అగ్ని మహా పురాణము

10 - అథ యుద్ధకాణ్డ వర్ణనమ్.

నారద ఉవాచః

రామో క్తశ్బాఙ్గదో గత్వా రావణం ప్రాహ జానకీ

దీయతాం రాఘవాయాశు అన్యథా త్వం మరిష్యసి.

నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. “వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణించగలవు”.

రావణో హన్తుముద్యుక్తః

సఙ్గ్రామోద్ఠతరాక్షసః

రామాయాహ దశగ్రీవో యుద్ద మేకం తు మన్యతే.

యుద్దమునకై ఉద్దతులైన రాక్షసులు గల రావణుడు ఆతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. “దశగ్రీవుడు యుద్ధమును మాత్రమే కోరుచున్నాడు” అని రామునితో చెప్పెను.

రామో యుద్ధాయ తచ్చ్రుత్వా లఙ్కాం స కపి రాయయౌ

వానరా హనుమాన్మైన్దో ద్వివిదో జామ్బవాన్నలః.

నీలస్తారోఽఙ్గదో ధూమ్రః సుషేణః కేశరి గజః

వనసో వినతో రమ్భః శరభః క్రథనో బలీ.

గవాక్షో దధివక్త్రశ్చ గవయో-గంధమాదనః

ఏతే చాన్యే చ సుగ్రీవ ఏతై ర్యుక్తో హ్యసంఖ్య కైః.

ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ఆరుడు, అంగద-ధూమ- ను షేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరథ క్రథనులు, జల శాలియైన గవానుడు, దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వనరులును వెళ్లిరి. వీరితోడను, ఆనంఖ్యాకులగు ఇతర వానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళేను.

రక్షసాం వానరాణాం చ యుద్ధం సజ్కులమాబభౌ

రాక్షసా వానరాఞ్జఘ్నుః శరశక్తిగదాదిభిః.

వానరా రాక్షసాఞ్జఘ్నుః నఖద న్తశిలాదిభిః

హ స్త్యశ్వరథపాదాతం రాక్షసానాం బలం హతమ్.

వానర రాక్షసుల మధ్య సంకుల యుద్దము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు ఈ రూవములో నున్న సైన్యము చంపబడెను.

హనుమాన్గిరిశృఙ్గేణ ధూమ్రాక్షమవధీద్రిపుమ్

అకమనం ప్రహస్తం చ యుధ్య న్తం నీల ఆవధీత్.

హనుమంతుడు శత్రువైన ధూమ్రానుని పర్వతశిఖరముతో చంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న ఆకంపన. ప్రహస్తులను చంపెను.

ఇన్ద్రజిచ్ఛరబన్దాచ్ఛ విముక్తౌ రామలక్ష్మణౌ

తార్క్ష్య సన్దర్శనాద్బాణ్ణెర్జఘ్న తూ రక్షసాం బలమ్.

గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన తరబంధమునుండి విముక్తులైన రామలక్ష్మణులు బాణము లతో రాక్షన సైన్యమును సంహరించిరి.

రామః శరైర్జర్జరితం రావణం చాకరోద్రణే

రావణః కుమ్బకర్ణం చ బోధయమాస దుఃఖితః.

రణరంగమున రాముడు బాణములచే రావణుని జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.

కుమ్బకర్ణః ప్రబుద్ధోఽథ పీత్వా ఘటసహస్రకమ్

మద్యస్య మహిషాదీనాం భక్షయిత్వాహ రావణమ్.

నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంనము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

కుమ్భకర్ణ ఉవాచః

సీతాయా హరణం పాపం కృతం త్వం హి గురుర్యతః

ఆతో గచ్ఛామి యుద్దాయ రామం హన్మి సవానరమ్.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న తాన యుద్దమునకు వెళ్లి వానర సహితుడైన రాముని సంహరించెదను.

నారద ఉవాచః

ఇత్యుక్త్వా వానరాన్సర్వాన్ కుమ్భకర్ణో మమర్ధ హ

గృహీత స్తేన సుగ్రీవః కర్ణనాసం చకర్త సః.

కర్ణనాసావిహీనోఽసౌ భక్షయామాస వానరాన్

రామోఽథ కుమ్బకర్ణస్య బాహూ చిచ్చేద సాయకైః.

తతః పాదౌ తతశ్చిత్త్వా శిరో భూమౌ వ్యపాతయత్

కుంభకర్ణుడి విధముగ పలికి వానరులందరిని మర్దించెను. ఆతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవు లను, ముక్కును, కొరికి నెను. చెవులు ముక్కులేని ఆతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కంభ కర్ణుని బాహువులను, పాదములను ఛేదించి ఆతని శిరస్సు నేల పై పడవేసెను.

అథ కుమ్బో నికుంభశ్చ మకరాక్షశ్చ రాక్షసః.

మహోదరో మహాపార్శ్వే మత్త ఉన్మత్త రాక్షసః

ప్రమసో భాసకర్ణశ్చ విరూపాక్షశ్చ సంయుగే.

దేవా న్తకో నరాన్తశ్చ త్రిశిరాశ్చాతికాయకః

రామేణ లక్ష్మణేనైతే వానరైః సవిభీషణైః.

యుధ్యమానా న్తథా హ్యన్యే రాక్షసా భువి పాతితాః

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ - నికుంభ - మకరాక్ష - మహోదర - మహాపార్శ్వ - మత్త - ఉన్మత్త - ప్రఘన - థానకర్ణ - విరూపాక్ష - దేవాంతక - నరాంతక, త్రిశిరన్కా - అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.

ఇన్ద్రజిన్మాయయా యుద్ద్యన్రామాదీన్స మృబన్ద హ.

వరదత్తై ర్నా గబాణై రోషధ్యా తౌ విశల్యకౌ

విశల్యయా వ్రణౌ కృత్వా మారుత్యానీతపర్వతే.

హనూమాన్దారయామాస తత్రాగం యత్ర సంస్థితః

మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్దములైన నాగబాణములచే బంధించేను. హను మంతుడు తాను తీసికొనివచ్చిన పర్వతము పై ఉన్న విశల్యయను ఓషధి చేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

నికుమ్బిలాయాం హోమాది కుర్వన్తం తం హి లక్ష్మణః.

శరై రిన్ర్దజితం వీరం యుద్దే తం తు వ్యశాతయత్

రావణః శోకస న్తవ్తః సీతాం హన్తుం సముద్యతః.

అవిన్ద్యావారితో రాజా రథస్థః సభలో యయౌ

నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తును లక్ష్మణుడు బాణములతో సంహరించేను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్ళెను.

ఇన్ద్రోక్తో మాతలి రామం రథస్థం ప్రచకార తమ్.

రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ

రావణో వానరాన్ హ న్తి మారుత్యాద్యాశ్చ రావణమ్.

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూఢుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.

 రామః శస్త్రైన్తమస్త్రైశ్చ వవర్ష జలదో యథా

తస్య ధ్వజం స చిచ్చేద రథమశ్వంశ్చ సారథిమ్.

ధనుర్బాహూంశ్చిరాం స్యేవ ఉ త్తిష్ఠన్తి శిరాంసి పా

వైతామ హేన హృదయం భిత్వా రామేణ రావణః.

భూతలే పాతితః సర్వై రాక్షసై రురుదుః స్త్రీయః

రాముడు మేఘము వలె ఆ రావణుని పై అస్త్రాస్త్రములను కురిపించెను. ఆతని ధ్వజమును భేదించి, రథమును లగ్నము చేసి గుఱ్ఱములను, సారథిని చంపి, ఆతని ధనస్సును, బాహువులను, శిరస్సులను ఛేదించెను. కాని ఆతని శిరస్సు మరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే ఆతని హృదయమును భేదించి నేల పై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చిరి.

ఆశ్వాస్య తం చ సత్కృత్య రామాజ్ఞప్తో విభీషణః.

హనూమతానయద్రామః సీతాం శుద్దాం గృహీతవాన్

రామో వహ్నౌ ప్రవిష్టాం తాం శుద్దామిన్ద్రాదిభిః స్తుతః.

బ్రహ్మణా దశరథేన త్వం విష్ణూ రాక్షస మర్దనః

ఇన్ద్రోఽర్చితోఽమృతవృష్ట్యా జీవయామాస వానరాన్.

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చేను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే రుద్దురాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాది దేవతలును, బ్రహ్మయు, దశరథుడును “నీవు రాక్షససంహారివైన విష్ణువే” ఆని ఆతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను.

రామేణ పూజితా జగ్ముర్యుద్ధం దృష్ట్వా దివం చ తే

రామో విభీషణాయాదాల్లఙ్కామభ్యర్చ్య వానరాన్.

ఆ దేవతలు యుద్దము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్లిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.

ససీతః పుష్ప కే స్థిత్వాఽఽగతమార్గేణ వై గతః

దర్శయన్వనదుర్గాణి సీతాయై హృష్టమానసః.

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వన ములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్లెను.

భరద్వాజం నమస్కృత్య నన్దిగ్రామం సమాగతః

భరతేన నతశ్చాగాదయోధ్యాం తత్ర సంస్థితః.

భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్లి, భరతునిచే నమస్కరింపబడినవాడై అయోధ్యకు వెళ్ళెను.

వసిష్ఠాదీన్నమస్కృత్య కౌసల్యాం చైవ కైకయీమ్

సుమిత్రాంప్రావ్తరాజ్యోథ ద్విజాతీన్సోఽభ్యపూజయత్.

వసిష్ఠాదులకు నమస్కరించి, కౌనల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ సమస్కరించి, రాజ్యమును పొంది బ్రాహ్మణులను పూజించెను.

వాసుదేవం స్వమాత్మానమశ్వమేధై రథాయజత్

సర్వదానాని స దదౌ పాలయామాస స ప్రజాః.

పుత్రవద్ధర్మకామాదీన్ దుష్టనిగ్రహణే రతః

పిమ్మట ఆశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు ఆసక్తుడై ధర్మకామాదులను పాలించెను.

సర్వధర్మపరో లోకః సర్వసస్యా చ మేదినీ

నాకాలమరణశ్చాసీద్రామే రాజ్యం ప్రశాసతి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రామాయణే యుద్ధకాణ్డ వర్ణనం నామ దశ మోధ్యాయః.

రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు ఆసక్తులైరి. ఆకాలమరణము చెందినవాడెవ్వడును లేకుండెను.

అగ్ని మహాపురాణమున, రామాయణమునందలి యుద్ధకాండవర్ణనమను దశమాధ్యాయము నమాప్తము.