అగ్ని మహా పురాణము

237 - అథ శ్రీస్తోత్రమ్

పుష్కర ఉవాచః

రాజలక్ష్మీ స్థిరత్వాయ యథేంద్రేణ పురాశ్రియః

స్తుతిః కృతాతథారాజా జయార్థం స్తుతిమాచరేత్. 

ఇంద్ర ఉవాచః

 సమస్యే సర్వలోకానాం జననీ మబ్ధి సంభవామ్

 శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షఃస్థలస్థితామ్.

త్వం సిద్ధి స్త్వం స్వదాస్వాహా సుధాత్వం లోకపావని

సంధ్యారాత్రిః ప్రభాభూతిర్మేధాశ్రద్ధా నర స్వతీ. 

యజ్ఞవిద్యామహావిద్యా గుహ్య విద్యా చ శోభనే

ఆత్మ విద్యా చ దేవి త్వంవిముక్తి ఫలదాయినీ. 

ఆన్వీక్షి కీత్రయీ వార్తా దండనీతి స్త్వమేవచ

 సౌమ్యాసౌమ్యైర్జరద్రూవై స్త్వయైతద్దేవిపూరితమ్.

కాత్వన్యా త్వామృతేదేవి సర్వయజ్ఞమయంవపుః

అధ్యా స్తేదేవదేవస్య యోగిచింత్యం గదాభృతః.

త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయమ్

 వినష్టప్రాయమభవ త్త్వయేదానీం సమేధితమ్.

 దారాః పుత్రా స్తథాగారం సుహృద్దాన్య ధనాదికమ్

భవ న్ త్యేతన్మహాభాగే నిత్యంత్వద్వీక్షణాన్నృణామ్.

  శరీరారోగ్యమైశ్వర్య మరిపక్షక్షయః సుఖమ్

 దేవి త్వద్దృష్టి దృష్టానాం పురుషాణాం నదుర్లభమ్.

  త్వమంబా సర్వభూతానాం దేవదేవోహరిః పితా

 త్వయైతద్విష్ణునా చామ్బ జగద్వ్యా ప్తం చరాచరమ్. 

మానః క్రోశం తథాగోష్ఠం మాగృహం మాపరిచ్ఛదమ్

మా శరీరం కలత్రంచ త్యజేథాః సర్వపావని. 

మా పుత్రాన్మా సుహృద్వర్గాన్మా పశూన్మా విభూషణమ్

 త్యజేథా మమదేవస్య విష్ణోర్వక్షస్థలాలయే. 

సత్త్వేన సత్యశౌచాభ్యాం తథాశీలాదిభిర్గుణైః

త్యజ న్తే తే నరాః సద్యః స న్త్యక్తాయే త్వయామలే.

 త్వయావలోకితాః సద్యః శీలాద్యైర ఖిలైర్గుణైః

 కులై శ్వర్యైశ్చ యుజ్యన్తే పురుషానిర్గుణా అపి.

 నశ్లాఘ్యః సగుణీ ధన్యః సకులీనః సబుద్ధిమాన్

సశూరః సచవిక్రాన్తో య స్త్వయాదేవి వీక్షితః.

 సద్యోవై గుణ్యమాయాంతి శీలాద్యాః సకలాగుణాః

పరాజ్ ముఖీ జగద్ధాత్రీ యస్యత్వం విష్ణువల్లభే.

 నతేవర్ణయితుంశక్తా గుణాఞ్జిహ్వాపి వేధసః

ప్రసీదదేవి పద్మాక్షి మాస్మాంస్త్యాక్షీః కదాచన.

పుష్కర ఉవాచః

ఏవం స్తుతా దదౌ శ్రీశ్చ వరమింద్రియ చేప్సితమ్

సుస్థిర త్వేచ రాజ్యస్య సంగ్రామ విజయాదికమ్.

 స్వస్తోత్ర పాఠశ్రవణ కర్తౄణాం భుక్తిముక్తిదమ్

శ్రీస్తోత్రం సతతం తస్మాత్పఠేచ్చ శృణుయాన్నరః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శ్రీస్తోత్రం నామ సప్తత్రింశ దధిక ద్విశతతమోఽధ్యాయః

పుష్కరుడు పలికెను : పూర్వము తన రాజ్యలక్ష్మిని స్థిరముగా ఉంచుకొనుటకై ఇంద్రుడేవిధముగ లక్ష్మీస్తవము చేసెనో ఆమ్టే రాజు విజయము కొరకు లక్ష్మీస్తవము చేయవలెను. ఇంద్రుడు పలికెను: సకలలోక జననియు, సముద్ర సంభవయు, వికసితకమలనేత్రయు, విష్ణువక్షఃస్థితయు ఆగు లక్ష్మికి నమస్కారము. ఓ లోకపావనీ! నీవే సిద్ధివి; స్వాహా. స్వధా - సంధ్యా - రాత్రి - ప్రధా - భూః - మేధా - శ్రద్ధా సరస్వతీ రూపిణి.. ప్రకాశించు దానవు, ముక్తి రూపవల దాత్రివి ఆగు ఓ దేవీ! యజ్ఞ విద్య, మహాపద్య, గుహ్యవిద్య, ఆత్మ విద్య, ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి కూడ నీవే. నీవు సౌమ్యురావు, నీతో నిండిన ఈ జగత్తు కూడ సౌమ్యమైనది. దేవీ! గదాధారియైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క సర్వయజ్ఞ స్వరూపము, యోగులచే ధ్యానింపబడునది అయిన శరీరమును నీవు తప్ప ఎవరు అధిష్టించగలరు?, దే!! నీవు విడచినంతనే ఈ భువనత్రయము వినష్టమైపోయినది. నీచే ఇపుడు పోషింపబడుచున్నది. మహాదేవీ! నీ దృష్టిపడిగనే మానవులకు భార్య, పుత్రులు, గృహము, స్నేహితులు, ధాన్యము, ధనము మొదలగునవి నిత్యము లభించును. నీ దృష్టిచే చూడబడిన పురుషులకు ఆరోగ్యము, ఐశ్వర్యము. శత్రుపక్షవినాళ నము, సుఖము-ఇవన్నియు దుర్లభములు కావు. సర్వ భూతములకును నీవే తల్లివి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు తండ్రి. ఈ చరాచర జగత్తునంతను, నీవు, శ్రీమహావిష్ణువు వ్యాపించి యున్నారు. ఓ సర్వపావనీ! నీవెన్నటికిని, నా కీర్తి ని, ధనాగారమును, అన్న కోష్టమును, గృహమును. పరి వారమును, శరీరమును, భార్యను విడచివెళ్ళకుము. శ్రీమహావిష్ణు వక్షఃస్థలముపై నివసించుదానా! నా పుత్రులను, స్నేహితు లను, పశువ్వును, ఆలంకారములను, విడచివెళ్ళకుము. ఓనిర్మలురాలా ! నీచే విడువబడిన వారు, సత్యము చేతను, సమరాశాచముల చేతను, శీలము మొదలగు గుణములచేతను పరిత్యజింపబడుదురు. నీచే చూడబడిన వారు నిర్గుణులై నను. వారికి శీలాది సకల గుణములును, కులైశ్వర్యాదులును లభించును. ఓదేవీ ! నాచే చూడబడినవాడే క్లాఘ్యుడు, గుణవంతుడు ధన్యుడు. కులీనుడు, బుద్ధిమంతుడు, శూరుడు, విక్రాంతుడు, జగత్తును పోషించు ఓ విష్ణువల్లభా ! నీవు ఎవని విషయ మున పరాజ్ము ఖురాలవగుదువో ఆతని శీలాదిసకల గుణములును వెంటనే విగుణము లగును. బ్రహ్మదేవుని నాలుక గూడ నీ గుణములను వర్ణింపజాలదు. ఓ పద్మాక్షీ ! దేవీ ! అనుగహింపుము. మమ్ము లను ఎన్నడును విడువకుము. పుష్కరుడు పలికెను. ఈ విధముగ స్తుతింపబడిన లక్ష్మి ఇంద్రునకు కోరికను, రాజ్య సైర్యమును, యుద్ధ విజయాదు లను అనుగ్రహించెను. తన స్తోతమును పఠించువారికిని, వినువారికిని భుక్తి ముక్తులను వర ముగాప్రసాదించెను. అందుచే మానవుడు సర్వదా శ్రీ స్తోత్రమును చదువవలెను. వినవలెను.

ఆగ్ని మహాపురాణమునందు శ్రీస్తోత్రవర్ణనమను రెండువందల ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.