అగ్ని మహా పురాణము

300 - అథ గ్రహహృన్మంత్రాదికమ్

అగ్ని రువాచః

గ్రహోపహార మంత్రా దీన్వక్ష్యే గ్రహ విమర్దనాన్

హర్షేచ్ఛాభయ శోకాది విరుద్దాశుచి భోజనాత్.

గురుదేవాది కోపాచ్చ పంచోన్మాదా భవన్త్యథ

త్రిదోషజాః సన్ని పాతా ఆగంతవ ఇతిస్మృతాః.

దేవాదయోగ్రహాజాతా రుద్రక్రోధా దనేకధా

సరిత్సర స్తడా గాదౌ శైలోప వన సేతుషు.

నదీసంగే శూన్యగృహే బిలద్వా ర్యేక వృక్షకే

 గ్రహా గృహ్ణంతి పుంసశ్చ స్త్రియం సుప్తాంచ గర్భిణీమ్.

ఆసన్న పుష్పాం నగ్నాంచ ఋతుస్నానం కరోతియా

అవమానం నృణాం వైరం విఘ్నం భాగ్య విపర్యయః.

దేవతా గురు ధర్మాది సదా చారాది లంఘనమ్

 పతనం శైల వృక్షా దేర్విధున్వన్మూర్ధ జాన్ముహుః.

రుదన్నృత్యతి రక్తాక్షో హ్రూంరూపోఽనుగ్రహీనరః,

ఉద్విగ్నః శూలదాహార్తః క్షుత్తృష్ణార్త: శిరో ర్తిమాన్.

 దేహి దేహీతి యాచేత బలికామగ్ర హీనరః

 స్త్రీ మూలా భోగస్నానేచ్ఛూరతి కామ గ్రహీనరః.

మహాసుదర్శనో వ్యోమ వ్యాపీ విటపనానికః

పాతాల నారసింహాద్యా చండీమంత్రా గ్రహార్దనాః.

పృశ్నీ హింగువచాచుక్ర శిరీష దయితం పరమ్

పాశాంకుశ ధరందేవ మక్షమాలా కపాలినమ్. .

ఖట్వాంగాబ్జాది శక్తించ దధానం చతురాననమ్

ఆంతర్భాహ్యాది ఖట్వాంగ పద్మస్థం రవిమండలే.

ఆదిత్యాదియుతం ప్రార్చ్య ఉదితేఽర్కేఽర్ఘ్యకం దదేత్

శ్వాసవిషాగ్ని విప్రకుండీ హృల్లేఖాసకలో భృగుః.

అర్కాయ భూర్భువః స్వచ్చజాలినీం కులముద్గరమ్

పద్మాసనోఽరుణో రక్తవస్త్ర: సద్యుతి విశ్వకః.

ఉదారః పద్మదృగ్ధోర్భ్యాం సౌమ్యః సర్వాంగ భూషితః

రక్తాహృదాదయః సౌమ్యావరదాః పద్మధారిణః.

విద్యుత్పుంజనిభం వస్త్రం శ్వేతః సౌమ్యోఽరుణ@ కుజః

బుధ స్తద్వద్గురుః షితః శుక్లః శుక్రః శనైశ్చరః

కృష్ణాంగార నిభోరాహుర్ధూమ్రః కేతురుదాహృతః

వామోరువామ హస్తాన్తే దక్షహస్తోరు జానుషు.

స్వనామాద్య న్తబీజాస్తే హస్తౌసంశోద్యశాస్త్రతః

అంగుష్ఠాదౌ తలేనేత్రే హృదాద్యం వ్యాపకం న్య సేత్.

మూలబీజైస్త్రిభిః ప్రాణధ్యాయకం న్యస్య సాంగకమ్

ప్రక్షాల్యపాత్రమన్త్రేణ మూలేనా పూర్యవారిణా.

గంధపుష్పాక్షతం న్యస్యదూర్వాయర్ఘ్యంచ మంత్రయేత్

ఆత్మానం తేనసంప్రోక్ష్య పూజాద్రవ్యంచ వై ధ్రువమ్.   

అగ్ని దేవుడు పలికెను. ఇపుడు గ్రహోపహార మంత్రాదులను చెప్పెదను. ఇవి గ్రహ శాంతి నిచ్చును. హర్ష ఇచ్ఛా భయశోకాదుల చేతను పకృతి విరుద్దము అపవిత్రముయైన ఆహారము భుజించుట చేతను గురు దేవాది కోపము చేతను మానవునకు ఐదు విధములగు ఉన్మాదములు కలుగు. వాటికి త్రిదోషజములు, సన్నిపాతజములు, ఆగంతుకములు అని పేర్లు, రుద్రుని క్రోధముచే అనేక విధములగు దేవాది గ్రహము కలుగును. ఈ గ్రహములు నదులు. చెరువులు తటాక ములు శైలములు ఉపవనములు సేతువులు నదీ సంగమము, శూన్య గృహము బిల ద్వారము, ఏకైక వృక్షము, వీటి యందుండి అక్కడికి వెళ్ళిన వారిని ఆవహించుకు నిద్రపోవుచున్న గర్భిణిస్త్రీ, ఆసన్న ఋతుకాలయగుస్త్రీని నగ్నస్త్రీని ఋతు స్నానము చేయుచున్న స్త్రీని కూడ ఆవహించును. ఇవి మానవునకు అవమానము, వైరము, విఘ్నము. భాగ్య విపర్యయము

మొదలగునవిచేయించును. దేవతా గురు ధర్మాది సదాచారాదులను ఉల్లంఘించిన వారిని పర్వత వృక్షాదుల నుండి పడినవారిని మాటి మాటికి జుట్టు దుల్పుకొను వానిని, కండ్లు ఎర్ర చేసి ఏడ్చచు గంతలు వేయుచున్న వానిని ఈ లక్షణములను బట్టి రూప అను గ్రహవిశేషముచే పీవీతుడై నట్లు గ్రహించవలెను ఉద్వేగయు కుకై దాహ శూల పీడితుడై ఆకలి దప్పులతో బాధపడుచు శిరో రోగముతో బాధపడుచు నాకు ఇమ్ము, నాకు ఇమ్ము యని యాచన చేయువాడు బలి కామి యను గ్రహముచే పిపితుడని తెలుపు కొనవళను. స్త్రీ, మాలా, స్నాన, సంభోగముల యందు అధి కేచ్ఛ కల వానిని రతి కామి యనుగ్రహి ఆవహించినట్లు తెలుసు కొనవలెను. ఆకాశ వ్యాపియైన మహా సుదర్శనము, విటప నాశికము, పాతాళ నార సింహాచె మంత్రములు, చుడీ ముత్ర ములు గ్రహ పీడను తొలగించును. గ్రహ పిక నాశనము చేయు సూర్యా రాధన ఈ క్రింది విధముగా చేయవలయును. సూర్యుడు తన దక్షిణ హస్తములందు పాశాంకుశ అక్షమాలా కపాలములను వామ హస్తము లందు ఖట్వాంగ కమల చక్ర శక్తులను ధరించి యుండును. నాలుగు ముఖములు ఎనిమివి హస్తములు, పన్నెండు నేత్రములు కలిగి యుండును. సూర్యుడు సూర్య మండలము లోపం కమలాసనముపై ఆత్యాది దేవగణ పరివృతుడై కూర్చుండి యుండును. ఈ విధముగ సూర్యుని ధ్యాన పూజాదులు చేసి ఉదయ కాలమున అర్ఘ్యము ఇవ్వవలెను. అందులకు మంత్రము శ్వాస (య) విష (ఓం) అగ్నిమాన్ రండి (ర్ - ఓం) హృల్లేఖా (హ్రీం) ఇవి సంకేతాక్షరమలు. వీటిని కలుపగా.యౌః రౌం, ఐ), హ్రీ. కలశార్కాయ భూర్భువః స్వరోం జ్వాలి నీ కుల ముద్ధర" అని ఏర్పడును. సూర్యుడు పద్మాసన గతుడై ఎర్రగా రక్త వస్త్రములు ధరించి యుండున. అతని మండలము జ్యోతిర్మయము. ఉదార స్వభావుడు. రెండు హస్తము లందును పద్మ మును ధరించి అన్ని అవయములందును అలంకారములు ధ్వంచి సౌమ్య మూర్తియై యు:డును. సూర్యాది గ్రహము అన్నియు సౌమ్యములై బలాదాయకములై కమఃములు ధరించి యుండును. వారి వస్త్రములు విద్యుత్పుఁజమువలె నుండును. బృహస్పతి పసుపుపచ్చగాను శుక్రుడు తెల్లగను శని, నల్ల బొగ్గు వలెను. రాహు కేతువులు ధూమ సమాన వర్ణులుగను వుందురు. వీరందరను ఎడమ చేతులను ఎడమ తొడల పైనుని దక్షిణ హస్తము లందు అభయ ముద్రను ధరించి యుందురు. గ్రహముల పేర్ల ఆద్యక్షరములకు బిందువులు చేర్చినచో అవి బీజ ముత్రములగును. "వజ్" యని ఉచ్చరిం చుచు హస్తముం ఛాంచి అంగడ్డము మొదలు కరతం పర్యన్తము, కరన్యాసము నేత్రములు తప్ప హృడమూవి పుదాంగ న్యాసము చేసి సూర్యుని మూల బీజ రూపములగు మూడు అక్షరము తో (హ్రాం హ్రీం సహ) వ్యాపక ! న్యాసము చేయవలయును. పిదప అర్ఘ్య పాత్రమను హస్త్ర మంత్రముతో ప్రక్షాళన చేసి పూర్వోక్త మూల మంత్రమను ఉచ్చరించుచు ఉదకము నింపి గంధ పుష్ప అక్షత దూర్వములు వేసి మరల ఆభిమంత్రించి ఆ జలముతో తనను పూజా ద్రవ్యములను ప్రోక్షణ చేసి కొనవలెను.    

ప్రభూతం విమలం సారమారాధ్యం పరమం సుఖమ్

పీఠాద్యాన్కల్పయే దేతాన్ హృదా మధ్యే విదిక్షుచ.

పీఠోపరి హృదోమధ్యే దిక్షుచైవ విదిక్షుచ

పీఠోపరి హృదాబ్జంచ కేసరేష్వష్టశక్తయః.

వాందీప్తాం వీంతథా సూక్ష్మాం వూంజయాం వృంజభద్రికామ్

వేం విభూతీం వైంవిమలాం వోమసిఘాత విద్యుతామ్.

వౌం సర్వతోముఖీం వంపీఠం వః ప్రార్చ్య రవింయజేత్

ఆవాహ్య దద్యాత్సాద్యాది హృత్షడంగేన సువ్రత.

ఖకారౌ దండినౌ చండౌ మజ్జాదశన సంయుతా

మాంసదీర్ఘా జరద్వాయు హృదై తత్సర్వదంరవేః.

వహ్ని శరక్షో మరుతాం దిక్షుపూజ్యా హృదాదయః

స్వమంత్రైః కర్ణికాంతస్థాదిక్ష్వస్త్రం పురతః సదృక్.

పూర్వాదిదిక్షు సంపూజ్యాశ్చంద్రజ్ఞ గురుభార్గవాః

పృశ్నిహింగువచా చుక్ర శిరీషలశు నామయైః.

నస్యాంజనాది కుర్వీత సాజమూత్రైర్గ్రహాపహైః.

పాఠాపథ్యావచాశిగ్రు సింధువ్యో షైః పృథక్ఫలైః

ఆజాక్షీరాఢకే పక్వసర్పిః సర్వగ్రహాన్హ రేత్ .

వృశ్చికాలీఫలీ కుష్ఠం లవణాని చ శార్జ్గకమ్

అపస్మార వినాశాయ తజ్ఞలం త్వభిభోజయేత్ .

విదారీకుశకాళేక్షు క్వాథజం పాయయేత్పయః

ద్రోణే సయష్టి కూష్మాండర సే సర్పిశ్చ సంస్కృతమ్.

పంచగవ్యం ఘృతం తద్వద్యోగం జ్వరహరం శృణు

ఓం భస్మాస్త్రాయ విద్మ హే ఏకదంష్ట్రాయ ధీమహి

తన్నో జ్వరః ప్రచోదయాత్

కృష్ణోషణ నిశారాస్నా ద్రాక్షా తైలంగుడం లిహేత్.

శ్వాసవానథ వాభార్గీసయష్టి మధుసర్ఫిషా

పాఠాతిక్తాకణా భార్గీమథ వామధునాలి హేత్.

ధాత్రీవిశ్వసిరా కృష్ణా ముస్తా ఖర్జూరమాగధీ

పివర శ్చేతి హిక్కాఘ్నం తత్త్రయం మధునాలి హేత్.

కామలీజీర మండూకీ నిశాధాత్రిరసం పిబేత్

వ్యోషపద్మక త్రిఫలా విడంగ దేవదారవః.

రాస్నా చూర్ణం సమం ఖండైర్జగ్ధ్వా కాసహరం ధ్రువమ్. .

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే గ్రహహృన్మంత్రాది నిరూపణం నామ త్రిశతతమోఽధ్యాయః.  

పిదప యోగ పీఠమును కల్పించి దాని పాదములుగా ప్రభూత విమల, సార, ఆరాధ్య పరమ సుఖములను కల్పించ వలెను. ఆగ్నేయాది దిక్కులు నాల్గింటి యందను మధ్య భాగము నందను వీటి పేర్లకు చివర నమః చేర్చి వాటికి ఆవహన పూజలు చేయవలయును. యోగ పిఠము పైనను, హృదయ కమలము నందను దిక్కు నందును విదిక్కునందును, దీప్త మొదలగు శక్తులను స్థాపించవలెను. పీఠముపై హృదయ కమలము స్థాపించి దాని కేసరములపై ఎనిమిది శక్తులను పూజించ వలెను. “వాం దీప్తాం” “ఏం సూక్ష్మాం” “వూం జయాం” “వృం భద్రి కాం” “వేం విభూతం” “వైం విమలాం” “వోం ఆసిఘాత విద్యుతాం” “వీం సర్వతో ముఖీం” “వం పీఠమ్”. ఈ విధముగ శక్తులను పూజించి పిదప రవిని పూజించవలెను. ఆవహనము చేసి పాద్యాదులు సమర్పించి హృదయాది షడంగ న్యాస పూర్వకముగ పూజ చేయవలయును. “ఖ కారౌ మొదలు జర ద్వాయుహృదా" వరకు సంకేతము చే సూచించిన రవి మంత్రము సర్వ ఫల ప్రదము. ఆగ్నేయ నై ఋకి ఈశాన వాయవ్య చిక్కులందును, మధ్య యఃదను హృదాదీ పంచాంగములతో వాటి మంత్రములతో పూజించ వను. కర్ణి కామధ్యము నందే పూజించవలెను. తన యెదురుగా నున్న దిక్కు నందు అస్త్ర పూజ చేయవలెను. పూర్వాది దిక్కు లందు క్రమముగా చంద్ర బుధ గురు శుక్రులను ఆగ్నేయాది విదిక్కు లందు మంగళశ నైశ్చర రాహు కేతువులను పూజించవలెను. పుష్ణిహింగు వచా చక్ర శిరీష లగున ఆమయములను మేః మూత్రము నందు నూరి అంజనము నశ్యము తయారు చేయవలయును. ఈ ఓషధులను ఈపిధముగ ఉపయోగించినచో గ్రహబాధ తొలగును. పాఠాపథ్యా వచా, శిగ్రుసింధు వ్యోషములును బొక్కక్క పలము చొప్పున గ్రహించి ఒక కుంచెడు మేక పాళ్ళతో ఉడక పెట్టి ఆ పాలనుండి తీసిన నెయ్యి సమస్త గ్రహబాధలను తొలగించును. వృశ్చికాః, ఫల కష్ట, లవణ శార్జకములను నీటిలో ఉడికించి ఇచ్చినచో అపస్మార రోగము తొలగును. విదారి కుళ కాశ, ఇకు క్వాథములతో చేసిన పాల నురోగికి త్రాగించవలెను. యష్టి కూష్మాండరసమునందు సంస్కృతమైన మృతమును కాని పంచగవ్యమును గాని, ఇచ్చినచో జ్వరము తొలగును. “ఓం భస్మాస్త్రాయ విద్మహే! ఏక దంష్ట్రాయ ధీమహి, తన్నో జ్వరః ప్రచోదయాత్” ఈ మంత్రమును జపించుటచే జ్వరము తొలగును. శ్వాసకోగి కృష్ణాశన, నిశా, రాస్నా, ద్రాక్ష తైల గుడములను సేవించవలెను. లేదా మధు ఘృతముల తో బార్డిని సేవించవలెను. లేదా పాఠా, ఆక, కణ బార్జీలను తేనెతో నాక వలెను. ధాత్రీ విశ్వసితా, కృష్ణా ముస్తా, ఖర్జూర మాగధీ, పీవరా, యివి ఎక్కిళ్ళను తగ్గించును. పైమూడు యోగము లను తేనెతో సేవించవలెను. కామల రోగముకలవాడు జీరమాండూకి నిళా, ధాత్రీ రసములను త్రాగ వలెను. త్రికటు పద్మకాష్ఠ, త్రిఫలా విడంగ దేవదారు రాస్నలను సమమైన పాళ్ళతో గ్రహించి చూర్ణముచేసి పటికి బెల్లముతో సేవించినచో కాసరోగము తప్పక నశించును. 

అగ్ని మహాపురాణమున గ్రహహృన్మంత్రాది నిరూపణమను మూడువందలవ అధ్యాయము సమాప్తము.