అగ్ని మహా పురాణము

58 - అథ స్నపనాది విధిః

శ్రీ భగవానువాచః-

ఐశాన్యాం జనయేత్కుణ్డం గురుర్వహ్నిం చవైష్ణవమ్

గాయత్య్రాష్టశతం హుత్వా సమ్పాత విధినాఘటాన్.

ప్రోక్షయేత్కారు శాలాయాం శిల్పిభిర్మూర్తి వైర్వజేత్

తూరశబ్దైః కౌతుకంచ భిన్తయేద్దక్షిణే కరే.

విష్ణవే శిపివిష్టేతి ఊర్జాసూ త్రేణ సర్ఘ వైః

పట్ట వస్త్రేణ కర్తవ్యం దేశిక స్యాపి కౌతుకమ్.

మండపే ప్రతిమాం స్థాప్య సవస్త్రాం పూజితాం స్తువన్

నమస్తేర్చ్యే సురేశాని ప్రణీతే విశ్వకర్మణా.

ప్రభావితా శేష జగద్ధాత్రి తుభ్యం నమో నమః

త్వయి సంపూజయామీ శే నారాయణమనామయమ్.

రహితా శిల్పదోషైస్త్వ మృద్ధి యుక్తా సదాభవ

ఏవం విజ్ఞాప్య ప్రతిషంనయేత్తాం స్నానమండపమ్.

హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యము నందు ఒక హోమకుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, సంపాతవిధిచే కలశ లను ప్రోక్షించ వలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పులతోడను కలిసి యజమానుడు, వాచ్యములతో, శిల్పశాలకు వెళ్ళ వలెను. ఆచట “విష్ణవేశిపివిష్టాయనమః” అను మంత్రుచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడి చేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్ని దారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్ట వలెను. మండలముపై ఆప్రతిమను వస్త్రముచుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను. “విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరి యైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము. సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబంధి దోషములేవియు లేకుండుగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము”. ప్రతిమను ఈ విధముగ ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.

శిల్పినం తోషయేద్దవ్యైర్గురవే గాంప్రదాపయేత్

చిత్రందేవేతి మ శ్రేణ నేత్రేచోస్మిల యే తతః.

అగ్నిర్ద్యోతీతి దృష్టించ దద్యాద్వై భద్రపీఠకే

తతః శుక్లాని పుష్పాణి ఘృతం సిద్దార్థకం తథా.

దూర్వాం కుశాగ్రం దేవస్య దద్యాచ్ఛిరసిదేశిక

మధువాతేతి మంత్రేణ నేత్రేచాభ్యజ్ఞయేద్దురుః.

హిరణ్యగర్భ మ శ్రేణ ఇమంమేతి చకీ ర్తయేత్

మృతేనాభ్యజ్ఞయే త్పశ్చాత్పఠన్ మృతవతీం పునః.

మసూరపిషేనోద్వర్య అతో దేవేతి కీర్తయేత్

కాలయేదష్టతో యేన స ప్రతేగ్నేతిదేశిక.

ద్రుపదాదివేతనులిం పై దాపోహిష్ఠతి సేచయేత్

నదీజై సీర్థ స్నానం పావమానీతి రత్న జై.

సముద్రం గచ్ఛగచ్ఛేతి తీర్థమృత్కల కేనచ

శన్నో దేవీః స్నా పయేచ్చ గాయత్ర్యా ముష్ణ వారిణా.

పజ్ఞ్చామృద్భిర్ధిరణ్యేతి స్నాపయేత్పర మేశ్వరమ్

సికతాది రిమం మేతి వల్మీ కోత్థమటేనచ.

తద్విష్ణోరితి ఔషధ్యద్భిర్యాఓషధి మన్తతః

యజ్ఞాయజ్ఞేతి కాషాయైః పణ్చభిర్గవ్యకై స్తతః.

 పయఃపృథివ్యాం మన్రోణయాః ఫలీతి ఫలామ్బుభిః

విశ్వతశ్చక్షుః సౌమ్యేన పూ ర్వేణ కలశేనచ.

సోమం రాజాన మిత్యేవం విష్ణో రరాటం దక్షతః

హంసః శుచిః పశ్చిమేన కుర్యాదుద్వర్తనం హరేః.

శిల్పికి ద్రవ్యమునిచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానమీయవలెను. “చిత్రందేవానామ్” ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమనేత్రములను తెరవవలెను. “ఆగ్నిర్డ్యోతిః” ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్రపీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను. “మధువాతా” ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచవలెను. ఆ సమయమున “హిరణ్యగర్భః”, “ఇమం మేవరుణ” ఇత్యాది మంత్రము పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్కు పఠించుచు మృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి “అదేవాః” ఇత్యాది మంత్రము పఠింపవలెను. “సప్త తే అగ్నే “ ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రసును కడగవలెను. “ద్రుపదాదివ ఇత్యాది మంత్రముచే అను లేపనము, ఆపోహిషామ” ఇత్యాది మంత్రముచే ఆభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ తీర్థజలములచే స్నానము చేయించి, “పావమానీ'! ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయించవలెను. “సముద్రం గచ్ఛస్వాహా ఇత్యాదిమంత్రము చదువుచు తీర్థ మృత్తి క చేత, కలక జలము చేతను స్నానము చేయించవలెను. “శంతో దేవీ? ఇత్యాది మంత్రముగాయత్రీమంత్రము పఠించుచు వేడినీళ్ళతో స్నానము చేయించవలెను. “హిరణ్యగర్భః” ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తి కలతో స్నానము చేయించవలెను. పిమ్మ. “ఇమంమేగంగేయమున” ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలము చేతను, “తద్విష్ణోః పరమపదమ్” అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ మటముతో స్నానము చేయించవలెను. “ఓషధీః” ఇత్యాది మంత్రము చదువుచు ఓషధి మిశ్ర జలము చేతను, యజ్ఞా యజ్ఞా ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలములచేతను, “పయః పృథివ్యామ్” ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, “యః ఫలినీ” ఇత్యాది మంత్రముతో ఫలమిశ్రిత జలములచేతను స్నానము చేయించవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది మంత్రముతో ఉత్తర దిక్కుననున్న కలశ చేతను, “సోము రాజానమ్” అను మంత్రముతో పూర్వదిక్కలశముచేతను, “విష్ణోరంటమసి” ఇత్యాది మంత్రముతో దక్షిణకలశ చేతను, “హంసః శుచిషత్” ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశ చేతను ఉద్వర్తన స్నానము చేయించవలెను.

మూర్ధానమితి మంత్రేణ ధాత్రీ మాంస్యుద కేనచ

మానస్తో కేతి మ శ్రేణ గన్జద్వారేతి గన్ద కైః.

ఇదమా పేతిచ ఘటై రేకాశీతి పదస్థితైః

ఏ హ్యేహి భగవన్విష్ణో లోకానుగ్రహ కారక.

యజ్ఞభాగం గృహాణేమం వాసుదేవనమోస్తుతే

అనే నావాహ్య డేవేశం కుర్యాత్కౌతుక మోచనమ్.

ముఞ్చామి త్వేతి సూ కేన దేశిక స్యాపి మోచయేత్

హిరణ్మయేన పాద్యం దద్యాదతో దేవేతి చార్ఘ్యకమ్.

మధువాతా మధుపర్కం మయిగృహ్ణమి చాచమేత్

అక్షన్న మీమద నేతి కిరేద్దూర్వాక్షతం బుధః.

“మూఠానందివో” ఇత్యాది మంత్రము తో ఉసిరికాయతో కూడిన జలముచేతను, “మానస్లోకే ఇత్యాది మంత్రమతో జటామాంసికలసిన జలముచేతను, “గద్గద్వారామ్” ఇది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, “ఇద మాప” ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందుంచిన కలశ లచేతను స్నానము చేయించ వలెను. స్నానానంతరము సమస్త లోక మును అనుగ్రహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపుము. మీకు నమస్కారము అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనము చేసి, “ముత్చా మిత్వా” ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహహస్తమునకు కట్టిన కౌతుక సూత్రమను, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట 'హిరణ్మయేన” ఇత్యాది మంత్రముతో పాద్యము ‘‘అత్దేవాః” ఇత్యాది మంత్రముతో అర్ఘ్యము, “మధువాత్కా ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి “మయిగృహ్ణమి” ఇత్యాదిమంత్రముతో ఆచమనము చేయించవలెను. పిమ్మట విద్వాంసుడు “అన్న మీమదన” ఇత్యాది మంత్రము చదువుచు శ్రీమహావిష్ణువు ఆవయవముల పై దూర్వలు, ఆక్షతలు చల్లవలెను.

కాణ్ణాన్ని ర్మంథనం కుర్యాద్ధనం గన్ధవతీతిచ

ఉస్న యామీతి మాల్యంచ ఇదం విష్ణు పవిత్రకమ్.

బృహస్పతే వస్త్రయుగ్మం వేదాహమిత్యుత్తరీయకమ్

మహావ్రతే సకలాన్పుష్టం చౌషధయః పేత్.

ధూపందద్యాద్దూరనీతి విభ్రాట్సూ క్తేన చాజ్ఞనమ్

 యుజ్ఞనీతిచ తిలకం దీర్ఘాయుష్వేత మాల్యకమ్.

ఇన్గచ్ఛత్రేతి ఛత్రంతు ఆదర్శంతు విరాజతః

చామరం తు వికర్ణేన భూషాం రథ న్తరేణచ.

 వ్యజనం వాయుదై వత్యైర్ము క్చామి త్వేతి పుష్పకమ్

వేదాద్యైః సంస్తుతింకుర్యాద్దరేః పురుష సూక్తతః.

సర్వమేతత్సమం కుర్యాత్పిణ్ణికా దౌహరాది కే

 దేవస్యోజ్ఞానసమయే సౌపర్ణం సూక్తముచ్చరేత్ .

ఉత్తిష్ఠేతి సముత్తాప్యశయ్యాయా మణ్డ పేనయేత్

శాకునేనైవ సూ కేన దేవంబ్రహ్మరథాదినా.

అతోదేవేతి సూ కేన ప్రతిమాం పిండికాం తథా

శ్రీ సూక్తేసచ శయ్యాయాం విష్ణోస్తు సక లీకృతి.

మృగరాజం వృషం నాగం వ్యజనం కలశం తథా

వై జయంతీం తథా భేరీం దీపమిత్యష్టమజలమ్.

దర్శయే దశ్వసూక్తేన పాదదే త్రిపాదితి

ఉఖాంపిధానకం పాతమమ్బికాం దర్వి కాందదేత్.

ముసలోలూఖలందర్యాచ్చిలాం సంమార్జనీం తథా

తథా భోజన భాణ్డాని గృహోపకరణానిచ.

శిరోదే శేచ నిద్రాఖ్యం వస్త్రరత్న యుతం ఘటమ్

ఖండఖాద్యైః పూరయిత్వా స్న స్ననస్యవిధిః స్మృతః.

ఇత్యాది మహాపురాణే స్నపనాది విధానం నామాష్టపఞ్చాశత్త మోధ్యాయః.

 “కాండాత్” ఇత్యాది మంత్రముతో నిర్మంథనము చేసి, “గంధవతీ” ఇత్యాది మంత్రముతో గంధమును, “ఉన్నయామి” ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, “ఇదం విష్ణుః” ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. “బృహస్పతే? ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, “వేదాహ మేతమ్” ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును “మహావ్రతేన” ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట “ధూరసి” అను మంత్రముతో ధూపము ఆర్పించి, 'విరాట్' సూక్తముతో అంజనమును, 'యుజ్ఞని' ఇత్యాది మంత్రముతో తిలక మును ఇవ్వవలెను. “దీర్ఘాయుష్ట్వాయ” అను మంత్రము 5 పుష్పమాల సమర్పింపవలేను. 'ఇంద్రక్షత్రమభి’ ఇత్యాది మంత్రముతో ఛత్రమును, ‘విరాట్' మంత్రముతో ఆద్దమును, 'వికర్ణ' మంత్రముతో చామరమును, రథంతర మంత్రము తో అలంకారమును సమర్పింప వలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, “ముక్చొమిత్వా” ఇత్యాది మంత్రముతో పుష్పము నేను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపవలెను. ఈ వస్తువుల నన్నింటిని పిండే కాదుల పైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తు నపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలేను. “ప్రభో లెమ్ము” అని పలుకుచు శ్రీ మహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపము నందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను. బ్రహ్మ రథము మీదగాని, పల్లకీ మీదగాని తీసికొని వెళ్ళవలేను. “ఆతోదేవాః” అను సూక్తము పఠించుచు, “శ్రీశ్చతే లక్ష్మీశ్చ” అను మంత్రము పఠించుచు, ప్రతిమను, పిండికను శయ్యపై చేర్చవలెను, పిమ్మట మహావిష్ణువు నకు నిష్కలీకరణ క్రియ చేయవలెను. సింహము, వృషభము, గజము, వ్యజనము, కలశము పతాక, భేరి, దీపము ఈ ఎనిమిదియు మంగళ సూచక వస్తువులు. వీటినన్నింటిని, ఆశ్వసూ క్తము పఠించుచు, భగ పంతునకు చూపవలెను. 'త్రిపాత్' ఇత్యాది మంత్రము చదువుచు భగవంతుని చరణ ప్రాంతమునందు ఉఖి (ఒక విధమైన పాత్ర) దాని మూత, అంబిక (చిన్న బూర్లమూకుడు), దర్వి (గరిటె) పాత్ర, రోలు, రోకలి, శిల, చీపురు, భోజన పాత్ర, ఇతర గృహ పాత్రలు ఉంచవలెను. తలవైపు వస్త్రములు, రత్నములుంచిన కలశము ఉంచవలెను. ఆ కలశ మును పటిక బెల్లం ముక్కలతో నింపవలెను. దానికి 'నిద్రా' అని పేరు. ఈ విధముగ భగవంతుని శయన విధానము చెప్పబడినది.

ఆగ్ని మహాపురాణమునందు స్నపనాది విధానమను ఏబది ఎనిమిదవ అధ్యాయము.