ఆగ్ని రువాచః
శబ్దార్థయోరలంకారో ద్వావలంకురుతే నమమ్ ।
ఏకత్రనిహితో హారః స్తనం గ్రీవామివస్త్రియాః.
ప్రశస్తిః కాన్తిరౌచిత్యం సంక్షేపోయావదర్థతా ।
అభివ్యక్తి రితివ్యక్తం షడ్ భేదా స్తస్య జాగ్రతి.
ప్రశ స్తిః పరవన్మర్మ ద్రవీకరణ కర్మణః ।
వాచోయు క్తిర్ధ్విధాసాచ ప్రేమో క్తిస్తుతి భేదతః.
ప్రేమో క్తిస్తుతి పర్యాయౌ ప్రియో క్తిర్గుణకీర్తనే ।
కాంతిః సర్వమనోరుచ్య వాచ్యవాచక సంగతిః.
యథావస్తు తథారీతిర్య థావృత్తి స్తథారసః ।
ఊర్జస్విమృదు సందర్భా దౌచిత్య ముపజాయతే.
సంక్షేపో వాచకైరల్పైర్బ హోరర్థస్య సంగ్రహః ।
అన్యూనాధిక తా శబ్దవస్తు నోర్యావదర్థతా.
ప్రకటత్వ మభివ్య క్తిః శ్రుతిరాక్షేప ఇత్యపి ।
తస్యాభేదే శ్రుతి స్తత్ర శబ్దం స్వార్థ సమర్పణమ్.
భవేన్నై మిత్తికి పారిభాషికీ ద్విచి ధైవసా ।
సంకేతః పరిభాషేతి తతః స్యాత్పరిభాషికీ.
ముఖ్యౌపచారికీ చేతి సాచసాచద్విధా ద్విదా ।
స్వాభిదేయస్ఖల ద్వృత్తిరముఖార్థస్య వాచకః.
యయాశబ్ధో నిమిత్తేన కేనచిత్సౌ పచారికి ।
సాచలాక్షణికీ గౌణిలక్షణా గుణయోగతః.
ఆభిధేయా వినాభూతా ప్రతీతిర్లక్షణోచ్యతే ।
అభిధేయేన సంబంధాత్సామీ ప్యాత్సమవాయతః.
వై పరిత్యా త్క్రియాయోగాల్లక్షణా పంచదామతా ।
గౌణీ గుణానామానంత్యా దనన్తా తద్వివక్షయా.
అన్యధర్మస్తతోఽన్యత్ర లోక సీమానురోధినా ।
సమ్యగాధీయతే యత్ర ససమాధి రిహస్మృ తః.
శృతేరలభ్యమానోఽర్థోయస్మాద్భాతి సచేతనః ।
స ఆక్షేపోధ్వనిః స్యాచ్చద్వనినా వ్యజ్యతే యతః.
శబ్ధేనార్థేన యత్రార్థః కృత్వా స్వయముపార్జనమ్ ।
ప్రతి షేధ ఇవేష్టస్యయో విశేషోఽభి ధిత్సయా.
తమాక్షేపం బ్రువ న్త్వత్రస్తుతం స్తోత్రమిదం పునః ।
అధికారా ద పేతస్య వస్తునోఽన్య స్య యాస్తుతిః.
యత్రోక్తం గమ్యతే నార్త స్తత్సమాన విశేషణమ్ ।
సాసమాసో క్తి రుదితా సంక్ష్మేపార్థతయాబుధైః .
అపహ్నుతి రపహ్నుత్య కించిదన్యార్థ సూచనమ్ ।
పర్యాయోక్తం యద న్యేన ప్రకారేణాభి ధీయతే.
ఏషా మేక తమస్యేవ సమాఖ్యా ధ్వనిరిత్యతః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే శబ్దార్థాలంకార నిరూపణంనామ పంచచత్వారింశదధిక
త్రిశతత మోఽధ్యాయః.
అగ్ని దేవుడు పలికెను. శబ్దాలంకారము ఒక చోట వుంచి హారము స్త్రీ యొక్క స్తనమును కంఠమును కూడ అలంకరించినట్లు శబ్దార్థములు రెండింటిని అలంకరించును. ప్రశస్తి కాంతి ఔచిత్యము సంక్షేపము, యావ దర్థత, అభి వ్యక్తి అని ఇది ఆరు విధములు. ఇతరుల మర్మమును ద్రవింప చేయునట్లు వుండు వాక్కౌశలము ప్రశస్తి. ప్రేమో క్తి స్తుతి అని ఇది రెండు విధముణ. వీటికే ప్రియో క్తి గుణ కీర్తవము అని నామాంతరములు. వాచ్య వాచకము చక్కగా కలిసి యుండుట కాంతి. ఓజో మాధుర్య యుక్త రచన లందు వస్తురీతి వృత్త్యనుసారముగా రసప్రయోగము కలుగునపుడు ఔచిత్యముండును. తక్కువ శబ్దములతో ఎక్కువ అర్థము చెప్పుట సంక్షేపము. శబ్దార్థముల ఆన్యూనానధికముగా వున్నచో దవదగ్ధత అని పేరు. ఆర్థ పాకఠ్యమునకు ఆభివ్యక్తి యని పేరు. శృతి ఆ క్షేపమా అని అది రెండు విధములు. శబ్ద ముచే ఆర్థ మును ప్రత్యక్షముగ బోధించుట శృతి. ఆది నైమిత్తిక ము పారిభాషికము అని రెండు విధము. పరిభాష యనగా సంకేతము గలది పారిభాషికీ. పారిభాషికికి ముఖ్య యనియు, నైమిత్తికికి ఔపచారికము అని పేరు. ఔప చారికము రెండు విధములు. అభిధేయార్థము చెప్పజాలని శబ్దము ఏదైన ఒక నిమి త్తముచే అముఖ్య మగు అర్థమును బోధించినచో ఆది ఔపచారికవృత్తి. నైమిత్తికమునందును కూడ ఈ భేదము లుండును. ఆది లక్షణాయోగముచే లాక్షణికి యనియు గుణ యోగముచే గౌణి యనియు చెప్పబడును. ఎచట అభిధీయార్థముతో సంబద్ధ మగు అన్యార్థము ప్రతీతమగునో అచ్చట లక్షణావృత్తి, అభిధేయముతో సంబంధము సామీప్యము, సమవాయము వైపరీత్యము క్రియా యోగము వీటిచే లక్షణా ఐదు విధములు. అనంతములగు గుణముల వివక్షనుబట్టి గౌడీ వృత్తి యందు కూడ అనంత భేదము లుండును. లోక వ్యవహారజు డగు కవి ప్రస్తుత వస్తువు పై అప్రస్తుత వస్తు ధర్మములను పూర్తిగా ఆరోపించినచో దానికి సమాధి యని పేరు. శ్రవణ మాత్రముచే తెలియని అర్థము బుద్ధి గోచరమైనచో అది ఆ వేషము. ఇది ధ్వనిచే వ్యజింప చేయబడును కాన ధ్వని యని పేరు. ధ్వని సంబంధముచే శబ్దార్థములు మరియొక అర్థమును వ్యంజింప చేయును. ఒక వస్తువు యందు ఉత్కర్షను సూచించుటకు చేయు నిషేధమునకు ఆ పము యని పేరు. అప్రకృత వస్తువును స్తుతించుట, ఆస్తుత స్తోత్రము ఒక వస్తు వును వర్ణించునపుడు సమాన విశేషణములు గల మరియొక అర్థము ప్రతీతమైనచో దీనిని ఆర్థ సంక్షేపమును బట్టి సమాసోక్తి అని అందురు. వాస్తవిక పదార్థములు కప్పిపుచ్చి అన్య పదార్థమును సూచించుట అపహ్నుతి. ఒక విషయమును ఋజువగా చెప్పక మరియొక విధముగా త్రిప్పి చెప్పుట పర్యాయోక్తి. వీటిలో ఒకటి ధ్వని యని చెప్పబడును.
ఆగ్ని మహా పురాణమనే శబ్దార్థాలంకార నిరూపణ మను మూడు వందల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 346 of the Agni Mahā Purana is as follows:
The qualities (guṇas) that enhance the power of kāvya are enumerated in three groups. The śabdaguṇas (qualities of the sound-body) include mādhurya (sweetness), ojas (force), and prasāda (clarity). The six arthaguṇas (qualities of the meaning-body) are mādhurya, saṃvidhāna (arrangement), komalalatā (delicate grace), udāra (nobility), prauḍha (maturity), and sāmaikatā (harmonious unity). The six ubhayaguṇas — qualities that enhance both sound and meaning simultaneously — are prasāda, saubhāgya (charm), yathāsaṅkhya (parallelism), praśastatā (elegance), pāka (ripeness of expression), and rāga (emotional coloring). Together the eighteen guṇas constitute the positive attributes that distinguish great poetry from merely competent versification.