అగ్ని మహా పురాణము

161 - అథ యతిధర్మ నిరూపణమ్

పుష్కర ఉవాచః-

యతిధర్మం ప్రవక్ష్యామి జ్ఞానమోక్షాది దర్శకమ్

 చతుర్థమాయుషో భాగం ప్రాప్య సద్గాత్పరివ్రజేత్.

యదహ్ని విర జేద్దీరస్తదహ్ని చ పరివ్రజేత్

ప్రాజాపత్యం నిరూ ప్యేష్టిం సర్వవేదసదక్షిణామ్.

ఆత్మన్యగ్నీసమారోప్య ప్రవ్రజే ద్బాహ్మణో గృహాత్

ఏక ఏవ చరేన్నిత్యం గ్రామమన్నార్థమాశ్రయేత్ .

ఈ పేక్షకోసచయకో మునిర్ణానసమన్వితః

కపాలం వృక్షమూలం చ కుచై లమసహాయతా.

సమతా చైవ సర్వస్మిన్నే తన్ముక్త స్య లక్షణమ్

నాభిననేత మరణం నాభిననేత జీవనమ్.

కాలమేవ ప్రతీ క్షేత విదేశం భృతకో యథా

దృష్టిపూతం న్య సేత్పాదం వస్త్రపూతం జలం పిబేల్.

సత్యపూతాం వద్ద్వాచం మః పూతం సమాచరేత్

అలాబుదారుపాత్రాణి మృణ్మయం వైణవం యలే.

విధూమే న్యస్త ముసలే వ్యఙారే భుక్త వజ్జనే

వృత్తే శరావసంపాతే భిక్షాం నిత్యం యతిశ్చరేత్.

మధూకరమసంక్లపం ప్రాక్ర్పణీతమయాచితమ్

తాత్కాలికం చోపపన్నం భైక్షం పణ్చా విధం స్మృతమ్.

 పాణిపాత్రీ భవేద్వాపి పాత్రే పాత్రోత్సమాచరేత్

ఆవే క్షేత గతిం నృణాం కర్మదోషసముద్భవామ్.

శుద్దభావశ్చద్దర్మం యత్ర తత్రాగ్ర మే రతః

సమః సర్వేషు భూతేషు నలిజం ధర్మకారణమ్.

 ఫలం కతకవృక్షస్య యద్యవ్యమ్బుప్రసాదకమ్

న నామగ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి.

 అజిహ్మః పబ్ధకః పద్గురన్లో బధిర ఏవ చ

సద్భిశ్చముచ్యతేఒసద్భిరజ్ఞానాత్సంసృతో ద్విజః.

 ఆహ్ని రాత్యాం చ యాన్ జస్తూన్ హీనస్త్వజ్ఞానతో యతిః

తేషాం స్నాత్వా విశుద్ద్యర్థం ప్రాణాయామాన్ షడాచరేల్.

ఆస్థిస్థూణం స్నాయుయుతం మాంసశోణిత లేపనమ్

చర్మావనద్దం దుర్గనపూర్ణం మూతపురీషయోః.

జలాశోకసమావిషం రోగాయతనమాతురమ్

రజస్వలమనిత్యం చ భూతావాసమిమం త్యజేత్.

పుష్కరుడు పలికెను : జ్ఞానమోక్షాది ప్రదర్శక మగు యతిధర్మమును చెప్పెదను. ఆయుర్దాయములోని నాల్గవభాగములోనికి రాగానే సంన్యసించవలెను. ధీరుడు ఏ రోజున వైరాగ్యము కలుగునో ఆ రోజునే సంన్యసించ వలెను. సర్వవేద సదక్షిణ మగు ప్రాజాపత్యేష్టి నిర్వర్తించి, ఆ్నులను తనలోనే ఆరోపించుకొని బ్రాహ్మణుడు గృహమునుండి నిష్క్రమించవలెను. ఒంటరిగానే సంచరించవలెను. అన్న ముకొరకు మాత్రమే గ్రామములోనికి ప్రవేశించవలెను. సంన్యాసి ఏది వచ్చినను ఉపేక్షాబుద్ధితో చూచుచు, ధనాదికమును కూడ బెట్టక, జ్ఞానసమన్వితుడై ఉండవలెను. చేత కపాలము, వృక్షమూలనివాసము, మాసిన వస్త్రము, ఏకాకిత్వము, సర్వసమదృష్టి ఇవి ముక్తుని లక్షణములు. మరణమును ఆభినందించ గూడదు. జీవనమును గూడ అభినందించగూడదు. భృత్యుడు ప్రఖ్వాజ్ఞకై ఎదురు చూచుచున్నట్లు కాలమునకై ఎదురు చూచుచుచుండవలెను. క్రింద చూచుకొని అడుగు పెట్టవలెను. వస్త్రముతో వడబోసిన నీరు త్రాగ వలెను. సత్యముచే పవిత్ర మైన మాటలే పలకవలెను. మనస్సుచేత పవిత్ర మైనదానిని ఆచరించవలేను. ఆనపకాయ బుర్ర, దారపాత్ర, మట్టి పాత్ర, వెదురు పాత్ర-ఇవి సంన్యాసికి విధింపబడినవి. యతీశ్వరుడు ఎల్లపుడును గ్రామములోని ఇండ్లలో ధూమము శాంతించిన పిమ్మటను, రోకళ్ళు ఆగిపోయినపుడును, నిప్పులు ఆర్పివేయబడిన పిమ్మటను, జను లందరును భోజనము చేసిన పిమ్మటను పాత్రలు కడిగివేసిన పిమ్మటను భిక్షకు బైలుదేర వలెను. మాధుకరము (అనేక గృహము నుండి కొంచెము కొంచెము సంగ్రహింపబడినది), ఆసక్ల ప్తము ముందుగా ఆనుకొని తయారు చేయబడనిది), ప్రాక్రృణీతము (ముందుగా తయారుచేయబడినది). అయాచితము, తాత్కాలికోపపన్నము (అప్పటి కప్పుడు లభించినది) అని బైక్షము ఐదు విధములు. హస్తములే పాత్రగా ఉపయోగించవలెను. లేదా మరి యొక పాత్ర నుండి హస్తపాత్రలోనికి తీసికొనవలెను. కర్మదోషముల వలన ప్రాణులు ఏ ఏ విధముల బాధపడుతున్నారో గమనించవలెను. ఏ ఆశ్రమములో నున్నను మానవుడు పరిశుద్ధ చిత్తముతో ధర్మాచరణము చేయవలెను; అన్ని భూతములందును సమదృష్టి చూపవలెను. అంతియే కాని ఆశ్రమలింగములను ధరించినంత మాత్రమున ప్రయోజనము లేదు. కతక వృక్షఫలము (ఇందుపకాయ) నీటిలోని బురదను తొలగించి దానిని నిర్మలము చేయు నను మాట నిజమే; కాని దాని పేరు చెప్పినంతమాత్రమున నీరు ప్రసన్న ముకాదు కదా ? అజ్ఞానవశముచే సంసారములో చిక్కుకొనిన ద్విజుడు కుంటివా డైనను, గ్రుడ్డివా డై నను, చెవిటివా డైనను, కుటిలత్వము లేని సంన్యాసి యెపచో సత్కర్మల నుండియు, అసత్కర్మల నుండియు విముక్తు డగును. సన్యాసి పగ టియందును, రాత్రియందును తనచే చంపబడిన ప్రాణ0 ల విశుద్ధికె స్నానము చేసి ఆరు ప్రాణాయామములు చేయవలెను. ఎముక లనేడు స్తంభములు గలదియు, నాడులతో కూడినదియు, మాంసశోణితములచే పూయబడినదియు, చర్మముచే కప్పబడినదియు, మూత్రపురీషదుర్గంధముతో నిండినది యు, జలాశోక ములతో కూడినదియు, ఆనిత్యముమ, జీవునికి నివాసమును ఆగు ఈ శరీరమును త్యజించవలెను.

ధృతిః క్షమా దమో నేయం శౌచ మింద్రియని గ్రహః

 ప్రీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్.

చతుర్విధా భిక్షవస్తు కుటీచక బహూదకౌ

హంసః పరమహంసశ్చ యో యః పశ్చాత్స ఉత్తమః.

ఏక దణ్ణి త్రిదళ్లీ వా యోగీ ముచ్యత బన్ధనాత్

అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహొ.

యమాః పశ్చాథ నియమాః శౌచం సంతోషణం తపః

స్వాధ్యాయేశ్వరపూజా చ పద్మ కాద్యాసనం యతే.

ప్రాణాయామస్తు ద్వివిధః సగర్భోగర్భ ఏవ చ

జపధ్యానయుతో గర్భో విపరీత స్వగర్భకః.

ప్రత్యేకం త్రివిధః సోఽపి పూరకుమ్భక రేచకైః

పూరణాత్పూరకో వాయోర్నిశ్చలత్వాచ్చ కుమ్బక .

రేచనాద్రేచకః ప్రోక్తో మాత్రాభేదేన చ త్రిధా

ద్వాదశాత్తు చతుర్వింశః షడ్రింక న్మా త్రికోవరః.

తాలో లఘ్వక్షరో మాత్రా ప్రణవాది చరేచ్ఛనై

ప్రత్యాహారో జాపకానాం ధ్యానమీశ్వరచి స్తనమ్.

మనోధృతిర్ధారణా స్యాత్సమాధిర్ర్బహ్మణి స్థితికి

అయమాత్మా పరం బ్రహ్మ సత్యం జ్ఞానమన స్తకమ్.

విజ్ఞానమానన్దం బ్రహ్మ తత్వమస్యహమస్మి తత్

పరం బ్రహ్మ జ్యోతిరాత్మా వామదేవో విముక్త ఓమ్.

 దే హేస్ట్రియమనోబుద్ధి ప్రాణాహజొర వర్ణితమ్

 జాగ్రత్స్వప్న సుషుప్త్యాదిముక్తం బ్రహ్మ తురీయకమ్. నిత్యశుద్ధబుద్దముక్తసత్యమానన్దమద్వయమ్

అహం బ్రహ్మ పరం జ్యోతిరక్షరం సర్వగం హరి.

యోసావాదిత్యపురుషః సోహమఖ ఓమ్

సర్వారమ్భపరిత్యాగీ సమదుఃఖసుఖః శమీ.

భావశుద్దశ్చ బహ్మాజ్ఞం భిత్త్వా బ్రహ్మ భవేన్నరః

ఆషాఢ్యం పౌర్ణమాస్యాం చ చాతుర్మాస్యవ్రతం చరేత్.

తతో వ్రజేన్నవమ్యాదౌ హృతుసనిషు వాపయేత్

ప్రాయశ్చిత్తం యతీనాం చ ధ్యానం వాయుయమ నథా.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే యతిధర్మనిరూపణం నామైకషష్ట్యధిక శతతమోధ్యాయః.

స్థ్యైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, పరధనాపహారము చేయకుండుట, ఇంద్రియనిగ్రహము సిగ్గు, జ్ఞానము సత్యము అక్రోధము ఈ పదియు ధర్మలక్షణములు, కుటీచకుడు, బహూచకుడు, హంస, పరమహంస అని సన్న్యాసులు వాలుగు విధములు. వీరిలో ఉత్తరోత్తరుడు ఉత్తముడు. ఏకదండి యైనను, త్రిదండి యైనను యోగి బంధనములనుండి విముక్తుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, ఆపరిగ్రహమం, ఈ ఐదును యమములు. శౌచము సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరపూజ ఇవి నియమములు. సంన్యాసికి పద్మాసనాదులు ఏహితములు. సగర్భము, అగర్భము అని ప్రాణాయామము రెండు విధములు, జపధ్యానాదులు కలిసినది సగర్బము. మరల ఆ రెండును ఒక్కొక్కటి పూరకము, కుంభకము, రేచకము అని మూడేసి విధములు. వాయువు- నింపుట పూరకము; బంధిం చినచో కుంభకము. విడచుటచే రేచకము. ప్రాణాయామము- ద్వాదశ మాత్రాకము, చతుర్వింశన్మాత్రాకము అని మరల మూడేసి విధములు. తాళము, లేదా లమ్వక్షరము ఒక మాత్ర. ప్రాణయామసమయమున ఓం కారాదులను మెల్లగా జపించవలెను. ఇంద్రియసంయమము ప్రత్యాహారము. జపము చేయు సాధకులు ఈశ్వరుని స్మరించుట ధ్యానము. మనస్సును స్థిరముగా నిలుపుట ధారణ. బ్రహ్మయందు స్థితి సమాధి. ఈ ఆత్మయే వరమాత్మ. ఆత్మ సత్యము జ్ఞానరూపము, అనంతము, విజ్ఞానము, ఆనందరూపమ. ఇదియే బ్రహ్మ. నీవు ఆ బ్రహ్మయే నేను ఆ బ్రహ్మనే. పరబ్రహ్మ జ్యోతిరూపము. ఆదియే ఆత్మ. వామ(సు)దేవుడు, నిత్యయుక్తము ఓంకార రూపము. దేహేంద్రియ మనో బుద్ధి ప్రాణ అహంకార శూన్య మైనది. ఈ బ్రహ్మణోగ్రత్ స్వప్న సుషుప్త్యాదిముక్త మైనది. అందుచే తురీయము, నిత్యము శుద్దము, జ్ఞానరూపము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వితీయము, పర జ్యోతియు, అక్షరము, సర్వవ్యాప్తము, హరియు అగు బ్రహ్మయే నేను. ఆదిత్యునిలో ఉన్న అఖండపురుషుడు నేను. ఓం మనుష్యుడు సర్వకర్మలను పరిత్యజించి సుఖదుఃఖములందు సముడై ఓర్పు కలవాడై, భావమునందు పరిశుద్దుడై, బ్రహ్మాండమును భేదించుకొని బ్రహ్మ యగును. ఆషాడపౌర్ణమాసియందు చాతుర్మాస్య వ్రతము ప్రారంభించి చేయవలేను. కార్తికశుక్ల నవమి మొదలు సంచారము చేయవలెను. ఋతుసంధాదివసమలందు ముండనము చేయించుకొనవలెను. సన్యాసులకు ధ్యాన-ప్రాణాయామములే ప్రాయశ్చిత్తము.

అగ్ని మహాపురాణమునందు యతిధర్మవర్ణన మను నూట అరువదియొకటవ ఆధ్యాయము సమాప్తము.