అగ్ని రువాచః
బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి సంసారా జ్ఞానము క్తయే ।
ఆయమాత్మా పరంబ్రహ్మ అహమస్మీతి ముచ్యతే.
దేహ ఆత్మా న భవతి దృశ్యత్వాచ్చ ఘటా దివత్ ।
ప్రసుప్తే మరణే దేహాదాత్మా ఽన్యో జ్ఞాయతే ధ్రువమ్ .
దేహః సచేద్య్వవహ రేదవికార్యాది సన్నిభః ।
చక్షురాదీ నీంద్రియాణి నాత్మావై కరణం త్వతః.
మనోధీరపి ఆత్మా న దీపవత్కరణం త్వతః ।
ప్రాణోఽప్యాత్మాన భవతి సుషుప్తే చిత్ర్పభావతః.
జాగ్రత్స్వప్నే చ చైతన్యం సంకీర్ణత్వాస్న బుధ్యతే ।
విజ్ఞాన రహితః ప్రాణః సుషుప్తే జ్ఞాయతే యతః.
అతో నాత్మేంద్రియం తస్మాదింద్రియాదిక మాత్మనః ।
అహంకారోఽపి నై హత్మా దేహవద్వ్యభి చారతః.
ఉక్తేభ్యో వ్యతిరిక్తోఽయ మాత్మా సర్వహృది స్థితః।
సర్వద్రష్టాచ భోక్తాచ నక్తముజ్జ్వల దీపవత్.
ఆగ్ని దేవుడు పలికెను. సంసారమును అజ్ఞానము ను తొలగించుకొనుటకు సాధనమైన బ్రహ్మజ్ఞానమును చెప్పెదను. “అయం ఆత్మాపరం బ్రహ్మ ఆహమస్మి”, నేనే పరబ్రహ్మమేవ ఆత్మను అని భావించుటచే ముక్తుడగును. ఘటాదలవలె దృశ్యమగుటచే దేహము ఆత్మ కాజాలదు. నిద్ర పోయినపుడున్ను, మరణమువందును, దేహముకంటే ఆత్మ భిన్న మని తెలియుచున్నది. ఆదినిశ్చితము. దేహమే ఆత్మయైనచో నిద్రా సమయమునందును, మరణానంతరమున కూడ ఆది వ్యవహ రించవలెను. చతురాది ఇంద్రియములు కూడ సాధనము లేకాని ఆత్మ కాదు. మనస్సు బుద్ధియు కూడ దీపమువలే సాధన మేకాని ఆత్మ కాదు. సుషుప్తావస్థలో జ్ఞానము లేకపోవుటచే ప్రాణము కూడ ఆత్మ కాదు. జాగ్రత్స్వప్న సమయములందు ప్రాణ చైతన్యము కలిచి పోయినట్లుండును. అందుచే వేరుగా తెలియుట లేదు. సుషుప్తి ఆవస్థలో ప్రాణము విజ్ఞాన రహితమై ఉన్నది. అందుచే ప్రాణము ఆత్మ కాదు. ఈ విధముగా ఇంద్రియాదులు ఆత్మ కారు. ఆత్మకు కరణములు మాత్రమే. అహంకారము కూడ ఆత్మకాదు. అది కూడ దేహమువలె వేరుగ కనబడుచున్నది కదా! పైన చెప్పిన దేహాదుల కంటే భిన్న మగు ఆత్మ అందరి హృదయము నందును వున్నది. అదియే భోక్త. రాత్రి ప్రకాశించుచున్న దీపము వలె సర్వమును చూచునది.
సమాధ్యారంభ కాలేచ ఏవం సంచింత యేన్మునిః ।
యతో బ్రహ్మణ ఆకాశం ఖాద్వాయుర్వాయుతోఽనలః.
ఆగ్నే రాపో జలాత్పృథ్వీతతః సూక్ష్మం శరీరకమ్ ।
ఆపంచీకృత భూతేభ్య ఆసన్పంచీ కృతాన్యతః.
స్థూలం శరీరం ధ్యాత్వాస్మాల్లయం బ్రహ్మణి చింతయేత్ ।
పంచీకృతాని భూతాని తత్కార్యంచ విరాట్ స్మృతమ్.
ఏతత్థ్సూలం శరీరంహి ఆత్మ నోఽజ్ఞాన కల్పితమ్ ।
ఇంద్రియైరథ విజ్ఞానం ధీరా జాగరితం విదుః .
విశ్వ స్తదభిమానీ స్యాత్త్రయ మేతదకారకమ్ ।
ఆపంచీకృత భూతాని తత్కార్యం లింగముచ్యతే.
సంయుక్తం సప్తదశభిర్హి రణ్య గర్భసంజ్ఞితమ్ ।
శరీరమాత్మనః సూక్ష్మం లింగమిత్య భిధీయతే.
జాగ్రత్సంస్కారజః స్వప్నః ప్రత్యయోవిషయాత్మకః ।
ఆత్మా తదభిమానీ స్యాత్తైజసోహ్య ప్రపంచతః.
స్థూలసూక్ష్మ శరీరాఖ్యద్వయ స్యైకంహి కారణమ్ ।
ఆత్మాజ్ఞానంచ సాభాసం తదధ్యా హృతముచ్యతే
న సన్నా సన్న సదసదేతత్సావ యవంనతత్ ।
నిర్గతావయవంనేతి నాభిన్నం భిన్న మేవచ.
భిన్నాభిన్నం హ్యనిర్వాచ్యం బంధ సంసార కారకమ్ ।
ఏకం బ్రహ్మవిజ్ఞానా త్ప్రాప్తం నైవచ కర్మభి:.
యోగి సమాధి ప్రారంభమున ఈ విధముగ భావన చేయవలెను. బ్రహ్మ నుండి ఆకాశ ము, దాని నుండి వాయువు దాని నుండి అగ్ని అగ్ని నుండి జలము దాని నుండి పృథివి, దాని నుండి నూక్ష్మ శరీరము ఆవిర్భవించినది. ఆపంచీకృత భూతముల నుండి పంచీకృతములగు స్థూల భూతము జనించినవి. స్థూల శరీరము జనించినదని భావించి ఆ బ్రహ్మయందు లీనమై నట్లు చింతించవలెను. వాటి నుండి పంచీకృత భూ కములకును, వాని కార్యములకును విరాట్ యని పేరు. ఈ స్థూల శరీరము ఆత్మ అజ్ఞాన కల్పితము. ఇంద్రియముల వలన జ్ఞానము జాగ్రదావస్థ అని అందురు. జాగ్రదావస్థ అభి మాని యగు ఆత్మకు విశ్వ అని పేరు. ఈత్రయము అకార స్వరూపము. అపంచీకృత భూతములు, వాటి కార్యము లింగము పదునేడు తత్త్వములతో కూడిన శరీరమునకు హిరణ్య గర్భుడ నియు సూక్ష్మ మరియు లింగమనియు పేరు. జాగ్రత్సంస్కారము వలన కలిగిన వివిధ విషయ జ్ఞానము స్వప్నము. తదభిమాని యగు ఆత్మకు తైజసుడు అని పేరు. స్థూల నూక్ష్మ శరీరములకు ఆత్మ ఒక్కటియే కారణము. పైన చెప్పిన తేజసము జాగ్రత్ ప్రపంచమునకంటె భిన్నమైనది. ఉకార రూపమైనది. ఆభాస రూపము అగు జ్ఞానమునకు ఆధ్యాహృతము అని పేరు. ఈ అవస్థకు సాక్షియైన బ్రహ్మ సత్తు కాదు. అసత్తు కాదు, సదసత్తు కాదు. సావయవము కాదు. నిరవయవము కాదు. భిన్నము కాదు, అభిన్నము కాదు, భిన్నా భిన్నము కాదు. ఆది నిర్వచింప శక్యము గానిది. సంసార బంధనములకు కారణమైనది ఇదియే. బ్రహ్మ ఒక్కటియే. అది జ్ఞానముచే లభించును. కర్మలచే లభ్యము కాదు.
సర్వాత్మనా హీంద్రియాణాం సంహారః కారణాత్మ నామ్ ।
బుద్దే: స్థానం సుషుప్తం స్యాత్తద్ద్వయ స్యాభి మానవాన్.
ప్రాజ్ఞ ఆత్మాద్వయం చైతన్మ కారః ప్రణవః స్మృతః.
ఆహం సాక్షీచ చిన్మాత్రో జాగ్రత్స్వప్నా దీక స్యచ ।
నాజ్ఞానంచైవ తత్కార్యం సంసారాదిక బంధనమ్.
నిత్యశుద్ధబుద్ద ముక్తసత్యమానంద మద్వయమ్ ।
బ్రహ్మాహ మస్మ్యహం బ్రహ్మపరం జ్యోతిర్విముక్త ఓమ్.
అహం బ్రహ్మపరం జ్ఞానం సమాధిర్చంధ ఘాతకః।
చిరమానన్దకం బ్రహ్మసత్యం జ్ఞాన మన న్తకమ్.
అయమాత్మా పరంబ్రహ్మ తద్ర్బహ్మ త్వమసీతిచ ।
గురణాబోధితో జీవోహ్యయం బ్రహ్మాస్మి బాహ్యతః.
సోఽసా వాదిత్య పురుషః సోసావహ మఖండ ఓం ।
ముచ్యతేఽసార సంసారాద్ర్బహ్మజ్ఞో బ్రహ్మ తద్భవేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే బ్రహ్మవిజ్ఞాన నిరూపణంనామ సప్తత్యధిక త్రిశతతమోఽధ్యాయః.
సాధన ములగు ఇంద్రియములు లీనములై బుద్ధి మాత్రమే నిలచియుండు స్థితికి సుషుప్తియని పేరు. ఈ బుద్ధి సుషుప్తులకు అభిమాని యగు ఆత్మ ప్రాజ్ఞుడు ఈ మూడును మకారము గాను ప్రణవము గాను చెప్పబడుచున్నవి. ఈ ప్రాజ్ఞుడే ఆకార, ఉకార, మకారములు. అహంపద లక్ష్య భూతుడగు ఆత్మ జ్ఞాన స్వరూపుడు, జాగ్రత్స్వప్నాదులకు సాక్షి. వానిలో అజ్ఞానము కాని, తత్కార్యమైన సంసారాది బంధనము గాని లేదు. నిత్యము శుద్ధము, బుద్ధము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వయ మగు బ్రహ్మయే నేను. జ్యోతి స్వరూపము, ముక్తము అగు పర బ్రహ్మ నేను. ఓంకార రూప పర బ్రహ్మ నేను. నేనే జ్ఞాన రూపమును, సమాధి రూప బ్రహ్మను. బంధనమును నశింప చేయువాడను నేను. చిర ము ఆనంద మయము, సత్వము, జ్ఞాన ము అనంత సుగు బ్రహ్మ నేనే. “అయం ఆత్మా పరం బ్రహ్మ”, “తత్ బ్రహ్మత్వం ఆసి”. ఈ విధముగా గురువుచే బోధింపబడిన జీవుడు దేహ విలక్షణమైన బ్రహ్మను తెలుసుకొనును. సూర్య మండలమున ప్రకాశించు పురుషుడు నేనే. నేనే ఓంకారమును, నేనే అఖండ పరమేశ్వరుడను. ఇట్లు జ్ఞానము కలవాడు అసారమగు సంసారము నుండి విముక్తుడై బహ్మ రూపుడగును.
ఆగ్ని మహా పురాణమున బ్రహ్మ విజ్ఞాన నిరూపణమును మూడు వందల డెబ్బది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 378 of the Agni Purāṇa is as follows:
Agni continues the brahma-vijñāna teaching in the form of a sustained mantra-like declaration: "Aham brahma paraṃ jyotiḥ" — "I am Brahman, the supreme Light" — repeated across more than thirty successive verses, each excluding one attribute or limitation. The declaration affirms that this supreme Light is beyond earth and water, beyond fire and air and ākāśa; beyond all karmendriyas and jñānendriyas, beyond taste, smell, touch, and sound; beyond the states of waking, dream, and deep sleep; beyond the viśva, taijasa, and prājña; beyond guṇas, beyond bheda-abheda, beyond cause-and-effect. The three mātrās of the Praṇava (A, U, M) are each identified with one of the three states and their experiencers, while tūrīya — the witnessing Brahman — transcends all three. This chapter is a sustained Advaita-Vedānta meditation in Purāṇic prose-verse form.