అగ్ని మహా పురాణము

177 - అథ ద్వితీయావ్రతాని

అగ్ని రువాచః-

ద్వితీయావతకం వక్ష్యేభుక్తి ముక్త్యాదిదాయకమ్

పుష్పాహారీ ద్వితీయాయామశ్వినౌ పూజయేత్సురౌ.

అబ్దం స్వరూపసౌభాగ్యం సర్వభాగ్ జాయతే ప్రతీ

కార్తికే శుక్లపక్షస్య ద్వితీయాయాం యమం వ్రజేత్ .

 ఆబ్దముపోషితః స్వర్గం గచ్ఛేన్న నరకం ప్రతీ

అశూన్యశయనం వత్యే హ్యవై ధవ్యాదిదాయకమ్.

కృష్ణపక్షే ద్వితీయాయాం శ్రావణస్య చరేదిదమ్

 శ్రీవత్సధారిన్ శ్రీకాక్ష శ్రీధామన్ శ్రీపలేవ్యయ.

గార్హస్థ్యం మా ప్రణాళం మే యాతు ధర్మార్థకామదమ్

అగ్న యో మా ప్రణశ్యన్తు మాప్రణశ్యత్తు దేవతాః.

పితరో మా ప్రణశ్యత్తు మత్తో దామ్పత్యభేదతః

లక్ష్మ్యా వియుజ్యతే దేవో న కదాచిద్యథా భవాన్.

 తథా కలత్రసమ్భణో దేవ మా మే విభిద్యతామ్

లక్ష్మ్యా న శూన్యం వరద యథా తే శయనం విభో.

 శయ్యా మమాప్యశూన్యాస్తు తథైవ మధుసూదన

లక్ష్మీం విష్ణుం యజేదబ్దం దద్యాచ్ఛయ్యాం ఫలాని చ.

 ప్రతిమాసం చ సోమాయ దద్యాదర్ఘ్యం సమ న్టకమ్

గగనాఱణ సందీప దుగ్గాభిమథనోద్భవ.

భాభాసితంగాభోగ రమానుజ నమోస్తుతే

ఓం శ్రీధరాయ నమః సోమాత్మానం హరిం యజేత్.

 ఘం డం భం హం శియై నమో దశరూపమహాత్మ సే

మృలేన హోమో నక్తం చ శయ్యాం దద్వాద్ద్విజాతయే.

దీపాన్న భాజనై ర్యుక్తం ఛత్రోపానహమాసనమ్

సోదకుమం చ ప్రతిమం విప్రాయాథ చ పాత్రకమ్.

 పత్న్యా య ఏవం కురుతే భుక్తి ముక్తీ ఆవాప్నుయాత్

కాని వ్రతం ప్రవక్ష్యామి కార్తి కస్య సితే చరేత్.

నక్త భోజీ ద్వితీయాయాం పూజయేద్బల కేశవా

 వర్షం ప్రాప్నోతి వై కాని మాయురారోగ్యకాదికమ్.

 ఆథ విష్ణువ్రతం వ్య మనోవాక్ఛోతదాయకమ్

పౌషశుక్ల ద్వితీయాది కృత్వా దినచతుష్టయమ్.

 పూర్వం సిద్దార్థకైః స్నానం తతః కృష్ణతిలైః స్మృతమ్

వయా చ చతుర్థఒహ్ని సర్వేషధ్యాచతుర్థ కే.

సురా మాంసీ వచా కుష్ఠం శైలేయం రజనీద్వయమ్

శటీ చమ్పకముస్తంచ సర్వోషధిగణఃస్మృతః.

 నామ్నా కృష్ణా చ్యుతానన్త హృషీ కేశతి పూజయేత్

పాదేనాభ్యాం చక్షుషీ చ క్రమాచిరసి పుష్పకైః.

 శశిచన్దశ శాశేశుసంజ్ఞాభిశ్చార్ఘ్యమిన్దవే

నక్తం భుఞ్జిత చ నరో యావత్తి ప్లేత చన్దమాః .

షణ్మాసం పావనం చాబ్దం ప్రాప్నుయాత్సకలం ప్రతీ

ఏతద్ర్వతం నృపైః స్త్రీభిః కృతం పూర్వం సురాదిభిః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ద్వితీయావ్రతాని నామ సప్త సప్తత్యధిక శతత మోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను; నేనిపుడు భుక్తిముక్తిప్రదము లగు ద్వితీయావ్రతములను గూర్చి చెప్పెదను. ప్రతిమాసమునందును ద్వితీయయందు పుష్పములు మాత్రము భుజించవలెను. అశ్వినీ దేవతలను పూజించవలెను. ఒక సంవత్సరము ఈ వ్రతము నమష్టించుటచే సౌందర్యము, సౌభాగ్యము లభించును, అంతమున స్వర్గము లభించును. కార్తిక శుక్ల ద్వితీయయందు యముని వజించవలెను. పిదప ఒక సంవత్సరము ప్రతి శుక్లద్వితీయయందును ఉపవాసపూర్వక ముగ వ్రత మాచరించవలెను. ఇట్లు చేయుటచే మానవుడు స్వర్గమునకు వెళ్ళును. నరకమునకు వెళ్ళడు. ఇపుడు అశూన్యశయన వ్రతమును చేప్పెదను. ఇది స్త్రీలకు అవే ధవ్యమును, పురుషులకు సర్వదా భార్యాసుఖమును ఇచ్చును. శ్రావణకృష్ణపక్షద్వితీయయందు ఈ వ్రతమును అనుష్ఠించవలెను. “వక్షఃస్థలమునందు శ్రీవత్సమును ధరించిన ఓ శ్రీకాస్తా! నీవు లక్ష్మీ నివాసభూతుడవు. లక్ష్మీపతివి. వినాశనరహితుడవగు సనాతన పర మేశ్వరుడవు. ధర్మార్థకామములకు నిలయ మగు నా గార్హస్థ్యము నీ కృపచే సుస్థిరముగా నుండుగాక. నా గృహమునందలి ఆగ్ని ఎన్నటికిని చల్లారకుండుగాక  గృహదేవత ఎన్నడును అదృశ్యురాలు కాకుండుగాక. నా పితరులకు నాశము కలుగకుండుగాక. నా దాంపత్యము విహ తము కాకుండుగాక నీకు ఏ విధముగ ఎన్నడును లక్ష్మీవియోగము కలుగదో అట్లే నాకును పత్నీ వియోగ మెన్నడును కలుగకుండుగాక. వరదాత వైన ఓ ప్రభూ! నీ శయనము ఏ విధముగ లక్ష్మీ విహీనము కొదో అదే విధముగ నా శయ్య కూడ పత్నీ విహీనము కాకుండుగాక” ఈ విధముగ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, వ్రతము ప్రారంభించి, ఒక్క సంవత్సరము వరకును ప్రతిమాసమునందును, ద్వితీయయందు లక్ష్మివిష్ణువులను యథావిధిగా పూజించవలెను. శయ్యాదానము, ఫల దానము చేయవలెను. ప్రతి మాసమునందును అదే తిథియందు చంద్రునకు మంత్రోచ్చారణపూర్వకముగా అర్ఘ్యప్రదానము చేయవలెను. “భగవంతుడ వేన చంద్రా! నీవు గగన ప్రాంగణమును దీపింపచేయువాడవు. క్షీరసాగరమును మథించు టచే నీవు ఆవిర్భవించితివి. నీవు నీ కాంతిచే సకలదిజృండలమును ప్రకాశింపచేయుచున్నావు. ఓ లక్ష్మీదేవితమ్ముడా! నీకు నమస్కారము” అని ఆ మంత్రమున కర్థము. “ఓం శ్రీం శ్రీధరాయ నమః” అను మంత్రముతో సోమరూపు డగు శ్రీహరిని పూజించవలెను. “ఘం ఓం హం సం శ్రియై నమః” అను మంత్రముతో లక్ష్మీదేవిని, “దశరూపమహాత్మనే నమః” అను మంత్రముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. రాత్రి ఆజ్యహోమము చేసి బ్రాహ్మణునకు శయ్యాదానము చేయవలెను. దానితో దీపము, ఆన్నముతో నింపిన పాత్ర, ఛత్రము, పాదుకలు, ఆసనము, జుపూర్ణకలశము శ్రీహరి ప్రతిమ, పాత్రకూడ బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా వ్రతపాలనము చేసినవాడు భోగ మోక్షములకు అర్ధుడగును. ఇపుడు కాంతివ్రతమును వర్ణించెదను. కార్తిక శుక్ల ద్వితీయయందు దీనిని ప్రారంభించవలెను. పగలు ఉపవాసము చేసి, రాత్రి భోజనము చేయవలెను. ఈ వ్రతమునందు శ్రీకృష్ణబలరాములను పూజించవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము వ్రతము చేసినవాడు కాంతి, ఆయుర్దాయము, ఆరోగ్యము మొదలగువాటిని పొందును.

ఇపుడు మనోవాంఛితములను ఇచ్చు విష్ణువ్రతమును వర్ణించెడను. పుష్యశుక్ల ద్వితీయనాడు ప్రారంభించి వ్రతము నాలుగు దినములు చేయబడును. మొదటి దినమున ఆవాలు కలిపిన జలముతో స్నానము చేయవలెను. రెండవ దినమున తిలలు కలిపిన జలముతోను, మూడవ దినమున వచ అను ఓషధి కలిపిన జలములోను, నాల్గవ దివసమున సర్వౌషధిమిక్ర జలముతోను స్నానము చేయవలెను. సునామాంసి, వచ, కుష్ఠము, శైలేయము, రెండు రకముల పసుపు, కటి, చంపకము, ము సము, అను ఓషధుల సముదాయమునకు సర్వౌషదు అని పేరు. మొదటి దివసమున ‘శ్రీకృష్ణాయ నమః’, రెండవ దివసమున “అచ్యుతాయ నమః” మూడవ దివసమున “ఆననాయ నమః” నాల్గవ దివసమున “హృషీ కేశాయ నమః” అనే నామ మంత్రములతో వరుసగా భగవంతుని చరణ-నాభి-నేత్ర, శిరస్సులందు పుష్పములు సమర్పించుచు పూజచేయవలెను. ప్రతిదినము ప్రదోషసమయమునందు చంద్రునకు అర్ఘ్య ప్రదానము చేయవలెను. నాలుగు దిశములందును వరుసగా “శశినే నమః”, “చంద్రాయ నమః”, “శశాఙ్కాయ నమః”, “ఇన్దవే నమః” అను మంత్రములతో అర్ఘ్యప్రదానము చేయవలెను. రాత్రి చంద్రుడు కనబడువంతకాలము లోపల భోజనము చేయవలెను. ఈ విధముగ ఆరు మాసములు లేదా ఒక సంవత్స రము ఈ వ్రత మాచరించినవాడు సంపూర్ణ వాంఛితములను పొందును. పూర్వకాలమున రాజులు, స్త్రీలు, దేవతలు కూడ ఈ వ్రత మాచరించిరి.

అగ్ని మహాపురాణమునందు ద్వితీయావ్రతవర్ణన మను నూటడెబ్బది ఏడవ అధ్యాయము సమాప్తము.