అగ్ని మహా పురాణము

141 - అథ షట్త్రింశత్పదకం

 ఈశ్వర ఉవాచః-

షట్త్రింశత్పదసంస్థానామోషధీనాం వదే ఫలమ్

ఆమరీకరణం నృణాం బ్రహ్మరుద్రేంద్ర సేవితమ్.

హరీతక్యడి ధాత్ర్యశ్చ మరీచం పిప్పలి శిఫా

వహ్ని  శుణ్ణి పిప్పలీ చ గుడూచీవచనింబకా.

పాసకః శతమూలీ చ సైన్తవం సిగ్గువారకమ్

కజ్జికారీ గోక్షురకా బిల్వం పౌనగ్న వం బలా.

ఏరణముగ్గేరుచకో భృంగః వారోథ కర్కటః

ధాన్యాకో జీరక శ్చైవ శతపుష్పి జవానికా.

విడజ్ఞః ఖదిర శ్చైవ కృతమాలో హరిద్రయా

వచా సిద్ధార్థ ఏతాని ష ట్రింశత్పదకాని పి.

 క్రమాదేకాదిసంజ్ఞాని హ్యౌషధాని మహా ని పా

సర్వరోగహరాణి స్యురమగీకరణాని చ.

 వలీపలితబేత్తణి సర్వకోష్ఠగతాని తు

ఏషాం చూళ్లే చవటికా ర సేన పరిభావితా.

అవలేహః కషాయో వా మోదకా గుడఖణకః

మధుతో మృతతో వాపి ఘృతం తైలమఠాపి ఐ.

నర్వాత్మనోపయుక్తం హి మృతసంజీవనం భవేత్

కరాకం కర్షమేకం వా పలార్గం పల మేకకమ్.

యథేష్టాచారనిరతో జీవేద్వర్షశతత్రయమ్

మృతసంజీవనీకల్పే యోగో నాస్మాత్పరో స్తి హి.

ప్రథమాన్న వకాద్యోగాత్సర్వరోగైః ప్రముచ్యతే

ద్వితీయాచ్చ తృతీయాచ్చ చతుర్థాన్ముచ్యతే రుజః.

ఏవం షట్కాచ్చ ప్రథమా ద్వితీయాచ్చ తృతీయతః

చతుర్దాత్పజ్చమాన్హష్ఠాత్తథా నవచతుష్కత.

ఏక ద్విత్రిచతుష్ఫ్చషట్సపాష్టమతో నిలాత్

అగ్ని భాస్కరషడ్వింశసప్తవింశ్చై పిత్తతః.

బాణర్తు శైలవసుభిస్తీథిభిర్ముచ్యతే కఫాత్

వేదాగ్ని భిర్బాణముఖై కి షడ్గుణిః స్యాద్వరే మృతే.

గ్రహాదిగ్రహణానైశ్చ సర్పైరేవ విముచ్యతే

ఏక ద్విత్రిర సైః శైలై ర్వసుగ్రహశివైః క్రమాత్.

ద్వాత్రింశ త్తిథిసూర్యైశ్చ నాత్ర కార్యావిచారణా

ష ట్రింశత్పదకజ్ఞానం న దేయం యస్య కస్య చిత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే యుద్ధజయార్ణవే షట్త్రింశత్పదకంనామైక చత్వారింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పేను ; ఇపుడు ముప్పదియారు పదములలో నుంచబడిన ఓషధుల ఫలమును చెప్పెదను. ఈ ఓషధులను సేవించుటచే మనుష్యులు అమరు లగుదురు. వీటిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఉపయోగించి యున్నారు. హరీతకీ. అధాత్రీ . మరీచ - పిప్పలీ - శిఫా - వహ్ని - శంకీ - పిప్పలీ గుడూచీ - వదానింబ - వాసక-శతమూలీ - సైంధవ సింధువార - కంటతారి - గోకుత - బిల్వ - పునర్నవా – ఐలా- ఏరండ-ముండి రుచక-భృంగ- తెర-పర్పట ధాన్యాక ఉరక - శతపుష్పి - యవానీ - విడంగ - అడర - కృతమూల - హరిద్రా వచా- సిద్దార్థము లను ఓషధులు ముప్పటి ట్రింశత్పరకమ్ యారు పదములందు స్థాపింపపలెను. ఒకటి, రెండు మొద లైన సంఖ్యలు గల ఈ మహౌషధులు సమస్త రోగమలన దూరము చేయును. అమరత్వమును నిచ్చును. అన్ని కుష్ఠములలోని ఓషధులును శరీరముపై ముడతలు పడకుండ చేయును. వెండ్రుకలు నెరవకుండు నట్లు చేయును. వీటి చూర్ణములతో గాని, రసముచేత గాని భావన చేసిన వటులను అవలేహములను కషాయము లను లడ్డులను, గుడఖండాదులను నెయ్యితో గాని, తేనెతో గాని తిన్న చో, లేదా వీటి రసముతో భావన చేసిన నెయ్యి గాని, తైలము గాని ఏ ప్రకారముగ నె నను ఉపయోగించినచో, అది సర్వధా మృతసంజీవనముగా పని చేయును. సగము కర్షము లేదా కర్షము లేదా సగము పలము, లేదా పలము దీనిని ఉపయోగించువాడు అహారవిహారములందు యథేష్టముగ నున్నను మూడు వందల సంవత్సరములు జీవించును. మృతసంజీవనీకల్పమునందు దీనికి మించిన యోగము లేదు. మొదటి నవకము (తొమ్మిదిఔషధముల సముదాయము నవకము) నందలి ఓషధులు కలిపి చేసిన ఔషధము సేవించుటచే మానవుడు సర్వరోగ విముక్తు డగును. ద్వితీయ-తృతీయ-చతుర్థ నవకము లందలి ఓషధుల ప్రయోగముచేత గూడ రోగ విముక్తుడగును. ప్రథమ ద్వితీయ - తృతీయ - చతుర్థ - పంచమ షష్ణ షట్కముల (ఆరు ఓషధుల సముదాయము షట్కము) సేవనము చే మనుష్యుడు రోగ విముక్తు డగును. ముప్పదియారు ఓషధులకు తొమ్మిది చతుష్కము లేర్పడును. (నాల్గింటి సముదాయము చతుష్కము). ఏ చతుష్కములోని ఓషధులను సేవించినను రోగ విముక్తుడగును. ప్రథమ - ద్వితీయ - తృతీయ - చతుర్థ - పంచమ షష్ణ - సప్తమ - అష్టమ కోష్టములందరి ఓషధులను సేవించుటచే వాతదోషము తొలగును. తృతీయ - ఏకాదశ - షడ్వింశ - సప్త వింశఓషధుల సేవనము చే పిత్త రోగము నశించును. 6, 7, 8, 15, ఓషధుల సేవనముచే కఫదోషము నివర్తించును. 84, 85 86 కోషములందలి ఓషధులను ధరించుటచే వశీకరణము సిద్ధించును. గ్రహబాధ, భూతబాధ మొదలు నిగ్రహము వరకును గల అన్ని బాధలు తొలగును 1, 2, 4, 6, 7, 8, 9, 11వ ఓషధులను, 22, 15, 12వ ఓషధులను ధరించినచో పై ఫలము లభించును. సందేహంచ పని లేదు. 36 కోష్టములలో చెప్పిన ఈ ఓషధుల విషయమును ప్రతివానికిని చేప్పగూడదు.

అగ్ని మహాపూణమునందు యుద్ధజ యార్ణవమున షట్త్రింశత్పదకమను నూటనలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.