అగ్ని మహా పురాణము

379 - పునః బ్రహ్మవిజ్ఞానమ్

అగ్ని రువాచః

 యజ్ఞైశ్చ దేవానాప్నోతి వై రాజం తపసాపదమ్

బ్రహ్మణః కర్మ సంన్యాసా ద్వైరాగ్యాత్ప్రకృతౌ లయమ్ .

జ్ఞానాత్ప్రాప్నోతి కైవల్యం పంచై తాగతయః స్మృతాః

 ప్రీతి తాప విషాదా దేర్వి నివృత్తిర్వీర క్తతా. 

సంన్యాసః కర్మణాంత్యాగః కృతా నామకృతైః సహ

 అవ్యక్తాదౌ విశేషాన్తే వికారోఽస్మిన్ని వర్తతే.

 చేతనా చేత నాన్యత్వజ్ఞానేన జ్ఞానముచ్యతే

పరమాత్మా చ సర్వేషామాధారః పర మేశ్వరః.

విష్ణునామ్నా చ దేవేషు వేదాన్తేషు చ గీయతే

 యజ్ఞేశ్వరో యజ్ఞపుమాన్ప్రవృత్తై రిజ్యతే హ్యసౌ.

నివృత్తైర్జాన యోగేన జ్ఞానమూర్తిః స చేక్ష్యేతే

హ్రస్వ దీర్ఘుప్లుతాద్యన్తు వచ స్తత్పురుషోత్తమః.

అగ్ని దేవుడు పలికెను. యజ్ఞములచే దేవలోకమును తపస్సు చే విరాట్పదమును, కర్మ సన్యాసముచే బ్రహ్మ పదమును, వైరాగ్యముచే ప్రకృతిలయమును, జ్ఞానముచే మోక్షమును పొందును. ఈ విధముగా ఐదుగతులు చెప్పబడినవి. ప్రసన్నత్వము తాప విషాదాదులు లేకుండుట వైరాగ్యమని చెప్పబడును. చేసిన కర్మల యొక్కయు ఇంతవరకు చేయని కర్మల యొక్కయు ఫలమును త్యజించుట సంన్యాసము. ఇట్లు చేయుటచే ఆవ్యక్తము మొదలు విశేషము వరకును వున్న వికారములు తొలగును. చేతనా చేతనముల వివేక జ్ఞానమునకు జ్ఞానమని పేరు. ఈ జ్ఞానము వలనే పర మాక్మ జ్ఞానము కలు గును. పరమాత్మ సర్వాధారము. పరమేశ్వరుడు వేదవేదాంతములో విష్ణు నామమాతో కీర్తింపబడుచున్నాడు. ఆతడే యజ్ఞేశ్వరుడు ప్రవృత్తి మార్గములో వున్న వారు యజ్ఞ పురుషునే సేవింతురు నివృత్తి మార్గములో వున్న వారు జ్ఞానయోగముచే జ్ఞాన స్వరూపుడగు ఆ పరమాత్మను సాక్షాత్కరించుకొందురు. హ్రస్వ దీర్ఘప్లుతాది వాక్కు పురుషోత్తమ స్వరూపమే.

తత్ర్పాప్తి హేతుర్జానంచ కర్మచోక్తం మహామునే

 ఆగమోక్తం వివేకశ్చ ద్విధాజ్ఞానం తథోచ్యతే.

శబ్దబ్రహ్మా గమమయం పరబ్రహ్మ వివేక దమ్

 ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మ పరంచయత్.

వేదాది విద్యాహ్య పరమక్షరం బ్రహ్మ సత్పరమ్

తదేతద్భగవద్వాచ్య ముపచా రేఽర్చనేఽన్యతః.

సంభర్తేతి తథా భర్తాభకారోఽర్థ ద్వయాన్వితః

నేతాగమయితా స్రష్టా గకారోఽయం మహామునే.

 ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్యయశ సః శ్రియః

జ్ఞానవైరాగ్య యోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణా.

 వసంత విష్ణోర్భూతాని సచధాతుస్త్రి ధాత్మకః

ఏవం హరౌహి భగవాంఛబ్ధోఽన్యత్రోపచారతః.

ఉత్పత్తిం ప్రలయంచైవ భూతానామాగతిం గతిమ్

వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి.

జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్యతేజాంస్య శేషతః

 భగవచ్చబ్ద వాచ్యాని వినా హెయై ర్గుణాదిభిః.

మహామునీ ! ఆ పరమాత్మ ప్రాప్తికి జ్ఞానము కర్మ అనునవి రెండు సాధనములు. వివేక జన్యము ఆగమ జన్యము అని జ్ఞానము రెండు విధములు శబ్ద బ్రహ్మ జ్ఞానము ఆగ మమయము. పర బ్రహ్మ జ్ఞానము వివేకదము. బ్రహ్మ శబ్ద బ్రహ్మ అనియు పర బ్రహ్మ అనియు రెండు విధము. వేదాది విద్య అపర బ్రహ్మ -అక్షర తత్వము పర బ్రహ్మ. భగ వచ్ఛబ్దముచే ముఖ్యముగా చెప్పబడునది ఈ పర బ్రహ్మయే. పూజాద్యర్థములందు ఈ శబ్దముల యొక్క ప్రయోగము ఔప చారికము. భగవచ్చబ్దములోని ధకారమునకు సోషించువాడు సర్వాధార భూతుడు అని రెండు ఆర్థములు. గకారమునకు నేతబ్రహ్మ విజ్ఞానమ్ గమయితా, సృష్టి అని అర్థములు. సమగ్రముగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగమని పేరు. సర్వ భూతములను విష్ణువు యందు నివసించును. ఆతడు సర్వ ధారకుడు త్రిమూర్తి అందుచే భగవచ్చబమునకు హరియందే ముఖ్య ప్రయోగముము. ఇతరార్థము యందు దాని ప్రయోగము గౌణము. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయ గమనములను, విద్యా విద్యలను ఎరిగిన వానినే “భగ వా” అని చెప్పవలెను. హేయగుణములు లేక జ్ఞాన శ క్తిబల ఐశ్వర్య వీర్య తేజస్సులు పరిపూర్ణముగా ఎవని యందుండునో ఆతనినే భగవాన్ అనవలెను.

ఖాఒడిక్య (క్యో) జనకాయాహ యోగం కేశిధ్వజః పురా

 అనాత్మన్యాత్మ బుద్ధిర్యా ఆత్మ సమితి యామతిః.

అవిద్యా భవసంభూతిర్బీ జమేతద్ద్విధా స్థితమ్

పంచభూతాత్మ కే దేహే దేహీ మోహతమః శ్రితః.

 ఆహ మేత దీపాత్యుచ్చైః కురుతే కుమతిర్మతిమ్

ఇత్థంచ పుత్రపౌత్రేషు తద్దేహో త్పాది తేషుచ.

 కరోతి పండితః సామ్యమనాత్మని కలేవరే

స్వ స్వదేహోప కారాయ కురుతే కర్మ మానవః.

 దేహశ్చాన్యోయదా పుంస స్తదా బంధాయతత్పరమ్

నిర్వాణమ యఏవాయ మాత్మాజ్ఞాన మయోఽమలః.

 దుఃఖ జ్ఞానమయోఽధర్మః ప్రకృతేః సతునాత్మనః

జలస్య నాగ్ని నా సంగః స్థాలీసంగా త్తథాపిహి. 

శబ్దాస్తే కాదికా ధర్తా స్తత్కృతావై మహామునే

 తథాత్మా ప్రకృతౌ సంగాదహం మానాది భూషితః. 

భజతే ప్రాకృతాస్థర్మానన్య స్తేభ్యోహి సోఽవ్యయః

బంధాయ విషయాసంగం మనోనిర్విష యంధియే. 

విషయా త్తత్సమాకృష్య బ్రహ్మభూత హరిం స్మరేత్

ఆత్మభావం నయత్యేనం తద్భ్రహ్మధ్యానం మునే.

విచార్యస్వాత్మనః శక్త్యాలోహమా కర్షకోయథా

 ఆత్మ ప్రయత్న సాపేక్షా విశిష్టాయా మనోగతిః. 

తస్యా బ్రహణి సంయోగో యోగ ఇత్యభిధీయతే

 వినిష్పంద సమాధిస్థః పరం బ్రహాధి గచ్చతి. 

యమైః సనీయమైః స్థిత్యా ప్రత్యాహృత్యా మరుజ్జయైః

ప్రాణయామేన పవనై : ప్రత్యాహా రేణ చేంద్రియైః.

వశీకృతే స్తతః కుర్యాత్థ్సితం చేతః శుభాశ్రయే

అశ్రయ శ్చేతసో బ్రహమూర్తంచా మూ ర్తకం ద్విధా.

 సనందనాదయో బహ భావ భావనయాయుతాః

 కర్మభావనయా చాన్యేదేవాద్యాః స్థావరాంతకా:

 హిరణ్య గర్భాదిషుచజ్ఞాన కర్తా త్మికాద్విధా

త్రివిధ భావనా ప్రోక్తా విశ్వబ్రహ ఉపాస్యతే. 

ప్రత్య స్తమితభేదం యత్సత్తామాత్ర మగోచరమ్

వచ సామాత్మ సంవేద్యంత జ్ఞానం బ్రహ్ప సంజ్ఞికమ్, 

తచ్చ విష్ణోః పరం రూపమరూపస్యాజ మక్షరమ్

ఆశ క్యం ప్రథమం ధ్యాతు మతో మూర్తాది చింతయేత్. 

మద్భావ భావమాపన్న స్తతోఽ సౌ వశమాత్మనా

భవత్యభేదోభేదశ్చ తస్యాజ్ఞాన కృతోభవేత్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే బ్రహ్మజ్ఞాన వర్ణనం నా మైకోనాశీత్యధిక త్రిశతతమోఽధ్యాయః.

పూర్వము కేశిధ్వ జరాజు ఖాండిక్య జనగునకు ఈ విధముగ ఉపదేశించారు. ఆ నాత్మ యందు, ఆత్మ బుద్ది ఆ విద్యా జనితమై సంసార బంధమునకు కారణము. ఈ అజ్ఞానము ఆహంకార మమ కార రూపముల రెండు విధములుగా వున్నది. దేహాభిమానియగు జీవుడు మోహాంధకారముచే కప్పబడి ఈ పాంచ భౌతిక శరీర మే నేను ఆను కుబుద్ధి కలిగియుండును. ఇట్లే పుత్రపౌత్రాదులందు మనుకారము కలిగియుండును. విద్వాంసుడు ఆనాత్మయగు ఈ దేహమున సమభావము కలిగియుండును. మానవుడు సర్వదే హోపకారమునకే కర్మ చేయును. దేహము పురుషునకంటే భిన్నమైనది. కావున ఆకర్మ యంతయు బంధ హేతువగును. వాస్తవమున ఆత్మ నిర్వా సమయము, జ్ఞానమయము, అమలము దుఃఖ జ్ఞాన మనునది ప్రకృతి ధర్మము కాని, ఆత్మ ధర్మము కాదు. జలమునకు అగ్నితో సత్సంబంధములే నున్నను పాత్రము ద్వార అగ్న సంపర్కము కలుగుట ఎట్లో ఇదియు అట్లే. మహామనీ ! ఆత్మ ప్రకృతి సంగమంచే అహంకార మమకారాది ప్రకృతి ధర్మములను పొందుచున్నది. వాస్తవమున ఆది వాటికంటే భిన్నమైనది. అవినాశి. విషయాసక్తమగు మనస్సు బంధ హేతువు. విషయ దూరమైనది జ్ఞాన హేతువు. దానిని విషయముల నుండి లాగి హరిని స్మరించవలేను. తనను ధ్యానించు వానికి హరి బ్రహ్మ భావము నిచ్చును. సూదంటురాయి లోహమును ఆకర్షించినట్లు తనను ధ్యానించు వానిని బ్రహ్మ తన వైపు లాగి కొనును. ఆత్మ ప్రయత్నముచే మనస్సు బ్రహ్మతో విశిష్ట సంయోగమును పొందుటయే యోగము. నిశ్చలుడై సమాధియందు న్నవాడు పర బ్రహ్మను పొందును. యమ నియమ, స్థితి, ప్రాణాయాయ, ప్రత్యాహార, ప్రాణజయ, ఇంద్రియనిగ్రహము లచే చిత్తము శుభమగు ఆశ్రయమునందు నిలచునట్లు చేసుకొనవలెను. ఈ శుభాశ్రయగు బ్రహ్మ మూర్తము అని రెండు విధము. సనందనాదులు బ్రహ్మ భావనా యుక్తులు. దేవతలు మొదలు స్థావర సల వర కువున్న ప్రాణులు కర్మభావనా యుక్తులు హిరణ్యగర్భాదులకు కర్మ బ్రహ్మ బ్రహ్మ భావనలు రెండును వుండును. ఈ విధముగా భావన మూడు విధములు. ఈ విశ్వమంతయు బ్రహ్మయే. అని ఉపాసించుట బ్రహ్మ భావనా. సమస్త భేదములు తొలగినదియు, సత్తా మాత విషయకము, వాక్కులకు గోచరించనిది, ఆత్మ మాత్ర సంవేద్యము అగు తత్వము యొక్క జ్ఞానము బ్రహ్మజ్ఞానము. ఆది యేరూప హీనుడగు విష్ణువు యొక్క జన్మరహితము, అక్షరము అగు ఉత్కృష్ట స్వరూపము అమూర్త ధ్యానము కష్టముగాన ముందు మూర్త ధ్యానము చేయవలెను. ఇట్లు చేయు వాడు భగవద్భావముమ పొంది పరమాత్మతో ఐక్యము పొందును. భేదజ్ఞానము ఆజ్ఞాన కృతము.

అగ్ని మహాపురాణమున బ్రహ్మ జ్ఞాన వర్ణనమను మూడు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.