అగ్ని మహా పురాణము

254 - పునర్వ్యవహార నిరూపణమ్

అగ్ని రువాచః

 గృహీతార్థః క్రమాద్దాప్యో ధనినామధమర్ణికః

దత్త్వాతు బ్రాహ్మణా యాదౌ నృపతే స్తదనంతరమ్.

 రాజ్ఞాధమర్ణికో దాప్యః సాధితాద్దశకం స్మృతమ్

పంచకంతు శతం దాప్యః ప్రాప్తార్థోహ్యుత్తమర్ణికః.

 హీనజాతిం పరిక్షిణమృణార్థం కర్మకారయేత్

బ్రాహ్మణస్తు పరిక్షీణః శనైర్ధాప్యో యథోదయమ్.

 దీయమానం న గృహ్ణతి ప్రయుక్తం యః స్వకం ధనమ్

మధ్యస్థ స్థాపితం తత్ స్యాద్వర్ధతే న తతః పరమ్.

ఋక్థ మాహ ఋణం దాప్యోయోషిద్గ్రాహ స్తథైవచ

పుత్రోఽనన్యాశిత ద్రవ్యః పుత్ర హీనస్య ఋక్థిణః.

 ఆవిభక్తైః కుటుంబార్థం యదృణం తు కృతం భవేత్

 దద్యుస్తసదృక్థినః ప్రేతే ప్రోషితేవా కుటుంబిని.

 నయోషిత్పతిపుత్రాభ్యాం నపుత్రేణ కృతం పితా

దద్యాదృతే కుటుంబార్థాన్న పతిః స్త్రీకృతం తథా.

గోపశౌండిక శైలూష రజక వ్యాధయోషితామ్

ఋణం దద్యాత్పతిస్త్వాసాం యస్మాద్వృత్తి స్తదాశ్రయా.

ప్రతిపన్నం స్త్రియా దేయం పత్యా వాసహయత్కృతమ్

 స్వయం కృతం వా యదృణం నాన్య త్త్స్రీదాతుమర్హతి.

పితరి ప్రోషితే ప్రేతే వ్యసనాభి ప్లుతేఽథవా

పుత్రపౌత్రై రృణం దేయం నిహ్న వే సాక్షి భావితమ్.

 సురాకామ ద్యూతకృతం దండశుల్కావశిష్టకమ్

 వృథాదానం తథై వేహపుత్రో దద్యాన్న వైతృకమ్.

 భ్రాతౄణామథదమ్పత్యోః పితుః పుతస్యచై వహి

ప్రతిభావ్యమృణం గ్రాహ్యమపిభ క్తేన చ స్మృతమ్.

అగ్ని దేవుడు పలికెను. వసిష్ఠా! చాలమంది ధనికులనుండి ఋణము తీసికొనిన ఆధమర్ణువిచే, ముందుగా బ్రాహ్మణునకు, తరువాత క్షత్రియునకు ఈ విధముగ క్రమము: ఋణము తీర్పించవలేను. నిర్ణయించిన దానిలో నూటికి పదిచొప్పున వడ్డీతో ఇప్పించవలెను. ధనము ఓభించిన ఉత్తముడు నూటికి ఐదుచొప్పున రోజుకు ఇవ్వవలెను. క్షీణ దశ లో ఉన్న నీచజాతివానిచే, ఋణమునకు బదులు పనిచేయించవలెను. బ్రాహ్మణునిచేత మాత్రము మెల్ల మెల్లగా, ఆతనికి అభివృద్ధి కలుగుటను బట్టి తీసికొన్న ధనమును" ఇప్పించవలేను. తిరిగి ఇచ్చిన ధనమును ఋణదాత తీసికొనకున్నచో దానిని ఒక మధ్యస్థుని వద్ద ఉంచవలెను. ఆనాటినుండి దాని పై వృద్ధి ఉండదు. కాని దానిని ఋణదాత అడిగినపుడు ఇచ్చి వేయవలెను. అట్లు ఇవ్వకున్నచో వృద్ధి ఇవ్వవలసి యుండును. బళ్లమును (ఒకరు మరణించగా సంక్రమించిన ఆస్థిని) ఎవడు గ్రహించునో ఆత డై ఋక్త దాత (తండ్రి మొ.) యొక్క ఋణము కూడ చెల్లించవలెను. ఋక్లము తీసికొనిన వాడు పుత్రహీనుడైనచో, ఆ ఋర్థమును మాత్రమే అనుభవించు కృత్రిమ పుత్రుడు చెల్లించవలెను. ఒకని స్త్రీని గ్రహించిన వాడు ఆతని ఋణము కూడ తీర్చవలేను. అవిభక్త కుటుంబములోని ఒకవ్యక్తి, ఋణము చేసినచో ఆ కుటుంబాధిపతి ఆ ఋణ మును తీర్చవలెను. కుటుంబ యజమాని మరణించినను పగ దేశమునకు వెళ్ళినను, ఆకుటుంబ సభ్యులందరును కలసి ఋణము తీర్చవలెను. భర్త చేసిన ఋణము భార్య తీర్చనవసరములేదు. పుత్రుడు చేసిన ఋణము తల్లిగానీ తండ్రి గాని తీర్చనవసరములేదు. శ్రీ చేసిన ఋణము భర్త తీర్చనవసరములేదు. కాని మొత్తము కుటుంబమునంతను పోషించుటకై చేసిన ఋణము విషయమున ఈనియమము వర్తించదు. గొల్లలు, మద్యవిక్రేతలు, నటులు, చాకళ్ళు, వేటగాళ్ళువీరిత్రీలు చేసిన ఋణమును తప్పక వారి భర్తలు తీర్చవలెను. ఏలనన వారివృత్తి ఆ స్త్రీల పై ఆధార పడి యున్నది. మరణించుటకు సిద్దముగానున్న లేదా పర దేశమునకు పోవనున్న ప్రేరేపింపగా స్త్రీ చేసిన ఋణము. పతి చేసినదేమైనను, భార్య తీర్చవలెను. భర్తతో కలిసియున్న శ్రీ చేసిన ఋణము కూడ, పతిపుత్రులు లేనిచో శ్రీయే చెల్లించవలెను. శ్రీ తానే చేసిన ఋణమును ఆమె యే తీర్చవలెను. మిగిలిన ఋణము లేవియు శ్రీ తీర్చపనిలేదు. తండ్రి విదేశ మునకు వెళ్ళి పోయినపుడు, మరణించినను, చాల కష్టములలో చిక్కుకొని యున్నపుడును, ఆతని ఋణమును పుత్రపౌత్రులు చెల్లించ వలెను. వారు అలిగీకరించనిచో సాక్ష్యాదుల ద్వారా నిరూపించి అర్థి వసూలు చేసికొనవలెను. మద్యపానము , శ్రీలంపట త్వము, ద్యూతము, దండము శుల్కము చెల్లించగా మిగిలినది, వృథాదానము - వీటికొరకై తండ్రి చేసిన ఋణమును పుత్రుడు తీర్చపనిలేదు. సోదరులయొక్క. పితృపుత్రుల యొక్క అవిభక్తధనములో ప్రాతిభావ్య ఋణము గ్రహింపదగినది కాదు.

దర్శనే ప్రత్యయే దానే ప్రాతిభావ్యం విధీయతే

ఆధౌతువితథే దాప్యా వితథస్యసుతా ఆపి.

 దర్శన ప్రతి భూర్యత మృతః ప్రాత్యయికోఽపివా

నతత్పు తా ధనం దద్యుర్ధద్యుర్ధానాయ యేస్థితాః.

 బహవః స్యుర్యది స్వాంశైర్ధద్యుః ప్రతిభుభువోధనమ్

ఏక చ్ఛాయా శ్రితేష్వేషు ధనికస్య యథారుచి.

 ప్రతిభూర్ధాపితోయత్ర ప్రకాశం ధనినే ధనమ్

ద్విగుణం ప్రతిదాతవ్య మృణికైస్తస్య తద్భవేత్.

 స్వ(స) సంతతిస్త్రీ పశవ్యం ధాన్యం ద్విగుణ మేవచ

 వస్త్రం చతుర్గుణం ప్రోక్తం రథశ్చాష్ట గుణ స్తథా.

 ఆధిః ప్రణ శ్యేద్ద్విగుణేదనేయ దినమోక్ష్యతే

 కాలే కాలకృతం నశ్యేత్ఫలభోగ్యో న నశ్యతి.

దర్శనము, ప్రత్యయము, దానము - వీటి యందు ప్రాతిభావము (జామీను) అంగీకరింపబడినది. ఆధి (తాకట్టు) వ్యర్థమైనపుడు తాకట్టు పెట్టినవాని పుత్రులచే ఋణము తీర్పింపవలెను. దర్శన ప్రతిభూ (అవసరమైనపుడు నేనీ వ్యక్తిని హాజరుపరచెదను అని జామీను ఉన్న వాడు) గాని, ప్రత్యయ ప్రభూ (విశ్వాసము నిమిత్తము జామీను ఉన్నవాడు) గాని మరణించినపుడు వారిపుత్రులు ఋణము చెల్లించనవసరములేదు. దాన ప్రతిభూ (ఆతడు చెల్లించెదను) ఆని జామీను ఉన్న వాడు) చెల్లించవలెను. దానప్రతిభూలు చాలమంది ఉన్నపుడు వారు ఋణమును కమవంతు ప్రకారము చెల్లి చవలెను. అందరును ఒకే విధముగ (పూర్తి గా తీర్చుటకు జామీను ఇచ్చి) ఉన్నపుడు ధనికుడు తన ఇష్టము వచ్చిన వాని నుండి ధనము వసూలు చేసికొనవచ్చును. అందరి సమకమున పతిథూ ధనికునకు ఎంతధనము చెల్లించేనో దానికి రెట్టింపుధన మును, ఆ పత్రిభుకు, ఋణగి హీతచేత ఇప్పించవలేను. ఆగపశువు ను ఋణముగా గ్రహించిన పుడు వాటి సంతతిని వడ్డిగా తీసికొనవలెను ధాన్యముపై వడ్డీ, ఆధికాధిము, మూడు రెట్లు, వస్త్రములపై వడ్డీ పెరిగి పెరిగి నాల్లు రెట్లు రసములపై ఎనిమిది రెట్లు కావచ్చును తాకట్టు పెట్టి ఋణము తీసికొనినపుడు ఆధనము పెరిగి రెట్టింపు అయిన పిర్ముట గూడ ఋణము చెల్లించి తాకట్టు విడిపించకొననిచో, ఆవస్తువు ధనికునకుని ఋణదాత యొక్క) సొత్తు అగును. ఇంత కాలము తరువాత విడిపించుకొందునని చెప్పి తాకట్టు పెట్టిన దానిని, ఆ కాలములోపల విడిపించుకొననిచో అది ధనికుని సొత్తు అయిపోవును. కాని ఫలము మాత్రమే అనుభవించుటకు వీలయిన తోట మొదలగునది తాకట్టు పెట్టినచో ఆది ఎన్నటికిని నష్టము కాదు. దానిసత్వము అధిపతికే యుండును.

గోప్యాధిభోగ్యోనా వృద్ధిః సోపకారేఽథ భావితే

నష్టోదేయో వినష్టశ్చ దైవరాజ కృతాదృతే.

 ఆదేః స్వీకరణా త్సిద్ధీరక్షమాణోఽప్యసారతామ్

యాత శ్చేదన్య ఆధేయో ధనభాగ్వా ధనీభవేత్.

 చరిత్ర బంధక కృతం సవృద్ధ్యా దాపయేద్ధనమ్

 సత్యంకార కృతం ద్రవ్యం ద్విగుణం ప్రతిదాపయేత్.

 ఉపస్థితస్య భోక్తవ్య ఆధీర్ధండోఽ (స్తేనో) న్యధా భవేత్

ప్రయోజ కేసతి ధనం కులేఽన్యస్యాధి మాప్నుయాత్.

తత్కాలకృతమూల్యోదా తత్ర తిష్ఠేద్ వృద్ధికః

 వినాధారణ కాద్వాపి విక్రీణీతే సమాక్షికమ్.

యదాతు ద్విగుణీ భూత మృణమాధౌతదాఖలు

మోచ్యశ్చాధి స్తదుత్పాద్య ప్రవిష్టే ద్విగుణేధనే.

 వ్యసనస్థమనాఖ్యాయ హస్తేన్యస్యయదర్పయేత్

ద్రవ్యం తదౌపనిధికం ప్రతిదేయం తథైవతత్.

 నదాప్యోఽపహృతం తత్తు రాజ దైవక తస్కరైః

బ్రేష శ్చేన్మార్గితే దత్తే దాప్యో దండశ్చ తత్సమమ్.

 అజీవన్స్వేచ్ఛయా దండ్యో దాప్య స్తచ్చాపి సోదయమ్

యాచితాన్వా హితన్యానని క్షేషాదిష్వయం విధిః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే వ్యవహారో వామ చతుష్పంచాశ దధిక శతతమోఽధ్యాయః.

దాచి ఉంచవలసిన వస్తువు తాకట్టు బెట్టినచో దానిని ధనికుడు  అనుభవించినను, ఉపయోగించు పశ్వాదులను రాకట్టు పెట్టినను వాటి పై వడ్డీ ఉండదు. తాకట్టు పెట్టిన వస్తువు పాడై పోయినను, పోయినను ఋణదాత తిరిగి ఇవ్వవలెను. ఆది దైవ - రాజోపప్లవములందు పోయినచో ఇవ్వవలసిన పనిలేదు. అట్టి పరిస్థితులలో ఋణగ్రహీత మరొక వస్తువు తాకట్టు ఇవ్వవలెను. లేదా ధనము వడ్డీతో చెల్లించవలెను. చరితమనే బంధకముగా పెట్టి (నమ్మకము మీద) తీసి కొన్న ధనమును వడ్డీతో ఇప్పించవలెను. సత్యంకారముతో చేసిన ఋణమును రెట్టింపు చెల్లింపచేయవలెను. తాకట్టు విడి పించుకొవవలసిన సమయము వచ్చినపుడు విడిపించుకోనవచ్చినచో ఇచ్చివేయవలెను. అట్లు కానిచో ధనికుని ఋణము నిచ్చినవాడు, బంధకము విడిపి:చుకొను సమయమునకు లేనిచో ఆతని కుటుంబమునకు ధనము చెల్లించి బంధకము విడి పించుకొనవలెను. లేదా ఆనాటి వరకు ఎంత వృద్ధియైనదో నిశ్చయము చేయించుకొని, ధనికుడు మరల వచ్చువరకును బంధకమును ఆతని వద్దనే ఉంచివేయవలెను. కాని ఆవాడు మొదట వడ్డీ ఉండదు. దూర దేశమునకు వెళ్ళిన ధనికుడు అను కున్న సమయానికి రాజా ఒకపోయినచో ఋణగ్రహీత విశ్వసనీయుడై న సాక్షుల ఎదుట బంధక మును ఆమ్మి వేసి తనకు రావలసిన సొమ్ము తీసికొనవలెను. ఋణము తీసికొని ధనము, వడ్డీ పెరిగి రెట్టింపు అయినచో అంతధనమును ఇచ్చి బంధకమును విడిపించుకొనవలెను. పెట్టి మొదలైన వాటిలో వ్యము ఉంచి, (సీలు చేసి) ఆది ఏదవ్యమో, ఎంతయో చెప్పకుండ ఇతరుల వద్దదాచనిచ్చినచో అది “ఔపనిధికము”. దానిని ఇచ్చినట్లుగ నే తిరిగి ఇచ్చి వేయవలెను. కాని అది రాజ - దైవ - తస్కరాదుల ద్వారా నష్టమైనచో తిరిగి ఇవ్వవలసిన పనిలేదు. ఉపనిధి ఉంచినవాడు అడిగినను ఉంచు కొన్న వాడు తిరిగి ఈయసున్నచో దానిని ఆతనికిప్పించి, అంతధనము దండము విధించవలెను. ఉపనిధిని ఉపయోగించి దాని పై ధనము సంపాదించిన వానిని దండించి లాభమాతో సహ ఆవస్తువును తిరిగి ఇప్పించవలెను. యాచిక - ఆక్వా హిత - న్యాస - నిక్షేపాదుల విషయమున గూడ ఉపనిధికి సంబంధించిన నియమములు వర్తించును

అగ్ని మహాపురాణమునందు వ్యవహారమను రెండువందల ఏబది నాల్గవ ఆధ్యాయము సమాప్తము.