అగ్ని మహా పురాణము

208 - అథ వ్రతదానసముచ్చయః.

అగ్ని రువాచః-

 వ్రతదానాని సామాన్యం ప్రవదామి సమాసతః

తిథా ప్రతిపదాదౌ చ సూర్యాదౌ కృత్తికాసు చ.

విష్కమాదౌ చ మేషాదౌ కాలే చ గ్రహణాది కే

య్కూలే యద్ర్వతం దానం యద్దవ్యం నియమాది యత్.

తద్దవ్యాఖ్యం చ కాలాఖ్యం సర్వం వై విష్ణుదై వతమ్

రవీశబ్రహ్మలక్ష్మ్యాద్యః సర్వే విష్ణోర్విభూతయః.

సముద్దిశ్య వ్రతం దానం పూజాది స్యాత్తు సర్వదమ్

జగత్పతే సమాగచ్ఛ హ్యాసనం పాద్యమకమ్.

మధుపర్కం తథా చామం స్నానం వస్త్రం చ గన్టకమ్

 పుష్పం ధూపశ్చ దీపశ్చ నైవేద్యాది నమోస్తుతే.

ఇతి పూజా వతే దానే దానవాక్యం సమం శృణు

అద్యాముక సగోత్రాయ విప్రాయముక శర్మణే.

ఏతద్దవ్యం విష్ణుదేవం సర్వపాపోప నయే

ఆయురారోగ్యవృద్ద్యర్థం సౌభాగ్యాదిపివృద్దయే. 

గోత్రసస్త తివృద్ద్యర్ధం విజయాయ ధనాయ చ

ధర్మా యైశ్వర్య కామాయ తత్పాపశమనాయ చ.

సంసారముక్త యే దానం తుభ్యం సంప్రదదే హ్యహమ్

ఏతద్దాన ప్రతిష్టార్ధం తుభ్యమేతద్దదామ్యహమ్.

 ఏతేన ప్రీయతాం నిత్యం సర్వలోకపతిః ప్రభుః

యజ్ఞదానవ్రతపతే విద్యాకీర్త్యాది పేహి మే.

ధర్మ కామార్థ మోక్షాంశ్చ దేహి మే మన సేప్సితమ్

యః పఠేచ్ఛృణుయాన్నిత్యం వ్రతదానసముచ్చయమ్.

సంప్రాప్త కామో విమలో భుక్తిం ముక్తిమవాప్నుయాత్

తిథివారర్జసం కాస్తా యోగమన్వాదికం వ్రతమ్

నైకధా వాసుదేవాదేర్నియమాత్పూజనాద్భవేత్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే వ్రతదానసముచ్చయో నామాష్టాధిక ద్విశతతమోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను : వసిష్టా! ఇపుడు, సామాన్య వ్రతమును గూర్చియు, దానములను గూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. ప్రతిపదాదితిథులందును సూర్యవారాదులందును, కృత్తికానక్షత్రములందును విష్కంభాది యోగములందును, మేషాది రాశులందును, గ9హణాది సమయము బందును చేయ దగిన వ్రతములు, దానము వాటికి సంబంధించిన ద్రవ్యములు, నియమాదులు వీటిని గూర్చి కూడ చెప్పెదను. ప్రతూనోపయోగులగు ద్రవ్యములకును, కాలమునకును, ఆధిష్ఠాతయైన దేవత శ్రీమహావిష్ణువు. సూర్యశివబ్రహ్మలక్ష్మ్యాది దేవతలందరును శ్రీమహావిష్ణు విభూతులే. అందుచే ఆయనను ఉద్దేశించిచేసిన వ్రతదాన పూజనాదులు సకలమనోరథప్రదములు. “ఓ జగత్పతీ! నీకు నమస్కారము. రమ్ము. ఆసన-అర్ఘ్య-మధుపర్క-ఆచమనస్నాన వస్త్ర-గంధ-పుష్ప ధూప-దీప-నైవేద్యములనుహించుము” ఆని ప్రార్థించి పూజించవలెను. పూజా వత-దాన ములందు పై మంతముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇప్పుడుసామాన్యదావసంకల్పమును గూర్చి వినుము. ఈ రోజున, ఈ గోతము గల, ఈ శర్మ అనుబ్రాహ్మణునకు నేను సమస్త పాపశాంతి, ఆయురారోగ్యవృద్ధి, సౌభాగ్యోదయము కలుగుటకై, గోత్ర-సంతానవిస్తృతి, ధనవిజయప్రాప్తికై, ధర్మ- ఆర్థ -కామసంపాదనమునకై, పాపనాశ పూర్వకముగ సంసారమునుండి విముక్తి పొందుటకై, విష్ణువునకు సంబంధించిన ఈ వస్తువును దానము చేయుచున్నాను. ఏతద్దానసాద్గుణ్యార్థమై మీకు సువర్ణాది ద్రవ్యములను గూడ సమర్పించుచున్నాను. నేను చేసిన ఈ దానముచే సకలలో కేశ్వరుడగు శ్రీహరి సర్వదా ప్రసన్ను డగుగాక. ఓ యజ్ఞ-దాన వ్రతాధీశా! నాకు విద్యాయక స్సులను అనుగ్రహించుము. ధర్మార్థ కామ మోక్షరూపములగు నాలుగు పురుషార్థములను, మనోభిలషితము లగు వస్తువులను అనుగ్రహించుము” ఈ వ్రతదానసముచ్చయమును ప్రతిదినము పఠించువాడు అభీష్ట లాభములను పొంది, పాపరహితుడై భుక్తిముక్తులను రెండింటిని పొందును. వాసుదేవాదులకు సంబంధించిన ఇట్టి పూజానియమాదులచే అనేక విధములగు తిథి వార - నక్షత్ర - సంక్రాంతి - యోగ - మన్వాదిసంబంధివ్రతము ననుష్ఠించిన ఫలము సిద్ధించును.

అగ్ని మహాపురాణమునందు వ్రతదాన సముచ్చయవర్ణన మను రెండువందల ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.