పుష్కర ఉవాచః-
శ్రాద్దకల్పం వక్ష్యామి భుక్తి ముక్తి ప్రదం శృణు ।
నిమగ్ర్య విప్రాన్పూర్వేద్యుః స్వాగతానపరాష్ట్రతః
ప్రార్చోవేశ యేత్పీఠీ యుగ్మాత్తైవేథ వైత్ర్యకే ।
ఆయుగ్మాన్ పాజ్ముఖాన్ డై వే తీన్ పైత్య్రే చైక మేవ వా.
మాతామహానామ ప్యేవం తస్రం వా వైశ్వదై వికమ్ ।
పాణి ప్రక్షాళనం దత్వా విష్టరార్థం కుశానపి.
ఆవాహయేదనుజ్ఞాతో విశ్వేదేవాస ఇతృదా ।
యవై రన్వవకీర్యాథ భాజనే సపవిత్రకే.
శన్నో దేవ్యా పయః క్షిప్త్వా యవోసీతి యవాంస్తథా ।
యా దివ్యా ఇతి మనేణ హస్తేహ్యర్ఘ్యం వినికి పేల్.
దత్త్వోదకం గన్ధమాల్యం ధూపదానం ప్రదీపకమ్ ।
ఆపసవ్యం తతః కృత్వా పితృణామప్రదక్షిణమ్.
ద్విగుణాంస్తు కుశాన్ కృత్వా హ్యుశన స్వేత్కృచా పితలాన్ ।
ఆవాహ్య తదనుజ్ఞాతో జు పేదాయాను నస్త తః.
యవార్థాస్తు తిలై కార్యాః కుర్యాదర్ష్యాది పూర్వవత్।
దత్త్వార్ఘ్యం సంస్రవాళ్ఛేషాన్పాతే కృత్వా విధానతః.
పితృభ్యః స్థానమనీతి న్యుజ్జం పాత్రం కరోత్యధః ।
అగ్నౌ కరిష్య ఆదాయ పృచ్ఛత్యన్నం మృతప్లుతమ్.
కురు ష్వేతి హ్యనుజ్ఞాతో హుత్వాగ్నౌ పితృయజ్ఞవత్ ।
హుత శేషం ప్రదద్యాత్తు భాజనేషు సమాహితః.
యథాలాపపన్నేషు రౌ ప్యేషు తు విశేషతః ।
దత్త్వాన్నం పృథివీపాత్రమితి పాత్రాభి మంత్రణమ్.
పుష్కరుడు చెప్పెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రద మగు శ్రాద్ధ కల్పమును గూర్చి చెప్పెదను. సావధానముగా వినుము. శ్రాద్ధకర్త మనస్సును, ఇంద్రియములను వశమునం దుంచుకొని పవిత్రుడై ఒక రోజు ముందుగా బ్రాహ్మణులను నిమంత్రించ వలెను. శ్రాద్ధదివసమున, అపరాష్ట్రకాలమునందు వచ్చిన ఆ బ్రాహ్మణులను స్వాగతాదులచే పూజించవలేను. వారిని పీఠముపై కూర్చుండ బెట్టవలెను. దైవస్థానమున సరిసంఖ్య కలవారిని, పితృస్థానమునందు బేసి సంఖ్యకలవారిని కూర్చుండ బెట్టవలెను. దైవస్థానమున ప్రాజ్ముఖముగ కూర్చుండబెట్టవలెను. పితృస్థానమునందు ఒకరిని లేదా ముగ్గురిని కూర్చుండ బెట్టవలెను. లేదా రెండింటియందును ఒక్కరొక్కరే ఉండవచ్చును. మాతామహశ్రాద్ధమునందు గూడ ఇడ్లీ పాణిప్రక్షాళనోదకమును, ఆసనముకొరకై కుశ లను ఇచ్చి, ఆనుజ్ఞ పొంది “విశ్వేదేవాసః” ఇత్యాదిమంత్రముచే ఆవాహనము చేసి, సపవిత్ర మగు పాత్రయందు యవలు చల్లి శం నో దేవీ, అను మంత్రముచే నీళ్ళు పోసి, 'యనోసి' అను మంత్రముచే యవలు చల్లి, 'యా దివ్యా ఆపః” అను మంత్రముచే హస్తమునందు ఆర్ఘ్యము ఇవ్వవలెను. పిదప ఉదక మును, గంధ మాల్యములను, ధూపదీపములను ఇవ్వవలెను. పిదప అపసవ్యము చేసుకొని పితృదేవతలకు ఆప్రదక్షిణముగా ద్విగుణము లగు కుశలను ఆసనముగా ఇచ్చి, “ఉశవ స్వా” అను మంత్రముచే ఆ పితృదేవతల ఆవావానము చేసి, అనుజ్ఞ పొందినవాడై, “ఆ యాస్తు నః' అను మంత్రము జపించవలెను. ఇచట యవలకు బదులు తిలలు వాడవలెను. అర్ఘ్యజికమును వెనుక టివలెనే ఇచ్చి, సంస్రవమును (కారిన జలమును) పితృపాత్రమునందు గ్రహించి దానిని 'పితృభ్యః స్థానమసి' అని చెప్పుచు ఆధోముఖము చేయవలెను. “ఆగ్నౌ కరిష్యే” అని చెప్పి కురుష్వ అని అనుజ్ఞ పొంది, మృతమిశ్రిత మగు అన్నము గ్రహించి, పితృయజ్ఞమునందు వలె అగ్నిలో హోమము చేసి, హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో ఉంచవలెను. లభ్య మగు పాత్రలలో. విశేషించి రజత పాత్రలలో -అన్న ముంచి, “పృథివీ తే పాత్రమ్”ఇత్యాదిమంత్రముచే పాత్రాభిమంత్రణ చేయవలెను.
కృత్వేదం విష్ణురిత్యన్నే ద్విజాజుష్టం నివేశయేత్ ।
సవ్యాహృతికాం గాయత్రీం మధు వాతా ఇతి త్యృచమ్.
జప్త్వా యథాసుఖం వాచ్యం భుజ్జరం స్తేపి వాగ్యశాః ।
ఆన్న మిష్టం హవిష్యం చ దద్యాజ్జప్త్వా పవిత్రకమ్.
అన్న మాదాయ తృప్తాః స్థ శేషం చై వాన్నమస్య చ ।
తదన్న వికిరేద్భూమౌ దద్యాచ్చాపః సకృత్సకృత్.
సర్వమన్న ముపాదాలయ సలిలం దక్షిణాముఖ8 ।
ఉచ్ఛిష్టసంనిధే పిజ్జాగ్దదద్యా తిపితృయజ్ఞవత్.
మాతామహానామ ప్యేవం దద్యాదాచమనం తతః ।
స్వస్తి వాచ్యం తతః కుర్యాదక్షయోదక మేవ చ.
దత్త్వా తు దక్షిణాం శక్త్యా స్వధాకారముదాహరేత్ ।
వాచ్యతామిత్యనుజ్ఞాతః స్వపితృభ్యః స్వరోచ్యతామ్.
కుర్యురస్తు స్వధేతుకే రూమౌ సిడ్చోత్త తో జలమ్ ।
ప్రియన్తోమితి పై దైవే విశ్వేదేవా జలం దదేల్.
దాతారో నోతివర్ధనాం వేదాః సన తీరేవ చ ।
శ్రద్ధా చ నో మా వ్యగమద్బహుదేయం చ నోస్త్వితి.
ఇత్యుక్త్వాతా ప్రియా వాచః ప్రణిపత్య విసర్జయేత్ ।
వాజేవాజ ఇతి ప్రీతపితృపూర్వం విసర్జనమ్.
యస్మింస్తు సంస్రవాః పూర్వమ ర్ఘ్యపాత్రే నిపాతితాః ।
పితృపాత్రం తదుత్తానం కృత్వా విప్రాన్వి సర్జయేత్.
“ఇదం విష్ణుః” అను మంత్రముచేత ద్విజుని అంగుష్ఠము అన్న ముందు ఉంచవలెను. వ్యాహృతులతో గూడిన గాయత్రిని, మధువాత్కా ఇత్యాది ఋక్రయమును జపిచి “సుఖముగా భుజించండి” అని చెప్పవలెను. వారు కూడ మౌనముతో భుజింపవలెను. వారికి ఇష్టము, హవిర్యోగ్యము ఆయిన ఆన్నము వడ్డించపలేను. పవిత్ర మంత్రము జపించి అన్నమును గ్రహించి, “తృప్తి చెందినారా?' అని ప్రశ్నించి తృప్తి చెందితిమి' అని వారు సమాధానము చెప్పిన తరువాత “శేషాన్న మును ఏమి చేయవలెను” అని ప్రశ్నించగా “వారు ఇష్టులతో కూడి భుజించండి” అని సమాధానము చెప్పవలెను. వారు తినగా మిగిలిన అన్న మును భూమి పై చల్లి ఒక్కొక పర్యాయము ఉదకము ఇవ్వవలెను. ఆ అన్నము నంతను గ్రహించి, దక్షిణాభిముఖుడై , ఉచ్ఛిష్ట సమీపమున పితృయజ్ఞమునందు వలె పిండ ప్రదానము చేయవలెను. మాతామ హులకు కూడ ఇట్లే చేయవలెను. పిదపఆచమనము ఇచ్చి, స్వస్తివాచనము చేయవలెను. అక్షయ్యోదకము ఇవ్వవలేను. యథాశక్తి గా దక్షిణ సమర్పించి ‘వాచ్యతామ్' అని అనుజ్ఞపొంది స్వధా అని పలుక వలెను. ‘ఆస్తు స్వధా’ అని చెప్పగా పిదప జలమును భూమి పై విడువవలేను. 'ప్రేయస్తాంవిశ్వేదేవా!” అనీ అనుచుదేవస్థానమున ఉదకము ఇవ్వవలెను. “మాలో దాతలు వృద్ది పొందుదురుగాక. వేదములు, సంతానము కూడ వృద్ధిపొందుగాక! మాశ్రద్ద కూడ తగ్గకుండుగాక. మావద్ద ఇతరులకు ఇచ్చుటకు అధికధనాదికము ఉండుగాక! ఈ విధముగ ప్రియవాక్కులు పలుకుచు నమస్కరించి విసర్జించవలెను. ముందుగా “వాజే వాజే” ఇత్యాది మంత్రముతో పితృ దేవతావిసర్జనము చేయవలెను పూర్వము సంస్రవములు పడిన ఆర్ఘ్యపాత్రలను ఉత్తానము చేసి బ్రాహ్మణులను పంపి వేయవలెను.
ప్రదక్షిణమనువజ్య భుక్త్వా తు పితృ సేవితమ్ ।
బ్రహ్మ చారీ భవేత్తాం తు రజనీం బ్రాహ్మడైః సహ.
ఏవం ప్రదక్షిణం కృత్వా వృద్ధా నాల్టీముఖాన్ పితృన్।
యజేత దధికర్కశూమి శ్రాన్ పిజ్ఞాన్యవైః క్రియా.
ఏకోద్దిష్టం దై వహీనమేకా రైక పవిత్రకమ్ ।
ఆవాహనాగౌకరణరహితం హ్యపసవ్యవల్.
ఉపతిష్ఠతామిత్యక్షయ్యస్థానే పితృవిసర్జనే ।
అభిరమ్యతామితి వద్ద్భూయు స్తేజభిరతాః
గశోదక తిలై ర్యుక్తం కుర్యాత్పాత్రచతుష్టయమ్।
అర్షార్థం పితృపా శ్రేషు పేతపాత్రం ప్రసేచయేత్.
యే సమానా ఇతి ద్వాభ్యాం శేషం పూర్వవదాచరేత్ ।
ఏతత్సపిణీకరణ మేకోద్దిష్టం శ్రియా సహ.
అర్వాక్సపిట్టీకరణం యస్య సంవత్సరాద్భవేత్ ।
తస్యాప్యన్న సోదకుమ్భం దద్యాత్సంవత్సరం ద్విజ.
మృతాహని చ కర్తవ్యం ప్రతిమాసం తు వత్సరమ్।
ప్రతిసంవత్సరం కార్యం శ్రాద్ధం వైమాసికాన్నవల్.
హవిష్యాన్నేన వై మాసం పాయ సేన తు వత్సరమ్ ।
మాత్స్యహారిణకౌరభ్ర శాకునచ్ఛాగపార్షతైః.
ఐణగౌరవవారాహశా ఖైర్మాంగైర్యథాక్రమమ్ ।
మానవృద్ద్యాభితృప్యని దతే రేవ పితామహాః.
ఖడ్గామిషం మహాశల్కం మధుయుక్తాన్న మేవ చ ।
లోహామిషం కాలశాకం మాంసం వార్షీణనస్య చ.
యద్దదాతి గయాస్థశ్చ సర్వమానన్యమశ్నుతే ।
తథా వరాత్రయోదశ్యాం మఘాసు చ న సంశయః.
తితి కన్యాం ప్రజాం వన్దినశ్చ పశూన్ముఖ్యాన్ సుతానపి ।
ఘృతం కృషిం చ వాణిజ్యం ద్విశ ఫైక కఫంతథా.
బహ్మవర్చస్వినః పుత్రాన్ స్వర్ణరూ ప్యే సకుప్య కే ।
జ్ఞాతిశ్రైష్ఠ్యం సర్వకామానావాప్నోతి శ్రాద్ధదః సదా.
బ్రాహ్మణులను ప్రదక్షిణక్రమమున కొంతదూరము అనుసరించి వెళ్ళి మర లవచ్చి పితృదేవభుక్త శేషమును భుజించి, ఆ రాత్రి తాను, బ్రాహ్మణులతో గూడ బ్రహ్మచారిగా ఉండవలెను. ఇదేవిధముగ పుత్రజన్మాది వృద్ధిసమయము లందు ప్రదక్షిణావృత్తిచే వాందీముఖపితృదేవతలను పూజించవలెను. పెరుగు కర్కంధూఫలము కలిసిన అన్నముతో పిండ దానము చేసి, తిస్థానమున యవలను ఉపయోగించవలెను. ఏకోద్దిష్ట శ్రాద్ధమున విశ్వేదేవపూజ ఉండదు. ఒకే అర్ఘ్యపాత్ర, ఒకే పవిత్రము ఉండును. ఆవాహనము, అగ్నౌ కరణము ఉండదు. యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసికొని అన్ని కార్య ములు చేయబడును. ‘అక్షయ్యమస్తు’ అనుటకు బదులు “ఉపశిష్టతామ్” అని చెప్పవలెను. “వాజే వాజే” ఇత్యామత్ర ముతో బ్రాహ్మణవిసర్జన చేయునపుడు 'అభిరమ్యతామ్' అని చెప్పగా, వారు “అభిరతాః స్మః” అని పలుకుదురు. సపిండి కరణ శ్రాద్ధమునందు వెనుక చేప్పిన విధముగ అర్ఘ్యసిద్దికొరకై గంధ-జల.తిలయుక్తము లగు నాలుగు అర్ఘ్యపాత్రలు చేసి కొనవలెను. (పేత పాత్రజలములు పితృపాత్రమునందు పోయవలెను. ఆ సమయమునందు “యే సమానా ఇత్యాది మంత్ర ద్వయమును పఠించవలేను. మిగిలిన క్రియాకలాపము వెనుకటివలెనే. ఈ సపిండికరణ ఏకోద్దిష్ట, శ్రాద్ధములు తల్లికి గూడ చేయవలెను. సపిండికరణము సంవత్సరమునకు ముందుగానే చేసివేసినవాని నిమిత్తమై సంవత్సరము పాలు, ఉదకుంభ సహిత అన్నమును ఇవ్వవలెను. ఒక సంవత్సరముపాటు ప్రతిమాసమునందును ఒక పర్యాయము క్షయాహతిథియందు ఏకోద్దిష్టముచేయుట ఉచితము. మొదటి ఏకోద్దిష్టము పదకొండవదినమునందు చేయబడును. శ్రాద్ధమునందు హవిష్యాన్ని మును ఇచ్చుటచే ఒక మాసము వరకును, పాయసము నిచ్చుటచే సంవత్సరమువరకును పితృదేవతలకు తృప్తి కలుగును. మత్స్య-హరిణ-ఉరక్ర_శకుని-ఛాగ-పృషత ఐణ-రురు. వరాహ.శశమాంసములు ఇచ్చినచో పితామహులకు వరుసగా ఒక్కొక్కమాసము అధికముగ తృప్తి కలుగును. ఖడ్గమృగమాంసము, మహాకర్కిమాంసము, వధుయు కొన్నము, లోహ మాసము, కొలతాకము, వార్ధిజసమాంసము, గయాదత్తము ఇవి అన్నియు అనంత తృప్తిని ఇచ్చును. భాద్రపద కృష్ణ త్రయోదశియందు- విశ్లేషించి మఘానక్షతయోగమున పితృదేవతల కిచ్చినది అక్షయ మగును. శ్రాద్ధము చేసినవాడు సర్వదా రూపశీలవతి యైన కన్యను, సంతానమును, స్తోత్రపాఠకులను, ముచి పశువులను, సుతులను, నెయ్యి, కృషి, వాణిజ్యము, రెండు డెక్కల జంతువులను, ఒక శఫము గల జంతువులను, బ్రహ్మ వర్చస్సు గల పుత్రులను, స్వర్గమును, వెండిని, కుప్యమును, జ్ఞాతులలో శ్రేష్ఠత్వమును, సర్వకామములను పొందును.
ప్రతిపత్రృభృతి ష్వేతాన్వర్జయిత్వా చతుర్దశీమ్ ।
శస్త్రేణ తు హతా యే వై తేషాం తత్ర ప్రదీయతే.
స్వర్గం హ్యపత్యమోజశ్చ శౌర్యం త్రం బలం తథా ।
సుత్ర ష్ట్యం ససౌభాగ్యమపత్యం ముఖ్యతాం సుతాన్.
ప్రవృత్తచక్రం పుత్రాన్వాణిజ్యం ప్రభుతాం తథా ।
ఆగిత్వం యశో వీతశోకలాం పరమాం గతిమ్.
ధనం విద్యాం భిషక్ సిద్ధిం రూప్యం గాశ్చాష్యజాపికమ్ ।
అశ్వానాయుశ్చ విధివద్యః శ్రాద్ధం సంప్రయచ్ఛతి.
కృత్తికాదభరణ్య నే స కామానాప్నుయాదిమాన్ ।
వసురుద్రాదితిసుతాః పితర శ్రాద్ధదేవతాః.
ప్రిణయని మనుష్యాణాం వితక్ర్ఛొద్దేన తర్పితాః ।
ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ.
ప్రయచ్ఛక్తిని తథా రాజ్యం ప్రీతా నృణాం పితామహా.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే శ్రాద్దకల్పవర్ణనం నామ త్రిషష్ట్యధికశతతమోధ్యాయః.
చతుర్ధశితప్ప, ప్రతిపత్తు మొదలు పదునైదు తిథులందు, శస్త్రహతులకు శ్రాద్ధము చేయబడును. కృత్తిక మొదల భరణివరకును యథాశాస్త్రముగ తార్థము నిచ్చువాడు స్వర్గమును, సంతానమును, తేజస్సును శౌర్యమును, సుతులను, ఆధీ కారమును, పుత్రులను, వాణిజ్యమును, ప్రభుత్వమును, ఆరోగ్యమును, యశస్సును, శోక వినాశనమును, పరమగతిని, ధన మును, విద్యను, వైద్యసిద్ధిని, వెండి, గోవులను, గొట్టెలను అశ్వములను, ఆయుస్సును పొందును. శ్రాద్ధముచేత తర్పితులైశ్రాద్ధకలనిరూపణమ్ వసురు ద్రాదిత్యరూపు లైన శ్రాద్ధదేవత లైన పితృదేవతలు, మనుష్యుల పితర్వును సంతోషింపచేయుదురు. సుశసించిన పితామహులు మనుష్యులకు ఆయుః ప్రజా ధన–విద్యలను, స్వర్గ-మోక్ష -సుఖములను రాజ్యమును ఇత్తురు.
ఆగ్నేయమహాపురాణమునందు శ్రాద్ధకర్పవర్ణన మను నూటఆరవది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 163 of the Agni Purāṇa is as follows:
The specific procedural text (kalpa) for śrāddha is laid out in greater ritual detail than the earlier general description. Agni describes the exact procedure for the Mahāśrāddha—the annual piṇḍa-pitṛ-yajña—including the preparation of the sacred square (catur-hasta-bhūmi), the installation of kuśa-seats for the invited brāhmaṇas (who embody the pitṛs), and the precise mantras for each oblation sequence. The piṇḍa-pāta (placing of rice-balls) to the pitāmaha, pitā, and prapitāmaha is described with the corresponding sapiṇḍa mantras. A list of the twelve months' śrāddha-nāmas and their specific phala for the departed is appended.