అగ్ని మహా పురాణము

347 - అథ కావ్యదోషవివేకః

ఆగ్ని రువాచః

ఉద్వేగ జనకోదోషః సభ్యానాం సచనప్తధా

వక్తృవాచక వాచ్యానామేక ద్విత్రినియోగతః.

తత్రవక్తాక విర్నామ ప్రథతే నచ భేదతః

సందేహానోఽవినీతః సన్నజ్ఞోజ్ఞాతా చతుర్విధః.

నిమిత్త పరిభాషాయా మర్థ సంస్పర్శివాచకమ్

తద్భేదౌ పదవా క్యేద్వే కథితం లక్షణం ద్వయోః.

అసాధుత్వా ప్రయుక్తత్వే ద్వావేవ పదనిగ్రహౌ

శబ్దశాస్త్ర విరుద్ధత్వ మసాధుత్వం విదుర్బుధాః.

వ్యుత్పన్నైర నిబద్దత్వ మప్రయుక్తత్వ ముచ్యతే

చాందసత్వమవిస్పష్టత్వంచ కష్టత్వమేవచ.

తదసామయికత్వంచ గ్రామ్యత్వంచేతి పంచధా

 ఛాందసత్వంన భాషాయామవిస్పష్టమ బోధతః.

గూఢార్థతా విపర్యస్తార్థతా సంశయితార్థతా

ఆవిస్పష్టార్థతా భేదా స్తత్ర గూడార్థ తేతిసా

యత్రార్థో దుఃఖ సంవేద్యో విపర్యస్తార్థతాపునః

వివక్షితాన్య శబ్దార ప్రతిపత్తిర్మలీమసా.

అన్యార్థత్వా సమర్థత్వే ఏతామేవోప సర్పతః

సందేహ్యమానహచ్యత్వ మాహుః సంశయితార్థతామ్.

దోషత్వమనుబధ్నాతి సజ్జనోద్వే జనాదృతే

అసుఖోచ్చార్య మాణత్వం కష్టత్వం సమయాచ్యుతిః.

ఆసామయికతానే యామేతాంచ మునయోజగుః

గ్రామ్యతాతు జఘన్యార్థ ప్రతిపత్తిః ఖలీకృతా.

వక్తవ్య గ్రామ్యవాచ్యస్య వచనాత్స్మరణాదపి

తద్వాచక పదేనాభి సామ్యాద్భవతి సాత్రిదా.

దోషః సాధారణః ప్రాతి స్వేకోఽర్థస్య సతుద్విధా

అనేక భాగుపాలభ్యః సాధారణ ఇతిస్మృతః.

క్రియాకరకయోర్భ్రంశో విసంధిః పునరుక్తతా

వ్యస్తసంబంధతా చేతి పంచసాధారణా మతాః.

ఆ క్రియత్వం క్రియాభంశో భ్రష్టకారకతాపునః

కర్త్రాది కారకాభావో విసంధిః సంధిదూషణమ్.

ఆగ్ని దేవుడు పలికెను. దోషము సభ్యులకు ఉద్వేగమును కల్గించును. వక్తృ - వాచక - వాచ్యములలో ఏక, ద్వీతి, యోగముచే ఇది ఏడు విధములు. వక్త అనగాకవి. సందిహానులు, అవినీతుడు, అజ్ఞుడు, జ్ఞాత, అని వక్త నాలుగు విధములు. నిమిత్తమును సంకేతమును అనుసరించి అర్థమును బోధించు శబ్దము వాచకము; పదము వాక్యము అను దీని రెండు భేదములు వెనుక చెప్పబడినవి. అసాధుత్వము, అప్రయుక్తత్వము అని పదదోషములు రెండు; వ్యాకరణ శాస్త్రమునకు విరుద్దముగ నుండుట అసాధుత్వము. అప్రసిద్దమగు పదమును ప్రయోగించుట అప్రయుక్తత్వము. ఛాందసత్వము, ఆవి స్పష్టత్వము, కష్టత్వము ఆసామయకత్వమా గ్రామ్యత్వము యని ఆ ఐదు విధములు. లోకములో ప్రయోగించని వైదిక పదములు ప్రయోగించుట ఛాందసత్వము. అర్థము స్పష్టము కాకుండుట అవి స్పష్టత్వము. దీనిలో గూడార్థత్వము, విపర్యసార్థత్వము, సంశయితార్థత్వము యనీ మూడు భేదములు, ఆర్థము శ్రమచే తెలిసినచో ఆది గూడార్థత్వము. వివక్ష తార్థమునకు విపరీతమగు అర్థమును బోధించుట విపర్యసార్థత్వము. అన్యార్థత్వము, అసమర్థత్వము అను దోషములు కూడ విపర్యసార్థత్వములో అంతర్గతమగును. అర్థము సందిగ్ధముగా వున్న చో ఆది సంశయితార్థత్వము. ఇది సహృదయు లకు ఉద్వేగకరము గానిచో దోషము కాదు. ఉచ్చారణకు కష్టముగా నుండుట కష్టత్వము, కవి సమయ వీరుద్దత్వము ఆసా మయికత్వము. దీనికి నేయ యని కూడ పేరు. నీచార్డమును బోధించుట గ్రామ్యతా దోషము. నింద్య మగు గ్రామ్యార్థమును చెప్పుట, తత్స్మరణ, తద్వాచక పదసామ్యము ఇవి గ్రామ్యతా దోషములో మూడు భేదములు. సాధారణము ప్రాతిస్వికము యని ఆర్థ దోషము రెండు విధములు. ఆనేక గత దోషము సాధారణము. క్రియాశ్రుళము కారక భ్రంశము, విసంధి పునరుక్తత, వ్యస్త సంబంధత అని ఇది ఐదు విధములు. క్రియ లేకపోవుట క్రియభ్రంశము. కర్త్రాది కారకములు లేకుండుట కారక భ్రంశము. సంది దోషము విసంది.

విగతోవా విరుద్ధోవా సంధిః సభవతిద్విధా

సంధేర్విరుద్దతా కష్టమపదార్థాంత రాగమాత్.

పునరుక్తత్వ మాభిక్ష్ణ్యాదభిమానం ద్విధై వతత్

ఆర్థావృత్తి: పదావృత్తి రర్థావృత్తిర పిద్విదా.

ప్రయుక్తవరశబ్ధేన తథాశబ్దాంత రేణచ

నా వర్తతే పదావృత్తౌ వాచ్యమావర్తతే పదమ్.

వ్యస్తసంబంధ తాసుష్ఠు సంబందో వ్యవధానతః

సంబంధాంతర నిర్భాసాత్సంబంధాంతర జన్మనః.

ఆభా వేఽపి తయోర న్తర్వ్య వధానా త్త్రిధై వసా

ఆంతరా పద వాక్యాభ్యాం ప్రతిభేదం పునర్ద్విధా.

వాచ్యముర్థార్థ్య మానత్వా త్తద్ద్విధా పదవాక్యయోః

ప్యుత్పాదితం పూర్వవాచ్యం వ్యుత్పాద్యంచేతి భిద్యతే.

ఇష్టవ్యాఘాత కారిత్వం హేతోః స్యాదసమర్థతా

అసిద్దత్వం విరుద్ధత్వ మనై కాంతికతాతథా.

ఏవం సత్ప్రతిపక్షత్వం కాలాతీతత్వ సంకరః

పక్షే సపక్షే నా స్తిత్వం విపక్షేఽ స్తిత్వమేవతత్.

కావ్యేషు పారిపద్యానాం నభవేదప్యరుంతుదమ్

ఏకాదశ నరర్థత్వం దుష్కరాదౌ నదుష్యతి.

దుఃఖీక రోతి దోషజ్ఞాన్గూడార్థత్వం నదుష్కరే

నగ్రామ్యతోద్వేయకారీ ప్రసిద్ధేర్లోక శాస్త్రయోః.

క్రియాభ్రంశేన లక్ష్మా స్తి క్రియాధ్యాహార యోగతః

భష్టకారకతా క్షేప బలాధ్యాహృత కార కే.

ప్రగ్ర హే గృహ్యతే నైవం క్షతం విగతనందినా

కష్టపాఠాద్వి సంధిత్వం దుర్వచాదౌన దుర్భగమ్. 

సంధ్యభావము విరుద్ధ సంధి ఆవి విసంధి రెండు విధములు. విరుద్ధముంగు పదార్థంతరమున భోధించుటచే విరుద్ధ సంధి దష్టమైనది. మాటిమాటికి చెప్పుట పునరుక్తత్వము, ఆర్థావృత్తి పదావృత్తి యని ఆది రెండు విధములు. ఆర్థావృత్తి రెండు విధములు. కావ్య ప్రయుక్త మగు శబ్దము చేతను, శబ్దాంతరము చేతను ఏర్పడు పదా వృత్తిచే ఆర్థావృత్తి కలుగదు. పదమాత్రమునకే ఆ వృత్తి ఏర్పడును. దూరముగ నున్న పదముల అన్వయము వ్యస్త్ర సంబంధత. సంబంధాంతర ప్రతీతి, సంబంధాంతర జన్యత్వము ఏతదుభయ అథావము వీటిచే వ్యస్త సంబంధిత్వమునకు మూడు భేదములుండును. పైమూడింటి యందును పదవ్యవధానవాక్య వ్యవధానములచే మూడేసి భేదములు ఏర్పడును. పద వాక్యములందు అర్థ ఆర్థ్యమాన భేద ముచే వాచ్యార్థము రెండు విధములగును. వ్యుత్పాదితము వ్యుత్పాద్యముయని పద వాచ్యార్థము రెండు విధములు, హేతువు అభీష్ట సిద్ధికి వ్యాఘాతమైనచో ఆది దుష్టము, అసమర్థత్వ - ఆసిద్ధత్వ - విరుద్ధత్వ - అనైకాంతికతా, - సత్రతిపక్షత్వకాలాతీతత్వ - సంకర . ఇషాభావ - సపషాభావ . విపక్షాస్థిత్వ - నిరర్థత్వములు పండ్రెండు హేతుదోషములు. ఇష్ట వ్యాఘాత కారిత్వదోషము సహృదములకును సభాసదులకును మార్మిక పీడ కల్గించును. దుష్కరములగు చిత్రబంధాది కావ్యములో నిరర్థత్వము దోషముకాదు. గూర్ఖత్వము కూడ దోషము కాదు. లోకశాస్త్రములందు ప్రసిద్ధమైనచో గ్రామ త్వము దోషము కాదు. క్రియను ఆధ్యాహారమును చేసుకొనుటకు అవకాశమున్నచో క్రి యాభ్రంశ ము; కారకమును ఆధ్యా హారము చేసుగ్గొనుటకు వీలున్న చో కారక భ్రంశము దోషములు కావు - ప్రగృహ్య సంజ్ఞను బట్టి ప్రకృతి భావము వచ్చిన చోట విసంధిత్వము దోషముకాదు. సంధి చేసినచో ఉచ్చరించుట కష్టమైనపుడు విసంధిత్వము దోషముకాదు.

అనుప్రాసే పదావృత్తిర్వః స్త సంబంధతాశుభా

నార్థ సంగ్రహణేదోషో వ్యుత్క్రమా ద్యైర్నలిప్యతే.

విభక్తి సంజ్ఞా లింగానాం యత్రోద్వేగోన ధీమతామ్

సంఖ్యాయాస్తత్ర భిన్నత్వ ముపమానోప మేయయోః.

అనేక స్యతథైకేన బహూనాం బహుభిః శుభా

కవీనాం సముదాచారః సమయోనామ గీయతే. 

సామాన్యశ్చ విశిష్టశ్చ ధర్మవద్భతిద్విదా

సిద్ద సైద్ధాంతి కానాంచ కవీనాంచా వివాదతః.

యః ప్రసిధ్యతి సామాన్య ఇత్యసౌసమయో మతః

సర్వేసి (సై) ద్ధాన్తికాయేన సంచరంతి నిరత్యయమ్.

కియ న్తేఅవవాయేన సామాన్యస్తేన సద్విధా

చేదిసిద్ధాంతతోఽన్యః స్యాత్కేషాంచిద్ర్భాంతి తోయథా.

తర్కజ్ఞానం మునేః కస్య కస్కచిత్ క్షణ భంగికా

భూతచైతన్య తాకస్య జ్ఞానస్య సుప్రకాశతా.

ప్రజ్ఞాతస్థూలతా శబ్దానేకా న్తత్వం తథార్హతః

శైవ వైష్ణవ శాక్తేయ సౌర సిద్ధాంతినాం మతిః.

జగతః కారణం బ్రహ్మసాంఖ్యానాం సప్రధానకమ్

ఆస్మిన్సరస్వతీ లోకే సంచరంతః పరస్పరమ్.

బధ్నంతి వ్యతిపశ్యన్తోయద్విశిష్టః స ఉచ్యతే

పరిగ్రహా దప్యసతాం సతామేవా పరిగ్రహాత్.

భిద్యమానస్య తస్యాయాం స్వైవిధ్య ముపగీయతే

ప్రత్యక్షాది ప్రమాణై ర్యద్బాధితం తదసద్విదుః.

కవిభి స్తత్ప్రతిగ్రాహ్యం జ్ఞానస్య ద్యోతమానతా

యదేవార్థ క్రియాకారి తడేవపరమార్థనత్.

ఆజ్ఞానాత్ జ్ఞానత స్త్వేకం బ్రహ్మైవ పరమార్థసత్

విష్ణు స్వర్గాది హేతుః సశబ్దాలంకారరూపవాన్. 

అపరాచ పరా విద్యాతాం జ్ఞాత్వాముచ్యతే భవాత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే కావ్యదోష వివేకో నామ సప్త చత్వారింశ దధిక త్రిశతతమోఽధ్యాయః.

అనుప్రాసలో పదావృత్తి వున్నపుడు వ్యస్తసంబంధత్వము దోషముకాదు. అర్థ సంగ్రహమున ఆర్థావృత్తి దోషము కాదు. కాని వ్యుత్ర్కమాదులు మాత్రము దోషము. ఉపమానోపమేయముని విభక్తి సంజ్ఞా లింగవచనములో భేదమున్నను బుద్ధిమంతులకు ఉద్వేగము కలుగనంత వరకు అవి దోషములు కావు. ఉద్వేగమును కల్గించని దోషములు దోషకరములు కావు. అనేక వస్తువులకు ఒక వస్తువు తోను, అనేక వస్తువులకు ఆనేక వస్తువులతోను ఔపమ్యము చెప్పినను దోషములేదు. కవిజన పరంపరా అంగీకృతమగు సదాచారమునకు సమయమని పేరు. దానిని సకల సిద్ధాంతవాదులును నిస్సంశయముగా అను సరింతురు. కొన్ని సమయములన కొంతమందియే అనుసరింతురు. ఈ విధముగా సమయములు రెండు విధములు; ఏ దేవా ఒక సిద్ధాంతమును అనురించుట చేతను భ్రాంతి చేతను ఈ మత భేదము ఏర్పడును. కొంతమంది ముమల సిద్ధాంతమునకు తర్కము ఆధారము; కొంతమందికి క్షణ థంగవాదము ఆధారము; పంచభూత సంఘాతముచే శరీరమున చైతన్యము వచ్చునని కొందరందురు. స్వతః ప్రకాశమగు జ్ఞానమే చైతవ్యమని కొందరందురు. కొందరు, ప్రజాత స్థూలతావాదులు కొందరు శబ్దానేకాంతవాదులు ఈ జగత్తుకు బ్రహ్మకారణమని, శైవ వైష్ణవ క్షసౌర, సిద్దాంతవాదులు అంగీకరింతురు. కాని సాంఖ్యులు దృశ్య జగత్తునకు ప్రధానమే కారణమని చెప్పుదురు. ఈ విధముగా సరస్వతీ లోకమున సంచరించు విచార కులు పరస్పర విపర్యస్త దృష్టితో చూచుచుయుక్తులతో పరస్పర ఖండనము చేసుకొను చున్నారు. వీరు చెప్పు విభిన్న మార్గములు విశిష్ట సమయము. అసత్తునే గ్రహించుట, సత్తును పరిత్యజించుట, దీనిచే ఈ విశిష్ట సమయము రెండు విధ ములు. ప్రత్యక్షాది ప్రమాణములచే బాధితమైనది ఆసత్తు. దేని యందు జ్ఞాన ప్రకాశముండునే ఆమతమనే కవులు గ్రహించ వలెను. ఏది ఆర్థ క్రియాకారియో ఆదియే పరమార్థసత్; ఆజ్ఞాన జ్ఞానాతీతమై వున్న ఏక మాత్ర బ్రహ్మయే పరమార్థసత్. అదిష్ణయము. ఆదియే సృష్టిపాలన సంహార హేతువగు విత్తవు. ఆదియే శబ్ద ఆలంకార రూపమా. ఆదియే పరాపర విద్యలు. దానిని తెలిసిన వాడే సంసార బంధ ముక్తుడగును.

అగ్ని మహాపురాణమున కావ్య దోష వివేకమను మూడు వందల నలుబది యేడవ అధ్యాయము సమాప్తము.