము కలుగును. పాచిక లేదా స్పర్శ విషమ సంఖ్యకల దానిపై పడినచో శుభము, సమసంఖ్యగలదానిపై అశుభము. 'యం హం హం' అను మూడు బీజాక్షరముల ఎనిమిది త్రీకములు ధ్వజాదు అమగు ఎనిమిది ఆయములకు ప్రతీకములు. వీటిలో సమ మైనవి ఆశుభములు; విషమములు శుభప్రదములు.  మొదలగు అక్షరములను పదునారు స్వరములతోడను, అట్లే పదునారు స్వరములను కొద్యక్షరముతో చేర్చి, వాటికి ‘ఆం ఈం’ అను పల్లవములను కూర్చవలెను. పల్లవయుక్తములైన ఈ సస్వరకాద్యక్షరములను ఆదియం దుంచి వాటితో త్రిపురామంత్రమను వేరువేరుగ చేర్పవలెను. వీటి మొదట ‘ హ్రీం’ చివర 'నమః' చేర్చవలెను, ఈ విధముగ పూజావీని యుక్షము లగు ఈ మంత్రముల ప్రస్తారముచే ఇరువదివేల నూట ఆరుశది మంత్రము లేర్పడును. సరస్వతీ-చండి–గౌరీ- దుర్గామంత్రములకు ‘ఆం హ్రీం’ అను బీజములును, శ్రీదేవీ మంత్రమునకు ‘ఆం శ్రీం’ అను బీజములును, సూర్యమంత్ర మునకు ‘ఆం క్షౌం’ లును, శివమంత్రమునకు ‘ఆం హూం’ లును, గణేశ మంత్రములకు ‘ఆం గం’ లును, విష్ణువునకు ‘ఆం ఆం’ లును ఉండును. కాదివ్యంజనములు అకారాది షోడశ స్వరములు కలిసి మొత్తము ఏబడియొక్క అక్షరము అగును. ఈ విధముగ సస్వరము లగు కాద్యక్షరములను ఆదియందును, సస్వర క్షాది కాంతాక్షరములను అంతమునందును ఉంచగా సంపూర్ణమంత్ర మగును. మొత్తము మండలముల సంఖ్య 1440 కాగా సూర్య-శివ-దేవీ-దుర్గా-విష్ణువుల మండలములు మూడువందల అరువది చొప్పున అగును.  అభిషిక్తుడైన గురువు ఈ అన్ని మంత్రముల జపము, దేవతల ధ్యానము చేసి, శిష్యునకును పుత్రునకును దీక్ష ఇవ్వవలెను.

అగ్ని మహాపురాణమునందు నానామంత్రికి కథన రూప మగు తొంబదియొకటవ ఆధ్యాయము సమాప్తము.