అగ్ని రువాచః
అక్షరం పరమం బ్రహ్మ సనాతనమజం విభుమ్ ।
వేదాంతేషు వద న్త్యేకం చైతన్యం జ్యోతిరీశ్వరమ్.
ఆనందః సహజ స్తస్య వ్యజ్యతే సకదాచన ।
వ్యక్తిః సాతస్య చైతన్య చమత్కార రసాహ్వయా.
ఆద్య స్తస్య వికారో యః సోఽహంకార ఇతిస్మృతః ।
తతోఽభిమాన స్తదేవం సమాప్తం భువనత్రయమ్.
ఆభిమానాద్రతిః సాచ పరిపోషము పేయుషీ ।
వ్యభిచార్యాది సామాన్యాచ్ఛృంగార ఇతిగీయతే.
తద్భేదాః కామమిత రే హాస్యాద్యా ఆప్యనేకశః ।
స్వస్వస్థాయి విశేషోత్థారి మోషస్వలక్షణాః.
అగ్ని దేవుడు పలికెను. అక్షరము, సనాతనము, జన్మ రహితము సర్వవ్యాప్తము పర బ్రహ్మ స్వరూపము, అద్వితీయము, జ్యోతి రూపము అగు ఏ చైతన్యము వేదాంతములో చెప్పబడుచున్నదో దానికి ఆనందము సహజము. యది అపుడపుడు అభివ్యక్త మగును. ఈ అభివ్య క్తియే చమత్కారమనియు చెప్పబడును. దాని ప్రథమ వికారమునకు అహంకార మని పేరు. దాని నుండి ఆభినూనము పుట్టినది. ఈ భువనత్రయము ఈ ఆభిమానము వందే ఆంతర్గతమై యున్నది. అభిమానము నుండి రతి పట్టును. యది వ్యభిచార్యాది భావసామాన్యముచే పరిపుష్టమై శృంగార మని చెప్పబడును. ఇతర మైన హాస్యాదులు ఈ శృంగార భేదములే. వాటికి ఆయా స్థాయీ భాములుండును. వాటి పరిపోషమే ఆ రసముల లక్షణము.
సత్త్వాది గుణసంతానా జాయ న్తే పరమాత్మనః ।
రాగాదృవతి శృంగారో రౌద్ర స్తైక్ష్య్ణా త్ర్పజాయతే.
వీరోఽవష్టమజః సంకోచ భూర్బీభత్స ఇష్యతే ।
శృంగారాజ్ఞాయతే హాసో రౌద్రాత్తుక రుణో రసః.
వీరశ్చాద్భుత నిష్పత్తిః స్వాద్బీభత్సాద్భయానకః ।
శృంగార హాస్యక రుణా రౌద్రవీర భయానకాః.
బీభత్ఛాద్బుత శాంతాఖ్యాః స్వభావాచ్చతురో రసాః ।
లక్ష్మిరివ వినోత్యాగాన్న వాణీ భాతినీరసా.
అపారే కావ్యసంసారే కవి రేవ ప్రజాపతిః ।
యథావైరోచతే విశ్వం తథేదం పరివర్తతే.
శృంగారీ చేత్కవిః కావ్యేజాతం రసమయం జగత్ ।
సచేత్క విర్వీత రాగోనీరసం వ్యక్తమేవతత్.
న భావహీనో ఽస్తి రసోన భావోరస వర్జితః ।
భావయంతి రసానే భిర్బావ్య న్తే చకసా ఇతి.
స్థాయినోఽష్టౌ రతిముఖాః స్తంభాద్యా వ్యభిచారిణః ।
మనోఽను కూలేఽనుభవః సుఖస్యరతిరిష్యతే
హర్షాదిభిశ్చ మనసోవికాసో హాసఉచ్యతే ।
చిత్రాది దర్శనాచ్చేతో వై క్లవ్యం బ్రువతే భయమ్.
జుగుప్సాన పదార్థానాంనిన్దా దౌర్భాగ్య వాహినామ్ ।
విస్మయోఽతిశ యేనార్థ దర్శనాచ్చిత్త విస్తృతిః.
అష్టౌస్తంభాదయః సత్త్వాద్రజ స్తమ ఆతః పరమ్ ।
స్తంభ శ్చేష్టా ప్రతీఘాతో భయారాగా ద్యుపాహితః.
శ్రమరాగా ద్యుపేతాంతః క్షోభజన్మ వపుర్జలమ్ ।
స్వేదోహర్షాదిభిర్దేహోచ్ఛ్వాసోఽన్తః పులకోద్గమః.
హర్షాది జన్మ వాక్సంగః స్వర భేదో భయాదిభిః ।
మనో వైక్లవ్య మిచ్చన్తి శోకమిష్ట క్షయాదిభిః.
క్రోధ స్తైక్ష్ణ ప్రబోధశ్చ ప్రతికూలాను కారిణి ।
పురుషార్థ సమాప్త్యర్థోయః సఉత్సాహ ఉచ్యతే.
చిత్త క్షోభ భవోత్తం భోవేపథుః పరికీర్తితః ।
వై వర్ణ్యంచ విషాదాది జన్మకాంతి విపర్యయః.
మఃఖానందాది జంనేత్ర జలమశ్రుచ విశ్రుతమ్ ।
సత్త్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించును. రాగము నుండి శృంగారము తీన్జత్వము నుండి రౌద్రము, ఉత్సాహము నుండి వీరము, సంకోచము నుండి బీభత్సము పుట్టును. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయా నక బీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు. నాల్గు రసములు (శృంగార రౌద్ర వీర బీభత్సములు) సహజములు. త్యాగము లేని ధనము వలె, రసము లేని వాక్కు ప్రకాశించదు. అపారమైన కావ్య సంసారములో కవియే ప్రజాపతి. ఆత నికి ఈ సంసారము ఎట్లు ఇష్టమగునో అట్టి మార్పు చెందు చుండును. కవి శృంగారియైనచో కావ్య జగత్తు రసమయు మగును. అతడు రసహీనుడై నచో కావ్యము నీరస మగును. ధావహీన మరు రసము, రస వర్జితమగు భావము వుండవు. భావములు రసములను అభివ్య క్తము చేయును, “భావ్యంతే రసాః ఏభిః” యను వ్యుత్పత్తిచే భావములు చెప్పబడును. రతి మొదలగు స్థాయీ భావములు ఎనిమిది. స్తంభాడులు ఎనిమిది. మనస్సు కనుకూల మగు సుఖానుభవము రతి. హర్షాదులచే చిత్త వికాసము హాసము. చిత్రాది దర్శనము వలన కూడ హాసము కలుగును. చిత్తమునకు విక్లబత్వను భయ మని చెప్పు దురు. చెడ్డ వ స్తుల నిండ జుగుప్స. ఉత్కృష్ట మగు వస్తువులను చూచుటచే కలుగు చిత్త విస్తారము విస్మయము, స్తంబాదులను ఎనిమిది భావములు సత్వము వల్ల కలుగును. రజస్తమస్సులకు అతీతము. భయరాగాదులచే కల్గిన చేష్టా విఘా తము స్తంభము. శ్రమరాగాదులతో కూడిన ఆంతర క్షోభము కలిగిన శరీర జలము స్వేదము. హరాదులచే దేహము పులక రించుట పులకోద్దమము. హరాది జన్య మగు వచన ఆస్పష్టత్వము స్వర భేదము. ఇష్ట క్షయాదులచే కలిగిన మనో వై క్ల బ్యము శోక ము. ప్రతికూలముగా ప్రవర్తించు వాని విషయమున తీక్షత్వము. క్రోధము పురుషార్థమును పూర్తి చేయుటకు యత్నము ఉత్సాహము. చిత్త క్షోభము కలిగిన ఉత్త. భము వేపథువు. విషాధారుల వలన కాంతి కోల్పోవుట వై వర్ణ్యము. దుఃఖా నా దాడుల వలన కల్గిన నేత్ర జలము అశ్రువు. లంఘనాదులచే ఇంద్రియములు పనిచేయకుండుట ప్రళయము.
ఇంద్రియాణా మస్తమయః ప్రలయో లంఘనాదిభిః.
వైరాగ్యా దిర్మనః భేదోనిర్వేద ఇతి కథ్యతే ।
మనః పీడాది జన్మాచ సాదోగ్లానిః శరీరగా.
శంకానిష్టాగమోత్ప్రేక్షా స్యాదసూయాచ మత్సరః ।
మదిరాద్యుపయోగోత్థం మనః సంమోహనంమదః.
క్రియాతిశయ జన్మాంతః శరీరోత్థక్లమః శ్రమః ।
శృంగారాది క్రియాద్వేష చిత్తస్యాలస్యము చ్యతే.
దైన్యం సత్త్వదపభ్రంశ శ్చింతార్థ పరిభావనమ్ ।
ఇతికర్తవ్య తోపాయాదర్శనం మోహ ఉచ్యతే.
స్మృతిః స్యాదను భూతస్య వస్తునః ప్రతిబింబనమ్ ।
మతిరర్థ పరిచ్చేద స్తత్త్వ జ్ఞానోపనాయితః.
వ్రీడానురాగాది భవః సంకోచః కోఽపిచేతసః ।
భవేచ్చపలతాఽస్థైర్యం హర్షశ్చిత్త ప్రసన్నతా.
ఆవేశశ్చ ప్రతీకారః శయోవైధుర్యమాత్మనః ।
కర్తవ్యే ప్రతిభాభ్రంశో జడ తేత్యభిధీయతే.
ఇష్టప్రాప్తేరుపచితః సంపదా భ్యుదయోధృతిః ।
గర్వ: పరేష్వవజ్ఞానమాత్మన్యుత్కర్ష భావనా.
భవేద్విషాదో దైవాదేర్విఘాతోఽభీష్టవస్తుని ।
ఔత్సుక్యమీప్సితా ప్రాప్తేర్వాంఛయా తర లాస్థితిః.
చిత్తేంద్రియాణాం స్తైమిత్య మపస్మారోఽచలాస్థితిః ।
యుధ్ధబాదాదిభిస్త్రాసో వీప్సా చిత్తచమత్కృతిః .
క్రోధస్యాప్రశ మోఽమర్షః ప్రబోధ శ్చేతనోదయః ।
ఆవహిత్థం భ వేద్గుప్తి రింగితాకార గోచరా.
రోషతోగురు వాగ్ధండ పారుష్యం విదురుగ్రతామ్ ।
ఊహోవితర్కః స్యాద్వ్యాధిర్మనో వపురవగ్రహః.
అనిబద్ద ప్రలాపాది రున్మాదో మదనాదిభిః ।
తత్వజ్ఞానాది నాచేతః కషాయోపరమః శమః.
వైరాగ్యాదులచే మనఃక్లేదము నిర్వేదము. మానసిక పీడాదుల వలన కలిగిన శరీర దౌర్బల్యము గ్లాని, అనిష్ట ప్రాప్తిని ఊహించుట శంక. మత్సరము ఆసూయ. మదిరాదుల ఉపయోగ ము వలన కలిగిన మానసిక మోహమ మదము. ఎక్కువ పని చేయుటచే కలిగిన శరీర క్లాంతిశ్రమము. చిత్తముకు శృంగారాది క్రియల యందు ద్వేషము ఆలస్యము, సత్వము నుండి తొలగుట దైన్యము. విషయములను గూర్చి ఆలోచించుట చింత. చేయదగిన ఉపాయము తెలియ జాల కుండుట మోహము. అనుభ వించిన వస్తువును మరల ప్రతిబింబింప చేసుకోనుట స్మృతి. యథార్థ జ్ఞానము వలన విషయ నిర్ణయము మతి. అనురాగాదుల వలన కలిగిన ఒకానొక విధ మగు చేత స్సంకోచము క్రీడా, ఆస్థిరత్వము చపుతా. చిత్త ప్రసన్నతాహర్షము; ప్రతీకార వాంఛచే కలీగిన అంతః కరణ వైకల్యము ఆవేశము. కర్తవ్యము విషయమున ఏమి తోచు కుండుట ఇడతా. ఆభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరుల యందు ఆవారమును, తన యందు ఉత్కర్ష భావన గర్వము. ఆభిష్ట వస్తువు యుదు దై వాది విఘాతము విషాదము. ఈప్సిత సిద్ది కొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యము. చితేంద్రియాదులు పనిచేయ కుండుట అపస్మారము. యుద్ధము అందు బాధాదుల వలన స్థిరముగ వుండ జాలక పోవుట ఠాజము చిత్త చమత్కారము ఏప్స. క్రోదము శమించకుండుట అమర్షము. చేతన హృదయము ప్రబోధము, ఇంగితాకారమును దాచుకొనుట ఆవహిత్థము. గురువుల విషయమున కోపముచే వాక్పారుష్యదండ పారుష్యములు ఉగ్రత, ఊహ వితర్కము. మనస్సు శరీరము సరిగా వుండకపోవుట వ్యాధికామాదులచే అసంబద్ధ ప్రలాపము ఉన్మాదము. తత్త్వ జ్ఞానాదులచే చిత్రమాలిన్యము తొలగుట శమము.
కవిభిర్యోజనీయావై భావాః కావ్యాది కేరసాః ।
విభావ్యతేహి రత్యాదిర్యత్ర యేన విధావ్యతే.
విభావోనామ సద్వేధాఽఽలంబనోద్దీప నాత్మకః ।
రత్యాది భావవర్గోఽయం యమాజీవ్యోప జాయతే.
ఆలంబనవిభావోఽసౌ నాయకాది భవ స్తథా ।
ధీరోదాత్తో ధీరోద్దతః స్యాద్ధీరలలిత స్తథా.
ధీరప్రశాంత ఇత్యేవం చతుర్ధా నాయకః స్మృతః ।
ఆనుకూలో దక్షిణశ్చశఠో దృష్టః ప్రవర్తితః.
పీఠమర్దో విట శ్చైవ విదూషక ఇతిత్రయః ।
శృంగారే నర్మసచివా నాయకస్యాను నాయకాః.
పీఠమర్దః సంభలకః శ్రీమాం స్తద్దేశ జోవిటః ।
విదూషకో వైహసిక స్త్వష్ట నాయక నాయికాః.
స్వకీయా పరకీయాచ పునర్బూరితి కౌశికః ।
సామాన్యాన పునర్బూరి ఇత్యాద్యా బహుభేదతః.
ఉద్దీపన విభాహస్తే సంస్కారై ర్వి విధైః స్థితైః ।
ఆలంబన విభా వేషు భావానుద్దీపయన్తియే.
చతుః షష్టి కలాద్వేధా కర్మాద్యైర్గీతి కాదిభిః ।
కుహకంస్మృతి రప్యేషాం ప్రాయోహాసోప హారకః.
ఆలంబన విభావస్య భావై రుద్బుద్ధ సంస్కృతైః ।
మనోవాగ్బుద్ధి వపుషాంస్మృతీచ్ఛా ద్వేషయత్నతః.
ఆరంభ ఏవ విదుషా మనుభావ ఇతిస్మృతః ।
సచాను భూయతేచాత్ర భవత్యుత నిరుచ్యతే.
మనోవ్యాపార భూయిష్ఠో మనఆరంభ ఉచ్యతే ।
ద్వివిధః పౌరుషః స్త్రైణ ఈదృశోఽపి ప్రసిధ్యతి.
కావ్యాదులందు కవులు భావములను రసములను కూర్చవలెను. దేనిచే రత్యాదులు విభావితములగునో యది విభా వము. విఖావ్యతేయేవ యని విగ్రహము. ఆకాంబవము ఉద్దీపనము యని యది రెండు విధములు. ఈ రత్యాది భావర్గము దేనిని ఆధారముగా తీసుకుని పుట్టునో ఆది ఆలంబన విభావము. ఇది నాయకారులను ఆధారముగా చేసుకుని పుట్టును. ధీకో దాత్త దీరోద్ధత, ధీరలలిత, ధీర ప్రశాంతులని నాయకులు నాలుగు విధములు. అనుకూలుడు, దక్షిణుడు, శరుడు, దృష్టుడు యని మరి నాలుగు విధములు. శృంగార మున నాయకునకు పీఠ మర్దుడు, విలుడు, విదూషకుడు యని ముగ్గురు ధర్మ సచివు లుగా వుందురు. వీరు అనునాయకులు. పీఠమర్దుడు శ్రీమంతుడై నాయకుని వలె బలవంతుడై వుండును. విటుడు వాయకుని దేశమునకు చెందిన వాడై వుండును. నవ్వించువాడు విదూషకుడు. నాయకుని నాయికలు కూడ ఎనీవిధములుగా వుందురు. స్వకీయ, పరకీయ, వనర్భూ యని కౌశికుడు చెప్పెను. మరికొందరు, పునర్భూరికి బదలుగ సామాన్యను అంగీకరింతురు. ఈ నాయికలలో చాల భేదము లున్నవి. ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభాము నందు భావోద్దీపనము చేయును. కర్మాదుల చేతను గీతికాదుల చేతను, చతుష్షష్టి కళలు ఆరు విధములు, సాధారణముగ కోకన్మృతులు హసోపహాకారములు. ఉద్బుద్ధములు సంస్కృతములు యగు భావములచే ఇచ్చాద్వేష ప్రయత్నముల సంయోగములచే కలుగు మనోవాడి బుద్ది శరీర కార్యములను విద్వజ్జనులు అనుభావములందురు. "స అనుభూయతే" అత్ర యని కాని స అనుభవతి యని కాని దీని నిర్వచనము. మానసిక వ్యాపారము అధికముగా నున్నది మానసికారంధము. పౌరుషముణము యని యది రెండు విధములు.
శోభావిలాసో మాధుర్యం స్థైర్యం గాంభీర్యమేవచ ।
లలితశ్చ తథౌదార్యం తేజోఽష్టావితి పౌరుషాః.
నీచనిందోత్త మస్పర్ధా శౌర్యం దాక్ష్యాదికారణమ్ ।
మనోధర్మే భవేచ్ఛోభా శోభతే భవనంయథా.
భావోహావశ్చ హేలాచ శోభాకాంతి స్తథైవచ ।
దీప్తిర్మాధుర్య శౌర్యేచ ప్రాగల్భ్యం స్యాదుదారతా.
స్థైర్యం గంభీరతా స్త్రీణాం విభావాద్వాద శేరితాః ।
భావోవిలాసోహావః స్యాద్భావః కించిచ్చ హర్షజః.
వాచోయు క్తిర్భవే ద్వాగారం భోద్వాదశ ఏవసః ।
తత్రభాషణ మాలాపః ప్రలాపో వచనంబహు.
విలాపో దుఃఖవచన మనులాపోఽ సకృద్వచః ।
సంభావ ఉక్తప్రత్యుక్త మహలాపోఽన్య థావచః.
వార్తా ప్రయాణం సందేశో నిర్దేశః ప్రతిపాదనమ్ ।
తత్త్వాదేశోఽతి దేశోఽయమ పదేశోఽన్య వర్ణనమ్.
ఉపదేశశ్చ శిక్షా వాగ్వ్యాజో క్తిర్వ్య పదేశకః ।
బోధాయ ఏషవ్యాపారః సుబుద్ధ్యారంభ ఇష్యతే ।
తస్యభేదాస్త్రయ స్తేచ రీతి వృత్తిప్రవృత్తయః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే శృంగారాది రస నిరూపణం నామైకోన చత్వారింశ దధిక త్రిశతతమోఽధ్యాయః.
శోభా, విలాస, మాధుర్య స్థైర్య గాంభీర్య లలిత ఔదార్య తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచులనింద ఉత్తములతో స్పర్ధ శౌర్యము చాతుర్యము వీటి చేమను ధర్మమునందు శోభకలుగును. యిది ఇంటిలో శోభవంటిది. భావ, హావ, హేళా, శోభ, కాంతి, దీప్తి, మాధుర్య, శౌర్య, పాగల్భ్య, ఉదారతా, స్థైర్య గంబీర తలు యను పండ్రెండు స్త్రీల విభావములు. విలాస హావములను భావమందురు. ఇది కొంచెము హర్షముచే పుట్టును. పాక్సంబంధము వాగారం భము వీనికి పండ్రెండు భేదములున్నవి. మాటలాడుట ఆలాపము, ఎక్కువ మాటలాడుట ప్రలాపము దుఃఖవచనము విలా పము. మాటిమాటికి చెప్పుట యనులాపము, ఉక్తి ప్రత్యుక్తులు సల్లాపము, మరొక విధముగ చెప్పుట అపూపము. వార్తను మోసికొని పోవుట సందేశము. ఒక విషయమును ప్రతిపాదించుకు నిర్దేశము. తత్త్వమును చెప్పుట అతిదేశ ము. యన్యవర్ణనము అపదేశ ము; శిక్షా పూర్వ కవచనము ఉపదేశ ము; వ్యాజోక్తి వ్యపదేశము. ఇతరులకు విషము బోధించుటకై ఉత్తమ బుద్దినాశ్రయించి వాగోరంభము చేయవలెను. దానికి భీతి, వృత్తి, ప్రవృతియని మూడు భేదములు.
అగ్ని మహాపురాణమన శృంగారాది రసనిరూపణమను మూడువందల ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 340 of the Agni Mahā Purana is as follows:
The theory of rīti (compositional style) is presented through the four great styles: Vaidarbhī (graceful, mellifluous, suited to śṛṅgāra), Gauḍī (forceful, complex, suited to vīra and raudra), Pāñcālī (balanced, lucid, used in narrative) and Lāṭī (plain speech, close to colloquial usage). The four vṛttis (theatrical modes of presentation) — Bhāratī (verbal-dominated), Ārabhaṭī (energetic-physical), Kaiśikī (graceful-feminine), and Sātvatī (heroic-grand) — are described as the performing counterparts to the literary rītis. The chapter elaborates the four aṅgas of the Bhāratī vṛtti, including the thirteen sub-types of vīthī (a minor dramatic form requiring quick wit and situational comedy), providing a comprehensive taxonomy of Sanskrit aesthetic expression.