అగ్ని రువాచః-
కాత్యాయనో మునీనామా యథా శ్రాద్ధం తథా పదే ।
శ్రాద్ధం గయాదో కుర్వీత సంక్రాక్ష్యాదే విశేషతః.
కాలే ఊపరిపడే చ చతుర్థ్యామూర్ధ్వమేవ వా ।
సంపాద్య చ వదల్లే చ పూర్వేద్యుశ్చ నీమ క్రయత్.
యతీన్ గృహస్థాన్ సాధూన్వా స్నాతకక్షత్రీయాన్వీ జాన్ ।
తనవద్యోన్ కర్మనీషాన్ పాసాచార సంయుతోన్.
వన్డేడిచ్ఛికత్రికుష్ట్యా దీన్ న గృప్తాన్ని స్త్రీతోన్ ।
స్నాతాన్ శుచిర స్తదా దోస్తాన్ ప్రాజ్ముఖాన్ దేవకర్మణి.
ఉపవేశమే త్త్రీన్ ఓత్రోదీనేకై కీముభయత్ర వా ।
ఏవర మాతామహాదీంశ్చ శాకైపే చ కారయేత్.
తదహ్ని బ్రహ్మా చోరీ స్యోదేకోప్యోతీర్పరతో మృదుః ।
నతోప్రమత్తానధ్వన్యో అస్వాధ్యాయశ్చ వోగ్యత.
సర్వాంశ్చ పం క్రిమూర్ధన్యాన్ పృచ్ఛేత్రశ్నే తథాసన్ ।
దర్బానా స్త్రీర్య ద్విగుణాన్ పిత్రే దేవాదికం చేరేల్.
విశ్వాన్ దేవానావాహయి ష్యే పృచ్ఛేదావాహయేతి చ ।
విశ్వేదేపాస ఆవాక్య వితీర్యాథ యవాణా పిత్.
విశ్వేదేవాః శృణులేమం పితృనావాహయి ష్యే చ ।
పృచ్ఛేదావాయేత్యు కే ఉశ నపాకీ సమాహ్వయేత్.
తిలాన్వికీర్యాథ పేదాయ న్విత్యాది వైతృకే ।
పవితీ నిషిణ్చేదాకి శన్నోదేవీ రబిత్ర్యుచా.
యవోసీతి యవాన్లత్వా పితే సర్వత్ర వై తిలాన్ ।
తిలోసి సోమదైవత్యో గోసవే దేవనిర్మిత.
ప్రత్నవద్భిః ప్రత్తః స్వధయేటా ఉమాన్ పిత్యన్
లోకాన్ క్రీడాపా న్వధా నమః ఇతి ।
శ్రీశ్చతే ఇతి దదేత్పుష్టం పాత్రే హైమే థ రాజతే:
ఔదుమ్బరే వాఖద్దేవా పర్ణపాత్రే ప్రదక్షిణమ్।
దేవానామపసవ్యంతు పితృణాం సర్వమాచరేత్.
ఏకై కస్యచే కై కేన సపవిత్రక రేషుచ.
ఆగ్ని దేవుడు చెప్పెను: కాత్యాయనమహర్షి మునులకు చెప్ళిన కొద్దకల్పమును చెప్పేదను. గయాదితీర్థములలో విశేషించి సంక్రాంత్యాదిసమయములందు శ్రాద్ధము చేయవలెను, ఉపరాష్ట్రకాలమునందు, కృష్ణపక్షమున, చతుర్థితిథియందు గాని. శ్రాథమునకు కావలసిన సామగ్రి సంపాదించుకొని ఉత్తమనక్షత్రమునందు శ్రాద్ధము చేయవలెను. శ్రాద్ధది వసమునకు ఒక దివసము ముందుగనే బ్రాహ్మణుల నియంత్రణము చేయవలెను. అనింద్యులును స్వస్వకర్మనిరతులును, శిష్టులును సదా చార వంతులును అగు సంవ్యాసులమ గృహస్థులను సాధుపులను వేద స్నాతకులను, లేదా శ్రోత్రియులను నియంత్రించవలెను. తొల్లికలవారిని, కుషాదులు కలవారిని నియంత్రించరాదు. నియంత్రితులగు బ్రాహ్మణులమ స్నానాచమనాద్యనంతరము దేవ కర్మకై పూర్వాభిముఖముగ కూర్చుండబెట్టవలెను. దేవశ్రాద్ధ-పితృశ్రాద్ధములందు ముగ్గురేసి కాని, ఒక్కొక్కరు గాని బ్రాహ్మణు లుండవలెను. మాతామహాదిగ్రాద్ధమునందు గూడ ఇడ్లీ శ్రాద్ధకర్మ శాకాదులతో జరుపవలెను. శ్రాద్ధడివప మున బ్రహ్మచర్య మవలంబించి క్రోధరహితుడుగా ఉండవలెను. ఆ రోజున చాల దూరము ప్రయాణము చేయకూడదు. స్వాధ్యాయాధ్యయనము చేయరాదు. ప్రతి ఒక్క కర్మ విషయమనన, పంక్తి పావను-అగు బ్రాహ్మణులను అడుగుచుండ వలెను, ఆసనములపై జింకలు పరచవలెను. పితృకర్మలందుకుకలురెండుగామడచి వేయవలెను. మొదట దేవకర్మ చేసి పిదప పితృకర్మ చేయవలెను. దేవకర్మయందున్న బ్రాహ్మణులను “నేను విశ్వేదేవులను ఆవాహన చేసెదమ” అని అడుగగా వారు “ఆవాహన చేయుము”అని ఆనుజ్ఞ ఇవ్వవలెను. పిదప ‘విశ్వేదేవాస ఇత్యాదిమంత్రముచే విశ్వేదేవతల ఆవాహన చేసి ఆసనముపై యవలు చల్లవలెను, “విశ్వేదేవాః శృణుతేమం” ఇత్యాదిమంత్రము జపించవలేను. పిదప నేనిపుడు పితృ దేవతలను ఆవాహన చేసెదను” అని కర్మనియుక్తు లగు బ్రాహ్మణులను అడగవలెను. “ఆవాహన చేయుము” అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిదప “ఉక వస్వా” ఇత్యాది మంత్రము చదువుచు ఆవాహన చేయవలెను. తిలలు చల్లి అకున్తః ఇత్యాది మంత్రము జపించుచు, పవిత్రసహితమగు ఆర్ఘ్యపాత్రమునందు “శం నో దేవీ” ఇత్యాదిమంత్రముతో ఉదక ముపోయవలెను. పిడప ‘యవోసి' ఇత్యాదిమంత్రముచే యవలు ఇవ్వవలెను. పితరుల విషయమున సర్వత్ర తిలలు ఉపయోగించవలెను. పితృదేవతల ఆర్ఘ్యపాత్రమునందు “శం నో దేవీ' ఇత్యాదిమంత్రము చే ఉదకము పోసి “తిలోసి సోమదేవత్యో గోసవే దేవ విర్మిత ప్రత్నవద్భిః ప్రత్తః స్వధర పితృన్ లోకాన్ ప్రీణాపా స్వధావము” అను మంత్రము చదువుచు తిలలువేయవలెను. పిదప”శ్రీశ్చ తే? ఇత్యాది మంత్రముచే అర్ఘ్య పాత్రమదందు పుష్పములుంచవలెను. ఆ్యపాత్రము సువర్ణమయముగాని. రజతమయము గాని, ఉదుంబరమయము గాని, పత్రనిర్మితము గాని కావలెను, దేవతలకు సవ్యముగను పితృదేవతలకు అపసవ్యముగను ఈ వస్తువులను ఉంచవలెను. ఒక్కొక్కరికి ఒక్కొక ఆర్ఘ్యపాత్రము వినియోగించుట మంచిది. వితృ దేవతలకు చేతిలో ముందుగా పవిత్రమునుంచిన పిమ్మటనే ఆర్ఘ్యమీయవలెను.
యా దివ్యా ఆపః పయసా సమ్బభూవుర్యా అన్తరిక్ష ఉత పార్థివీర్యాః ।
హిరణ్యవర్ణా యజ్జియాస్తాన ఆపః శివాః శం స్యోనాః సుహవా భవన్తు ।
విశ్వేదేవ ఏష వోర్ఘ్య స్వాహా చ పిత రేష తే.
స్వరైవం పితామహాదేః సంసవాల్ ప్రథమే చరేత్ ।
పితృభ్యః స్థానమసితి న్యుణ్ణపాత్రం కరోత్యధః.
ఆత్రగన్దపుష్పధూపదీపాచ్ఛాదనదానకమ్ ।
ఘృతా కమన్న ముద్దృత్య పృచ్ఛత్యగ్నౌ కరిష్యే చ.
కురు ష్వెత్యభ్యనుజ్ఞాతో జుహుయాత్సాగ్ని నమేత్ ।
అనగ్నికః పితృహస్తే సపవిత్రేతు మ వ్రతః.
అగ్న యే కవ్యవాహనాయేతి ప్రథమాహుతిః ।
సోమాయ పితృమతేథ యమాయాజిర సే పరే.
హుత శేషం చిన్న పాత్రే దత్త్వా పాత్రం సమాలభేత్ ।
పృథివీ తే పాత్రం ద్యౌరపిధానం బ్రహ్మణస్వా ముఖే అమృతే ఆమృతం
జుహోమి స్వాతి. జఫ్వేదం విష్ణురిత్యన్నే ద్విజాజుష్టం నివేశయేత్.
అపహతేతి చ తిలాన్వికిడ్యాన్నం ప్రదాపయేత్ ।
జుషద్వమితి చోత్త్వాథ గాయత్ర్యాదీ తతో జపేత్.
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిత ఏవ చ ।
నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః.
శ్రాద్ధకల్పః తృప్తాన్ జ్ఞాత్వాన్నంవికి రేదపో దద్యాత్సకృతకృత్।
గాయత్రీం పూర్వవజ్ఞప్త్వామధుమధ్వితి వై జపేత్.
తృప్తి స్థ ఇతి సంపృచ్చే తృప్తాః స్మ ఇతి వై వదేత్ ।
శేషమన్న మనుజ్ఞాప్య సర్వమన్న మథైకత.
ఉద్ధృత్యోచ్ఛిష్టపార్వే తు కృత్వా చైవావనేజనమ్ ।
దద్యాత్కు శేషు త్రీన్ పిణ్డానాబాంతేషు వరే జగుః.
పిదప “ఓం యా దివ్యా అపసుహవా భవన్తు” అను (మూలములో ఇచ్చిన) ముత్రము చదువుచ విశ్వేదేవాః ఏష వో హర్తార్ఘ్యః స్వాహా ఆని చెప్పి, విశ్వదేవతలకు అర్ఘ్య మిచ్చి పాత్రలను దక్షిణ (కుడి) భాగమున ఉంచ వలెను. పిత్రాదులకు కూడ స్వధా అని చివర చెప్పుచూ ఇదే విధముగ అర్ఘ్యము ఇవ్వవలెను. పితామహాదులకు కూడ ఇదే విధముగ ఇవ్వవలెను. ఆర్యావశేషము నంతను మొదటి పాత్రలో ఉంచవలెను. పాత్రలను మూడింటిని పిత్రాసన వామ భాగమునందు “పితృభ్య స్థానచుసి” అని చెప్పుచు బోర్లించవలెను. పిదప దేవతలను పితరులను గంధ - పుష్ప - ధూప దీప . వస్త్రాదులతో పూజించవలెను. పిదప పాత్రనుడి మృతయుక్త మగు అన్నము తీసి, “నే నీ అన్నమును అగ్నిలో హోమము చేసెదను” అని బ్రాహ్మణులను అడిగి, “చేయుము”. అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట ఆగ్నిలో హోమమ చేయవలెను. సాగ్ని యైనవాడు పవిత్రయుక్త మగు పితృహస్త మునందు, మంత్రమతో హోమము చేయవలెను “అగ్నమే కవ్యవాహనాయ స్వాహా” అని మొదటి ఆహుతి చేయవలెను” రెండవది “సోమాయ పితృమతే స్వాహా” అని చేయవలెను యముని, ఆంగిరసుని ఉద్దేశించి ఆహుతి ఇవ్వవలె నని కొందరి మతము, హోమము చేయగా మిగిలిన అన్నము వరుసగ దేవతా పితృపాత్రములందు వడ్డించి, పాత్రను హస్త ముతో కప్పి “ఓం పృథివీ శ్రీ పాత్రమ్జుహోమి స్వాహా” అను మంత్రము జపించుచు, ఇదం పిషుర్విచక్రమే” ఇత్యాది మంత్రముతో బ్రాహ్మణుని అంగుష్ఠముతో ఆ అన్నమును స్పృశింప చేయవలెను అపహతా అసురా”. ఇత్యాది మంత్రముతో పితృపాత్రమున తిలలు చల్లి సంకల్ప పూర్వకముగ అన్నము అర్పించవలెను. పిదప “జుషధ్వమ్” (భుజింపుడు) అని చెప్పి, గాయత్ర్యాదిమంత్రములను జపించవలెను. “దేవతాభ్యః..... నమో నమః.” ఆనుమంత్రమును గూడ జపించవలెను. పితృదేవతలు తృప్తి చెందిన విషయము తెలిసికొని, పాత్రము నందలి అన్నము చల్లవలెను. ఒక్కొక్క సారి అందరికిని జల మీయవలెను, సవ్యముగా నుండి గాయత్రీ మంత్రజపము చేసి, “మధువాతా” ఇత్యాది ఋక్కును జపించి, మీరు తృప్తి చెందినారా?” అని బ్రాహ్మణులను అడుగవలెను మేము తృప్తుల మైతిమి” అని వారు సమాధానము చెప్పవలెను. బ్రాహ్మణుల అనుమతిచే శేషాన్న మును కలిపి పిండము చేయుటకై పాత్రనుండి బైటకుతీసి, పితృచ్ఛిష్టాన్న సమీపమున అవనేజనము చేసి, కుశ ముల పై సంకల్ప పూర్వకముగ పిండదానము చేయవలెను. బ్రాహ్మణులు చేతులు కడిగిని ఆచమనము చేసిన పిమ్మట పిండ ప్రదానము చేయవలె నని కొందరి మతము.
ఆచాంతేషూదకం పుష్పాణ్యక్షతాని ప్రదాపయేత్ ।
ఆక్షయ్యోదక మేవాథ ఆశిషః ప్రార్థయేన్నరః.
ఆ మోరాః పితరః సత్తు గోత్రం నో వర్దతాం సదా ।
దాతారో నోఒలివర్గంతాం వేదాః స నతిరేవ చ.
శ్రద్ధా చ నో మా వ్యగమద్బహు దేయం చ నో స్త్వితి ।
అన్నం చ నో బహు భవేదతిథీంశ్చ లభేమహి.
యాచితారశ్చ నః సన్లు మా చ యాచిష్మ కం చన ।
స్వధా వాచనీయాన్ కుశానా స్త్రీర్య సపవిత్రకాన్.
స్వధాం వాచయి ష్యే పృచ్చేదనుజ్ఞాతశ్చ వాచ్యతామ్ ।
పితృభ్యః పితామ హేభ్యః ప్రపితామహముఖ్యకే.
స్వరోచ్యతామస్తు స్వధా ఉచ్యమాన స్తథైవ చ ।
ఆపో నిషిజ్బోదుల్తానం పాత్రం కృత్వాథ దక్షిణామ్.
యథాశక్తి ప్రదద్యాచ్చ దైవే పైత్రేఒథ వాచయేత్ ।
విశ్వేదేవాః ప్రీయనాం చ వాజే వాజే విర్జయేత్.
ఆమావాజ స్యేత్యనుప్రజ్య కృత్వా విప్రాన్ ప్రదక్షిణమ్ ।
గృహే విశేదమావాస్యాం మాని మాపి చరేత్తతా.
ఆచమనానంతరము ఉడక మ పుష్పములు, అక్షతలు సమర్పించవలేను. ఏడవ అక్షయ్యోదకి మిచ్చి ఆశీర్వాదమును కోరుచు, “నా పితృదేవతలు సౌమ్యులగా నుందురుగాక” అని పలికి ఉదకము వదలవలెను. “మా గోత్రము సర్వదా వృద్ధి పౌండగాక. వేదముల పఠన పాఠనక్రమము అవిచ్చిన్నముగ కొనసాగుగాక! సంతానవృద్ధి ఆగు గాక. మాకు శ్రద్ధ లోపించకుండుగాక.. దానము చేయుటకై మా వద్ద వివిధ వస్తు సామగ్రి ఉండుగాక, చూవద్ద అన్నము కూడ అధిక ముగా నుండుగాక, మా యింటికి ఆతిథులు వచ్చుచుందురుగాక. యాచకులు మావద్దకువచ్చి యాచించమురు గాక. మేము మాత్రము ఎవ్వరిని యాచించకుందుముగాక అని ప్రార్థించవలెను. స్వధావాచనము నిమిత్త ము పిండములపై పవిత్రక సహిత మగు రకములు కప్పి నేను స్వధావాచసము చేయించెదను ఆని బ్రాహ్మణును అడిగి, “స్వరా వాచనము చేయుము” అని వారి అనుజ్ఞపొంది ఈ విధముగా చెప్పవలెను. 'బ్రాహ్మణులారా! మీరు మా పితృ - పితామహ - ప్రపితామహుల కొరకై స్వంవాచనము చేయుకు” అపుడు బ్రాహ్మణులు” అస్తు స్వధా” అని అందరు. పిమ్మ ఓ కుశ లపై దుగ్గమిశ్ర జలమును క్షిణాగ్రధారగా పోసి, అర్ఘ్యపాత్రను ఉత్తానము చేసి, దేవశ్రాద్ధ పిృశ్రాద్ధ ప్రతిష్టార్థమై యథా శక్తి గ సువర్ణ రజత దక్షిణ ఈయవలెను “శ్వేదేవా ప్రీయనామ్” అని చెప్పి దేవతావిసర్జన చేసి “ వాజే పాక్ష ఇత్యాది మంత్రముచే పిత్రాదులను విసర్జించవలెను. “ఆమావాజస్య” అను మంత్రము పఠించుచు బ్రాహ్మణును అనుసరించి నడచి, ప్రదక్షిణము చేసి ఇంటిలోనికి వెళ్ళవలెను. ప్రతి అమావాస్యయండను ఈ విధముగనే పార్వణ శ్రాద్ధము చేయవలెను,
ఏకోద్దిష్టం ప్రవక్ష్యామి శ్రాద్దం పూర్వవదాచరేత్ ।
ఏకం పవిత్రమేకారమేకం పిణం ప్రదాపయేత్
నావాహనాగ్నౌకరణం విశ్వేదేవా న చాత్రహి ।
తృప్తిప్రశ్నే స్వదితమితి వచేత్సుస్వదితం ద్విజః.
తితి ఉపతిష్ఠతామిత్యక్షయ్యే విసర్జే చాభిరమ్యతామ్ ।
అభిరతాః స్మ ఇత్యపరే శేషం పూర్వవదాచరేత్.
సపిణీకరణం వచ్యే అబ్దానే మధ్యతోపి వా ।
పితృణాం త్రీణి పాత్రాణి ఏకం పేతస్య పాత్రకమ్.
సపవిత్రాణి చత్వారి తిలఫుష్పయుతాని చ ।
గనోద కేన యుక్షాని పూర్తయిత్వాభిషిణ్చాతి.
లీ పేతపాత్రం పితృపాత్రే యే సమానా ఇతి ద్వయాత్ ।
పూర్వవత్పిణ్ణదానాది ప్రేతానాం పితృతా భవేత్.
అథాభ్యుదయికం శ్రాద్ధం వక్ష్యే సర్వం తు పూర్వవత్ ।
జ పేత్పితమ వర్ణం పూర్వాప్లే తతదక్షిణమ్.
ఉపచారా ఋజుకుగా స్త్రీలార్గెశ్చయవై రిహ ।
తృప్తి ప్రశ్నస్తు సంపన్నం సుసంపన్నం వడేద్ద్విజ।
దధ్యక్షతబదరాద్యాః పిడ్డా నాస్టీము ఖాన్ పితృన్ ।
ఆవాహయి ష్యే పృచ్చేచ్చ ప్రియన్తోమితి చాక్షయే.
నానీముఖాశ్చ పితరో వాచయి ష్యేథ పృచ్ఛతి ।
నాస్టీముఖాన్ పితృగణాన్ ప్రీయన్తమిత్యథో వదేత్.
నాస్టీముభాశ్చ పితర సత్పితా ప్రపితామహః ।
మాతామహః ప్రమాతామహో వృద్ద ప్రమాతామహః.
స్వధాకారం న యుజ్ఞాత యుగ్మాన్విప్రాంశ్చ భోజయేత్ ।
తృప్తిం వ్య పితృణాం చ గ్రామ్యైరోషధిభి స్తథా.
మాసం తృప్తి స్తథారణ్యేః కందమూలఫలాదిభిః ।
మత్యైర్మా సద్వయం మార్గెశ్రయం వై శాకునేన చ.
చతురో రౌరవేడాథ పళ్ళా షట్ ఛాగ కేన తు,
కూర్మేణ సప్త చామ్లో చ వారా హేణ నవైన తు.
మేషమాం సేన దశ చ మాహి షేః పార్వతైః శివైః ।
సంవత్సరం తు గజ్యేన పయసా పాయసేన వా.
జార్టీనసస్య మాం సేన తృప్తిర్ద్వాదశవార్షికి ।
ఖడ్గమాంసం కాలకాకుం డోహితచ్భాగలో మదు.
మహాశల్కాశ్చ వర్షాసు మమాశ్రాద్ధమథాక్షయమ్ ।
ఇపుడు ఏకోద్దిష్ట శ్రాద్ధ మును గూర్చి చెప్పెదను. ఈ అర్ధము కూర వెనుకటివ నే చేయవలెను భేద మేమనగా దీనిలో ఒకే పవిత్రకము, ఒకే అర్ఘ్యము, ఒకే పిడము ఇవ్వవలెను. దీనిలో ఆవాహనము అగ్నౌ కరణము, విశ్వేదేవ పూజనము ఉండవు తృప్తి ని ప్రశ్నించినపుడు “స్వంతమ్” అని ప్రశ్నించవలెను బ్రాహ్మణుడు సుస్వదితమ్ అని ప్రత్యు త్తర మీయవలెను “ఉపతిష్ణమ్” అని చెప్పి అర్పణము చేయవలెను - అక్ష యోచకము కూడ ఇవ్వవలెను. విసర్జన సమయమున ఈ “ఆభిరమ్యతామ్” అని పలుక వలెను (హ్మణు. ఈ ఆభిరతాః “స్మః” అని ప్రత్యుత్తర మీయవలెను. మిగిలిన దంతము వెనుక టి వలనే చేయవలెను. ఇపుడు సపిండికరణమును గూర్చి చెప్పే కను ఇది సంవత్సరాంతమునందమ మధ్యయుదును కూడ చేయవచ్చును. దీనిలో పినరు కొరకు మూడు పాత్రలను, ప్రేతకు వేరుగా ఒక పాత్రయు ఉంచవలెను, నాలుగు అర్ఘ్యపాత్రముందును పత్రము, తిలలు. పుష్పములు, చందనము, జలము నింపవలెను. వాటి నుండియే అర్ఘ్యము నిచ్చు చుండవలెను 'తే, సమానాః' ఇత్యాది మంత్రద్వయముతో ప్రేతార్ఘ్యపాత్రను క్రమముగా పితృపితామహ, ప్రపితామహ పాత్రలతో కలపవలెను ఈ విధముగనే పిడదానము, దానము మొదలగు నవి గూడ చేసి, ప్రేత పిండమును పితరుల పిడములతో కలప వలెను. ఇట్లు చేయు చే ప్రేకకు పితృత్వము ప్రాప్తించును. ఇప్పుడు ఆభ్యుదయిక శ్రాద్ధమును గూర్చి చెప్పుచున్నాను దీని విని యతయు వెనుకటి వలనే. దీని యందు పితృదేవతాముత్రమును తప్ప ఇతర మంత్రము. జపము చేయవలెను. కోమ, కుశ లను ఉపయోగించవలెను. తిలలకు బదు యవలు ఉపయోగించ వలెను పితరులతృప్తి ని గూర్చి బ్రాహ్మణులను ప్రశ్నించు నపుడు ఓ సంపన్నమ్ అని ప్రశ్నించవలెను. వారు సు సుప్నమ్ అని సమాధానము చెప్పవలెను దీనిలో పెరుగు, అక్షత, బదరీఫ ములు మొదలగు వాటితో చేసిన పిండముల ప్రదానము చేయవలెను ఆవాహనసమయమున నేను నాందీముఖు లను పేరుగల పితృదేవతలను ఆవాహన చేసె నను” అని ప్రశ్నించవలెను. ఆక్షయ్యతృప్తి విష యమున 'ప్రీ మతామ్' ఆపవలెను. నేను సాందీముఖ పికృ దేవతల తృప్తి వాచనము జేయించే నను అని అడిగి, బ్రాహ్మాణు అను గొని, నాస్టీముఖాః పితరః ప్రియన్తమ్ ఆనీ, చెప్పవలేను. పితృ- పితామహ - ప్రపితామహులు, మాతామహ - ప్రమాతామహ - వృద్ధవ మాతామహులను పోందీముఖపితృ దేవతలు అభ్యుదాయిక శ్రాద్ధమునందు “స్వరా' ఉపయోగించరాదు. బ్రాహ్మణయము నకు భోజనము పెట్టవలెను. ఇపుడు నేను పితృదేవతల తృప్తి ని గూర్చి చెప్పెదను గామ్యాన్నము చేతను ఆరణ్యకంద - మూ - ఇలాచులచేతను” ఒక మాసము తృప్తి కలుగును. మత్స్యము చే రెండు మాసము, మృగ మాంసము చే మూడు మాసములు, పక్షి మాంసముచే నాలుగు మాసములు. రురు మృగమాంసముచే ఆ మదుమాసములు, మేక మాంసముచే ఆరు మాసములు కూర్మమాంసముచే ఏడుమాసములు, వరాహమాం సముచే ఎనిమిది మాసములు మేషమాంసముచే తొమ్మిది మాసము, మహిష - పర్వత శృగాలమాంసములచే పది మాసములు, గోక్షీర - పాయసము చే సంవత్సరము తృప్తి కలుగును వర్ధినసమాంసముచే పండెండు సంవత్సరము పాలు తృప్తి కలుగును. ఖడ్గమృగమాంసము, కాలశాకము, లోహితచ్చాగలము, మధువు మహాశల్కము వర్షకాలమున మహశాద్ధము ఇవి ఆక్షయతృప్తి నిచ్చును.
మంత్రాధ్యాయ్యగ్ని హోత్రి చ శాఖాధ్యాయీ షడజ్గవత్.
త్రిణాచి కేతస్త్రీ మధుర్ధర్మ ద్రోణస్య పాఠక ।
త్రిసుపర్ణ జ్యేష్ఠ సామజ్ఞానీ స్యుః పజ్క్తి పావనా.
కామ్యానాం కల్పమాఖ్యా స్యే ప్రతిపత్సు ధనం బహు ।
శ్రియః పరా ద్వితీయాయాం చతుర్థ్యాం ధర్మ కామదః.
పశ్చిమ్యాం పుత్రకామస్తు షష్ఠ్యాం చ శ్రేష్ఠ్యభాగపి ।
కృషిభాగీ చన ప్రమ్యామష్టమ్యామలాథక.
నవమ్యాం చేకశఫా దశమ్యాం గోగణో భవేత్ ।
ఏకాదశ్యాం పరీవారీ ద్వాదశ్యాం ధనధాన్యకమ్.
జోతిష్యం త్రయోద్యం చతుర్ధశ్యాం చ
శస్త్రత మృతానాం శ్రాద్ధం సర్వా ప్రమమావాస్యాం సమీరితమ్.
సప్త వ్యాధా దళారణ్యే మృగాః కాలజ్జురే గిరౌ ।
చక్రవాకాః శరద్వీ పే హంసాః సరసి మాన .
లేపి జాతాః కురు క్షేత్రే బ్రాహ్మణా వేదపారగా।
ప్రస్థితా దూరమధ్వానం యూయం తేభ్యోఒవసీదత
శ్రాద్ధాదౌ పఠితే శ్రాద్ధం పూర్ణం స్యాద్రహ్మలోక దమ్।
శ్రాద్ధం కుర్యాచ్చ పిత్రాదిః పితుర్జీవతి తత్పతుః.
తత్పతు న్తత్పితుః కుర్యాజీవతి ప్రపితామహే ।
పితుః పితామహస్యాథ పతస్య ప్రపితామహాత్.
ఏవం మాత్రాదిక స్యాపి తథా మాతామహాది కే ।
శ్రాద్దకల్పం పఠేద్యస్తు స లభే చ్ఛాద్ధకృత్ఫలమ్.
తీర్థ యుగాదౌ మన్వాదౌ శ్రాద్ధం దత్తమథాక్షయమ్ ।
ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశీకా ర్తి కే తథా.
తృతీయా చైవ మామస్య తథా భాద్రపదస్య చ ।
ఫాల్గునస్యా మావాస్యా పౌష స్యైకాదశీ తథా.
ఆషాఢస్యాపి దళమీ మాఘమాసస్య సప్తమీ ।
శ్రావణే చాష్టమీ కృష్ణా తథాషాఢ చ పూర్ణిమా.
కార్తికే ఫాల్గునీ తద్వజ్యే ప్లే పశ్చాదశీ సితా ।
స్వాయమ్ళువాద్యా మనవ స్తేషామాద్యాః
కిలాక్షయాః. గయా ప్రయాగో గడొ చ కురుక్షేత్రం చ నర్మదా ।
శ్రీపర్వతః ప్రభాసళ్ళ శాలగ్రామో వారాణసీ.
గోదావరి తేషు శ్రాద్ధం శ్రీపురుషోత్తమాదిషు.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే శ్రాద్ధకల్పో నామ సప్తదశాధిక శతతమోర్యాయః.
మంత్రపాఠము చేయువాడు, అగ్నిహోత్రి, శాఖాధ్యయనము చేయువాడు, షడంగ వేత్త , త్రిణాచికేతుడు, త్రిమధువు ధర్మ ద్రోణము పఠించువాడు, త్రిసుపర్ణ.” బృహల్సామములు తెలిసినవాడు, ఇట్టి బ్రాహ్మణులు పంక్తి పావనులు. ఇపుడు కామ్య శ్రాద్ధకల్పమును గూర్చి చెప్పెదను. ప్రతిపత్తునంద శ్రాద్ధము చేయుటచే ఆధికముగ ధనము లభించన. ద్వితీయయందు శేషశ్రీ, చతుర్ధియందు ధర్మకామములు, పంచమినాడు పుత్రుడు, షష్టియందు శ్రేషత్వము, సప్త మినాడు వ్యవసాయములో లారమ, అష్టమినాడు ధనమ్మా నవమినాడు గుజములు మొదలగు ఒక డెక్క గల మృగములు, దశమినాడు గోసముదాయమ ఏకాదశినాడు పరివారము, ద్వాదశినాడు ధనధాన్యవృద్ధి, త్రయోదశినాడు స్వీయజాతి శ్రేష్ఠత్వము లభించును. చతుర్దశి యందు శస్త్రహతులకు మాత్రమే శ్రాద్ధము పెట్టవచ్చును. దశార్ణదేశమునం దుండెడు ఏడుగురు వ్యాధులు, కాలంజరగిరిపై మృగములుగాను, శరద్వీపమునందు చక్రవాకములుగాను, మానససరోవరమునందు, హంసలుగాను, అయిరి. వారే ఇపుడు కురుక్షేత్రమునందు వేదపారగతు లైన బ్రాహ్మణు లైరి. వారు చాలా దూరము దాటివేసినారు. మీరు వారికంటె చాల వెనుకబడి కష్టపడుచున్నారు. శ్రాద్దసమయపాలన దీనిని చదువుటచే శ్రాద్దము పరిపూర్ణమై బ్రహ్మలోకము నిచ్చును. పితామహుడు జీవించి యున్నచో పుత్రాదులు తమ తండ్రికిని, పితామహుని తండ్రికిని, ఆతని తండ్రికిని అద్దము పెట్ట వలెను. ప్రపితామహుడు జీవించియున్న చో పితృ-పితామహ-వృద్ధప్రపితామహులకు శ్రాద్ధము పెట్టవలెను. మాతృమాతామహాదిగ్రాద్ధము విషయమునందు గూడ ఇట్లే చేయవలెను. ఈ శ్రాద్ధకల్పమును పఠించువానికి, శ్రాద్ధవలము లభించును. ఉత్త మతీర్థములందును, యుగాది-మన్వాదితిథులందును చేసిన శ్రాద్ధము అక్షయము. ఆశ్వినశుక్ల నవమి, కార్తి క ద్వాదశి, మామ-భాద్రపదతృతీయలు, పాల్గునఅమావాస్య, పౌషశుక్లైకాదశి; ఆషాఢదశమి, మామసప్తమి, శ్రావణకృష్ణాష్టమి, ఆషాడ. కార్తిక.ఫాల్గున-జ్యేష్ఠపూర్ణిమలు. ఈ తిథులు స్వాయంభువాదిమనువులకు సంబంధించినవి. వీటి ఆది భాగమునందు చేసిన శ్రాద్ధము అక్షయ మగును. గయా-ప్రయాగ గంగాకురుక్షేత్ర-నర్మదా-శ్రీపర్వత ప్రభాసశాలగ్రామతీర్థ -కాశీగోదావరి- లీపురుషోత్త మషేత్రాదులలో చేసిన శ్రాద్ధము ఉత్త మము.
అగ్ని మహాపురాణమునందు శ్రాద్ధకల్పవర్ణన మను నూటపదునేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 117 of the Agni Mahā Purana is as follows:
The marriage saṃskāra is described with its varieties and full procedural detail. Agni enumerates the eight forms of vivāha—Brāhma, Daiva, Ārṣa, Prājāpatya, Āsura, Gāndharva, Rākṣasa, Paiśāca—ranked by dharmic merit. The core rite centers on pāṇigrahaṇa (joining of hands), saptapadī (seven steps around the fire), and lāja-homa (roasted-grain oblations). The auspicious nakṣatras, tithis, and muhūrtas for conducting vivāha are listed, along with the prohibition of certain periods (āśauca, adhika-māsa, etc.).