ఆగ్ని రువాచః
ప్రియవ్రతోత్తానపాదౌ మనుః స్వాయమ్భువః సుతౌ ।
ఆజీజనత్సుతాం రమ్యాం శతరూపాం తపోన్వితామ్.
కామ్యాం కర్దమ భార్యాతః సమ్రాట్ కుక్షిర్విరాట్ ప్రభుః ।
స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃశాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచే నెను
సురుచ్యము త్తమో జజ్ఞీ పుత్ర ఉత్తానపాదతః ।
సునీత్యాం తు ధ్రువః పుత్ర స్తపస్తే పే స కీర్తయే ।
ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని హే మునే.
ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువుడను పుత్రుడును జనించిరి. ఓ మునీ ధ్రువుడు, కీర్తి కొరకై, మూడు వేల దివ్య వర్షములపాటు తపస్సు చేసెను.
తస్మై ప్రీతో హరిః ప్రాదాన్మున్యగ్రో స్థానకం స్థిరమ్ ।
శ్లోకం పపాఠ హ్యుశనా వృదిం దృష్ట్వా స తస్య చ
అహోస్య తపసో వీర్యమహో శ్రుతమహాద్భుతమ్ ।
యమద్య పురతః కృత్వా ధ్రువం సప్తర్షయఃస్థితాః.
ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సపరులకంటే ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్ధిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివేను. “ఈతని తపస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞానమెంత అద్భుత మైనది: సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!
తస్మాచ్ఛిష్టిశ్చ భవ్యశ్చ ధ్రువాచ్ఛముర్వ్యజాయత !
శిష్టరాదత్త సుచ్చాయా పళ్చి పుత్రానకల్మషాన్.
రిపుం రిపుఞ్జయం రిప్రం వృకలం వృక తేజసమ్ ।
రిపోరాదత్త బృహతీ చాక్షుషం సర్వతేజసమ్.
ద్రుపునకు శిష్టి, భవ్యుడు, శంభువు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్చాయవలన, రిపువు, రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృక తేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, నర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.
అజీజనత్పుష్కరిణ్యాం వీరణ్యాం చాక్షుషో మనుమ్ ।
మనోరజాయ న దశ నడ్వలాయాం సుతో త్తమాః,
ఊరుః పూరుః శతద్యుమ్న స్తపస్వీ సత్యవాక్కవిః ।
అగ్నిష్టుర తిరాత్రశ్చ సుద్యుమ్న శ్చాతిమన్యుకః.
దాశుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు - అను పదిమంది సుతో త్తములు జనించిరి.
ఊరోర్జనయత్పుత్రాన్ షడాగ్నేయా మహాప్రభాన్ ।
ఆజ్ఞం సుమనసం స్వాతిం క్రతు మజ్గిరసం గయమ్.
ఊరునివలన ఆగ్నేయ ఆంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతు లగు ఆరుగురు కుమారులను కనెను.
ఆజ్ఞాత్సునీధాపత్యం వై దేనమేకం వ్యజాయత ।
అరక్షకః పాపరతః స హతో మునిభిః కుశెః
అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసకుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుళములను ప్రయోగించి సంహరించిరి.
ప్రజార్థమృషయోథాస్య మమస్థుర్ధక్షిణం కరమ్ ।
వేనస్య మథితే పాణా సమ్బభూవ పృథుర్నృపః.
పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడి చేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను
తం దృష్ట్వా మునయః ప్రాహు రేష వె ముదితాః ప్రజాః ।
కరిష్యతి మహాతేజా యశశ్చ ప్రాప్యతే మహత్.
మునులందరును ఆతనిని చూచి – “మహాతేజశ్శాలి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు” అని పలికిరి.
స ధన్వీ కవచీ జాత స్తేజసా నిర్దహన్నివ !
పృథుర్వెన్యః ప్రజాః సర్వా రరక్ష క్షత్రపూర్వజః.
క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్న వాడును ఆగు ఆ పృథువు ధనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.
రాజసూయాభిషి క్తానామాద్యః స వృధివీపతిః ।
తస్మాచైవ సముత్పన్నౌ నిపుణె సూత మాగధే.
తత్ స్తోత్రం చక్ర తుర్వీరౌ రాజాభూజనర జ్ఞానాత్ ।
దుగ్ధా గౌస్తేన సస్యార్థం ప్రజానాం జీవనాయ చ.
ఆ రాజు రాజసూయ యాగము చేసి అభి షేకము పొందిన వారిలో మెదటివాడు. అతని నుండి పుట్టిన నేర్పరు లైన వీరులైన సూత మాగధులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపా దించుట కై భూమిని పిదికెను.
సహ దేవై ర్మునిగణై ధనర్వెః సాప్సరోగణై ।
పితృభి ర్దానవై సర్పైర్వీరుద్భిః పర్వతై ర్జనైః.
తేషు తేషు చ పాత్రేషు దుహ్యమానా వసున్దరా ।
ప్రాదాద్యదేప్సితం క్షీరం తన ప్రాణానధారయత్.
దేవతలును మునిగణములును, గంధర్వులును, ఆరోగణములును. పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములును, జనులును ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.
పృథోః పుత్రౌ తు ధర్మ జజ్ఞాతేజనర్ధిపాలితా ।
శిఖణ్ణినీ హవిర్ధాన మంతర్భాణ ద్వ్యజాయత.
హవిర్ధానాత్ షడాగ్నేయీ ధిషణా జనయత్సుతాన్ ।
ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాజినౌ.
పృథుచక్రవర్తికి అంతర్గ, పాలితుడు ఆను ధర్మవేత్త లైన ఇరువురు కుమారులు జనించిరి. శిఖండిని ఆంతర్గ నుండి హవిర్గాను దనేడు కుమారుని క నేను. అగ్ని పుత్రి యగు ధీషణ హవిర్గానుని వలన ప్రాచీన శిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు. ప్రజుడు, అజినుడు అను ఆరుగురు కుమారులను క నేను.
ప్రాచీనగ్రాః కుళా స్తస్య పృథివ్యాం యజతో యతః ।
ప్రాచీనబ ర్ణిర్బగవాన్మహానానీత్ ప్రజాపతిః.
యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి ఆగ్రములు తూర్పు వైపున కుండునట్లు భూమి పై వరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజావతికి “ప్రాచీన బరిస్సు” అను పేరు వచ్చెను.
సవర్ణదత్త సాముద్రో దశ ప్రాచీనబర్హిషః ।
సర్వే ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగా.
సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబరి స్సువలన పదిమంది కుమారులను క నేను వారందరికిని ప్రచేతసు. లనీయే పేరు. వారందరును ధను ర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.
అపృథగర్మచరణాస్తే తవ్యంత న మహత్తపః ।
దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశ యాః.
ఒకే విధముగా ధర్మము నాచరి. చుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.
ప్రజావతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గ తాః।
భూః ఖం వ్యాప్తం హి తరుభిస్తాం సరూనదహంశ్చ తే.
ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్।
ఉవగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజావతీన్.
కోపం యచ్చత దాస్య ని కన్యాం వోమారిషాం వరామ్।
తవస్వినో మునేః కణోః ప్రహ్ణిచాయాం మయైవ చ.
భవిష్యం జానతా సృష్టా భార్యా వోస్తు కులజరీ।
ఆస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్ధయిష్యతి.
వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై నముద్రజలమునుండి లేచిరి. అపుడు భూ న్యూకాశములు వృక్షములచే వ్యాప్త ములై యుండెను. వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షము లను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజావతుల దగ్గరికి వెళ్లి- “కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగు కండుముని కుమారే యేన ప్రమోచయందు ఉ తమురా లగు మారిష చుసు కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ధి పొందించు భార్య యగుగాక. ఆమెయందు పుటిన దక్షుడు ప్రజలను వృద్ధిపొందిoచును.
ప్రచేతసస్తాం జగృహుర్దవోఎస్యాం చ తతోభవత్ ।
అచరాంశ్చచరాం శ్చైవ ద్విపదోథ చతుష్పదః.
స సృష్ట్వా మనసా దక్షః పశ్చా ద సృజత స్త్రియః ।
రదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ.
సప్తవింశతిం సోమాయ చతసోఒరిష్టనేమయే ।
ద్వే చైవ బహుపుత్రాయ ద్వే నై వాజిర సే హ్యదాత్.
తాను దేవశ్చ నాగాద్యా మైథునాన్మనసా పురా ।
ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దకుడను కుమారుడు జనించెను. అతడు మనస్సుచే స్థావర జంగమము లకు,ద్విపాత్రులను (మసమ్యలు మొదలగువారిని) చతుష్పాత్తులను (నాలుగు కాళ్సుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పది మందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడు రిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును, నాగాదులును జన్మించిరి.
ధర్మసర్గం ప్రవక్ష్యామి దశ పత్నీషు ధర్మతః.
విశ్వేదేవాస్తు విశ్వాయః సాధ్యాసాధ్యావ్యజాయత ।
మరుత్త్వ న్యా మరుత్త్వనై వసోస్తు వసవోభవన్.
భానోస్తు భానవః పుత్రా ముహూర్తాస్తు ముహూర్తజాః ।
లమ్బాయా ధర్మతో ఘోషో నాగవీథీ చ యామిజా
పృథివీ విషయం సర్వం మరుత్వత్యాం వ్యజాయత ।
సజ్కల్పాయాస్తు సజ్కల్పా ఇస్టోర్నక్షత్రతః సుతాః.
ఆరోధ్రువశ్చ సోమశ్చ ధర శ్చైవానిలో నలః ! ।
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవ్వోష్టా చ నామతః.
యమధర్మరాజునకు తన పదిమంది భార్వలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పేదను. విశ్వకు విశ్వే దేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వతికి ఇద్దరు ముత్వంతులు, వస్తువునకు వసువులు భానువుకు భానులు, ముహూర్త కు ముహూర్తులు, లంబకు ఘోషుడు. యామికి నాగ వీధి, మరుత్వతికి వృథివీ సంబద్ధమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధవుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు. ప్రభాసుడు, ఎనమండుగురు వసువులును జన్మించిరి.
ఆపస్య పుత్రో వై తఱ్యః శ్రమః శాన్తో ముని స్తదా ।
ధ్రువస్య కాలో లోకానో వర్ణాః సోమస్య వై సుతః.
ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహ స్తథా ।
మనోహరాయాః శిశిరః ప్రాణోథ రమణ స్తథా.
పురో జవోనిలస్యానీ దవిజ్ఞాతోనలస్య చ ।
అగ్ని పుతః కుమారశ్చ శర స్తమే వ్యజాయత.
తస్య శాఖో విశాఖశ్చ నై గమ్యశ్చ పృషజః ।
కృత్తికాతః కార్తికేయో యతిః సనత్కుమారకః.
ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రీముడు, శాంతుడు, ముని అను వారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరు నికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజవుడు. ఆనలుని కుమారుడు ఆవిష్ణాతుడు.. కుమా రుడు అగ్ని పుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పుట్టిరి కృత్తిక నుండి కార్తి కేయుడును, యతియైన సనత్కుమారుడును పుగ్గిరి.
ప్రత్యూషాద్దేవలో జజ్ఞే విశ్వకర్మా ప్రభాయుతః ।
కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్ధికి.
మనుష్యాశ్చోవజీవంతి శిల్పం వై భూషణాదికమ్ ।
వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును అగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యూషనుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.
సురభీ కశ్యపాద్రుద్రానేకాదశ విజజ్ఞుషీ.
మహాదేవప్రసాదేన తపసా భావితా సతీ ।
అజైకపాదహిర్బుధ్న్య స్వష్టా రుద్రశ్చ సత్తమ.
త్వష్టు శ్చైవాత్మజః శ్రీమాన్విశ్వరూపో మహాయశాః ।
హరశ్చ బహురూపశ్చ త్యచ్బుక శ్చాపరాజితః
వృషాకపిశ్చ శమ్భుశ్చ కపర్దీ రైవత స్తథా ।
మృగవ్యాధశ్చ సర్పశ్చ కపాలీ దశ చై కకః.
రుద్రాణాం చ శతం లక్షం యైర్యాప్తం సచరాచరమ్ ।
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్వాయమ్భువ మనువంశ వర్ణనం నామాష్టదశోధాయ్యః॥
సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల ఆహిర్భుధ్యుడు, త్వషయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాఢ మియు, కవర్ద (జటా) ధారియగు శంభువు, రేవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యక శాలియు ఆగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.
అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశ వర్ణనమను అష్టాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 18 of the Agni Purāṇa is as follows:
Departing from genealogy, this chapter presents a theological celebration of Bhagavān Śiva. Śiva's supreme nature as the destroyer of the three cities (Tripurāntaka), his five divine acts (pañcakṛtya — sṛṣṭi, sthiti, saṃhāra, tirobhāva, anugraha), and his identity with the ultimate reality are expounded. The chapter includes a Śiva Gītā passage in which Śiva reveals to a devotee the non-dual truth that all deities are ultimately one supreme consciousness. Śiva's sacred forms — the liṅga, Ardhanārīśvara, Dakṣiṇāmūrti — and the significance of his attributes (triśūla, ḍamaru, jaṭā, bhasma) are explained. The chapter affirms that knowledge of Śiva is identical with liberation.