అగ్ని మహా పురాణము

225 - అథ రాజధర్మాః

పుష్కర ఉవాచః

రాజపుతస్య రక్షాచ కర్తవ్యా పృథివీభృతా

ధర్మార్థ కామశాస్త్రాణి ధనుర్వేదంచ శిక్షయేత్.

శిల్పాని శిక్షయేచ్చైవ మాప్తైవైర్మిథ్యా ప్రియం వదైః 

శరీరరక్షావ్యాజేన రక్షిణోఽస్య నియోజయేత్ .

న చాస్య సంగో దాతవ్యః క్రుద్దలుబ్ధవిమానితైః

అశక్యం తు గుణాధానం కర్తుం తం బంధయేత్సుఖైః.

అధికా రేషు సర్వేషు వినీతం వినియోజయేత్

మృగయాం పాన మక్షాంశ్చ రాజ్యనాశాం స్త్యజేన్నృపః.

దివాస్వప్నం వృథాట్యం చ వాక్పారుష్యం వివర్జయేత్

నిందించ దండ పారుష్యమర్థదూషణ ముత్సృజేత్ .

ఆకారాణాం సముచ్ఛేదో దుర్గాదీనామసత్క్రియా

అర్థానాం దూషణం ప్రోక్తం విప్రకీర్ణత్వమేవ చ.

అదేశ కాలే యద్దానమపాత్రే దానమేవచ

ఆర్ధేషు దూషణం ప్రోక్తమసత్కర్మప్రవర్తనమ్.

కామం క్రోధం మదం మానం లోభం దర్పంచ వర్జయేత్

తతోభృత్యజయం కృత్వా పౌర జానపదంజయేత్.

జయేద్బాహ్యానరీన్పశ్చా ద్బాహ్యాశ్చ త్రివిధారయః

గురవస్తే యథావూర్వం కుల్యానంతరకృత్రిమాః.

పితృ వైతామహం మిత్రం సామన్తం చ తథారిపోః

కృత్రిమంచ మహాభాగ మిత్రం త్రివిధముచ్యతే.

పుష్కరుడు చెప్పెను : రాజు తన పుత్రుని బాగుగా రక్షించుకొనుచు ఆతవిక ధర్మశాస్త్ర - ఆర్థశాస్త్ర కామశాస్త్ర - ధనుర్వేదములందు శిక్షణ ఇవ్వవలెను. వివిధ శిల్పములమ గూడ నేర్పవలెను. విశ్వాసపాత్రులు, ప్రియముగా మాటలాడువారు ఆగువారిని క్షకులుగా నియమించవలెను. రాజకుమారుని శరీరర శార్థమై కొందరిని నియమింపవలెను. కోపము కలవారు, లుబ్దులు, అవమానితులు అయినవారినుండి రాజకుమారుని దూరముగా ఉంచవలేను. మంచి గుణములు నేర్పుట అంత సులభము కాదు. అందుచే రాజకుమారుని ఎక్కువగా సుఖ పెట్టరాదు. ఆతడు చక్కగా శిక్షితుడైన పిమ్మట ఆతనిని అన్ని పనులందును నియమించవలెను. వేట, జూదము, మద్యపానము- ఇవి రాజ్య వినాశకరములగు దోషములు. రాజు వీటిని పరిత్యజించవలెను. పగటినిద్ర, పనిలేకుండగ తిరుగుట, కటుభాషణము- వీటిని పరిత్యజించ వలెను. ఇతరులను నిందించుట, తీక్షదండము, అర్థదూషణము కూడ విడువవలెను. ఐంగారము గనులు మొదలగునవి వశించిపోవుట, దుర్గాదులకు మరమ్మతులు చేయకుండుట. ఇవి ఆర్థదూషణములు. ధనమును కొంచెము కొంచెము అనేక స్థానములందు ఉంచుట, అయోగ్యముడైన దేశ కాలములందు అపాత్రలకు దానము చేయుట చెడ్డపనులకై ధనవంవెచ్చించుట, ఇవి కూడ అర్థదూషణములు కామ - క్రోధ - మధ - మాన - లోభ - దర్పములమ త్యజించవలెను.  పిదప భృత్యు అను వశమునందుంచుకొని, పిమ్మట వగరములోని వారిని, దేశములోని వారిని వశంగతులను చేసికొనవలెను. పిదప బాహ్యశ త్రువులను జయించుటకై ప్రయత్నించవలెను. బాహ్యశత్రువులు మూడు రకములు పాత శత్రుత్వము కలవారు రాజ్యవు సరిహద్దులలో ఉండువారు, తనతో శత్రుత్వ మేర్పడినవారు. వీరిలో పూర్వపూర్వులు అధిక శత్రువులు. తాత  ముత్తాతలనుంచి మిత్రులు శత్రువుల శత్రువులు, కృత్రిములు అని మిత్రులు కూడ మూడు విధములు.

స్వామ్యమాత్యం జనపదా దుర్గం దండ స్తథైవ చ

కోశో మిత్రంచ ధర్మజ్ఞ సప్తాఙ్గం రాజ్యముచ్యతే.

 మూలం స్వామీ సవై రక్ష్య స్తస్మాద్రాజ్యం విశేషతః

 రాజ్యాంగ ద్రోహిణం హన్యాత్కాలే తీక్ష్ణోమృదుర్భవేత్.

ఏవం లోకద్వయం రాజ్ఞో భృత్యైర్హాసం వివర్జయేత్

భృత్యాః పరిభవంతీహ నృపం హర్షణ నత్కథమ్.

 లోక సంగ్రహణార్థాయ కృతకవ్యసనోభవేత్

 స్మిత పూర్వాభిషీస్యాల్లోకానాం రంజనం చరేత్.

 దీర్ఘసూత్రస్య నృపతేః కర్మహానిర్ధ్రువం భవేత్

 రాగే దర్పేద మానే చ ద్రోహేపా పేచ కర్మణి.

 అప్రియే చైవ వక్తవ్యే దీర్ఘ సూత్రః ప్రశస్యతే

గుప్తమంత్రో భవేద్రాజా నాపదో గుప్తమంత్రతః.

ధర్మవేత్తవైన పరశురామా! రాజ్యమునకు - రాజు, మంత్రి, జనపదము, దుర్గమ, సేన, కోషము, మిత్రులు అని ఏడు అంగములు. రాజ్యమునకు మూలము స్వామి (రాజు). అందుచే ఆతనిని ఎక్కువగా రక్షించవలెను. రాజ్యాంగ విద్రోహులను చంపివేయవలెను. సమయానుసారముగా రాజు కఠోరముగాను మృదువుగాను కూడ ప్రవర్తించవలెను. ఇట్లుండుటచే ఆతనికి రెండులోకములును బాగుపడును రాజు భృత్యులతో పరిహాసము చేయరాదు. అందరితోడను నవ్వుతూ మాటలాడే రాజును సేవకులు అవమానింతురు. లోకులతో కలిసిమెలిసి ఉండుటకై రాజు కొన్ని లేని వ్యసనములు కూడ ఉన్నట్లు ప్రవర్తించవలెను. ప్రజలు ప్రసన్నులగు విధమున చిరునవ్వు నవ్వుచూ మాటలాడవలెను. దీర్ఘసూత్రి (పనులు చేయుటలో చాలాకాలం ఆలోచించువాడు) యైనరాజుయొక్క కార్యము లన్నియు నశించును. కాని రాగ - దర్పఅభిమాన - ద్రోహ - పాపకర్మ - అప్రియభాషణాదులలో దీర్ఘసూత్రియైన రాజును ఆందరును ప్రశంసింతురు. రాజు తన మంత్రమును [ఆలోచనలను] గుప్తముగా ఉంచుకొనవలెను. ఆట్లు ఉంచుకొన్నచో ఎన్నటికిని ఆపదరాదు.

జ్ఞాయతే హి కృతం కర్మ నారబ్దం తస్య రాజ్యకమ్

ఆకారై రిఙ్గితైర్గత్యా చేష్టయా భాషితేన చ.

 నేత్రవక్త్రవికారాభ్యాం గృహ్యతేఽ న్తర్గతం మనః

నై కస్తుమంత్రయేన్మంత్రం నరాజా బహుభిః సహ.

 బహుభిర్మంత్రయేత్కామం రాజా మన్త్రాన్ పృథక్పృథక్

మంత్రిణామపినో కుర్యాన్మంత్రీ మంత్ర ప్రకాశనమ్.

క్వాపి కస్యాపి విశ్వాసో భవతీహసదానృణామ్

 నిశ్చయశ్చతథా మంత్రే కార్య ఏకేన సూరిణా.

 నశ్యేదవినయాద్రాజా రాజ్యంచ వినయాల్లభేత్

త్రై విద్యేభ్యస్త్రయీం విద్యాం దండనీతిం చ శాశ్వతీమ్.

 ఆన్వీక్షికీం చార్థవిద్యాం వార్తారమ్బాంశ్చలోకతః

జితేంద్రియో హి శక్నోతి వశ స్థాపయితుం ప్రజాః.

 పూజ్యా దేవాద్విజాః సర్వే దద్యాద్దానాని తేషుచ

ద్విజే దానం చాక్షయోఽయం నిధిః కై శ్చిన్న నాశ్యతే.

 సంగ్రా మేష్వనివర్తిత్వం ప్రజానాం పరిపాలనమ్

దానాని బ్రాహ్మణానాం చ రాజ్ఞో నిశ్రేయసంపరమ్.

 కృపణానాథ వృద్దానాం విదవానాం చ యోషితామ్

యోగ క్షేమంచ వృత్తించ తథైవ పరికల్పయేత్.

 వర్ణాశ్రమ వ్యవస్థానం కార్యం తాపస పూజనమ్

నవిశ్వసేచ్చ సర్వత్ర తాపసేషు చ విశ్వ సేత్.

 విశ్వాసయేచ్చాపి పర తత్త్వ భూతేన హేతునా

బకవచ్చింతయేదర్థం సింహవచ్ఛపరాక్రమేత్.

 వృకవచ్చావలుం పేత శశవచ్చ వినిష్పతేత్

దృడప్రహారీ చ భవేత్తథా సూకరవన్నృపః.

చిత్రాకారశ్చ శిఖివద్దృడ భక్తి స్తథాశ్వవత్

భవేచ్చ మధురాభాపీ కథాకోకిలవన్నృపః.

కాకాశంకీ భవేన్నిత్యమజ్ఞాతాం వసతింవసేత్

నా పరీక్షిత పూర్వంచ భోజనం శయనం స్పృ శేత్.

 నా విజ్ఞతాం స్త్రియం గచ్చేన్నా జ్ఞాతాం నావమారుహేత్

రాష్టకర్షీభ్రశ్యతే చ రాజ్యార్థాచ్చైవ జీవితాత్.

భృతో వత్సో జాతబలః కర్మయోగ్య స్తథాభవేత్

 తథారాష్ట్రం మహాభాగ భృతం కర్మసహం భవేత్.

 సర్వం కర్మేదమాయత్తం విధానే దైవపౌరుషే

 తయోర్దైవ మచింత్యం హి పౌరుషే విద్యతే క్రియా.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే రాజధర్మోనామ పంచవింశత్యధిక ద్విశతతమోధ్యాయః

రాజ్యకార్యములు పూర్తియైన తరువాతనే ఇతరులకు తెలియవలెను. వాటి ప్రారంభము ఎవ్వరికిని తెలియ కూడదు. మనుష్యుల ఆకారము, సంజ్ఞలు, చేష్టలు, ప్రవర్తన, మాటలు, నేత్రముఖ వికారములు - వీటిని పట్టివారి మనస్సులోని ఆలోచనను పసిగట్ట వచ్చును. రాజు ఒంటరిగా రహస్యమైన విషయములను గూర్చి ఆలోచించగూడదు. చాల మందితో సలహా తీసికొనవచ్చును గాని ఒక్కొక్కరినే పిలిపించి తీసికొనవలెను. రాజు యొక్క రహస్యాలోచనలను మంత్రి ఇతర మంత్రులకు గూడ చెప్పగూడదు. మనుష్యులకు సాధారణముగా ఎవ్వరో ఒక వ్యక్తిపైననే విశ్వాసమేర్పడును. ఆందుచే రాజు విద్వాంసుడైన ఒక మంత్రితో సూత్రమే ఆలోచనలు చేయవలెను. వినయములేని రాజు నశించును. వినయ వంతుడు రాజ్యము పొందగల్గును. వేదత్రయ పండితులనుండి, వేదత్రయమును, ప్రాచీనదండనీతిని, ఆన్వీక్షకిని, (న్యాయవేదాంతాచులు) ఆర్థశాస్త్రమును నేర్వవలెను వార్తను [కృషి, గోరక్ష, వాణిజ్యము మొ.] గూర్చిన జ్ఞానమును లోకమునుండి సంపాదించుకొనవలెను. తన ఇంద్రియములను వశములో ఉంచుకొన్న జడే ప్రజలను పశములో ఉంచు కొన గల్గును. దేవతలను సమస్త బ్రాహ్మణులను పోషించవలెను. వారికి దానములీయవలెను. బ్రాహ్మణునకిచ్చిన దానము అక్షయమగు. దానినెవ్వరును నశింపచేయజాలరు. యుద్దము నందు వీపు చూపకుండుట, ప్రజలను పాలించుట, బ్రాహ్మణులకు జనము లిచ్చుట ఇవి రాజునకు కల్యాణదాయకములు. దీనులు, అనాథులు, వృద్ధులు, విధవలగు, స్త్రీలు మొదలగు వారి యోగ క్షేమములు చూచుచు, వాటికి జీవనోపాధి కల్పింపవలెను. వర్ణాశ్రమధర్మ రక్షణము, మునులను సత్కరించుట ఇవి రాజుల కర్తవ్యములు. రాజు ఎవ్వరిని నమ్మకూడదు. కాని మునులను మాత్రము నమ్మవచ్చును. సరియేన ఉపాయముల చే ఇతరులకు తన పై విశ్వాసమేర్పడునట్లు చేసికొనవలెను. రాజు స్వార్థ మునుగూర్చి కొంగవలె ఆలో చించవలెను. సింహమువలె పరాక్రమము చూపవలెను. తోడేలు వలే శత్రువులను ఆక్రమించి చర్చించవలెను. చేవులపిల్లి వలె దుముకుచు అదృశ్యుడు కావలెను. సూకరమువలె దృడప్రహారము చేయవలెను. నెమలివలె విచిత్రవేషమును ధరించవలెను. గుఱ్ఱమువలె దృఢమైన భక్తి కలిగియుండ వలెను. కోకిలవలే మధురముగా నూటలాడవలేను. కాకివలె అందరి మండి తప్పించుకొని యుండవలెను. ఎవరికిని తెలియని చోట నివసించవలెను. పరీక్షించకుండగ భోజనము చేయరాదు. శియ్యపై పరుండరాదు. ప్రజలను పీల్చివేయువాడు రాజ్యమును, జీవితమును కూడ కోల్పోవును, పోషింపబడిన లేగ దూడ బలము కలదై న పిమ్మట పనులు చేయుటకు ఉపయోగించునట్లు, బాగుగా రక్షింపబడిన రాష్ట్రము రాజునకు ఉపకరించును. కార్యముల్న యు దైవము మీదను పురుషకార ముమీదను ఆధారపడి యుండును. వీటిలో దైవము అచింత్యము. వురషకారము కార్యమును సాధించగలగును. ప్రజానురాగమే రాజ్యమును, పృథివిని. లక్ష్మిని ఇచ్చు ఏకైక హేతువు.

అగ్నిమహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.