అగ్ని మహా పురాణము

3 - అథ కూర్మావతార వర్ణనమ్.

అగ్ని రువాచః-

వక్ష్యే కూర్మావతారం చ సంతుతం పాపనాశనమ్

 పురా దేవాసురే యుద్దే దైత్యైర్దేవాః పరాజితాః. 

దుర్వాససశ్చ నా పేన నిశ్రీకాశ్చభవం స్తదా

స్తుత్వా తీరాబ్దిగం విష్ణుమూచు పాలయ చాసురాత్.

అగ్ని పలికెను: పాపములను తొలగించు కూర్మావతారమునుగూర్చి మొదట నేను ప్రతిజ్ఞ చేసినవిధమున చెప్పెదను. పూర్వము దేవాసుర యుద్దములో దేవతలు దూర్వాసుని శాపము చే దైత్యుల చేతిలో ఓడిపోయిరి. అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీరహితులై పోయిరి. క్షీరాబ్ది పై ఉన్న విష్ణువును స్తుతించి “మమ్ము లను అసురులనుండి రక్షింపుము” అని వేడికొనిరి.

బ్రహ్మాదికాన్ హరిః ప్రాహ నందిం కుర్వన్తు చాసురైః

 క్షీరాబ్ధమథనార్థం హి అమృతార్థం యే సురాః. 

ఆరయోపిహి సంధేయాః సతి కార్యార్థగౌరవే

యుష్మానమృతభాజో హి కరిష్యామి న దానవాన్.

  మన్దనం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్

క్షీరాబ్ధిం మత్సహాయేన నిర్మథధ్వమతంద్రింతాః.

శ్రీమహావిష్ణువు బ్రహ్మాది దేవతలతో ఇట్లనెను: “సురలారా! క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించు టకే అసురులతో సంధి చేసికొనుడు. పని వడి నపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా ! అమృతము మీకే తక్కునట్లును, దానవులకు తకకుండు నట్లును చేసెదను. మందర పర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సాహాయ్యముతో క్షీరాబ్దిని మథింపుడు. మాంద్యము వలదు.

 విష్ణూక్తాః సంవిదం కృత్వా దైత్యైః క్షీరాబ్దిమాగతాః

తతో మథితుమారబ్దా యతః పుచ్ఛం తతః సురాః.

విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యులతో ఒప్పందము చేసికొని క్షీరాబ్దికి వచ్చి, మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి .

ఫణినిశ్శ్వాసస నప్తా హరిణాప్యాయితాః సురాః

 మధ్యమానేర్జవే సోద్రిర నాధారో హ్యపోవిశత్. 

            సర్పము విడచు నిట్టూర్పుల వేడికి బాధపడుచున్న దేవతలను హరి. సేదదీర్చెను. సముద్రమును మథించు చుండగా ఆ పర్వతము క్రింద ఆధార మేదియు లేకపోవుటచే నీటిలో మునిగిపోయెను.

కూర్మరూపం సమాస్థాయ దధే విష్ణుశ్చ మన్దరమ్

 క్షీరాభైర్మథ్యమానాచ్చ విషం హాలాహలం హ్యభూత్.

విష్ణువు కూర్మరూపమును ధరించి మందరపర్వతమును నిలబెట్టెను. మథింపబడుచున్న క్షీరాబ్దినుండి హాలాహల విషము పుట్టెను.

 హరేణ ధారితం కణే నీలకణ్ఠస్తతోభవత్

తతో భూదారుణీ దేవీ పారిజాతస్తు కౌస్తుభ, 

గావశ్చాపుర సో దివ్యా లక్ష్మీర్దేవీ హరిం గతా

వశ్యన్తః సర్వదేవాస్తాం స్తువన్తః నశ్రియోభవన్.

            శివుడు ఆ విషమును కంఠమునందు ధరిం చెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీదేవియు (సురయు), పారిజాతము కౌస్తుభము, గోవులు, దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతు లైరి.

తతో ధన్వన్తరిర్విష్ణురాయు ర్వేదప్రవర్తకః

బిభ్రతమణ్డలుం పూర్ణ మమృతేన సముత్థితః.

పిమ్మట ఆయుర్వేదమును ప్రచారములోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృతపూర్ణ మగు కమండలువును చేత ధరించి ఆవిర్భవించెను.

ఆమృతం తత్కరాధైత్యాః సురేభ్యోర్ధం ప్రదాయ చ

 గృహీత్వా జగ్ముర్ణమృద్యా విష్ణుః స్త్రీరూపధృక్తతః,

జంతుడు మొదలగు దైత్యులు ఆతని చేతినుండి అమృతమును గ్రహించి,  సగము దేవతల కిచ్చి, వెళ్లి పోయిరి. పిమ్మట విష్ణువు శ్రీరూపమును ధరించెను.

తాం దృష్ట్వా రూపసంపన్నాం దైత్యాః ప్రోచుర్విమోహితాః

భవ భార్యామృతం గృహ్య పాయసాన్వరాననే.

మంచి సౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చేది, “ఓ వరాననా ! మాకు భార్యవు కమ్ము; ఈ అమృతమును తీసికొని మాకు త్రాగించుము ) వంచి పెట్టుము” అని పలికిరి.

 తథోత్యుక్త్వా హరి స్తేభ్యో గృహీత్వా పాయయత్సురాన్

 చంద్రరూపధరో రాహుః పిబంశ్చార్కేన్దునార్పిత.

అట్లే అని పలికి హరి వారి చేతినుండి అమృతమును గ్రహించి దేవతలచే త్రాగించెను, రాహువు చంద్రరూపమును ధరించి అమృతము త్రాగుచుండగా సూర్యచంద్రులాతనిని పట్టి చూపిరి.

హరిణాప్యరిణా చ్ఛిన్నం తదా రాహోః శిరః పృథక్

 కృపయామరతాం నీతం వరదం హరిమబ్రవీత్.

 రాహుర్మతస్తు చంద్రర్కౌ ప్రా ప్యేఽతే గ్రహణం గ్రహః

తస్మిన్ కాలే తు యద్దానం దాస్య నే స్యాత్తదక్షయమ్.

ఆప్పుడు విష్ణువు రాహుశిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చే నేను, రాహువు వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను : “చంద్రసూర్యులు నాచే పట్టుబడుచుందురు. అది గ్రహణ మగును. ఆ కాలమునందు ఇచ్చు దానము అక్షయ మగుగాక”.

తథోత్యాహాథ శం విష్ణుస్తతః సర్వైః సహామరైః

స్త్రీరూపం సంపరిత్యజ్య హరేణోక్తః ప్రదర్శయ.

“అటులనే అగుగాక అని విష్ణువు అతనితో పలికెను. పిమ్మట రూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు “ఆ స్త్రీ రూపమును చూపుము” ఆని హరితో అనెను.

దర్శయామాస రుద్రాయ స్త్రీరూపం భగవాన్ హరిః

 మాయయా మోహితః శమ్భుర్గౌరీం త్యక్త్వా స్త్రీయం గతః.

భగవంతుడైన శ్రీమహావిష్ణువు రుద్రునకు శ్రీ రూపముమ చూ పెను, శివుడు విష్ణుమాయచే మోహితుడై పార్వతిని విడచి ఆస్త్రీని వెంబడించెను.

నగ్న ఉన్మత్తరూపోభూత్ స్త్రియః కేశానధారయత్

 అగాద్విముచ్య కేశాన్ స్త్రి అన్వధావచ్చ తాం గతామ్.

             శివుడు ఉన్మత్తుడై, దిగంబరు డై ఆమె కేశపాశమును పట్టుకొనెను. ఆమె జుట్టు విడిపించుకొని వెళ్లి పోయెను ఇతడు ఆమె వెంట పరుగేత్తెను.

 స్థలితం యత్ర వీర్యం కో యత్ర యత్ర హరస్య హి

తత్ర తత్రాభవత్ చేత్రం లిజ్గానాం కనక స్య చ.

ఈశ్వరుని వీర్యము సలితమై భూమి పై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.

మాయేయమితి తాం జ్ఞాత్వా స్వరూపస్థోభవద్ధరః

 శివమాహ హరీ రుద్రజితా మాయా త్వయా హి మే.

 న జేతు మేనాం శక్తో మే త్వదృతే ఒన్యః పుమాన్ భువి

ఇది యంతయు మాయ యని గ్రహించి శివుడు స్వస్థచిత్తు డాయెను. ఆపుడు విష్ణువు శివునితో ఇట్లనెను : “రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈ లోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింపజాలరు.”

 ఆప్రాప్యాథామృతం దైత్యా దేవై ర్యుద్దే నిపాతితాః.

త్రిదివస్థాః సురాశ్చానన్ దై ల్యాః పాతాలవాసినః

 యో నరః పఠతే దేవవిజయం త్రిదివం వ్రజేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కూర్మావతారోనామ తృతీయోధ్యాయః.

అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్దములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతాళలోక నివాసు లయిరి. ఈ దేవి విజయకథను పఠించువాడు స్వర్గమును పొందును

ఆగ్నేయ మహా పురాణములో కూర్మావతార మనెడు తృతీయాధ్యాయము నమాప్తము.