అగ్ని మహా పురాణము

230 - అథ శకునాని

పుష్కర ఉవాచః

ఔషధాని చ యుక్తాని ధాన్యం కృష్ణమశోభనం

 కార్పాసం తృణ శుష్కఞ్చ గోమయం వైధనానిచ.

అంగారం గుడనర్ణౌచ ముండాభ్యక్తం చ నగ్నకమ్

 ఆయః పంకం చర్మ కేశౌ ఉన్మ త్తంచ నపుంసకమ్.

 చండాలశ్వపచాద్యాని నరా బంధన పాలకాః

 గర్భిణీ స్త్రీచ విధవాః పిణ్యాకాదీని వైమృతమ్.

తుషభస్మకపాలాస్థి భిన్న భాండమశ స్తకమ్

ఆశస్తో వాద్యశబ్దశ్చ భిన్నభైరవ జర్జరః.

ఏహితి పురతః శబ్దః శస్యతే నతు పృష్ఠతః

గచ్చేతిపశ్చాచ్చబ్దోఽగ్య్రః పురస్తాత్తు విగర్హిత. 

క్వయాసి తిష్ఠమాగచ్ఛ కింతే తత్ర గతస్యచ

అనిష్టశబ్దా మృత్యర్థం క్రవ్యాదశ్చ ధ్వజాదిగః.

 స్థలనం వాహనానాంచ శస్త్రభంగ స్తథైవచ

 శిరోఘాతశ్చ ద్వారాద్యైశ్చత్రవాసాదిపాతనమ్.

హరిమభ్యర్చ్య సంస్తుత్య స్యాదమంగల్య నాశనమ్

 ద్వితీయం తు తతోదృష్ట్వా విరుద్ధం ప్రవిశేద్గృహమ్.

పుష్కరుడు పలికెను: పరశూమా! యాత్రాసమయమున, శ్వేతవస్త్రములు, స్వచ్చమైన ఉదకము, ఫలభరితమగు వృక్షము, నిర్మలాకాశము, క్షేత్రములలోని సస్యములు, నల్లని ధాన్యము కనబడుట అశుభము. దూది, తృణములు కలిసిన ఎండినగోమయము (పిడకల), సుత్తి, బొగ్గులు, గుడము, కరాయల, తలగొరిగించుకొని తైలము పట్టించుకొనిన నగ్న సాధువు, ఇనుము, బురద, చర్మము, వెండ్రుకలు, పిచ్చి వాడు, నపుంసకుడు, చండాలుడు, కారాగారాధికారి, గర్భిణి, విధవ, తెలకపిండి, మృత్యువు, ఊక, బూడిద, నిప్పులు, ఎముకలు, బ్రద్దలై న పాత్రలు - ఇవి యుద్ధయాత్రాసమయమునందు కనబడుట అశుభము. బ్రద్దలైన తాళము చిప్పలధ్వనివలె భయంకరముగ వినవచ్చు వాద్యధ్వని మంచిదికాదు. “బయలుదేరిరమ్ము” అను శబ్దము ముందు నుండి విన బడినచో శథము; వెనుక నుండి వినవచ్చినచో ఆశుభము. 'వెళ్ళుము' అను శబ్దము. వెనుక నుండి వినబడినచో శుభము ; ముందు నుండి వినబడినచో అకథము, “ఎక్కడికి వెళ్ళుచున్నావు ? ఆగుము; వెళ్ళకము. అచటికి వెళ్ళుట చే నీకేమి లాభము ? ఇట్టి మాటలు అనిష్టసూచకములు, ధ్వజాదలపై గ్రద్ద మొదలగి మాంసాహారి పనులు కూర్చున్నన, అశ్వ - గజావాహనములు తోట్రువడి పడిపోయినను. ఆయుధము విరిగిపోయినను, ద్వారాదులు తగిలి శిరస్సు పై దెబ్బ తగిలినను, ఛత్ర వస్త్రాదులను ఎవ్వడై నను క్రింద జార విడచినను, ఈ ఆపశకునములన్నియు మృత్యు కారకములు. శ్రీ మహావిష్ణువును పూజించి స్తుతించినచో ఆమంగళములు తొలగిపోవును. రెండవ పర్యాయము కూడ ఈ ఆపశకునములు కనబడినచో ఇంటికి తిరిగి వచ్చి వేయవలెను

శ్వేతాః సుమనసః శ్రేష్టాః పూర్ణకుంభో మహోత్తమః 

మాంసం మత్స్యా దూరశబ్దా వృద్ధ ఏకః పశు స్త్వజః.

గావస్తురంగమానాగా దేవాశ్చ జ్వలితోఽనలః

దూర్వార్ద్రగోమయం వేశ్యా స్వర్ణరూప్యంచ రత్నకమ్.

 వచా సిద్దార్థ కౌషధ్యో ముద్గ ఆయుధ ఖడ్గకమ్

 ఛత్రం పీఠం రాజలింగం శవం రుదితవర్ణితమ్.

 ఫలంఘృతం దధిపయోహ్యక్షతా దర్శమాక్షికమ్

 శంఖ ఇక్షుః శుభం వాక్యం భక్తవాదిత్రగీతకమ్.

 గంభీర మేమస్తనితం తడిత్తుష్టిశ్చ మానసీ

ఏకతః సర్వలింగాని మనసస్తుష్టి రేకతః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మాంగల్యధ్యాయో నామత్రింశదధిక ద్విశతతమోధ్యాయః

యాత్రా సమయమున తెల్లని పుష్పములు కనబడుట శుభప్రదము. జలపూర్ణకుంభము కనబడుట అత్యుత్తమము. మాంసము, మత్స్యములు, దూరము నుండి కోలాహలము, ఒంటరియైన వృద్దుడు, మేకలు, గోవులు అశ్వములు, గజములు, దేవప్రతిమలు, మండుచున్న అగ్ని, దూర్వలు, గోమయము, వేశ్య, బంగారము, వెండి, రత్నములు, వనఆవాలు మొదలైన ఓషధులు, పెసలు, ఆయుధములలో ఖడ్గము, ఛత్రము, బల్ల, రాజచిహ్న ములు, కూడా విలాపించువారు లేని శవము, ఫలములు, నెయ్యి, పెరుగు, పాలు, ఆక్షతలు, అద్దము, తేనె, శంఖము, చేరకు, శభసూచక ములగు మాటలు, భక్తుల గాన - వాద్యవాదనములు, మేమగంభీరగర్జనము, మెరుపు మెరయుట, మనసంతోషము- ఇవన్నియు శుభశకునములు. శుభ శకునములన్నియు ఒక ప్రక్క , మనఃప్రసాదము ఒక ప్రక్క-ఈ రెండును సమానములు,

అగ్ని మహాపురాణమునందు శకునవర్ణన మను రెండువందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.