అగ్ని మహా పురాణము

282 - అథ వృక్షాయుర్వేదః

ధన్వంతరిరువాచః

వృక్షాయుర్వేద మాఖ్యా స్యే ప్లక్షశ్చోత్తరతః శుభః

 ప్రాగ్వటోయామ్యతస్త్వామ్ర ఆ ప్యేఽశ్వత్థః క్రమేణతు.

దక్షీణాం దిశ ముత్పన్నాః సమీ పే కంటకద్రుమాః

 ఉద్యానం గృహవాసే స్యాత్తిలాన్వాప్యథ పుష్పితాన్.

గృహ్ణీయాదోప యేద్వృక్షాన్ద్విజం చంద్రం ప్రపూజ్యచ

 ధ్రువాణీ పంచవాయవ్యం హస్తప్రాజేశ వైష్ణవమ్.

నక్షత్రాణి తథామూలం శస్యన్తే ద్రుమరోపణే

 ప్రవేశ యేన్న దీవాహాన్పుష్కరిణ్యాంతు కారయేత్.

హస్తోమఘాతథా మైత్రమాద్యం పుష్పం నివాసవమ్

జలాశయ సమారంభే వారుణం చోత్తరాత్రయమ్.

సంపూజ్యవరణం విష్ణుం పర్జన్యం తత్సమాచరేత్

అరిష్టాశోకపున్నాగ శిరీషాః సప్రియంగవః.

అశోకః కదలీజంబూ స్తథా బకుల దాడిమాః

 సాయం ప్రాతస్తు మర్మర్తౌ శీతకాలే దినాంతరే.

వర్షారాత్రౌ భువః శోషే సే క్తవ్యా రోపితా ద్రుమాః

ఉత్తమా వింశతి ర్హస్తామధ్యమాః షోడశాంతరాః .

స్థానాత్స్థానాంతరం కార్యం వృక్షాణాం ద్వాదశావరమ్

 విఫలాః స్యు ర్ఘనా వృక్షాః శస్త్రే ణాదౌ హిశోధనమ్.

విడంగఘృత పంకాక్తాన్సేచయే చ్ఛీతవారిణా

ఫలనాశే కుల త్థైశ్చ మా షైర్ముద్గైర్య వై స్తిలైః.

ఘృతశీతపయు సేక ఫలపుష్పాయ సర్వదా

 ఆవికాజశ కృచ్చూర్ణం యవ చూర్ణం తిలానిచ.

 గోమాంస ముదకం చైవ సప్తరాత్రం నిధాపయేత్

ఉత్సేకః సర్వవృక్షాణాం ఫలపుష్పాది వృద్దిదః.

మత్స్యాంభసాతు నే కేన వృద్ధిర్భవతి శాఖినః

 విడంగ తండులో పేతం మాత్స్యంమాం సంపాదోహదమ్..

సర్వేషామవి శేషేణ వృక్షాణాం రోగమర్దనమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వృక్షాయుర్వేద కథనం నామ ద్వ్యశీత్యధిక శతతమోఽధ్యాయః.

ధన్వంతరి పలికెను : ఇవుడు , వృక్షాయుర్వేదమును చెప్పెదను, ఇంటికి ఉత్తరమున ప్లక్షము, తూర్పున వటము, దక్షిణమున ఆమ్లము, పశ్చిమమున అశ్వత్థ వృక్షము మంగళకరములు. ఇంటికి దక్షిణమున మొలిచిన ముండ్ల చెట్లుకూడ మంచివి. ఇంటికి దగ్గరగ ఉద్యానవనమును నిర్మించుకొనవలెను. లేదా ఆన్ని వైపుల అందమైన పుష్పిత తిల వృక్షములు పెంచవలెను. బ్రాహ్మణుని చంద్రుని పూజించి వృక్షములు నాటవలెను. చెట్లునాటుటకు ఉత్తరాన క్షత్రములు మూడును స్వాతిహస్త, రోహిణి, శ్రవణ. మూల ప్రశస్త నక్షత్రములు ఉద్యానములో సుష్కరిణి నిర్మించి దాని లోనికి నదీప్రవాహము వచ్చునట్లు ఏర్పరచవలెను. జలాశయారంభమునకు హస్త, మఖ ఆను రాధ పుష్య జ్యేష్ఠా నక్షత్రములు మూడు ఉత్తరా నక్షత్రములు మంచివి. వరుణుని, విష్ణువును, పర్జన్యుని పూజించి ఈ పని ప్రారంభించవలేను. అరిష్ట అశోక, పున్నాగ, శిరీష, ప్రియంగు, కదళీ, జంబు, వకుల, దాడిమ వృక్షములను నాటి గ్రీష్మ ఋతువునందు దినమునకు ఒకపర్యాయము వర్ష ఋతువు నందు రాత్రియందును భూమి ఎండి పోయినచో నీళ్లు పోయవలెను. చెట్టుకును చెట్టుకును నడుమ ఇరువది హస్తముల ఆంతరము ఉత్తమము, పరునారు హస్తముల ఆంతరము మధ్యమము. పండ్రెండు హస్తముల ఆంతరము అధమము. పండ్రెండు హస్తముల అంతరముగల చెట్లను తీసి వేరొక చోట పాతవలెను. దగ్గర దగ్గరగా వున్న చెట్లు ఫలముల నివ్వవు. ముందుగ వాటిని తగు విధముగా ఖండించి శోధనము చేయవలయును. విడంగ, మృత, పంకములు కలిపిన శీతలజలము వాటికి పోయవలెను. వృక్షముల పండ్లు నశించునపుడు కుళుత, మామ, ముద్దయవ, తిలలు కలిపిన మృత మిశ్రమములో శీతల జలమును పోసివచో అవి సర్వదా ఫలపుష్పముల నిచ్చును. మేకల గొట్టెల ఎరువు యవ చూర్ణము తిలలు వీటిని తడిపి ఏడుదినములు ఒకచోటవుంచి పిదప దీనిని వృక్షములకు వేసినచో ఫలపుష్ప వృద్ధి కలుగును. మత్స్య ములున్న నీరుపోసినచో వృక్షములు వృద్ధి చెందును. విడంగ తండులములతో మత్స్యమాంసమును కలిపి వేసినచో అది అన్ని వృక్షములకును దోహదమగును. వాటి రోగములను తొలగించును.

అగ్ని మహాపురాణమున వృక్షాయుర్వేద కథనమను రెండువందలయెనుబది రెండవ అధ్యాయము సమాప్తము.