అగ్ని రువాచః
ఆత్య న్తికంలయం వక్ష్యేజ్ఞానాదాత్య న్తికో లయః ।
ఆధ్యాత్మికాదిసంతాపం జ్ఞాత్వాస్వన్య విరాగతః.
ఆధ్యాత్మికస్తు సంతాపః శారీరో మానసోద్విదా ।
శారీరో బహుభి ర్భేదై స్తాపోఽ సౌ శ్రూయతాంద్విజ.
త్యక్త్వాజీవో భోగదేహం గర్భమాప్నోతి కర్మభిః ।
ఆతవాహిక సంజ్ఞస్తు దేవోభవతి వై ద్విజ.
కేవలం సమనుష్యాణాం మృత్యుకాల ఉపస్థితే ।
యామ్యైః పుంభిర్మనుష్యాణాం తచ్ఛరీరం ద్విజోత్తమ.
నీయతే యామ్యమార్గేణ నాన్యేషాంప్రాణినాంమునే।
తతః స్వర్యాతి నరకం సభ్రమద్వదట యంత్రవత్.
కర్మభూమిరియం బ్రహ్మనుల భూమిరసౌస్మృతా ।
యమోయోనిశ్చ నరకం నిరూపయతి కర్మణా.
పూరణీయాశ్చతేనైవ యమంచై వాను పశ్యతామ్ ।
వాయుభూతాః ప్రాణినకగర్భంతే ప్రాప్నువ నిహి.
యమదూతై ర్మనుష్యస్తు నీయతే తంచపశ్యతి ।
ధర్మీచ పూజ్యతేతేన పాపిష్ఠస్తాడ్యతే గృ హే.
శుభాశుభం కర్మతస్య చిత్రగుప్తో నిరూపయేత్ ।
భాంధవానామశౌచేతు దే హేఖల్వాతివాహికే.
తిష్ఠన్న యతి ధర్మజ్ఞ దత్తపిండాశనం తతః ।
తంత్యక్త్వా ప్రేతదేహను ప్రాప్యాన్యం ప్రేతలోకతః.
వసేత్తుధాతృషాయుక్తా ఆమ శ్రాద్ధాన్న భుజ్ నరః ।
ఆతివాహిక దేహాత్తు ప్రేతపిండై ర్వినానరః.
నహిమోక్షమవాప్నోతి పిండాం సతై వ సోఽశ్నుతే ।
కృతే సపిండిక రణే నరః సాంవత్సరాత్పరమ్.
ప్రేత దేహం సముత్సృజ్య భోగదేహం ప్రపద్యతే ।
భోగదేహావభౌ ప్రోక్తావశుభాశుభ సంజ్ఞతౌ.
భుక్త్వాతు భోగదే హేన కర్మబంధాన్ని పాత్యతే ।
తందేహం పతత స్తస్మాదృక్షయ ని నిశాచరా.
పాపేతిష్ఠతి చేత్స్వర్గం తేన భుక్తం తదాద్విజా ।
తదా ద్వితీయం గృహ్లాతి భోగదేహను పాపినామ్.
భుక్త్వా పాపస్తువై పశ్చాద్యేన భుక్తం త్రివిష్టపమ్ ।
శుచీనాం శ్రీమతాంగేహే స్వర్గభ్రష్ట్రోఽభి జాయతే.
పుణ్యేతిష్ఠతి చేత్పాపంతేన భుక్తంతదాభవేత్ ।
తస్మిన్నం భక్ష్మితే దేహేశుభం గృహ్లాతి విగ్రహమ్.
కర్మణ్యల్పావశేషేతు నర కాదపి ముచ్యతే ।
ముక్తస్తు నర కాద్యాతి తిర్యగ్యోనిం న సంశయః.
అగ్ని దేవుడు పలికెను. ఆత్యంతిక ప్రళయమును గూర్చి చెప్పెదను. ఇది జ్ఞానము వలన కలుగును, ఆధ్యా త్మికాది సంతాపమును తెసుకొని మానవుడు తన విషయముననే కొంత వైరాగ్యమును పొందవలయును. అపుడు జ్ఞానము కలుగును. ఆధ్యాత్మిక సంతాపము “శారీరము” మానసము అని. రెండు విధములు, శారీరక సంతాపము అనేక విధము లై నది. వాటిని గూర్చి వినము. జీవుడు భోగ దేహమును త్యజించి కర్మానుసారముగ గర్భమున చేరును. ఆతిదాహిక మను ఒక దేహ ముండును. మనుష్యులకు మృత్యు కాలము వచ్చినపుడే ఆ దేహము లభించును. యమదూతలు ఆ శరీ రమున యమలోక మార్గము యమ లోకమునకు తీసుకొని పోవుదురు. ఇతర ప్రాణులట ఈ ఆతిపాక శరీరము వుండదు, యమ లోకమునకు వెళ్ళిన జీవుడు కొంత కాలము స్వర్గము, కొంత కాలము నరకము కందుచు మట యంత్రము వలే తిరుగుచుండును. ఇది కర్మ భూమి. పరలోకము ఫల భూమి. యముడు ఆయ జీవుల కర్మానుసారముగా వివిధ యోనులను వరకములను వారికి ఇచ్చును. ఆతడే నరకములను నింపుచుండును. యముడే వీరికి నియామకుడు. జీవుడు వాయు రూపమున గర్భములో ప్రవేశించుచుండును. యమ దూతలచే తీసుకొని వెళ్ళబడిన జీవుని యముడు చూచును. ఆ జీవుడు ధర్మాత్ముడే నచో యముడు ఆతనిని పూజించును. పాపాత్ములైనచో తన లోకమున ఆతనిని దండించును. వాని శుభా శుభ కర్మలను గూర్చి చితగు పుడు వివరించి చెప్పును. బంధువులకు ఆశాచము తీరు వరకును జీవుడు ఆతీవాహిక శరీరములోనే వుండి వారిచ్చిన పిండములను భుజించును. పిదప పేత లోకము చేరి ప్రేత దేహమును విడచి మరియొక భోగ దేహమును పొంది ఆకలి దప్పికలతో బాధపడుచు ఆచట నివసించును. శ్రాద్ధ రూపమున ఇవ్వబడు ఆపద్రవ్య మును ఆతడు భుజించును. ప్రేమకు పిండ దానము లేకుండగ చేయనిచో వానికి ఆతివాహిక దేహము నుండి విడుదల వుండదు. సపిండీకరణ శ్రాద్దము wరిగిన సంవత్సరమునకు తరువాత వాడు పేత దేహము విడచి భోగ దేహమును పొందను శుభ దేహము, అశుభ దేహము ఆని ఆది రెండు విధములు. ఆ దేహముతో కర్మ బంధములను అనుభవించిన పిమ్మట, పర్వ లోకమునకు గెంటి వేయబడున. అపుడు ఆతను విడిచిన దేహమున నిశాచరులు భక్షింతురు. మొదట పుణ్య ఫల మగు స్వర్గమును అనుభవించినచో పాప భోగము మిగిలి యున్నచో మరొక భోగ శరీరమును ధరించును. కాని పాప ఫలమును ఆమఠవించినవాడు పిదప స్వర్గ సుఖమును అనుభవించి దాని పిమ్మట స్వర్గ భ్రష్టుడై పవిత్రులగు శ్రీమంతుల గృహము లందు జనించును. పుణ్యము వుండగా ముందు పాప ఫలము అనుభవించిన వాడు ఫల భోగము పూర్తియైన పిమ్మట ఉత్తమ దేహమును ధరించును. కర్మ భోగము కొంచెము మాత్రమే మిగిలి యుండగా జీవునకు నరకము నుండి విముక్తి లభించుమ. వరక విముక్తుడు తిర్యగ్యోనిలో పట్టును. సందేహము లేదు.
జీవః ప్రవిష్టో గర్భన్తు కలలేఽప్య త్రతిష్ఠతి ।
మనీ భూతం ద్వితీయేతు తృతీయేఽవయవాస్తతః.
చతుర్థేఽస్థిత్వఙ్మాంసం పంచమే రోమసంభవః ।
షష్ఠే చేతోఽథ జీవస్యదుఃఖం విందతి సప్తమే.
జరాయు వేష్టితే దే హేమూర్థ్ని బద్ధాంజలి స్తథా ।
మధ్యేక్లీ బస్తు వామేస్త్రీ దక్షిణే పురుషస్థితిః.
తిష్ఠత్యుదరభాగేతు పృష్ఠ న్యాభి ముఖ స్తథా ।
యస్యాంతిష్ఠత్య సౌయోనౌతాం సవే త్తిన సంశయః.
నవచవేత్తి వృత్తాంత మారభ్యజన్మనః।
ఆంధకారంచ మహతీం పీడాం విన్ దతి మానవః.
మాతురాహారపీతస్తు సప్తమేమాస్యుపాశ్రుతే ।
అష్టమేనవమాసి భృశముద్విజతేతథా.
వ్యవాయే పీడా మాప్నోతి మాతుర్వ్యాయామ కే తథా ।
వ్యాధిశ్చ వ్యాధితాయాం స్యాన్ముహూర్తం శతవర్షవత్.
గర్బములో ప్రవేశించిన జీవుడు కలలము నడుండును. రెండవ మాసమున గట్టి పడును. మూడవ మాస మున అవయవములు ప్రకట మగును. నాల్గవ మాసమున ఆస్థి మాంస త్వక్ లు ఏర్పడును. ఐదవ మాసమున రోమములు పుట్టును. ఆరవ మాసమున చై తనము ఏర్పడును. ఏడవ మాసము నుండి దుఃఖము ననుభ వింప ప్రారంభించును. మావితో చుట్టబడిన దేహము నందు శిరస్సుపై దోసిలి కట్టి యుండును. గర్భ మధ్యమున నున్నచో నపుంసకుడు, వామ భాగములో వున్నచో స్త్రీ, కుడి ప్రక్క వున్న చో పురుషుడు, ఉదరము నందుండి పృష్ఠ భాగమునకు అభిముఖుడుగా వుండును. తాను ఏ యోని యందున్నాడో వానికి తెలియును. సందేహము లేదు. నవ జన్మ మొదలు సకల వృత్తాం తమును స్మరించును. ఆ అంధకారమున మానవుడు గొప్ప పీడను పొందును. ఏడవ మాసమున తల్లి భుజించిన ఆహార మును ఆ శిశువు పొందును. అష్టమ, నవమ మాసము లందు మిక్కిలి ఉద్విగ్నుడగును. మైథువ మ్మునందు ఇంకను పీడను పొందను. తల్లి ఆధిక వ్యాయామము చేసినను శిశువునకు పీడ కలుగును. ఆమెకు వ్యాధి యున్నచో శిశువు కూడ ఆరోగము యొక్క కష్టమను అనుభవించును. ఒక ముహూర్తము నూరు సంవత్సరముల వలె కనబడును.
సంతప్యతే కర్మభిస్తు కురుతేఽథ మనోరథాన్ ।
గర్భాద్వినిర్గతో బ్రహ్మన్మోక్ష జ్ఞానం కరిష్యతి.
సూతి వాతై రధోభూతో నిఃసరేద్యోనియంత్రతః ।
పీడ్యమానో మాసమాత్రం కరస్పర్శేన దుఃఖిత.
ఖశబ్దాతుద్ర స్రోతాంసి దేహేశ్రోతం వివిక్తతా ।
శ్వాసోచ్ఛ్వాసౌ గతిర్వాయోర్వక్ర సంస్పర్శనంతథా.
అగ్నేరూపం దర్శనం స్యాదూష్మా ప క్తిశ్చ పిత్తకమ్ ।
మేదావర్ణం బలం ఛాయాతేజః శౌర్యం శరీర కే.
జలాత్స్వేదంచరసనం దేహేవై సంప్రజాయతే ।
క్లేదో వసారసా రక్తం శుక్ర మూత్రకఫాదికమ్.
భూమేర్ఘాణం కేశనఖం గౌరవం స్థిరతో2స్థితః ।
మాతృజాని మృదూన్యత్ర త్వఙ్మాంస హృదయానిచ.
నాభిర్మజ్ఞాళకృన్మేదః క్లేదాన్యామాశయానిచ ।
పితృజాని శిరాస్నాయు శుక్రం చై వాత్మజానితు.
కామ క్రోధౌ భయంహర్షో ధర్మాధర్మాత్మతాతథా ।
ఆకృతిః స్వర వర్ణౌతు మేహనాద్యం తథాచయత్.
తామసాని తథాఽ జ్ఞానం ప్రమదాలస్య తృట్క్షుధా।
మోహమాత్సర్య వైగుణ్య శోకాయాన భయనిచ.
కామక్రోధౌ తథాశౌర్యం యజ్ఞేప్సా ఐహుభాషితా ।
అహంకారః పరావజ్ఞా రాజసాని మహామునే.
ధర్మే ప్సా మోక్ష కామిత్వం పరాభక్తిశ్చ కేశవే ।
దాక్షిణ్యం వ్యవసాయిత్వం సాత్త్వికాని వినిర్ది శేత్.
కర్మలతో బాధపడుచు ఎన్నియో మనోరథములు కలిగి యుండును. గర్భము నుంచి బయట పడగ నే మోక్ష జ్ఞానమునకు ప్రయత్నము చేయునట్లు వుండుమ. ప్రసూతి వాయు ప్రేరణచే ఆధోముఖుడై యోని యంత్ర పీడితుడై బయట పడును. ఒక మాసము వరకు చేతితో ముట్టుకొనినను వానికి పీడ కలుగును. ఆకాశము వలన వాని శరీరమణ చిన్న చిన్న రంధ్రములు, చెవి మొదలగునవి ఏర్పడును. వాయువు వలన శ్వాసోచ్చ్వాసములు గతి, ఆవయవములను ఇటు అటు తిప్పుతూ స్పృశించుట ఏర్పడును. అగ్ని వలన రూపము నేత్రములు వేడి జీర్ణ శక్తి పిత్తము, మేధ, వర్ణపటం, బలము ఛాయ తేజస్సు శౌర్యము, ఇవి శరీరము వందేర్పడును. జలము వలవ, చెమట, ఆస్వాదము, వస, రస, గ్రహణ శక్తి రక్తము, శక్రమూత్ర కఫాదికము ఏర్పడును. భూమి వలన ఫ్రతి కేళ, నఖములు బరువు ఏర్పడును. శరీరము నందలి త్వడ్మాస హృదయ, నాభి, మజ్జా, మల మేదన్, క్లేదనములు ఆమాశయములు తల్లి వలన పుట్టినవి. రన్స్నా రు శుక్ర ములు తండ్రి వల్ల పుట్టును. కామ క్రోధ భయ హర్ష, ధర్మ, ఆకృతి, స్వర, వర్ణ మేహన ఆదులు జీవుని శరీరమవ స్వతః ప్రకటన మగువ. అజ్ఞాన, ప్రమాద, ఆలస్య, ముధా, తృషా, మోహ, మాత్సర్య, వై గుణ, శోక, ఆభాస భయా దులు తమ గణము వలన బుట్టును. కామ, క్రోధ, శౌర్య యజ్ఞాభిలాష బహుభాషిత ఆహంకార అవాదరములు రజో గుణము వలన పుట్టును. ధర్మాభిలాష, మోక్షకామిత్వము విష్ణువు పై ఉత్తమ భక్తి, దాక్షిణ్యము, ఉద్యోగ శీలత్వము. ఇవి సత్వ గుణము వలన పుట్టును.
చపలః క్రోధనో భీరుర్బహు భాషీ కలిప్రియః ।
స్వ ప్నే గగనగశ్చైవ బహువాతోనరో భవేత్.
అకాలపరీతః క్రోధీమహాప్రాజ్ఞో రణప్రియః.
స్వప్నే చ దీప్తీమ త్ప్రేక్షీ బహుపిత్తో నరోభ వే త్.
స్థిరమిత్రః స్థిరోత్సాహ స్థిరాంగో ద్రవిణాన్వితః ।
స్వప్నే జలసితాలోకే బహుళ్లేష్మా నకోభవేత్.
రసను ప్రాణినాందే హే జీవనం దుధిరంతథా ।
లేపనంచ తథా మాంసమేహ స్నేహ కరస్తుతత్.
ధారణ న్వస్తి మజ్జాస్యాత్పూరణం వీర్యవర్దనమ్ .
శుక్రవీర్యకరం హ్యా జః ప్రాణ కృజీవసంస్థితి.
ఓజః శుకాత్సారతర మాపితం హృదయోపగమ్ ।
షడంగంగకి నీ రాహుర్మూర్తా జఠర మీరితమ్.
షట్ త్వచా బాహ్యతో యద్వదన్యా రుధిర ధారికా ।
విలానధారిణీ చాన్యా చతుర్థి కుండధారిణీ.
పంచమీ విదథిస్థానం షష్ఠి ప్రాణధరామతా ।
కలాస ప్రమీ మాంసకరా ద్వితీయా రక్తధారిణీ.
యకృత్ల్పీహాశ్రయా చాన్యా మేదోధారాఽస్థి ధారిణీ ।
మజ్జా శ్లేష్మ పురీషాణాంధరా పక్వాశయస్థితా।
షష్ఠీ పిత్తదరా శుక్రధరా శుక్రాశయాఽపరా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే అత్యున్తిక ప్రలయగర్భోత్పత్తి వర్ణనం నామైకోన సప్తత్యధిక త్రిశతతమోఽధ్యాయః.
చపలుడు క్రోధి భీరువు బహుభాషి కలహప్రియుడు స్వప్నమునందు ఆకాశములో సంచరించువాడు అగు మనుష్యు నిలో వాతము ప్రధానముగా నుండును. ఆకాలమున జుట్టు నెరసినవాడు కోపశీలుడు. మహాబుద్ధిమంతుడు యుద్ధ ప్రియుడు స్వప్నమునందు ప్రకాశించుచున్న వస్తువులను చూచువాడు అగు మనుష్యుని యందు పిత్తము అధికముగా నుండును. స్థిరమైన మైతి కలవాడు స్థిరోత్సాహుడు స్థిరాంగుడు ధనవంతుడు స్వప్నమున శ్వేత వస్త్రమును చూచువాడు అగు మనుష్యునిలో కఫము అధికముగా నుండును. ప్రాణుల దేహమున రసము జీవనమును, రక్తము లేపనమును, మాంసము, మోహన స్నేహ నములను కలగించును. ఆస్థులు - మజ్జి శరీరమును నిలుపును. వీర్యవృద్ధి శరీరమును పూర్ణము చేయును. ఓజస్సు శుక్ర వీర్య వృద్ధికరము. జీవుని స్థితికి ప్రాణమునకు ఆవష్టంభకము. ఓజము శుక్రము కంటే ఎక్కువ సారము కలది. ఆది హృదయ సమీపమునందుండును. కొంచెము పసుపు పచ్చగ వుండును. కాళ్ళు బాహువులు. శిరస్సు, ఉదరము. ఇవి షడంగములు. చర్మలో ఆరు పొరలుండును. బయటకు కనబడునది బాహ్యము. రక్తము ధరించునది రెండవది. మూడవది కిలాసమును, నాల్గవది కుండమును ధరించుము. ఐదవది ఇంద్రియముల స్థానము. ఆరవది ప్రాణధారణము చేయునది. కల కూడ ఏడు విధములు. మొదటిది మాంసములు ధరించుమ. రెండవది రక్తమును, మూడవది యకృత్ ప్లీ హలను, పాల్గవది మేధస్సును అస్థులను, ఐదవది మజ్జి శ్లేష్మ పురీషములను, ఆరవది పిత్తమును, ఏడవది శుక్రముమ ధరించును. ఐదవది పక్వాళయమునందున, ఏడవది శుక్రాశయమము నందును వుండును.
అగ్ని మహా పురాణమున ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి వర్ణనమను మూడు వందల అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 370 of the Agni Purāṇa is as follows:
The twenty-four Sāṃkhya tattvas are enumerated as the framework for understanding embodied existence. The five jñānendriyas (organs of knowledge: śrotra, tvak, cakṣus, rasanā, ghrāṇa), five karmendriyas (organs of action: vāc, pāṇi, pāda, pāyu, upastha), five tanmātras (subtle elements: śabda, sparśa, rūpa, rasa, gandha), mahat (cosmic intelligence), ahaṁkāra (ego-principle), and five mahābhūtas (ether, air, fire, water, earth) are described. Ātmā plus avyakta brings the count to twenty-four; adding puruṣa as the twenty-fifth illumines why liberation consists in the jīva recognizing its nature as the witness-puruṣa rather than the prakṛti-process. The chapter also introduces the seven āśayas (bodily cavities) and the special role of the garbhāśaya (uterus) as the gateway for embodied existence.