అగ్ని మహా పురాణము

7 - అథ అరణ్యకాణ్డ వర్ణనమ్.

 నారద ఉవాచః -

రామో వసిష్ఠం మాతృశ్చ నత్వాత్రిం చ ప్రణమ్య చ

అనసూయాం చ తత్పత్నీం శరథజ్ఞం సుతీక్షకమ్.

 ఆగ న్యథాతరం నత్వా అగ స్త్యం తత్రసాదతః

ధనుః ఖడ్గం చ సంప్రావ్య దణ్డకారణ్యమాగతః.

రాముడు వసిష్టుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమును, అత్రిమహామునిని, అతని భార్య యైన అనసూయను, శర భంగుని, సుతీష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించేను అగస్త్యుని, అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానే పజ్చవట్యాం స్థితో గోదావరీ తటే

తత్ర శూర్పణఖా యాతా భక్షితుం తానయజ్కరీ.

రామం సురూపం దృష్ట్వా సా కామినీ వాక్యమబ్రవీత్

జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటితో నివసించెను. భయంకరురా లైన కూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.

శూర్పణఖోవాచః -

క స్త్వం కస్మాత్సమాయాతో భర్తా మే భవ చార్థితః.

ఏతా చ భక్షయిష్యామి ఇత్యుక్త్వా తం సముద్యతా

 తస్యా నాసాం చ కర్ణౌచ రామోక్తో లక్ష్మణోచ్ఛినత్.

శూర్పణఖ ఇట్లు పలికెను. “నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు. ఆమె ముక్కు చెవులు కోసివేసెను.

రక్తం క్షరంతీ ప్రయయౌ ఖరం భ్రాతరమబ్రవీత్

మరిష్యామి. వినా సాహం ఖర జీవామి వైతదా.

  రామస్య భార్యా సీతా స్తి తస్యాసిల్లక్ష్మణోనుజః

 తేషాం యద్రుధిరం కోష్ణం పాయయిష్యసి మాం యది.

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెను. ఖరుడా ముక్కులేని నేను మరణించేదను. కాని రాముని భార్య సీత, సోదరుడు, లక్ష్మణుడు ఉన్నారు. నీవు, వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.

ఖర స్తథేతి కాముక్త్వా చతుర్దశ సహస్రకైః

రక్షసాం దూషణేనాగాద్యొద్దుం త్రిశిరసా నహ. 

రామం రామోపి యుయుధే శరై ర్వివ్యాధ రాక్షసాన్

హ్యస్త్యశ్వరథపాదాతబలం నిన్యే యమక్షయమ్.

 త్రి శీర్షాణం ఖరం రౌద్రం యుధ్య నం చైవ దూషణమ్

అట్లే చేసెదను అని పలికి ఖరుడు: పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళాను. రాముడు కూడ యుద్దమునందు బాణములచే రాక్షసులను కొట్టి. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిరనని, భయంకరుడైన అరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు వం పెను.

 యయా శూర్పణఖా లఙ్కాం రావణాగ్రేఒపతద్బువి.

ఆబ్రవీద్రావణం క్రుద్దా న త్వం రాజా చ రక్షకః

ఖరాది హస్తూరామస్య సీతాం భార్యాం హరస్వ చ.

 రామలక్ష్మణర కన్య పానాజ్జీవామి నాన్యథా

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదట నేల పై, బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. “నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. అందులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. ఆట్లు కానిచో జీవింపను

 తథేత్యాహ చ తచ్చుత్వా మారీచం ప్రాహ చ ప్రజ

స్వర్ణచిత్రమృగో భూత్వా రామలక్ష్మణ కర్షకః

 సీతాగ్రే తాం హరిష్యామి అన్యథా మరణం తవ.

ఆ మాటలు విని రావణుడు “అటులనే చేసెదను” అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణ మైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్న చో నీకు మరణమే.

 మారీచో రావణం ప్రాహ రామో మృత్యుర్ధనుర్ధరః

రావణాదపి మర్తవ్యం మర్తవ్యం రాఘవాదపి

 అవశ్యం యది మర్తవ్యం వరం రామో న రావణ!

 ఇతి మత్వా మృగో భూత్వా సీతాగ్రే వ్యచరన్ము హు.

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను. (అనుకొనెను). ధనుర్ధారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నై నను మరణింపవలసినదే; . రాముని చేతిలో నే నను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

 సీతయా ప్రేరితో రామః శ రేణాఠావధీచ్చతమ్

 మ్రియమాణో మృగ ప్రాహ హా సీతే లక్ష్మణేతి చ.

సీతచే ప్రేరితుడై న రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణిం చుచు ఆ మృగము హా సీతా హా లక్ష్మణా అని అరచెను.

 సౌమిత్రి సీతయోక్తో ఒథ విరుద్ధం రామమాగతః

రావణోన్య హరత్సీతాం హత్వా గృధ్రం జటాయుషమ్.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను. రావణుడు జటా యువును చంపి సీతను హరించేను.

 జటాయుషా న భిన్నాజ్గో అజ్కేనాదాయ జానకీమ్

గతో లఙ్కామకాఖ్యే ధారయామాస చాబ్రవీత్.

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకము పై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంక చేరి, ఆమెను ఆశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణ ఉవాచః -

మమ భార్యా భవాగ్ర్యా త్వం రాక్షస్యో రష్యతామియమ్

రామో హత్వా తు మారీచం దృష్ట్వా లక్ష్మణమబ్రవీత్.

రావణుడు పలికెను. “నీవు నాకు ప్రముఖురాలై న భార్యవగుము”, “ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.” రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీరామ ఉవాచః -

మాయామృగో సౌ సౌమిత్రే యథా త్వామిహచాగతః

తథా సీతా హృతా నూనం నావశ్యత గతోఽథతామ్.

శ్రీ రాముడు పలికెను. “లక్ష్మణా! ఆ మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు.” పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

శుశోచ విలలాపార్తో మాం త్యక్త్వా క్వ గరాసి వై

లక్ష్మణాశ్వానితో రామో మార్గయమాన జానకీమ్.

రాముడు దుఃఖించుచు “నన్ను విడచి ఎక్కడికి పోతివి” అని పలుకుచు దుఃఖార్హుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

దృష్ట్వా జటాయు స్తం ప్రాహ రావణో హృతవాంశ్చ తామ్

మృతోథ సంస్కృత స్తేన కబందం చావధి త్తతః.

 శావముక్తోబ్రవీద్రామం స త్వం సుగ్రీవమవ్రజ

ఇత్యాది మహా పురాణే ఆగ్నేయే రామాయణే ఆరణ్యకాణ్డ వర్ణనం నామ సప్తమోధ్యాయః.

జటాయువు రాముని చూచి “సీతను రావణుడు అపహరించేను “అని చెప్పి ప్రాణములు వీడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై “సుగ్రీవుని వద్దకు వెళ్లము” అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకొండవర్ణన మనెడు సప్త మాధ్యాయము సమాప్తము.