పుష్కర ఉవాచః-
ఆజీవంస్తు యదు క్రేన బ్రాహ్మణః స్వేన కర్మణా ।
కత్రవిట్ శూద్రధర్మేణ జీవేన్నైవ తు శూద్రజాత్.
కృషివాణిజ్య గోరక్ష్యం కుసీదం చ ద్విజశ్చరేత్ ।
గోరసం .గుడలవణగారమాంసాని వర్జయేత్.
భూమిం భిత్త్వాషధీశ్చిత్వా హత్వా కీట పిపీలికాః ।
పునని ఖలు యజైన కర్షకాదేవ పూజనార్.
శ్రీ హలమష్టగవం ధర్మం షష్ణవం జీవిలార్డినామ్ ।
చతుర్ధవం నృశంసానాం ద్విగతం ధర్మపతినామ్.
ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా ।
నత్యానృతాభ్యామపి వా న శ్వవృత్త్యా కదాచన.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే గృహస్త్రవృత్తివర్ణనం నామ ద్విపఞ్చాశదధిక శతతమోధ్యాయః॥
పుష్కరుడు పలికెను : బ్రాహ్మణుడు తన కర్మచే జీవించవలెను. అట్లు జీవించజాలని బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య - శూద్రధర్మములచే గూడ జీవించవచ్పున. కాని సంకరజాతులవారి ధర్మము నవలంబింపరాదు. ద్విజుడు ఆపత్కాలమున కృషి, వాణిజ్యము, గోరక్షణము, వడ్డీవ్యాపారము కూడ చేయవచ్చును. కాని గోక్షీరాదులు, బెల్లము, లవణము, వారము, మాంసము మొదలైనవాటి వ్యాపారము చేయరాదు. కర్షకులు భూమిని బ్రద్దలుకొట్టుట, ఓషధులను ఛేదించుట, కీటక పిపీలికాదులను చంపుట మొదలగు వాటివలన కలిగిన పాపమును యజ్ఞముచేతను, దేవతాపూజచేతను తొలగిం చుకొనగలరు. ఎనిమిది ఎద్దుల హలము ధర్మసంమతము, జీవిక కోరువారికి ఆరు ఎద్దుల హలము, క్రూరులకు వాలు గెద్దుల హలము, ధర్మహింసకులకు రెండెద్దుల హలము చెప్పబడినది. ఋతము (కళ్లములో మిగిలిన వరివెన్నుల ధాన్యపు గింజలు ఏరికోని వాటిపై మాత్రము జీవించుట) చేతగాని, అమృతము (అయాచితముగా లభించినది) చే గాని, మృతము (లివాన్నమచేత గాని, ప్రమృతము (వ్యవసాయము) చేత గాని, సత్యానృతముల (వర్తకమ) చేత గాని జీవించవలెను. శ్వవృత్తి (సేవావృత్తి) తో ఎన్నడును జీవించరాదు.
అగ్ని మహాపురాణమునందు గృహస్థజీవికావర్ణన మను నూటఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 152 of the Agni Purāṇa is as follows:
The proper livelihood and daily conduct of the gṛhastha (householder) are described. Agni outlines the five great sacrifices (pañca-mahāyajña)—brahmayajña, pitṛyajña, devayajña, bhūtayajña, and atithiyajña—as the householder's daily obligatory duties. Permitted means of livelihood according to varṇa are enumerated, along with forbidden occupations and prohibited trades. The gṛhastha's ideal daily schedule from predawn ablutions through evening sandhyā is sketched. The chapter declares the gṛhastha-āśrama the foundation of all other āśramas since it alone provides support to brahmacārins, vānaprasthas, and saṃnyāsins.