అగ్ని మహా పురాణము

66 - అథ సాధారణప్రతిష్ఠావిధానమ్.

శ్రీ భగవానువాచః

సముదాయ ప్రతిష్ఠం చ వక్ష్యే సా వాసుదేవవత్

ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వేశ్వినౌ తథా.

ఋషయశ్చ తథా సర్వే వత్యే తేషాం విశేషకమ్

యస్య దేశస్య యన్నామ తస్యాద్యం గృహ్య చాక్షరమ్.

మాత్రాభిర్భేదయిత్వా తు దీర్ఘాణ్యఙాని భేదయేత్

ప్రథమం కల్పయేద్బీజం సబిష్ణుః ప్రణవం గతిమ్.

సర్వేషాం మూలమ శ్రేణ పూజనాం స్థాపనం తథా

నియమ వతకృచ్ఛాణాం మఠ సంక్రమవేశ్మ నామ్.

మాసోపవాసద్వాదశ్యామిత్యాదిస్థాపనం వ

శిలాం పూర్ణఘటం కాంస్యం సంభారం స్థాపయే త్తత.

బ్రహ్మకూర్చం సమాహృత్య శ్రీ పేద్యవమయం చరుమ్

క్షి రేణ కపిలాయాస్తు తద్విషోరితి సాధకః.

ప్రణవేనాభిఖార్యైవ దర్వ్యా సంఘట్టయే త్తతః

సాధయిత్వావతార్యాథ విష్ణుమభ్యర్చ్య హోమయేత్.

వ్యాహృత్యా చైవ గాయత్ర్యా తద్విపా సేతి హోమయేత్

విశ్వతశ్చక్షు ర్వేదాద్యైర్బర్నయే తథైవ చ.

సూర్యాయ ప్రజాపతయే ఆ రిక్షాయ హోమయేత్

ద్యౌః స్వాహా బ్రహ్మణే స్వాహా పృథివీమహారాజకః.

తస్మై సామం చ రాజానమిన్గాద్యైర్హోమమాచరేత్

ఏవం హుత్వా చరోర్బాగాన్దద్యాద్దిగ్బలిమాదరాత్.

హయగ్రీపుడు పలికెను - ఇప్పుడు దేవసముదాయ ప్రతిష్టను గూర్చి చెప్పెదను. ఇది కూడ వాసుదేవ ప్రతిష్ట వలెనే చేయవలెను. ఆదిత్య - వసు - రుద్ర . సాధ్య - విశ్వేదేవ . అశ్వినీ కుమార - ఋషి - ఇతర దేవగణములకు దేవసముదాయ మని పేరు. వీరి స్థాపనలో నున్న విశేషములు చేప్పెదను. ఆయా దేవతల పేర్లలోని మొదటి అక్షరము గ్రహించి దానికి స్వరములు చేర్చవలెనుదీర్ఘ స్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగన్యాసము చేయవలెను. ఆ ప్రథమాక్షరమునకు బిందువు, చేర్చి బీజముగ గ్రహింపవలెను. ప్రణవనమస్కారములు చేర్చవలెను. సమస్తదేవతలను మూలమంత్రముతోడనే పూజించి స్థాపింపవలెను. ఇవి కాక, స్థాపనావిషయమున అవలంబింపవలసిన నియమములను, వ్రతములను, కృచములను. మఠ - సేతు - గృహాదులను, మాసోపవాస - ద్వాదశీవ్రతాదులను చేప్పెదను. ముందుగా శిలా - పూర్ణకుంభ - కాంస్య పాత్రలు తీసికొని వచ్చి ఉంచవలెను. పిమ్మట సాధకుడు బ్రహ్మకూర్చ గైకొని “తద్విష్ణోః పరమం పదమ్” అను మంత్రముతో కపిలగోవుపాలతో యవచ రువును వండవలెను. ఓం కారముతో దానిలో నేయిపోసి, గరటితో ఎనపవలెను. పిదప శ్రీవిష్ణు పూజ చేసి హోమము చేయవలెను. వ్యాహృతి గాయత్రులతో కూడిన తద్విప్రాసో ఇత్యాదిమంత్రముతో చరుహోమము చేయవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది వైదిక మంత్రముతో భూమి - అగ్ని - సూర్య. ప్రజాపతి - అన్తరిక్ష - ద్యౌ - బ్రహ్మన్ - పృథ్వీ - కుబేర - సోమశ బ్దములను చతుర్థ్యంతములు చేసి, వాటికి “స్వాహా” చేర్చి, ఆ దేవతల నుద్దేశించి ఆహుతు నీయవలెను, ఇంద్రాది దేవతలకు ఆ దేవతలకు సంబంధించిన మంత్రములు చదువుచు ఆహుతు లివ్వవలెను. చరు భాగమును ఈ విధముగ హోమము చేసి ఆదర పూర్వకముగ దిగ్బలు లీయవలెను.

సమిధోఇష్టశతం హుత్వా పలాశాంశ్చాజ్యహోమకమ్

కుర్యాత్పురుషసూక్తేన ఇరావతితిలాష్టకమ్.

 హుల్వా తు బ్రహ్మ విష్ణ్వీశ దేవానామనుయాయినామ్

గ్రహాణాహుతీర్హుల్వా లో కేశానామథోపునః.

పర్వతానాం నదీనాం చ సముద్రాణాం తథాహుతీ

హుత్వా చ వ్యాహృతీర్గద్యా త్సువపూర్ణాహుతిత్రయమ్.

నౌషడ నేన మ శ్రేణ వైష్ణవేన పితామహ

పఞ్చగవ్యం చరుం ప్రాశ్య దత్తా చార్యాయ దక్షిణామ్.

తిలపాత్రం హేమయుక్తం సవస్త్రం గామలంకృతామ్

ప్రీయతాం భగవాన్విష్ణుంత్యుత్సృజేద్ర్వతం బుధః.

పిదప నూట ఎనిమిది పలాశ సమిధలను హోమము చేసి, పురుష సూక్తముతో ఆజ్యహోమము చేయవలెను, “ఇరావతీధేనుమతీ” అను మంత్రముతో తిలాష్టక హోమము చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులుకు, మరల ఆహుతు లీయవలెను. పర్వత నదీసముద్రములకు కూడ హోమములు చేసి, మహావ్యాహృతులను చ్చరించుచు, స్రువముతో మూడు పూర్ణాహుతు లియవలెను. పితామహా! 'నౌషట్' చేర్చిన వైష్ణవ మంత్రముతో పంచ గవ్యమును, చదువును ప్రాశనము చేసి, ఆచార్యు-కు సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా నీయవలెను. “భగవాన్ విష్ణుః ప్రియతామ్” అని పలుకుచు వ్రతవిసర్జనము చేయవలెను.

మాసోపవాసాదేర న్యాం ప్రతిష్ఠాం వచ్మి పూర్వతః

యజైనాతోష్యదేవేశం శ్రపయేద్వైష్ణవం చరుమ్.

తిలతణులనీవారైః శ్యామా కైరథవా యవే

ఆజ్యేనాఘార్య చోత్తార్య హోమధేన్మూర్తిమ న్తకై .

విష్ణ్వాదీనాం మాసపానాం తద నే హోమయేత్పునః

ఓం విష్ణవే స్వాహా ఓం విష్ణవే విభూషణాయ స్వాహా; ఓం విష్ణవే శిపి

విష్టాయ స్వాహాః ఓం నరసింహాయ స్వాహా; ఓం పురుషోత్తమాయ స్వాహా.

ద్వాదశాశ్వతసమిధో హోమయేదృతసంపుతాః

విష్ణోర రాటమన్రణతతో ద్వాదశ చాహుతీకి

ఇదం విష్ణోరిరావతీ చరోర్ద్వాదశ చాహుతీః.

హత్వా బాజ్యాహుతీ సద్వ త్తద్వీపా నేతి హోమయేత్

శేషహోమం తతః కృత్వా దద్యాత్పూర్ణాహుతిత్రయమ్.

యుజ్జుతే త్వనువాకం తు జప్త్వా ప్రాశ్నీత వై చరుమ్

ప్రణవేన స్వశఙానే కృత్వా పాత్రే తు వైప్పలే.

తతో మాసాధిపానాం తు విప్రాన్ ద్వాదశ భోజయేత్

త్రయోదశో గురు స్తత్ర తేభ్యో దద్యా త్రయోదశ.

కుమాన్వాద్వమ్బుసంయుక్తా నచ్ఛతోపానహాన్వితాన్

సవస్త్ర హేమమాల్యాడ్యాన్వతపూర్యై త్రయోదశ.

గావ ప్రీతిం సమాయాన్లు ప్రచరత్తు ప్రహర్షితాః

ఇతి గోపథమత్సృజ్య యూపం తత్ర నివేశయేత్.

దశహ స్తం ప్రపారామ మఠసంక్రమణాదిషు

గృహే చ హోమమేవం తు కృత్వా సర్వం యథావిధి.

పూర్వో కేన విధానేన ప్రవి శేచ్చ గృహం గృహీ

ఆనివారితమన్నాద్యం సర్వేశ్వేతేషు కారయేత్.

ద్విజేభ్యో దక్షిణా దేయా యథాశ క్తి విచక్షణె

 ఆరామం కార యేద్యస్తు నన్దనే స చిరం వసేత్.

మఠప్రదానాత్స్వర్లో కే శత్రలో కే వసేత్తతః

ప్రపాదానాద్వారుణేన సంక్రమేణ వసేప్టివి.

ఇష్టకా సేతుకారీ చ గోలో కే మార్గకృద్దవామ్

నియమవ్రతకృద్విష్ణుః కృచ్ఛకృత్సర్వపాపహా,

గృహం దత్వా వసేత్స్వళే యావదాభూతసంప్లవమ్

సముదాయప్రతి ష్ఠేష్టా శివాదీనాం గృహాత్మనామ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సాధారణ ప్రతిష్ఠా కథనం నామ షట్ షష్టితమోధ్యాయః.

ఇపుడు మరియొక మాసోపవాసాది విధిని చెప్పుచున్నాను. ముందుగా యజ్ఞముచే శ్రీహరిని సంతుష్టుని చేయవలెను తిల - తండుల - నీవార - శ్యామాకములతో, శ్యామాకములకు బదులు యవలతో వండిన వైష్ణవ చరువును నేతితో కలిపి మూర్తి మంత్రముతో హోమము చేయవలెను. పిమ్మట మాసాధిపతులైన విష్ణ్వాది దేవతల నుద్దేశించి మరల హోమము చేయవలెను. 'ఓం శ్రీవిష్ణవే స్వాహా' ఇత్యాది మంత్రములతో నేతిలో ముంచిన అశ్వత్త సమిధలతో పండ్రెండు హోమములు చేయవలెను, “విష్ణోరరాటమసి” అను మంత్రముతో కూడ పండ్రెండు హోమములు చేయవలెను. 'ఇరావతీ' ఇత్యాది మంత్రముతో పండ్రెండు చర హోమములు చేయవలెను, 'తడ్విస్రాసః' ఇత్యాది మంత్రముతో ఘృత హోమములు చేయ వలెను. పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. “యుజ్ఞతే”. ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరలో వడ్డించుకొని ఛరువును భక్షించవలెను. పిమ్మట మాసాధిపతుల నుద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణము లగు పదమూడు కలశముల, ఉత్త మమైన ఛత్రము పాదుకలు. వస్త్రములు, సుపర్ణము, మాలలు దానము చేయవలెను. వ్రతపూర్తి కి ఆన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. గోవులు ప్రసన్నములగుగాక, సంతోషముతో నవిచుశ్రీమదగ్ని మహాపురాణము రించుగాక. అని పలుకుచు గోపథమును(గోవులు మేయుటకు స్థానము) విడచిపదిహ స్తముల ఎత్తైన యూపస్తంభము పాతవలెను. గృహస్థుడు ఇంటిలో హోమాదికార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధ్యనుసారము గృహములో ప్రవేశించ వలెను, అందరికిని, ఏ అడ్డులును లేకుండి అన్న దానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణ లీయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందనోద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును ప్రతి (చలివేందలి) దానము చేసినవాడు వరుణలోకమునందును. సేతునిర్మాణము చేసినవాడు దేవలోకమునందును నివసించును. ఇటుకలతో సేతువు నిర్మించువాడు కూడ స్వర్గమును పొందును. గోపథమును నిర్మించు వాడు గోలోకము పొందును. నియమములను వ్రతమును ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపుడగును కృచ్చవ్రతములు చేయువాడు సమస్త పాపములను నశింపచేసికొనును గృహదానము చేసినవాడు మహాప్రలయము వరకును స్వర్గములో నివ సించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను.

శ్రీ అగ్ని మహాపురాణమునందు సాధారణ ప్రతిష్టాకథనమను ఆరువది యారవ అధ్యాయము సమాప్తము.