అగ్ని మహా పురాణము

192 - అథ చతుర్దశీ వ్రతాని

ఆగ్ని రువాచః-

వ్రతం వక్ష్యే చతుర్ధశ్యాం భు క్తిముక్తిప్రదాయకమ్

కార్తికే తు చతుర్ధశ్యాం నిరాహారో యజేచ్ఛివమ్.

వర్షం భోగధనాయుష్మాన్ కుర్వన్ శివచతుర్దశిమ్

మార్గశీర్ష సీతేష్టమ్యాం తృతీయాయాం మునివ్రత.

 ద్వాదశ్యాం వా చతుర్ధశ్యాం ఫలాహారో యజేత్పురమ్

త్యక్త్వా ఫలాని దద్యాత్తు కుర్వన్ ఫలచతుర్దశీమ్.

చతుర్ధశ్యామథాష్టమ్యాం వక్షయోః శుక్లకృష్ణయోః

అనశ్నన్పూజయేచ్ఛముం స్వర్గ్యుభయచతుర్దశిమ్.

కృష్ణాష్టమ్యాం తు న క్రేన తథా కృష్ణచతుర్దశీమ్

ఇహ భోగానవాప్నోతి పరత చ శుభాం గతిమ్.

 తార్తికే తు చతుర్ధశ్యాం కృష్ణాయాం స్నానకృత్సుబీ

ఆరాధితే మహేశౌ తు ధ్వజాకారాసు యష్టిసు.

ఈ తతః శుక్ల చతుర్దశ్యామన న్తం పూజయేద్దరిమ్

కృత్వా దరృమయం చైవ వారిదానీసమన్వితమ్.

 శాలి ప్రస్థస్య పిష్టస్య పూపనామ్నః కృతస్య చ

ఆర్ధం విప్రాయ దాతవ్యమర్గమాత్మని యోజయేత్.

 కర్తవ్యం సరితాం చానే కథాం కృత్వా హరేరితి

అనన్త సంసారమహాసముద్రే మగ్నానమభ్యుద్దర వాసుదే వః

ఆన స్తోరూ పే వినియోజయస్వ హ్యన నరూపాయ నమో నమస్తే.

 అనేన పూజయిత్వాథసూత్రం బద్ధ్వా తు మ నితమ్

స్వకే కరే వా కణ్టే వా త్వననవ్రతకృత్సుఖీ.

 ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నానాచతుర్ద శీ వ్రతాని నామ ద్వినవత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను: భుక్తి ముక్తి ప్రదాయకము లగు చతుర్దశీవ్రతమును చెప్పెదను. కార్తి కచతుర్దశినాడు నిరాహారడై శివుని పూజించవలెను. అది మొదట ప్రతిమాసము శివచతుర్దశినాడు వ్రతము - శివపూజనము ఒక సంవత్సరము పాటు జరుపవలెను. ఇట్లు చేయువాడు భోగ - ధన - దీరాయుఃసంపన్ను డగును. మార్షశీర్ష శుక్ల పక్షమున అష్టమీ.తృతీయా ద్వాదశీ - చతుర్దశులలో ఒకనాడు మౌనవ్రత మవలంబించి, ఫలములు మాత్రము భుజించుచు దేవతాపూజ చేయవలెను. కొన్ని నలములు త్యజించి, వాటిని దానము చేయవలెను. ఈ విధముగ పలచతుర్దశీవ్రతమాచరించువాడు రెండు పక్షముల చతుర్ధశి-అష్టమి తిథులయందు ఉపవాస ముండి శివునిపూజించవలెను. ఇట్లు రెండు పక్షములందును చతుర్దశీవ్రతము చేయువానికి స్వర్గము లభించును. కృష్ణపక్ష అష్టమి - చతుర్ధశలందు రాత్రిభోజనము మాత్రము చేయువాడు ఇహలోకమున ఆలీష్ట లోగములను పరలోకమున శఠగతిని పొందును. కార్తిక కృష్ణచతుర్దశినాడు స్నానమాచరించి, ధ్వజాకారమగు వెదురు గడపై ఇంద్రుని పూజించువాడు సుఖవంతుడగున పిదప ప్రతిమాసమునందును శక్ల చతుర్దశినాడు కుశలతో విష్ణవిగ్రహము నిర్మించి దానిని జంపూర్ణకలశముపై నుంచి పూజించవలెను. ఆనాడు ఒక ప్రస్థము బియ్యము పిండితో ఆప్పములు వండి సగ ము బ్రాహ్మణునకు దానము చేసి, సగ ముతాను ఉపయోగించవలెను. నదీతటమున ఈ వ్రతహశాదులు చేసి, ఆనంతవ్రతకథ వినిపించవలెను. పదునాలుగు ముడుల గల అనంతసూత్రము నిర్మించి దానిని ఆనంతునీగ  పూజించి “ఓ వాసుదేవా! అనంత మైన సంసారమహాసముద్రమునందు మునిగిన మమ్ము ఉద్దరించుము. నీ ఆనంతరూపమునంద మమ్ములను కలుపుకొనుము. ఓ అనంతరూపా! నీకు నమస్కారము” అను ఆర్థము గల ముత్రమ వరించుచు, చేతికి గాని కంఠమునకు గాని కట్టుకొనవలెను. ఈ విధముగ అనంత వ్రతమాచరించువాడు పరమానందసంపన్నుడగును.

అగ్ని మహాపురాణమునందు వివిధచతుర్దశీవ్రతవర్ణన మను నూట తొంబది రెండవ అధ్యాయము సమాప్తము .