అగ్ని మహా పురాణము

13 - అథ భారతాఖ్యానమ్.

అగ్ని రువాచః

భారతం సంప్రవక్ష్యామి కృష్ణమాహాత్మ్యలక్షణమ్

భూభారమహరద్విష్ణుర్ని మిత్తీ కృత్య పాణ్డవాన్.

ఆగ్ని పలికెను

కృష్ణుని మాహాత్మ్యమునకు లక్షణ మైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని భూ భారమును హరించెను.

విష్ణునాభ్యబ్జజో బ్రహ్మా బ్రహ్మపుత్రోఽత్రిరత్రితః

సోమః సోమాద్బుధస్త స్మాదై ల ఆసీత్పురూరవాః.

తస్మాదాయుస్త తో రాజా నహుషోఽతో యయాతికః

తతః పూరుస్తస్య వంశే భరతోఽథ నృవః కురుః.

తద్వంశే శన్తను స్తస్మాద్భీష్మో గఙ్గాసుతోఽనుజౌ

చిత్రాఙ్గదో విచిత్రశ్చ సత్యవత్యాం చ శననోః.

విష్ణువు నాభికమలమునుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రి చంద్రుడు, ఆతనికి బుధుడు, ఆతనికి ఐలుడు, ఆతనికి పురూరవుడు, అతనికి ఆయువు, ఆతనికి నహుషుడు, ఆతనికి యయాతి, ఆతనికి పూరువు, పుట్టెను. ఆతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టెను. ఆతని వంశమునందు శంతనున జన్మించెను ఆతనికి గంగాపుత్రు డైన భీష్ముడు జనించెను. శంతనువునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద - విచిత్రులు పుట్టిరి.

స్వర్గం గతే శన్తనౌ చ భీష్మో భార్యావివర్జితః

అపాలయద్భ్రాతృరాజ్యం బాలశ్చిత్రాఙ్గదో హతః.

చిత్రాఙ్గదేన ద్వే కన్యే కాశిరాజస్య చామ్బికా

అమ్బాలికా చ భీష్మేణ ఆనీతే విజితారిణా.

భార్యే విచిత్రవీర్యస్య యక్ష్మణా స దివం గతః.

శంతనువు స్వర్గస్తు డైన పిమ్మట భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరుల రాజ్యము పాలించెను. చిన్నవా డైన చిత్రాంగదుని, చిత్రాంగదు డనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశిరా కుమార్తె లైన అంబికాంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలనుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మచే స్వర్గస్తు డయ్యెను.

సత్యవత్యా హ్యనుమతా దమ్బికాయాం నృపోఽభవత్

ధృతరాష్ట్రామ్బాలికాయాం పాణ్డుశ్చ వ్యానతః సుతః.

గాన్ధార్యాం ధృతరాష్ట్రాచ్చ దుర్యోధనముఖం శతమ్

శతశృఙ్గాశ్రమపదే భార్యా యోగాదథొ మృతః.

ఋషిశాపాత్తతో ధర్మాత్కున్త్యాం పాణ్డోర్యుధిష్ఠిరః

వాతాద్భీమోఽర్జునః శక్రాన్మాద్ర్యామశ్వికుమారతః.

నకుల సహదేవశ్చ పాణ్డుర్మాద్రీయుతో మృతః

కర్ణః కున్త్యాం హి కన్యాయం జాతో దుర్యోధనాశ్రితః.

సత్యవతి అనుమతిచే వ్యాసునివలన ఆంబికయందు రాజైన ధృతరాష్ట్రడును అంబాలిక యందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రని వలన గాంధారియందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్య న కుంతియందు యమధర్మ రాజువలన యుధిష్ఠిరుడును, వాయుదేవునివలన భీముడును, దేవేశిద్రునివలన ఆర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకులసహదేవులు పుట్టిరి. శతశృంగాశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాదీసంగము చేయుటవలన మరణించెను. మాద్రి ఆతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా, జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.

కురుపాణ్డవయోర్యుద్ధం దైవయోగాద్బభూవ హ.

దుర్యోధనో జతుగృహే పాణ్డవానదహత్కుధీః

దగ్దాగారా ద్వినిష్క్రాన్తా మాతృషష్ఠాస్తు పాణ్డవాః.

దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్దియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చేను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.

తతస్త ఏకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే

మునివేషాః స్థితాః సర్వే నిహత్య బక రాక్షసమ్.

పిమ్మట ఆ పాండవులు ఏక చక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు ఒక రాక్షసుని చంపిరి.

యయుః పాఞ్చాలవిషయం ద్రౌపద్యాస్తే స్వయంవరే

సంప్రాప్తా బహువేషేణ ద్రౌపదీ పఞ్జపాణ్డవైః.

వారు ద్రౌపదీస్వయంవరనిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.

అర్ధరాజ్యం తతః ప్రాప్తా జ్ఞాతా దుర్యోధనాదిభిః

గాణ్డీవం చ ధనుర్ధివ్యం పావకాద్రథముత్తమమ్.

సారథిం చార్జునః సంఖ్యే కృష్ణమక్షయ్యసాయకాన్

బ్రహ్మాస్త్రాదీం స్తదా ద్రోణాత్సర్వే శస్త్రవిశారదాః.

దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్ధ రాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్నిదేవునినుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, ఆశయ్యమైన బాణములు గల అమ్ములపొదులను పొందెను. ద్రోణునివలన బ్రహ్మాద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.

కృష్ణేన సోఽర్జునో వహ్నిం ఖాణ్డవే సమతర్పయత్

ఇన్ద్రవృష్టిం వారయంశ్చ శరవర్షేణ పాణ్ణవః.

పాండుకుమారు డైన అర్జునుడు తన శరవరముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహా యముతో, ఖాండవవనమునందు అగ్నిని సంతృప్తుని చేనెను.

జితా దిశః పాణ్ణవై శ్చ రాజ్యం చక్రే యుధిష్ఠిరః

బహుస్వర్ణం రాజసూయం న సే హే తం సుయోధనః.

పాండవులు నలుదిక్కులను జయించిరి. యుధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహించలేకపోయెను.

భ్రాత్రా దుఃశాసనేనోక్తః కర్ణేన ప్రాప్త భూతినా

ద్యూతకార్యే శకునినా ద్యూతేన సయుధిష్ఠిరమ్.

ఆజయత్తస్య రాజ్యం చ సభాస్థో మాయయా హసన్

సోదరుడైన దుఃఖాననుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వులు, ఆతని రాజ్యమును హరించెను.

జితో యుధిష్ఠిరో భ్రాతృయుతశ్చారణ్యకం యయౌ.

వనే ద్వాదశ వర్షాణి ప్రతిజ్ఞాతాని సోఽనయత్

అష్టాశీతి సహస్రాణి భోజయన్ పూర్వవద్ద్విజాన్.

నధౌమ్యో ద్రౌపదీషష్ఠ స్తతః ప్రాయాద్విరాటకమ్

కఙ్కో ద్విజో హ్యవిజ్ఞాతో రాజా భీమోఽథ సూవకృత్.

బృహన్నడార్జునో భార్యా సైరన్ధ్రీ యమజౌ తథా

అన్యనామ్నా భీమ సేనః కీచకం చావధీన్నిశీ.

ద్రౌవదీం హర్తుకామం తమర్జునశ్చాజయత్కురూన్

కుర్వతో గోగ్రహాదీంశ్చ తైర్జ్ఞాతాః పాణ్డవా ఆథ.

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, దౌమ్యునితోడను ఆరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞ చేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకు డనెడు బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను ఆయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు అని గుర్తించిరి.

సుభద్రా కృష్ణభగినీ అర్జునాత్సమజీజనత్

అభిమన్యుం దదౌ తస్మై విరాటశ్చోత్తరాం సుతామ్.

కృష్ణుని సోదరి యైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యుడను కుమారుడు కలిగెను. విరాటుడు ఆతనికి తన కుమార్తె యైన ఉతర నిచ్చెను.

ఆసీత్సప్తాక్షౌహిణిశో ధర్మరాజో రణాయ సః

కృష్ణో దూతోఽబ్రవీద్గత్వా దుర్యోధన మమర్షణమ్.

ఏకాదశాక్షౌహిణీశం నృపం దుర్యోధనం తదా

యుధిష్ఠిరాయర్ధరాజ్యం దేహి గ్రామాంశ్చ వఞ్చ వా.

యుధ్యస్వ వా వచః శ్రుత్వా కృష్ణమాహ సుయోధనః

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్ధము చేసికొనెను. కృష్ణుడు అమర పూర్ణుడును, పదకొండు అక్షౌహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి “యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము . లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్దము చేయుము” అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధన ఉవాచః

భూసూచ్యగ్రం న దాస్యామి యోత్స్యే సఙ్గ్రహణోద్యతః.

అగ్ని రువాచః

విశ్వరూపం దర్శయిత్వా ఆధృష్యం విదురార్చితః

ప్రాగాద్యుధిష్ఠిరం ప్రాహ యోధయైనం సుయోధనమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ త్రయోదశోఽధ్యాయః.

సుయోధను డిట్లనెను - “సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్దమునకై సిద్ద ముగా ఉన్నాను”. అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, “ఆ సుయోధనునితో యుద్ధము చేయుము” అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యాన మను పదమూడవ అధ్యాయము సమాప్తము.