అగ్ని మహా పురాణము

375 - అథ ధారణా

ఆగ్ని రువాచః

ధారణా మనసో ధ్యేయే సంస్థితిర్ధ్యాన వద్ద్విదా

మూర్తి మూర్త హరిద్యానమనో ధారణతో హరిః.

యద్భాహ్యావ స్థితం లక్ష్యం తస్మాన్న చలతేమనః

లావత్కాలం ప్రదేశేష ధారణా మనసిస్థితిః.

కాలావధి పరిచ్చిన్నం దేహే సంస్థాపితం మనః

నప్రచ్యవతి యల్లక్ష్యాద్దారణా సాభిధీయతే.

ధారణా ద్వాదశా యామాధ్యానం ద్వాదశ ధారణాః

ధ్యానం ద్వాదశకం యావత్సమాధిరభి ధీయతే.

ధారణాభ్యాస యుక్తాత్మా యదిప్రాణై ర్వి ముచ్యతే

కులైక వింశముత్తార్య స్వర్యాతి పరమం పదమ్.

యస్మిన్యస్మిన్భవేదంగే యోగినాం వ్వాధిసంభవః

తత్తదంగం ధియా వ్యాప్తం ధారయేత్తత్త్వ ధారణమ్.

ఆగ్నే యీ వారుణీ చైవ ఐశానీ చామృతాత్మికా

సాగ్నిః శిఖాపడం తాచ విష్ణోః కార్యాద్విజోత్తమ.

నాడీభిర్వికటం దివ్యం శూలాగ్రం వేద యేచ్చుభమ్

 పాదాంగుష్ఠాత్క పాలాన్తం రశ్మిమండల మావృతమ్.

తిర్యక్ చారోర్ధ్వ భాగేభ్యః ప్రయాన్త్యోఽతీవతేజసా

చింత యేత్సాధ కేంద్రస్తం యావత్సర్వం మహా మునే.

భస్మీభూతం శరీరం స్వంతత శ్చైవోప సంహరేత్

శీత శ్లేష్మాద యః పాపం వినశ్యంతి ద్విజాతయః.  

ఆగ్ని దేవుడు పలికెను. ధ్యేయము పై మనస్సును నిలుపుడు. ధారణ ధ్యానమువలె ఇది కూడ సాకారము నిరాకారము అని రెండు విధములు. భగవంతుని పై మనస్సు నిలుపుడు, క్రమముగా మూర్తధారణ, అమూర్త ధారణ అని చెప్పబడును. దీని వలన భగవత్ప్రాప్తి కలుగును. బాహ్య లక్షము పై మనస్సు కదలకుండా ఎంత కాలము నిలచునో అట్టి స్థితికి ధారణ అని పేరు. దేహములో పల కూడ నియత సమయము వరకు మనస్సుమ లక్షముపై నిలిపి వుంచుట కూడ ధారణ అని పేరు. పండ్రెండు ఆయామములు కల ధారణ వుండును. పండ్రెండు ధారణములు ధ్యానమగును. పండ్రెండు ధ్యావముల పాటు మనస్సు ఏకాగ్రమైనచో దానికి సమాధి యని పేరు. ధారణా భ్యాససమయమున ప్రాణములు విడుచువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి పరమ పదమగు స్వర్గమును పొందును. యేయే ఆంగమునందు వ్యాధి కలుగునో ఆ అంగమును బుడ్డిచే వ్యాప్తము చేసి తత్త్వమున ధారణ చేయవలెను, ఆగ్నేయావారుణి ఐ), అమృతాత్మికా ఆను విష్ణువు యొక్క నాలుగు విధముల ధారణ చేయవలెను. ఆ సమయమున ఆగ్ని యుక్త శిఖా మంత్రమునకు వట్ చేర్చి జపము చేయవలెను. నాడుల ద్వారా వికటము. దివ్యము శుభము అగు తూలాగ్రమును వేధ చేయవలెను. పాదాంగుష్ఠము మొదలు కపోలము వరకు కిరణసముదాయము వ్యాప్తమై వున్నది. అది మహావేగమతో క్రింది మండి పైకి, పైనుండి క్రిందికి తిరుగుచున్నట్లు భావన చేయవలెను. సాధకుడు తన శరీరము పూర్తిగా, లోపల భస్మమయినట్లు కనబడునంతవరకు రశ్మి మండలమును ధ్యానించవలెను. పిదప ఆధారణను, ఉపసంహరించవలెను. ఈ విధముగా చేయుటచే ద్విజులు శీత శ్లేష్మాది రోగములను తమ పాపములను నశింపచేయుదురు.

శిరోధీరం వాచారంచ కంఠం చాధోముఖేస్మరేత్

ధ్యాయేదచ్చిన్న చిత్తాత్మా భూయోభూతేన చాత్మనా.

స్ఫుర చ్ఛీకర సంస్పర్శ ప్రభూతే హిమగామిభిః

ధారాభిర ఖిలం విశ్వమాపూర్యభువి చిన్తయేత్.

బ్రహ్మరంధ్రాచ్చ సంక్షోభాద్యావదా ధార మండలమ్

సుషుమ్నాం తర్గతో భూత్వా సంపూర్ణేందు కృతాలయమ్.

సంప్లావ్య హిమసంస్పర్శ తోయేనామృత మూర్తినా

క్షుత్పిపాసా క్రమ ప్రాయసంతాప పరిపీడితః.

ధారయేద్దారుణీం మంత్రీతుష్ట్యర్థం నాప్యతంద్రితః

వారుణీ ధారణా ప్రోక్తా ఐశానీందారణాంశృణు.  

పిదప ధైర్యముతో విచారణ చేయుచు ముఖము క్రిందనున్న కంఠమును ధ్యానించవలెను. చిత్తము నష్టము కాకూడదు. తన అంతఃకరణ ద్వారా ధ్యానలగ్నుడై అనంత జల కణములు ఆవిర్భవించి, ఒక దానితో ఒకటి కలసి హిమ రాశిని పుట్టించుచున్నట్లును దానిచే భూమిపై జలధారలు ప్రవహించుచు సకల విశ్వమును ముంచెత్తుచున్నట్లును భావించవలెను. ఈ విధముగ పామస్పర్శచే శీతలమైన అమృత స్వరూప జలముచే బ్రహ్మ రంధ్రము మొదలు మూలాధారము వరకునువున్న చక్ర మండలమున ఆప్లావితము చేసి, సుసుమ్న నాడి మధ్య ఇందు మండలమును ధ్యానించవలెను. ఆకలి దప్పిక లచే క్రమముగా వచ్చిన క్లేశములచే మిక్కిలి పీడితు డై తనతష్టి కొరకే వారుణీ ధారణా చింతన చేసి ఆలస్యము విడచి విష్ణు మంత్ర జపమును చేయవలెను. ఈ విధముగా వారుణీ ధారణ చెప్పబడినది. ఐళాలీ ధారణను చేప్పెదను.

వ్యోమ్ని బ్రహ్మ మయే పద్మేప్రాణాపానే క్షయంగతే

ప్రసాదం చింతయేద్విష్ణార్యా వచ్చిన్తా క్షయంగతా.

మహాభావం జపేత్సర్వం తతోవ్యాపక ఈశ్వరః

అర్దేందుం పరమంశాంతం నిరాభాసం నిరంజనమ్.

ఆసత్యం సత్యమాభాతి తావత్సర్వం చరాచరమ్

యావత్స్వస్పంద రూపన్తు నదృష్టం గురు వక్త్రతః.

దృష్టేతస్మిన్పరే తత్త్వేఆబ్రహ్మ సచరాచరమ్

ప్రమాతృ మానమేయంచ ధ్యానహృత్పద్మ కంపనమ్.

మాతృ మోదకవత్సర్వం జపహోమార్చ నాదికమ్

విష్ణుమంత్రేణ వాకుర్యాదమృతాం ధారణాంవదే.

సంపూర్ణేందు నిభం ధ్యాయేత్కమలం తంత్రిముష్టిగమ్

శిరః స్థం చింతయేద్యత్నాచ్చ శాంకాయుత వర్చసమ్.

సంపూర్ణ మండలంవ్యోమ్ని శివకల్లోల పూర్ణితమ్

తథాహృత్కమలే ధ్యాయేత్త న్మ ధ్యే స్వతనుం స్మరేత్.

సాధకో విగతక్లేశో జాయతే ధారణాదిభిః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ధారణా యోగ నిరూపణం నామ పంచసప్తత్యధిక త్రిశ తత మోఽధ్యాయః.

ప్రాణా పానము క్షయమును పొందగ హృదయాకాశ మున బ్రహ్మమయ పద్మమునందు విష్ణు ప్రసాదమును, చింత వశిఁచు వరకు ధ్యానము చేయవలెను. పిదప వ్యాపకమగు ఈశ్వర రూపములో వుండి శాంతము నిరంజనము, నీరా భాసము, అర్ధ చంద్ర స్వరూపము, అగు సంపూర్ణ మహా భావము యొక్క జపధ్యానములు చేయవలెను. జీవాత్మ బ్రహ్మ స్వరూపుడే అను విషయమును గురు ముఖతః తెలియనంతవరకు ఈ చరాచర జగత్తు, అసత్యమేవను సత్యముగా భాసించుము. ఆ పరతత్వము తెలిసిన పిమ్మట బ్రహ్మ మొదలు, సకల చరాచర జగత్తు ప్రమాత, మానము, మేయము, సర్వము కూడ హృదయ కమలమునందు లీనమై పోవును. జప హోమ పూజనాదులు తల్లి ఇచ్చిన మేదకమల వలె మధురమైనవని తెలిసికొని విష్ణు మంత్రముతో అనుష్టించవలెను. ఇపుడు ఆమృతమయీ ధారణను చెప్పెదమ. శిరస్సు యొక్క నాడి యందు కేంద్రస్థానమున పూర్ణ చంద్ర సమానమగు కనులములను ధ్యానించవలెను. ఆకాశమునందు పదివేల చంద్రులతో సమానమగు ఒక చంద్రమండలము ఉదయించినది. ఆది కల్యాణమయ ముంగు కల్లోలములతో నిండియున్నది అని భావన చేయవలెను. అట్టి భావన తన హృదయ కమలము నందు కూడ చేసి దాని మధ్య భాగమున తన శరీరమున్నట్లు భావించ వలెను. ధారణాదుల ద్వారా సాధకుని శ్లోకములన్నియు నశించును.

అగ్ని మహాపురాణమున ధారణా యోగ నిరూపణమను మూడు వందల డెబ్బదియైదవ ఆధ్యాయము సమాప్తము.